ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

బైబిలులోని ""ఇష్బోషెతు"" గారి క్లుప్త చరిత్ర

*బైబిలులోని ""ఇష్బోషెతు"" గారి క్లుప్త చరిత్ర...*

ఈయన సౌలు గారి కనిష్ఠ కుమారుడు..
*ఇతనికి మరొక పేరు కూడా వుంది*
""ఎష్బయలు""
(1దిన 8:33, 9:39)

*ఈ ఇష్బోషెతు గారి తండ్రి అయిన సౌలు గారు చనిపోయాక దావీదు గారు యూదా ప్రజలపై హెబ్రోనులో రాజుగా పట్టాభిషేకం పొందారు.*

ఈ విషయం తెలుసుకున్న సౌలు గారి సేనాధిపతి అయిన అబ్నేరు గారు ఇష్బోషెతు గారిని మహనయీమునకు తీసుకెళ్లి 
గిలాదు వారిమీద,
ఆషేరీయులమీద,
యెజ్రెయేలుమీద,
ఎఫ్రాయిమియుల మీద,
బెన్యామీనియుల మీద,
ఇశ్రాయేలు వారి మీద రాజుగా పట్టాభిషేకం చేసాడు.

*ఈ అబ్నేరు దావీదు గారి మీద పోటీగా ఈ ఇష్బోషెతు గారిని రాజును చేసాడు..*

ఇష్బోషెతు గారు రాజు అవ్వకపోతే ఇశ్రాయేలీయుల గోత్రములందరి మీద దావీదు గారే రాజు అయ్యేవారు..

*40 సంవత్సరాల వయస్సులో ఇష్బోషెతు గారు రాజయ్యి 2 సంవత్సరాలు పరిపాలించాడు*
(2సమూ 2:1-10)

పేరుకు మాత్రమే ఇష్బోషెతు గారు రాజు కానీ అధికారం, పరిపాలన మొత్తం అబ్నేరు గారిదే..

*అబ్నేరు గారు తన లాభం కోసం, ఆధిక్యత కోసం ఇష్బోషెతు గారిని రాజుని చేసారు*.
అబ్నేరు గారి చేతిలో ఇష్బోషెతు గారు ఒక కీలు బొమ్మ..

*ఇష్బోషెతు గారు రాజు అయ్యాక అబ్నేరు గారు దావీదు గారిపై పలుమార్లు యుద్ధానికి వెళ్ళాడు.*
సౌలు కుటుంబీకులకును, దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరగడానికి ఒకరకంగా అబ్నేరు గారే కారణము.
(2సమూ 3:1, 6)

*దేవుని చిత్తము దావీదు గారు ఇశ్రాయేలీయుల గోత్రములందరి మీద రాజు అవ్వాలని కానీ అబ్నేరు గారు ఇష్బోషెతు గారిని రాజుని చేసి దేవుని చిత్తానికి ఇష్బోషెతు గారిని అడ్డంగా పెట్టాడు...*

ఒక మనిషి చేతిలో కీలు బొమ్మ అవ్వడం వలన, ఆ మనిషి చెప్పింది చేయటం వలన ఈ ఇష్బోషెతు గారు దేవుని పనికి, దేవుని ఇష్టానికి అడ్డుగా తయారయ్యాడు.

*ఈరోజుల్లో కూడా చాలామంది క్రైస్తవులు తెలియకుండానే అపవాది ఉచ్చులో పడి అపవాది చేతిలో సాధనాలుగా మారిపోయి దేవుని చిత్తానికి అడ్డుగా నిలబడుతున్నారు.*

నేను మానకుండా మందిరానికి వెళ్తున్నాను, దేవునిలోనే ఉంటున్నాను అని అనుకుంటున్నాము కానీ మనకు తెలియకుండానే చాలా విషయాలలో అపవాది చేతిలో కీలు బొమ్మలు అయిపోయాము.

*దేవుని పని చాలాసార్లు ముందుకు వెళ్లకుండా అడ్డుపడేది కొంతమంది క్రైస్తవులే, సువార్త జరగకుండా ఆపేది కొంతమంది క్రైస్తవులే, దేవుని నామాన్ని అందరిలో దూషింపబడేలా చేసేది కొంతమంది క్రైస్తవులే (ఈ కొంతమంది క్రైస్తవులే అపవాది ఉచ్చులో చిక్కిన కీలు బొమ్మలు)*

దేవుడు తన బిడ్డలకు మంచి మంచి లక్షణాలు, ఆయనకు నచ్చిన సైన్యాన్ని క్రైస్తవునిలో పెట్టారు.

*1.చెడును, అపవాదిని ఎదిరించటానికి ప్రతిఘటన అనే సైనికుణ్ణి,*
2.నిష్కళంకము అను సైనికుణ్ణి,
*3.దృఢ చిత్తము అను సైనికుణ్ణి,*
4.జ్ఞానము అను సైనికుణ్ణి,
*5. మనస్సాక్షి అను సైనికుణ్ణి,*
6.సత్ క్రియలు అను సైనికుణ్ణి,
*7.తగ్గింపు, ఓర్పు అను సైనికుణ్ణి,*
8.సమయాన్ని సద్వినియోగం అను సైనికుణ్ణి,
*9.నైతిక విలువలు, సంస్కారం అను సైనికుల్ని*
10.మంచి మాటలు అను సైనికుణ్ణి
ఇలా అనేకరకాలైన సైనికుల్ని లేక దేవుని లక్షణాలను దేవుడు క్రైస్తవునిలో పెట్టారు.
కానీ

*అపవాది చాలా తెలివిగా క్రైస్తవులను మోసగించి తన ఉచ్చులో వేసుకుని దేవుడు తన బిడ్డలకు ఇచ్చిన సైన్యాన్ని లేక లక్షణాలను ఒక్కొక్కటిగా తీసివేసి వాడి లక్షణాలను లేక సైన్యాన్ని క్రైస్తవునిలో పెడుతున్నాడు.*

1.శరీర వ్యామోహం,
2.సత్య తిరస్కారం,
3.దైవ నిర్లక్ష్యం,
4.పాపిష్టి నోరు,
5.ప్రతీకారం,
6.గర్వము, హెచ్చింపు,
7.మంచిని మరచిపో,
8.అపనమ్మిక,
9.కఠిన హృదయము,
10.త్రాగుడు,
11. జూదము,
12.వ్యభిచారం,
13.నాస్తికత్వము,
14.దైవ ద్వేషము,
15.నిర్దయగా ఉండటం
*ఇలాంటి చెడ్డ లక్షణాలను లేక సైన్యాన్ని క్రైస్తవునిలో పెడుతున్నాడు అపవాది.*

అపవాది ఉచ్చులో పడి, వాడి లక్షణాలను లేక సైన్యాన్ని తనలోకి ఆహ్వానించిన *చాలామంది క్రైస్తవులు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు, దేవుని పనికి అడ్డు గోడవలె నిలుస్తున్నారు చాలా విచారము.*

రకరకాల చెడు వ్యసనాలకు, చెడ్డ పనులకు బానిసలు అవుతున్నారు చాలా దౌర్భాగ్యము..

*మనలను మనం ప్రతీ రోజు, ప్రతీ ఘడియ పరీక్షించుకుంటూ ఉండాలి నాలో దేవుని లక్షణాలు ఉన్నాయా లేక అపవాది లక్షణాలు ఉన్నాయా?? అని.*
మనము దేవుని పనికి నిలబడాలి కానీ అడ్డుగా నిలవకూడదు...

*దేవునికి వ్యతిరేకంగా నిలబడిన ఇష్బోషెతు గారు అతి దారుణంగా చంపబడ్డాడు*
(2సమూ 4:4-8)

*అపవాది చేతిలో కీలు బొమ్మలా మారితే మనము కూడా దారుణంగా మరణించాల్సి వస్తుంది.*
మరణము అనగా నరకము.

*ప్రభువే స్వయముగా చెప్పారు*
*ఆటంకపరచు వారికి శ్రమ అని.*

Luke(లూకా సువార్త) 17:1,2
ఆయన తన శిష్యులతో ఇట్లనెను అభ్యంతరములు రాకపోవుట అసాధ్యముకాని అవి ఎవనివలన వచ్చునో వానికి శ్రమ. 
2.వాడీ చిన్నవారిలో ఒకనికి అభ్యంతరము కలుగజేయుటకంటె వాని మెడకు తిరు గటిరాయి కట్టబడి సముద్రములో పడద్రోయబడుట వానికి మేలు. 

*ప్లీజ్ ఎవరూ అపవాది చేతిలో, మనుస్యుల చేతిలో, అధికారుల చేతిలో కీలు బొమ్మలుగా మారి దేవునికి, ఆయన పనికి అడ్డుగా నిలవకండి.....*

దేవుని రాకడ అతి సమీపముగా ఉంది.
జాగ్రత్తగా లేకపోతే రాకడలో ఎత్తబడుట కష్టము.

*మనము దేవుని చేతిలో బాణములుగా ఉండాలి కానీ అపవాది చేతిలో కాదు...*

మన బ్రతుకైనా, చావైనా క్రీస్తు కోసమే!!!!!

*మన బ్రతుకు ద్వారా మన దేవునికి, ఆయన పనికి యుగాయుగములు మహిమ కలుగును గాక!!*

*మరనాత= యేసుప్రభువు త్వరగా వచ్చుచ్చున్నాడు.*
1కోరింది 16:22.

*ప్రభువైన యేసూ రమ్ము..*
ప్రకటన 22:20.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...