ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

భాషలు ఎలా ఉద్భవించినవి?

భాషలు ఎలా ఉద్భవించినవి?
🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯
ప్రపంచములో గల మొత్తము భాషలు 6,528.
ఇందులో 1,964 లిపి కలిగినవి; 4,564 లిపి లేనివి 
మన భారత దేశంలోనే 1,652 భాషలు మాట్లాడేవారు ఉన్నారు! వీటిలో 22 భాషలకు మాత్రమే లిపి ఉన్నది! 18 భాషలను మాత్రమే అధికార భాషలుగా గుర్తించారు!అసలు ఇన్ని భాషలు మరి ఎలా పుట్టినవో మీకు తెలుసా?
🌠🌠🌠🌠🌠🌠🌠🌠
ఇన్ని భాషలు ఎలా పుట్టినవంటే - ఆదియందు దేవుడు ఆదాము, హవ్వలను సృష్టించి; “మీరు ఫలించి, అభివృద్ధి పొంది, విస్తరించి, భూమిని నిండించి, దానిని లోపరచుకొనుడి” (ఆది 1:27,28) అని చెప్పాడు. అయితే మానవులు విస్తరించి నప్పుడు, అప్పటి వరకు భూమియందంతట ఒక్క భాషయు, ఒక్క పలుకును ఉన్న వారు - "మనము భూమియందంతట చెదరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశము నంటుకొను ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకొందము రండి” (ఆది 11:4) అని అనుకొనిరి! 

అప్పుడే ఇప్పటిలాగ వంద అంతస్థుల వంటి కట్టడాలు కట్టడానికి సిద్ధపడ్డారు! అయితే అది మానవుని ఆరోగ్యమునకు, జీవన విధానమునకు మంచిది కాదని; అంతేకాక మంచి సమశీతల వాతావరణం లేని స్థితి, నీటి కొరత వంటివి ఏర్పడ తాయని ముందే ఎరిగిన దేవుడు తానే దిగి వచ్చి, వారి భాషలు తారుమారు చేసెను. 

“అప్పుడు యెహోవా - ఇదిగో జనము ఒక్కటే; వారికందరికి భాష ఒక్కటే; వారు ఈ పని ఆరంభించియున్నారు. ఇకమీదట వారు చేయదలచు ఏ పని యైనను చేయకుండ వారికి ఆటంకమేమియు నుండదు. గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండ అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండని అనుకొనెను. ఆలాగు యెహోవా అక్కడ నుండి భూమి యందంతట వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. దానికి బాబెలు అను పేరు పెట్టిరి; ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడ నుండి యెహోవా భూమియందంతట వారిని చెదరగొట్టెను (ఆది 11:6-9). ఆ రీతిగా ఇన్ని భాషలు ఉద్భవించెను.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...