ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

యాకోబులో ఉదయించిన నక్షత్రం


అంశం)యాకోబులో ఉదయించిన నక్షత్రం 
🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯
(సంఖ్యా 24:17 నక్షత్రము యాకోబులో ఉదయించును) 

✡ఉపోద్ఘాతం:
🔴🔴🔴🔴🔴
క్రీస్తు జన్మించినప్పుడు తూర్పున ఉదయించిన ఒక నక్షత్రం, మానవజాతికి నిత్య నిరీక్షణను తీసుకొని వచ్చింది. యేసు క్రీస్తు జన్మించక ముందు 1452 సంవత్సరాల క్రితమే ప్రవక్త బిలాము యేసు క్రీస్తు జననం గురించి ప్రవచించాడు. యాకోబు నుండి ఒక నక్షత్రం వచ్చినట్లు ప్రవక్త చెప్పాడు. 
యేసుక్రీస్తు ప్రకాశవంతమైన మరియు ఉదయపుకాలపు నక్షత్రం అని పరిశుద్ధ గ్రంధం స్పష్టముగా చెప్పుచున్నది.. ప్రకటన  22:16 నేను దావీదు వేరుచిగురును సంతానమును,  ప్రకాశమానమైన  వేకువ  చుక్కయునై యున్నాను. అదే విధంగా దేవుని బిడ్డలైన విశ్వాసులందరూ కూడా నక్షతములతో పోల్చబడ్డారు. ప్రభువుకు సాదృశ్యమైన నక్షత్రం గురించి కొన్ని విషయాలను పరిశీలన చేద్దాం. 

*✡1. యాకోబులో ఉదయించిన నక్షత్రము:
🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻
యాకోబులో ఉదయించిన నక్షత్రం ప్రభువైన యేసును చూపించు చున్నది.  (సంఖ్యా 24:17 నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండము ఇశ్రాయేలులోనుండి లేచును అది మోయాబు ప్రాంతములను కొట్టును.  కలహ వీరులనందరిని నాశనము చేయును.) 
దావీదు మోయాబును, సేయీరు(ఎదోం)ను కూడా ఓడించాడు. ఇక్కడ బిలాము పలికిన వాక్కులు దావీదు ద్వారా నెరవేరాయి (2 సమూ 8:2, మరియు అతడు మోయాబీయులను ఓడించి,14మరియు ఎదోము దేశమందు అతడు దండు నుంచెను. ఎదోమీ యులు దావీదునకు దాసులు కాగా ఎదోము దేశమంతట అతడు కావలిదండుంచెను; దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను). 
అయితే దావీదుకంటే క్రీస్తు ఈ వచనాలకు సరిగ్గా సరిపోతాడు. యాకోబు నక్షత్రం, రాజ దండం క్రీస్తే. భవిష్యత్తులో ఆయన లోకాన్నంతటినీ జయిస్తాడు. (యెషయా 9:6-7 ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింప బడెను *ఆయన భుజముమీద రాజ్యభారముండును*. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని  అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితిలేకుండ దానికి వృద్ధియు క్షేమ మును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును  నియమించును న్యాయము వలనను నీతివలనను రాజ్యమును స్థిరపరచు టకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపరిపాలన చేయును. సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తికలిగి దీనిని  నెరవేర్చును.) 
అన్నను తండ్రిని మోసంచేసి యాకోబు పాపపు హృదయంలో నక్షత్రమైన యేసు ఉదయించగానే, ఆయన విశాలమైన 12 గోత్రాల ఇశ్రాయేలుగా మారిపోయాడు. ఎంతో శక్తివంతమైన దేశంగా ఇశ్రాయేలు మార్పుచెంది శత్రువైన సాతానును నాశనం చేసినట్లు ఈ లోకంలో పాపులుగా ఉన్నవారి జీవితంలో నక్షత్రమైన యేసు ఉదయించగానే వారు బలమైన క్రీస్తు సంఘంలో చేర్చబడి లేపబడి దేవుని కొరకు గొప్ప రాజ్యంగా తయారుకాగలరు. 

*✡2. నక్షత్రము పేరు “ఆయన నక్షత్రము”:*
🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶
  ఈ నక్షత్రం పేరు గలిగినదిగా ఉన్నది. “ఆయన” నక్షత్రం” అను పేరుతో పిలువబడినది. జ్ఞానులు తూర్పుదిక్కున *ఆయన నక్షత్రమును* చూచి ఆయనను ఆరాధింప వచ్చితిమనిరి. ( మత్తయి 2:2 యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ నున్నాడు? తూర్పు దిక్కున మేము *ఆయన నక్షత్రము* చూచి, ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి.) 
మనము కూడా దేవుని యొక్క నక్షత్రాలము. (ఫిలిప్పి 2:16 అట్టి జనము మధ్యను మీరు జీవ వాక్యమును చేతపట్టుకొని, లోకమందు జ్యోతులవలె కనబడు చున్నారు.)
దేవుని యొక్క రక్తంలో కడగబడి కొనబడిన వారం. మనము మన సొత్తు కాదు. దేవుని సొత్తుగా ఉన్నాము. (1 కొరి 6:19 మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని  మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు. విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో  దేవుని మహిమపరచుడి.) 

*✡3. జ్ఞానులను నడిపించిన నక్షత్రం:* 
🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️
జ్ఞానులను నక్షత్రం నడిపించినట్లుగా యేసు మనలను నడిపించువాడు.  (మత్తయి 2:9 వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా, ఇదిగో తూర్పుదేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి   మీదుగా వచ్చి నిలుచువరకు వారికి ముందుగా *నడిచెను*.) 

ఆదాము హవ్వలు ఏదెను వనంలో దేవునికి వ్యతిరేకంగా పాపము చేసినప్పుడు, దేవుడు వారిని ఆ తోట నుండి బయటకు నడిపించాడు, ఆదికాండము 3:24. తూర్పు దిక్కున నక్షత్రంగా జన్మించిన యేసు తిరిగి మానవజాతికి శాశ్వతమైన మోక్షం లోనికి నడిపించాడు. మన హృదయాల్లో యేసుక్రీస్తు జన్మించినప్పుడే ఇది జరుగగలదు. 

ఇశ్రాయేలీయులను నలభై సంవత్సరాలు యేసు నడిపించాడు. ఆయన మనలను కూడా నడిపించువాడు. (యెషయా 48:17 నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును నీవు నడవవలసిన త్రోవను *నిన్ను నడిపించుదును.* యెషయా 58:11 యెహోవా నిన్ను నిత్యము *నడిపించును.*) 

దేవుని పిల్లలందరూ దేవునిచేత నడిపించబడుదురని పౌలు కూడా చెప్పుచున్నాడు. రోమా 8:14 దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరు దేవుని కుమారులై యుందురు

*✡4. ప్రజలను కలవరపరచిన నక్షత్రం:* 
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
ప్రజల పాపములను విమోచించు యూదుల రాజు పుట్టాడనగానే హేరోదు మరియు అతనితో కూడా ఉన్నవారందరూ కలవర పడిరి. (మత్తయి 2:3 హేరోదురాజు ఈ సంగతి  విన్నప్పుడు అతడును అతనితో కూడ యెరూషలేము వారందరును *కలవరపడిరి.*) 

నక్షత్రంగా ఉన్న యేసు సాతానును సాతాను యొక్క అనుచరులను కలవరపరచువాడు, దేవుని బిడ్డలను ఆనంద పరచువాడు. 

ఆనాడు ప్రభువు ఐగుప్తీయులను కలవర పరచి శత్రువులను పారిపోయేటట్లు చేశాడు. నిర్గ 14:24-25  అయితే  వేకువ జామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును *కలవరపరచి*  వారి రథచక్రములు ఊడిపడునట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రా యేలీయుల యెదుటనుండి పారిపోదము రండి; యెహోవా వారిపక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి 

*✡5. ప్రకాశించిన నక్షత్రం:
♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️
* నక్షత్రం చీకటిలో మహిమతో ప్రకాశించినది గనుకనే ఆకర్షింపబడిన జ్ఞానులు దానిని *చూచి* దాని వెనుక బయలు దేరి యెరుషలేమునకు బయలుదేరి వచ్చారు. (మత్తయి 2:2  తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము *చూచి,* ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి. 1 కొరి 15:41 మహిమను బట్టి యొక నక్షత్రమునకును మరియొక సక్షత్రమునకును భేదము కలదు గదా.) 

ఈ నక్షత్రం దాని ప్రత్యేకమైన మహిమను నిలుపుకున్నది. చీకటిలో ఉన్న జ్ఞానులకు వెలుగును ఈ నక్షత్రం చూపించినట్లుగా మనము కూడా జీవ వాక్యమును చేతబట్టుకొని అనేకులకు మన జీవిత సాక్ష్యం ద్వారా వెలుగును చూపించాలి. 

అవును, విశ్వాసులు ప్రకాశించు నక్షత్రాలని దానియేలు గ్రంధంలో వ్రాయబడినది. (దానియేలు 12:3 బుద్ధిమంతులైతే ఆకాశమండలము లోని జ్యోతులను పోలినవారై ప్రకా శించెదరు. నీతిమార్గము ననుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు *నక్షత్రమువలె* నిరంతరమును ప్రకాశించెదరు.) 

*✡6. దేవుని చేతిలో ఉన్న నక్షత్రం:*
✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️
(ప్రకటన 1:16 ఆయన తన కుడిచేత ఏడు నక్షత్రములు పట్టుకొని యుండెను.) ఏడు సంఘాల మధ్య ఉన్న మనుష్య కుమారుడు ఏడు నక్షత్రాలను చేత పట్టుకొని యున్నాడు. 

భూలోకమందు వివిధ సంఘాలలో వాక్యం అందిచున్న దైవజనులే దేవున్ ఇ చేతిలో ఉన్న ఈ ఏడు నక్షత్రాలకు సాదృశ్యం. ఈ చీకటి రాత్రులలో ప్రభువు కొరకు పరిచర్య చేయు దేవుని బిడ్డలందరూ దేవుని చేతిలోని నక్షత్రాలే ఆయన యొక్క పనిముట్లే. (రోమా 13:12 రాత్రి చాల గడచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి, తేజస్సంబంధమైన యుద్ధోపకరణములు ధరించు కొందము.) 

దేవుని *చేతిలో నక్షత్రాల* మాదిరిగా ఉన్నవారికి దేవుడు కాపుదల నిస్తాడు. యోహాను 10:28 నేను వాటికి నిత్యజీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికిని నశింపవు, ఎవడును వాటిని నా చేతిలోనుండి అపహ రింపడు. 

*✡7. తిరిగి రానై యున్న నక్షత్రం:
🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅
వెలిగించబడిన తన బిడ్డలను తీసుకొని వెళ్ళుటకు త్వరలో రానైయున్న వేకువ చుక్క యేసు క్రీస్తు. అవును ఆయన ప్రకాశమానమైన నీతి సూర్యుడుగా రాబోవు చున్నాడు. 

(ప్రకటన 22:16 సంఘముల కోసము ఈ సంగతులనుగూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను    పంపి యున్నాను. నేను దావీదు వేరుచిగురును సంతానమును,  *ప్రకాశమానమైన వేకువ  చుక్కయునై* యున్నాను. మలాకి 4:2 అయితే నా నామమందు భయ భక్తులుగలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును.) 

*✡ముగింపు:* 
🌀🌀🌀🌀🌀🌀🌀
తూర్పున జ్ఞానులు మొదటిసారిగా నక్షత్రాన్ని చూసినప్పుడు, వారు ఆనందించి ఉంటారు కాని ఆ నక్షత్రం వారికి ముందుగా నడచుచు వచ్చి శిశువు ఉండిన చోటుకు వచ్చి నిలచినప్పుడు జ్ఞానులు లోనికి వచ్చి నిజమైన నక్షత్రం *యేసు* చూచి అత్యానంద భరితులైనారు (మత్తయి 2: 10). 

జ్ఞానవంతుడైన యేసు మన హృదయంలోనికి వచ్చినప్పుడు ప్రతీ ఒక్కరూ ఆ గొప్ప సంతోషాన్ని పొందుతారు. దుఃఖం సంతోషంగా మారిపోతుంది. కొన్నిసార్లు జీవిత పరిస్థితి చీకటిలా ఉంటుంది,  కాని యేసు క్రీస్తు అను ప్రకాశవంతమైన మరియు ఉదయ నక్షత్రం మన హృదయంలోనికి వచ్చినప్పుడు చీకటి అనే పాపం, దుఖం వెళ్ళిపోయి ఆనందం మరియు వెలుగు మన జీవితంలోనికి వస్తాయి. 

సరైన మార్గంలో నడిపే నక్షత్రం మీకు ముందు ఉంది. మీరు మీ జీవితంలో కష్టాలను ఎదుర్కొంటున్నారా? తగినంత సహాయం ఆదాయం ఆదరణ లేని కారణంగా మీరు చితికిపోయారా? *మీకు యేసు అను నక్షత్రం అవసరం. 

ఈ క్రిస్మస్ దినాలలో మీరు యేసుక్రీస్తు అను నక్షత్రం యొక్క నాయకత్వం క్రిందకు వస్తే ఈ నక్షత్రం ఖచ్చితంగా మీ జీవితాలను మారుస్తుంది.  మీరు మీ జీవితంలో దేవుని రక్షణ చూస్తారు. దేవుడు తన ప్రకాశవంతమైన నక్షత్రం యేసు ద్వారా మిమ్మును రేపు జరుగనున్న క్రిస్మస్ దినాన మాత్రమే జీవితకాలపర్యంతం బహుగా దీవించును గాక!  ఆమెన్!! 
దైవాశ్శీసులు!
పాస్టర్ జ్యోతిరాజు వేముల
ప్రిన్సిపాల్,ఇమ్మానుయేల్ బైబిల్ కాలేజి 
నిడుబ్రోలు .

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...