*""మార్టిన్ లూథర్"" గారు ఖండించిన ఒక "దుర్బోధ" (పార్ట్-1)*
మార్టిన్ లూథర్ గారు అంటే తెలియని క్రైస్తవులు ఉండరు. ఆయన గొప్ప సంఘ సంస్కర్త, సింహపు గుండె కలిగిన ధైర్యవంతుడు.
*ఆనాడు పోపులు బైబిలు గ్రంధాన్ని దాచివేసి వాక్యాన్ని మరుగుచేసి అబద్ధపు బోధలు చేస్తున్నపుడు మార్టిన్ లూథర్ గారు ఒక్కరే నిలబడి ఆ బోధలను, పోపులను ఎదిరించి సత్య వాక్యాన్ని ప్రజలకు అందించారు.*
దాచబడిన బైబిలు గ్రంధాన్ని బయటకు తీసుకుని వచ్చి క్రైస్తవ సమాజానికి అందించారు.
*1520 సంవత్సరంలో లూథర్ గారు కొన్ని పుస్తకాలు వ్రాసి ఆనాడు క్రైస్తవ్యంలో ఉన్న కొన్ని దుర్బోదలను ఖండించారు.*
అందులో ఒక దుర్బోద కోసం తెలుసుకుందాము రండి...
*ఆనాటి పోపులు, యాజకులు క్రైస్తవ విశ్వాసులకు కొన్ని అబద్ధపు బోధలు బోధించేవారు...*
మీరు పరలోకం వెళ్ళాలి అంటే మంచిపనులు చేయాలి. మంచి పనులు చేస్తేనే పరలోకం వెళ్తాము లేకపోతే నరకానికి వెళ్లిపోతాము అని ప్రజలకు ప్రకటించేవారు.
*పోపులు, యాజకులు చెప్పిన*
*మంచిపనులు ఏమిటంటే!!!*
*1.పరిశుద్ధుల (భక్తుల) సమాధులను ముట్టుకుంటే, మంచి రోజున భక్తుల సమాధులు దర్శిస్తే పరలోకం వెళ్ళిపోతారు.*
2.రోమా నగరాన్ని దర్శించటం (వెళ్ళటం) వలన పరలోకం సులువుగా వెళ్లిపోతాము. (రోమా పట్టణం అతి పరిశుద్ధమైన పట్టణం అని పోపులు ఆనాడు గంబీరంగా చెప్పేవారు)
*3.పిలాతు గారి దగ్గరకు వెళ్ళినప్పుడు యేసుప్రభువు గారు ఎక్కిన మెట్లు ఎక్కడం వలన పరలోకం వెళ్లిపోతాము.*
4.భక్తులు వాడిన వస్తువులను, వస్త్రాలను, ముట్టుకోవడం వలన, చూడటం వలన పరలోకం వెళ్లిపోతాము.
*5.పాప పరిహార పత్రాలు కొనటం వలన, వాటిని కొంతమందికి పంచటం వలన పరలోకం వెళ్లిపోతాము...*
6.పోపులు, యాజకులు, సేవకుల పాదముల మీద పడటం, వారిని దేవునితో సమానముగా గౌరవించడం. పోపులు చెప్పినదే వేదం గా భావిస్తే పరలోకం వెళ్ళిపోతారు.
*ఇంకా ఇలాంటి మరెన్నో మంచి పనులు చేస్తే పరలోకం వెళ్ళిపోతారు అని ఆనాటి పోపులు, యాజకులు క్రైస్తవ విశ్వాసులకు బోధించేవారు...*
ఈ బోధలను ఖండిస్తూ *"మార్టిన్ లూథర్" గారు ఒక పుస్తకాన్ని వ్రాసి క్రైస్తవులకు పంచిపెట్టారు.*
ఆ బుక్ పేరు
*"On Good Works"*
గూగుల్ లో సెర్చ్ చేయండి ఈ బుక్ పిడిఎఫ్ దొరుకుతుంది.
*ఒకడు క్రియల వలన, పనులు వలన కాదు విశ్వాసము వలన, దేవుని కృప వలన పరలోకం వెళ్తాడు అని లూథర్ గారు వాక్యానుసారంగా బోధించారు, పుస్తకాన్ని వ్రాసారు..*. ఆనాటి సంఘాన్ని దుర్బోద నుంచి రక్షించారు.
*ఈనాడు కూడా క్రైస్తవ సమాజంలో చాలాచోట్ల దుర్బోదలు, మూఢ నమ్మకాలు ఎక్కువ అయిపోయాయి.*
*క్రైస్తవ పుణ్యక్షేత్రములు అని పిలవబడుతున్న కొన్ని చోట్ల మోకాళ్లపై మెట్లు ఎక్కితే మంచిది, ఏమి కోరుకున్న జరిగిపోతుంది అని చెప్తున్నారు*. (చాలామంది విశ్వాసులు వందల మెట్లు మోకాళ్ళ మీద ఎక్కుతున్నారు)
*గుండు కొట్టించుకుంటే మీ కోరికలు తీరుతాయి, పరీక్షలు పాస్ అవుతారు అని చెప్తున్నారు.*
(క్రైస్తవ పుణ్యక్షేత్రములు అని పిలవబడుతున్న కొన్ని చోట్ల)
*క్రైస్తవ పుణ్యక్షేత్రములు అని పిలవబడుతున్న కొన్ని చోట్ల చెట్లకు బొమ్మలు కడితే పిల్లలు పుడతారు అని చెప్తున్నారు*. చాలామంది విశ్వాసులు చెట్లకు బొమ్మలు కట్టి మాకు పిల్లలు పుడతారు అని నమ్ముతున్నారు (వారి విశ్వాసం క్రీస్తు మీద కాదు చెట్టు మీద)
*అదే స్థలంలో రాయి మీద రాయి పెడితే ఇల్లు కట్టుకుంటారు, మీకు ఎన్ని అంతస్థుల భవనం కావాలో అన్ని రాళ్లు ఒకదానిపై ఒకటి పెట్టండి అని బోధిస్తున్నారు.*
చాలామంది అలానే చేస్తున్నారు.
*పుణ్యక్షేత్రములు నుంచి తెచ్చిన నీరు, మట్టి, రాళ్లు మన ఇంట్లో పెట్టుకుంటే దీవెన, ఆశీర్వధములు అని బోధిస్తున్నారు.*
ఎక్కడెక్కడికో వెళ్తే పరలోకం వెళ్లినంత దీవెన, మహిమ కలిగినట్టే అని చెప్తున్నారు.
*మంచిరోజులు, శకునాలు, ముహుర్తాలు చూస్తున్నారు.*
భక్తులను, దేవదూతలను, మనుష్యులను దేవునితో సమానం చేసేస్తున్నారు..
*ఆనాడు సంఘంలో ఎలాంటి దుర్బోదలు, మూఢ నమ్మకాలు ఉన్నాయో అలాంటివే ఈనాడు క్రైస్తవ్యంలోకి చొరబడ్డాయి,* క్రైస్తవులను దారితప్పిస్తున్నాయి.
*ప్రియ చదువరీ!!!*
దుర్భోదలలో, మూఢ నమ్మకాలలో ఉన్నావా??? ఒక్కసారి పరిశీలించుకొనుము...
అటువంటి వాటికి దూరంగా ఉండు.
*క్రీస్తు మీద విశ్వాసము ఉంచు, ఆయన వలన ఆయన కృప ద్వారానే మనకు రక్షణ, పరలోకము అని మరచిపోవద్దు.*
దేవుని వాక్యము సెలవిస్తుంది.
రోమా 1:17
*నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును.*
ఎఫెసీయులకు 2:8,9
*మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే.*
అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు....
1 John(మొదటి యోహాను) 4:1
*ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్లియున్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి.*
Matthew(మత్తయి సువార్త) 7:15
*అబద్ధ ప్రవక్తలనుగూర్చి జాగ్రత్తపడుడి. వారు గొఱ్ఱెల చర్మములు వేసికొని మీయొద్దకు వత్తురు కాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు.*
బైబిలు కి దగ్గరగా ఉండండి మూఢ నమ్మకాలకు కాదు.🙏
*మూఢ నమ్మకాలలో, అబద్ధ బోధలో పడిపోయిన తోటి సహోదరులను, విశ్వాసులను కూడా బయటకు లాగుదాము.*
Jude(యూదా) 1:23
*అగ్నిలోనుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రము నొప్పుకొనక దానిని(మూలభాషలో-శరీరమువలన డాగుపడిన అంగీని) అసహ్యించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి.*
కుదిరితే ప్రతీ ఒక్కరూ లూథర్ గారు వ్రాసిన
*""on good works""* అనే పుస్తకాన్ని చదవండి...
*మన దేవాది దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక!!!*👏👏👏
*గమనిక:::*
మన ప్రభుని రాకడ అతి సమీపముగా ఉన్నది కాబట్టి *మనము*
*దుర్బోదలకు, మూఢనమ్మకాలకు దూరముగా ఉండి ఆయన రాకడలో ఎగిరి వెళ్లిపోదాము...*
అటువంటి భాగ్యము మన దేవాది దేవుడు మనకు దయచేయును గాక!!! ఆమేన్....
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి