ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సేవకుడు పాటించవలసినవి :

సేవకుడు పాటించవలసినవి :
🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯
1.సంఘములో ఏ స్త్రీతోను సాన్నిహిత్యం కలిగి ఉండకూడదు. 

2.ఎవరి ఇంటికి పదే పదే వెళ్లకూడదు. 

3. ఎవరికైనా బాగుండకపోతే తప్ప ఊసుపోకు ఏ యింటికి వెళ్లవద్దు. 

4. గృహదర్శనం చేసేటప్పుడు ఒంటరిగా ఎప్పుడూ వెళ్లవద్దు. 

5. సంఘ పెద్దలను వెంట తీసుకు వెళ్లడం అవసరం. 

6.ఎవరూ లేకుంటే నీ భార్యను వెంట తీసుకువెళ్లు. 

7. ఎవరితోనూ ఒంటరిగా ఉండవద్దు . 

8.నిందకు అవకాశం ఇవ్వవద్దు. 

9. నిందవచ్చే స్థలానికి సాధ్యమైనంత దూరంగా ఉండు. 

10. వాళ్లే నీయింటికి వస్తుంటే నిర్మోహమాటంగా ఉండు. 

11.స్త్రీ సమస్యలకు నీ సలహాలు కాకుండా మరో స్త్రీ సలహా అవసరమని గుర్తించు. 

12. సంఘంలో వయసు మళ్లినవారి సలహా లేదా నీ భార్య సలహా వారికి అందేట్లు చూడు. 

13. ఎవరితోనూ అనవసర ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపవద్దు. 

14. కాలం వృధా చేయకు, ఎవరి పైనా దేవుని కంటే ఎక్కువ అభిమానాన్ని చూపకు. 

15. వాళ్లు నీకంటే వయసులో పెద్ద వాళ్లు కదా అనో నాకంటే కదా చాలా చిన్నవాళ్లు అనో ఉదాశీనంగా ఎప్పుడూ ఉండవద్దు. 

16. అనవసరమైన నిందవస్తే రాద్దాంతం చెయ్యొద్దు. 

17. దేవుడు నీ నిర్దోషత్వాన్ని వెల్లడి చేసేంత వరకు మౌనంగా ఉండు. 

18. ఇతరులు నిన్ను విమర్శిస్తే నీవే వాటిని ఇతరులకు ప్రచారం చేసుకునే బలహీనతకు చోటివ్వకు. 

19. జీవితభాగస్వామితో అన్యోన్యంగా ఉండు. 

20. ఎన్నడూ ఇద్దరు వేరుగా ఉండకండి. 

21. వీటన్నింటితోపాటు పరిశుద్ధాత్మ నడిపింపుకు నిన్ను నీవు అప్పగించుకో 

శీలం పై మచ్చపడకుండా చూడు. ఒకవేళ శోధనవద్ద మనుష్యులు అపార్థం చేసుకుంటే కృంగిపోకు, వ్యసనపడకు, కీడుకు ప్రతికీడు చెయ్యకు, మౌనం వహించి తీర్పు తీర్చే దేవునికి నిన్ను నీవు అప్పగించుకో! 

సేవకుడు...పిళ్ళా వెంకటరత్నం(రచన) 


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...