దేవుని మహాసైన్యమయిన మిడుతలు
🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯
ఉపోద్ఘాతము:
♻️♻️♻️♻️♻️♻️
ప్రచంచ వ్యాప్తముగానున్న కీటకములు దాదాపుగా ఆరు లక్షల జాతులు కలవని శాస్త్రజ్ఞుల అంచనా. అందులో మిడుతలు ఒకటి. మిడుతలు ఆరు కాళ్ళు కలిగియున్న కీటకము. మొదటి రెండు జతల కాళ్ళతో భూమి మీద నడచును. చివరి జత కాళ్ళు ఎగురుటకును లేక దుముకుటకును ఉపయోగించును. ఇటువంటి మిడుతలు పాలస్తీనా దేశమందు దాదాపుగా 40 రకములు కలవని బైబిల్ పండితులు పేర్కొనిరి. పరిశుద్ధ గ్రంథమునందు నేతమిడుత, చిన్నమిడుత, ఆకుమిడుత (లేవి 11:22) పెద్దమిడుత (కీర్త 105:34)లు వివరించబడినది. యివి మిక్కిలి చిన్నవి. మిడుతల జీవితకాలము 90 రోజులు, మిడుతలు ఎవరికిని హాని చేయవు. ఇవి కేవలము మూడు మాసములలో బహుగా అభివృద్ధి చెందుతాయి. ఇటువంటి మిడుతలను గూర్చి శాస్త్రీయముగాను
మరియు బైబిలునుండియు కొన్ని ఆసక్తికరమైన, ఆచరణీయమైన సత్యములను తెలిసికొని, నేర్చుకొనెదము.
1. మిడుతలను 'యాత్రా' కీటకములు అందురు :
🌠🌠🌠🌠🌠🌠🌠🌠🌠🌠
(సంచార కీటకము) కారణము ఏమనగా యివి ఒక స్థలములో స్థిరముగా నుండవు. స్థిర నివాస మేర్పరచుకొనవు.ఇవి నిరంతరము గుంపులు, గుంపులుగా తిరుగుసంచార కీటకములు, యివి పగటికాలమందు ఎంత దూరమైనా అలసట పడకుండా రోజుకు సగటున 150 కి.మీ ప్రయాణము చేస్తాయి. రాత్రి వేళ ప్రయాణము చేయవు. ఆలాగుననే మనము కూడా భూమి మీద పరదేశులమును, యాత్రికులమై యున్నామని (హెబ్రీ 11:18)గుర్తు చేసికొనవలయును,
2. మిడుతలు ఐక్యతగా గుంపులు, గుంపులుగా వెళ్తాయి :
🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀
అందుకే మిడుదల దండు అంటారు (న్యాయా 6:3). పరిశోధకులు తెలిపినట్లుగా మిడుతల దండు ఒకేసారి ఐక్యతగా 60 నుండి 80 మైళ్ళ విస్తీర్ణతతో ప్రయాణము చేస్తాయి. అంటే ఎంత ఐక్యతగా ముందుకు సాగుతాయో ఆలోచించుడి. అలాగుననే సహోదరులు ఐక్యత కలిగి యుండుట ఎంత మేలు, ఎంత మనోహరము (కీర్త 133:1)
3. మిడుతలకు రాజులేడు,
🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰
అయిననూ అవి అన్నియు పంక్తులు తీరి క్రమముగా
సాగిపోవును (సామె 30:27). కొన్ని సార్లు మనుష్యులు క్రమము తప్పుతారు. కాని మిడుతలు ఎట్టి పరిస్థితులలోను క్రమము తప్పవు. ఆత్మననుసరించి నడుచుకొను వారు క్రమముగా, మర్యాదగా జీవింతురు (గలతీ 5:25)
4. మిడుతలు బహు వేగముగా విస్తరిస్తాయి :
🛑🛑🛑🛑🛑🛑🛑🛑🛑🛑🛑🛑
మిడుతల జీవితకాలము 90 రోజులు మాత్రమే. ఈ కాలములో రెండు సార్లు గుడ్లు పెడతాయి. 6 వారాల్లో అవి తిరిగి పెద్దగవుతాయి. అలా పెరిగి పెద్దవయినవి మళ్ళీ నెల రోజుల్లో గుడ్లు పెడతాయ.ఇలా మూడు నెలల్లో 20 రెట్లు పెరుగుతాయి. 9 నెలల్లో 8 వేల రెట్లు పెరిగిపోతాయి.అంటే అంత బహుగా విస్తరిస్తాయి (నహు3:17) ఇస్సాకు విత్తనము వేసి నూరంతల ఫలము పొందినట్లు (ఆది 26:12). మనము కూడా బహుగా ఫలించి దేవునికి మహిమ తేవలెను. (యోహా 15:8)
5. మిడుతలు పవిత్రమైనవి :
💠💠💠💠💠💠💠💠💠
లేవి 11:22 ధర్మశాస్త్రానుసారముగా చరించుచూ గంతులు వేయుటకు కాళ్ళమీద తొడలు గల పరుగులు పవిత్రమైనవి తినవచ్చును. అందుకే బాప్తిస్మమిచ్చు యోహాను మిడుతలను ఆహారముగా భుజించెను. మత్త 3:4, ఇవి చాలా పవిత్రంగా జీవిస్తాయి.
6. మిడుతలు చిన్న జీవులు అయిననూ మిక్కిలి జ్ఞానము కలిగినవి సామె 30:27.
🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷
ఎందుకనగా యివి దైవాజ్ఞకు లోబడి కేవలము ఆకులను, పంటనే పాడు చేయును గాని మనుష్యులను ఏ మాత్రము ముట్టవు.
7. మిడుతలు దేవుని మహాసైన్యమని పిలువబడినది :
🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶
యోవేలు 2:25. యివి దీనత్వము కలది. అల్పమైనది, స్వల్పమైనది అయిననూ సైన్యములకధిపతియైన దేవుని మాటకు
లోబడినది. దైవాజ్ఞకు లోబడి ఐగుప్తీయుల పంటను పాడుచేసెను నిర్గ 10:17.ప్రియ చదువరులారా, చిన్నజీవులయిన మిడుతలే దేవుని మహా సైన్యముగా పనిచేయగలిగితే నీవు కూడా క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నిరంతరము సిద్ధపాటు కలిగి మంచి పోరాటము పోరాడుము (2తిమో 2:2)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి