ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

🌖 నూతన ఆకాశము,🌏 నూతన భూమి

🌖 నూతన ఆకాశము,🌏 నూతన భూమి
🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯
అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను. సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధపట్టణము తన భర్తకొరకు అలంకరింపబడిన పెండ్లికుమార్తెవలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్దనుండి దిగి వచ్చుట చూచితిని. అప్పుడుఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపుర ముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించి పోయెనని సింహాసనములోనుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని.
ప్రకటన 21:1-4 

పరిశుద్ధ గ్రంధములో మూడు పర్యాయములు భూమి, ఆకాశములను సృష్టించబడినట్లుగా చూడగలము. 

🔹 *మొదటి సృష్టి:*
ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. (ఆది. కా. 1:1) ఇది మొదటి సృష్టి. లూసిఫర్ పడద్రోయబడిన తర్వాత ఈ సృష్టి నాశనమై నిరాకారముగా మారింది. అనగా పనికిరాకుండా పోయింది అని అర్ధం. 

🔹 *రెండవ సృష్టి:*
ఆరు దినములలో రెండవ సృష్టిని చేసిన దేవుడు, ఏడవదినాన్న విశ్రమించెను. (ఆది. కా. 2:2) ఇప్పుడు ఆ రెండవ సృష్టిలోనే మనము జీవిస్తున్నాము. త్వరలో ఈ భూమి, ఆకాశములు కూడా గతించిపోనున్నాయి. 

🔹 *మూడవ సృష్టి:*
మూడవ సృష్టియైన నూతన భూమి, నూతన ఆకాశం కొరకు మనము ఎదురుచూచుచున్నాము. 

మనమాయన వాగ్దానమునుబట్టి క్రొత్త ఆకాశములకొరకును క్రొత్త భూమికొరకును కనిపెట్టు చున్నాము; వాటియందు నీతి నివసించును. 
(2 పేతురు 3:13) 

ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను మునుపటివి మరువబడును జ్ఞాపకమునకురావు.యెషయా 65:17 

నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయముకాక నా సన్నిధిని నిలుచునట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండును ఇదే యెహోవా వాక్కు.యెషయా 66:22 

🌏 *నూతనమైన భూమిని గురించి రెండు అభిప్రాయములు కలవు:*
✴️✴️✴️✴️✴️✴️✴️✴️ 

🔻 *మొదటి అభిప్రాయం:*
🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶
వెయ్యేండ్ల పాలన అనంతరం భూమి అగ్నివలన కాలిపోయి, శుద్ధీకరణం పొంది, నూతన భూమి ఆవిర్భవించును. అయితే, తాను భూమిని నిత్యముగా స్థాపించెను.
(కీర్తనలు 78:69). గనుక, భూలోకం నాశనం పొందదు. అది కాలి, కాలి, నూతన భూమిగా రూపాంతరం చెందుతుంది. అనేది కొందరి అభిప్రాయం. 

🔻 *రెండవ అభిప్రాయం:*
🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷
ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి ఆకాశములు కూడ నీ చేతిపనులే. అవి నశించును గాని నీవు నిలచియుందువు అవియన్నియు వస్త్రమువలె పాతగిలును ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయుదువు అవి మార్చబడును.
కీర్తనలు 102:25,26 

అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను.
ప్రకటన 21:1 

దీనిని బట్టి, భూమిగా నశించిపోయి, నూతన భూమి ఏర్పడుతుందనేది మరికొందరి అభిప్రాయము. 

Note: ఈ పాపభూయిష్టమైన భూమి నశించిపోయి, నూతన భూమి ఏర్పడుతుందని అందరూ అంగీకరిస్తారు.* 

🌏 *నూతన భూమి, ఆకాశము యొక్క ప్రత్యేకతలు:*
✳️✳️✳️✳️✳️✳️✳️✳️
▪సముద్రము ఉండదు.
▪నూతన యెరూషలేము పట్టణము పరలోకమునుండి నూతన భూమి మీదికి దిగివస్తుంది.
▪నూతన భూమి మీద మనుష్యులు, దేవునితో ప్రత్యక్ష సహవాసం కలిగి నివసిస్తారు.
▪దేవుడు తన ప్రజల కన్నులనుండి ప్రతీ భాష్ప బిందువును తుడిచివేస్తాడు.
▪పాపం లేదు
▪మరణం లేదు
▪దుఃఖం లేదు
▪ఏడ్పు లేదు
▪వేదన లేదు
▪సూర్యుడు లేడు.
▪చంద్రుడు లేడు
▪రాత్రి లేదు 

ఇట్లా అనేకమైన ప్రత్యేకతలు కలిగివుంటాయి. ఇది ప్రభువు నిత్యత్వం. ఇక దీనికి అంతములేదు. 

ఈ నిత్యత్వంలో నీవుండాలంటే? ఈ లోకంలో నీవు జీవించిన జీవితమే ప్రమాణం. అట్లా అని, నీ సత్క్రియలు నిన్ను ప్రభువు నిత్యత్వంలో చేర్చలేవుగాని, రక్షించబడి, కొనసాగింపుగా సత్క్రియలు చేస్తూ, ఆ నిత్యరాజ్యం కొరకు సిద్ధపడాలి. 

అట్టిరీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాం! అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!ఆమెన్! ఆమెన్! ఆమెన్! 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...