ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

వాస్తు కన్నా క్రీస్తు గొప్పవాడు.

*వాస్తు కన్నా క్రీస్తు గొప్పవాడు...*

 వాస్తు మీద వున్న నమ్మకం క్రీస్తు మీద ఉంటే చాలా బాగుంటుంది...😞

*నేడు కొంతమంది వాస్తు బాగుంటే మాకు అన్ని సౌభాగ్యాలు, ఆరోగ్యాలు, ఆయుష్షు వచ్చేస్తాయి అని నమ్మినంత గట్టిగా క్రీస్తును నమ్మలేకపొతున్నారు😢*

కానీ మనము గ్రహించాల్సింది ఏమిటంటే!
*వాస్తు కన్నా క్రీస్తు గొప్పవాడు.*

కానీ కొంతమంది మనసులో క్రీస్తు కన్నా వాస్తు గొప్పది...

*ఒక్కసారి ఆలోచించండి...*
 *వాస్తు  ఒక్క మనిషినైనా పరలోకము తీసుకుని వెల్లగలదా?*

*వాస్తు మన వ్యసనాలను మాన్పించగలదా??*

*వాస్తు మనలను ఉత్తములుగా తీర్చిదిద్దగలదా????*

*వాస్తు కన్నా ముందు దేవుడు ఉన్నాడు.*
వాస్తు కన్నా ముందు మనము ఉన్నాము.
*(జగత్పునాది వేయబడకముందే క్రీస్తులో మనము ఉన్నాము)*
(కొలస్సి 1:15, 18, ఎఫెసి 1:6)

*వాస్తుని స్మరించినంతగా క్రీస్తును స్మరిస్తే, విశ్వసిస్తే, అనుసరిస్తే ఆరాధిస్తే రక్షణ, సౌభాగ్యాలు, ఆరోగ్యము, ఆయుష్షు, పరలోకం దొరుకుతుంది*

దయచేసి వాస్తును క్రీస్తు కంటే గొప్పగా చూడకండి, నమ్మకండి ప్లీజ్🙏🙇‍♂️

*వాస్తు సరిగ్గా లేదు అందుకే మీకు ఎదుగు బొదుగు లేదని ఎవరో అంటే ఇంటిని పగలగొట్టేస్తాము, చెట్లను పీకించేస్తాము, ఏవేవో చేసేస్తాము*
 కానీ ఒక్క నిమిషం మోకరించి *దేవా! నా స్థితి బాగోవటంలేదు సహాయము చేయండి అని మాత్రం అడగము కారణము*
మన దృష్టిలో వాస్తు గొప్పది కాబట్టి
వాస్తు మన స్థితిని మారుస్తుంది కానీ క్రీస్తు మార్చలేడని మన ఆలోచన కాబట్టి.

*ఓ క్రైస్తవ యువకా!!!*

*గోడలు, ఇళ్ళను పగలగొట్టడం కాదు మన మనస్సులను పగలగొట్టుకుని, చింపుకుని కన్నీరు విడిచి ప్రార్థిస్తే మన స్థితి మారుతుంది.* మన బ్రతుకు బాగుంటుంది.. (యోవేలు 2:13)

*ప్రియ చదువరీ!!!*

*చనిపోయిన వారినే బ్రతికించిన శక్తిమంతుడు నా క్రీస్తు అని,*
పుట్టి గ్రుడ్డివారికి సహితం చూపునిచ్చిన గొప్పవాడు నా క్రీస్తు అని,
*చావునే చంపి తిరిగిలేచిన గొప్పవాడు నా క్రీస్తు అని మరిచిపోతున్నామా??*

క్రీస్తు శక్తిని ఆశ్రయిస్తే భూమినే తలక్రిందులుగా తిప్పేసే శక్తిని మనకు ఇస్తాడు.
*ఆకాశం నుంచి అగ్నిని కురుపించగలిగే శక్తిని ఇస్తాడు.*
ఇవన్నీ మనము మర్చిపోయి వాస్తు వెనకాల పరుగులు పెడుతున్నామా???

*మన నమ్మిక, విశ్వాసము కంటే వాస్తు గొప్పదా??*
ఆలోచించు...

యిర్మీయా 32:27
*నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనదేదైన నుండునా?*

 యోహాను 11:40
*యేసు- నీవు నమ్మినయెడల దేవుని మహిమ చూతువు....*

మార్కు 9:23
*అందుకు యేసు-*
*నమ్ముట నీవలననైతే, నమ్మువానికి సమస్తమును సాధ్యమేయని అతనితో చెప్పెను.*

మార్కు 10:27
*యేసు వారిని చూచి ఇది మనుష్యులకు అసాధ్యమే గాని, దేవునికి అసాధ్యము కాదు; దేవునికి సమస్తమును సాధ్యమే అనెను.*

1పేతురు 4:3
*మనము పోకిరిచేష్టలు, దురాశలు, మద్య పానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహపూజలు మొదలైనవాటియందు నడుచుకొనుచు, అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును...*

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...