ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

యాత్రికుని ప్రయాణం" పుస్తక రచయిత జాన్ బన్యన్ గారి గురించి*

*"యాత్రికుని ప్రయాణం" పుస్తక రచయిత జాన్ బన్యన్ గారి గురించి*  
        
  👉చిన్న వయస్సులోనే అబద్ధములు, దొంగతనములు వంటి అనేక చెడ్డ అలవాట్లకు గురై, చదువులో ముందుకు సాగలేకపోయిన ఆ యువకుడు సైన్యములో చేరెను. ఒకసారి యుద్ధములో తాను వెళ్ళవలసిన డ్యూటీకి మరొక వ్యక్తి వెళ్ళెను.అతడు అక్కడ మరణించెను. దేవుడు ఎదో ఒక ఉద్దేశ్యంతో తనను మరణము నుండి తప్పించెనని గ్రహించి, సైన్యములో నుండి బయటికి వచ్చిన తరువాత పాత్రలకు మాట్లు వేసి, బాగు చేయు కమ్మరి వృత్తిని ప్రారంభించెను.
  
👉ఎప్పుడూ పాపపు తీర్పు యొక్క భీతితో సమాధానము లేని జీవితం జీవిస్తున్న అతనిని ఒక ఫాదిరి గారికి పరిచయం చేయగా, యేసుక్రీస్తు పాపములను క్షమించుటకు అధికారం గలవాడని, ఆయనిచ్చు రక్షణ ఉచితమని చెప్పిన మాటలు అతడంగీకరించి, అతని హృదయంలో విశ్వసించి తన పాపముల కొరకు పశ్చాత్తాపపడి, రక్షించబడెను. అంతేగాక, ఈ గొప్ప రక్షణ సువార్తను పాపములో నశించిపోతున్న అనేకులకు చెప్పాలన్న ఆశతో సువార్త ప్రకటించుట ఆరంభించెను.అతడే జాన్ బన్యన్!

👉ఆదినాల్లో అభిషేకించబడినవారు తప్ప ఎవరూ ప్రసంగించకూడదు అన్న చట్టమున్నందున ఆయనను బంధించి, చెరసాలలో పెట్టిరి! మరెన్నడూ ప్రసంగించనని ప్రమాణం చేస్తే విడుదల చేస్తామన్నప్పటికీ, జాన్ బన్యన్ ప్రమాణం చేయుటకు నిరాకరించుటే గాక, "ఈ రోజు విడుదల చేస్తే, రేపే ప్రసంగిస్తానని చెప్పాడు. దేవునికి అవిధేయుడగుట కంటె, చెరసాలలో నా కండ్లపై నాచు పెరిగేవరకు ఉన్నా నాకు మేలే" అనేవాడు!

👉ఆలాగు ఎంతో మురికిగా, చీకటిగా ఉన్న ఆ చెరసాలలో 12 సం||లు ఉండెను.ఆ 12 సం||లలో తన సమయాన్ని ఏ మాత్రము వృథా పరచుకొనక, తన తోటి ఖైదీలకు సువార్త ప్రకటిస్తూ, ప్రతి నిముషము ప్రార్ధన, ధ్యానములలో గడిపెను.అంతేగాక, నేటికినీ ప్రపంచంలో గొప్ప పేరు పొందిన, వంద భాషలలో తర్జుమా చేయబడిన యాత్రికుని ప్రయాణము" అనే పుస్తకమును చెరసాలలో ఉండగా, తనకు కలిగిన ప్రత్యక్షతలను బట్టి వ్రాసెను.జైలు నుండి బయటికి వచ్చిన తరువాత మరనేక పుస్తకములనువ్రాసెను,సంఘకాపరిగా పని చేసెను, అనేక ఆత్మలను సంపాదించెను. చివరికి తన 60వ యేట ఈ లోకాన్ని విడిచి ప్రభువు సన్నిధికి వెళ్ళేను.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...