ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

కొంతమంది క్రైస్తవులు నమ్ముతున్న ""మూఢనమ్మకాలు""(కీడులు)*క్లుప్త వివరణ.....

*కొంతమంది క్రైస్తవులు నమ్ముతున్న ""మూఢనమ్మకాలు""(కీడులు)*
క్లుప్త వివరణ.....

*నేడు చాలామంది విశ్వాసులలో కొన్ని "కీడుల" కోసం కొన్ని అపోహలు ఉన్నాయి వాటికోసం తెలుసుకుందాం రండి...*

మనకు తెలిసిన వారు లేక సంఘ సభ్యులలో ఎవరైనా చనిపోతే చాలామంది ఆ వ్యక్తిని చూడటానికి (చివరి చూపు) రారు, సమాధి కార్యక్రమంలో పాలుపొందరు కారణం కీడు తగులుతుంది అని..

*మేము ఇల్లు కట్టుకుంటున్నాము,*
మా అమ్మాయి లేక కోడలు గర్భముతో ఉంది,
*మా అమ్మాయి పెద్ద మనిషి అయ్యింది,*
మా అబ్బాయికి లేక అమ్మాయికి పెళ్లి కుదిరింది
*కాబట్టి మేము ఆ చనిపోయిన మనిషిని చూడటానికి వస్తే కీడు తగులుతుంది.*

మేము వస్తే కట్టుకుంటున్న ఇల్లు కి కీడు.
*పుట్టబోయే బిడ్డకు కీడు*
పెద్దదైన మా అమ్మాయికి కీడు, 
*జరగబోయే వివాహానికి వివాహ బంధానికి కీడు అని చాలామంది సమాధి కార్యక్రమానికి రారు.*

ఓ క్రైస్తవ యువకా!!!
*కీడు కంటే క్రీస్తు గొప్పవాడు, సర్వ శక్తిమంతుడు అని గ్రహించు...*

వెలుగు లోనికి వచ్చిన మనము, వెలుగై ఉన్న మనము చీకటికి (మూఢనమ్మకాలకు) భయపడవచ్చా???

*చీకటిని చూసి వెలుగు భయపడుతుందా??*

*అన్యులలో అటువంటి సెంటిమెంట్ లు, అపోహలు, మూఢనమ్మకములు ఉన్నాయంటే తప్పులేదు కానీ క్రీస్తులోనికి వచ్చిన మనకు అటువంటి సెంటిమెంట్ లు, మూఢనమ్మకాలు వుండవచ్చా?*

ఒకరిని సమాధి చేస్తున్నాము అంటే వారిని పరలోకం పంపుతున్నాము అని అర్థము.
*(పరలోకము వెళ్ళేది వెళ్ళనిది చనిపోయిన ఆ మనిషి యొక్క ఆత్మీయ స్థితిని బట్టి ఉంటుంది)*
కానీ మన విశ్వాసము వారు పరలోకం వెళ్తారు అని.

*ఒకరిని పరలోకం పంపడం అంటే ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప అద్భుతం. ఎంత గొప్ప పని.*

*ఆ వ్యక్తి పరలోకము వెళ్తున్నప్పుడు పరలోకంలో ఉన్న దూతలు, పరిశుద్ధులు, భక్తులు నిలబడి స్వాగతం పలుకుతారు.*

అటువంటి మంచి కార్యములో పాలుపొందితే దీవెన వస్తుంది కానీ కీడు ఎలా వస్తుంది???

*చనిపోయిన వారిని సమాధి చేయటానికి మనము సహకారులముగా ఉంటే మన పేర్లు జీవగ్రంధములో వ్రాయబడటానికి అవకాశం ఉంటుంది*
(ఫిలిప్పి 4:3)

చీకటి నుంచి వెలుగులోకి (క్రీస్తులోకి) వచ్చిన మనము ఇంకా ప్రాచీన స్వభావమును, అలవాట్లను, నమ్మకాలను వదలలేకపోతున్నాము విచారం. (ఎఫెసి 4:22-24)

*క్రీస్తు మనలను మూఢనమ్మకాల నుండి, మనుస్యులు కల్పించిన పారంపర్యాచరాల నుండి విడిపించి స్వాతంత్ర్యము ఇచ్చాడు.*
మరల మనము దాసత్వము (మూఢనమ్మకాలు) కిందకి వెళ్లడం మంచిది కాదు. (గలతి 5:1)

*దేవుని వాక్యము చెబుతుంది*

Ecclesiastes(ప్రసంగి) 7:2
*విందు జరుగుచున్న యింటికి పోవుటకంటె ప్రలాపించుచున్నవారి యింటికి పోవుట మేలు;* ఏలయనగా మరణము అందరికినివచ్చును గనుక బ్రదుకువారు దానిని మనస్సున పెట్టుదురు. 

*నా అనుభవ సాక్ష్యము*.

*మా సంఘంలో చాలాసార్లు నా తోటి సహోదరులు తమ భార్యలు గర్భముతో ఉండగా, ఇండ్లు కట్టుకొనుచుండగా,వారి కుమార్తెలు పెద్దమనిషి అయినపుడు, వారి పిల్లలకు పెళ్లి కుదిరినప్పుడు కూడా  సమాధి కార్యక్రమాలలో పాలుపొందారు, వారే దగ్గరుండి సమాధి పెట్టెను తయారు చేశారు.*

ఆ పెట్టెను మోశారు, గొయ్యను తవ్వారు, సమాధి చేశారు.
వారికి ఎటువంటి కీడు జరగలేదు.
దేవుడు వారికి మంచి బిడ్డలను ఇచ్చారు, వారి వివాహ జీవితము చాలా బాగుంది, మంచి దీవెనకరమైన గృహాలు దేవుడు అనుగ్రహించారు...

*ఓ ప్రియ చదువరీ!!!*
*మూఢనమ్మకాలను విడిచిపెట్టు, నిజమైన సత్యమార్గములో నడువుము.*

ఆనాడు క్రీస్తు అందరికి మాదిరి చూపుతూ జీవించిన రీతిగా ఈనాడు క్రీస్తు వారసులమైన మనము కూడా మాదిరిగల జీవితమును జీవించుదాము.
(1పేతురు 2:21,  ఫిలిప్పి 3:17)
 
*ఓ క్రైస్తవ యువకా!!!*

*ఆయన అరచేతిలో ఉన్న నీ మీదకు కీడు రాగలదా??*
(యెషయా 49:16)

*ఆయన రెక్కల క్రింద ఉన్న నీ మీదకు కీడు రాగలదా??*
(కీర్తనలు 91:3-4)

*ఆయన ఒడిలో ఉన్న నీ మీదకు కీడు రాగలదా??*
(యెషయా46:4)

*జగత్పునాది వేయబడకముందే క్రీస్తులో  ఏర్పరచుకున్న నీ మీదకు కీడు రాగలదా??*
(ఎఫెసి1:6)

*నశించిపోతున్న నిన్ను రక్షించడానికి వచ్చిన క్రీస్తును దాటి ఎటువంటి కీడైన నీ మీదకు రాగలదా???*
(లూకా 19:10)

మూఢనమ్మకాలను నెత్తి మీద నుండి దించివేసి మన హృదయ సింహాసనములో క్రీస్తును మోద్దాము....

కొలొస్సయులకు 2:8
*ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును, అనగా ఈ లోకసంబంధమైన(భూతములు) మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానముచేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైన ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి.*

గలతీయులకు 5:1
*ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి, క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసియున్నాడు. కాబట్టి, మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడిక్రింద చిక్కుకొనకుడి.*

మనలో ఉన్న లోపాలను దిద్దుకుని సిద్ధపడి ప్రభుని రాకడలో మనందరం ఎగిరి వెళ్లిపోదాము......

ప్రకటన 22:7
*ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను*....

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...