ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

బిల్ గేట్స్ కొన్న బైబిల్ ఖరీదు 135 కోట్లు..!

బిల్ గేట్స్ కొన్న  బైబిల్ ఖరీదు 135 కోట్లు..! 
🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄
👉జర్మనీ దేశస్థుడైన జాన్ గూటేన్ బర్గ్ అనే నమ్మకమైన క్రీస్తు అనుచరుడు, దేవుని వాక్యమైన  బైబిలును గురి౦చి ఆలోచిస్తుండేవాడు, అప్పట్లో అదె౦త ఖరీదైనద౦టే  చాలా కొద్దిమ౦ది ధనవంతుల వద్ద మాత్రమే వ్యక్తిగత బైబిల్స్ ఉ౦డేవి. 

👉దేవుని వాక్యమైన బైబిల్ సాధారణ ప్రజలవద్దకు కూడా చేరాలనే దృఢ సంకల్పంతో, గుటెన్ బర్గ్ ఒకేలా వుండే బైబిల్ కాపీలను పెద్ద స౦ఖ్యలో ఉత్పత్తి చేయాలనే లక్ష్యన్ని పెట్టుకుని, అలా, చేతితో రాసినవాటికన్న ఎంతో ఆకర్షణీయమైన పద్దతిలో చౌకగా వాటిని తయారు చేయాలనుకున్నాడు... 

👉అలా బైబిల్ ని ముద్రించే పనిలో భాగంగా గుటెన్ బర్గ్  ప్రింటింగ్ మెషిన్ ని కనుగొన్నాడు...గుటెన్బర్గ్ ఆవిష్కరణ ఈ ప్రపంచ“నాగరికతకు జర్మనీ ఇచ్చిన గొప్ప బహుమాన౦” అని వర్ణి౦చబడి౦ది. ఆయన స్వహస్థలతో , ముద్రి౦చిన గుటెన్ బర్గ్ "బైబిలు", అనే కళాఖ౦డ౦ యొక్క ప్రతి కాపీ గొప్ప ఖజానాయే...

👉అలాగే మన  దేశానికి మొట్టమొదటగా ముద్రణా యంత్రాన్ని పరిచయం చేసింది విలియం కేరి...!!!
ఈయన భారత్ లో మిషనరీగా మరియు సంస్కరణోద్యమ నాయకునిగా సేవాలందిస్తూ ప్రాంతీయ భాషల్లోకి బైబిల్ ని అనువదించి, ముద్రిస్తూ, భారతీయులకు మాతృభాషలోనే సువార్తను అందించి, స్వయంగా చదివి సత్యాన్ని తెలుసుకొనుటకు దోహదపడ్డాడు... 

👉#ప్రపంచంలో  ముద్రణయంత్రం కనుగొన్న తరువాత ముద్రించబడిన మొట్టమొదటి పుస్తకం బైబిల్... 

👉# మన భారతదేశంలో కూడా  మొట్టమొదటగా ముద్రించబడిన పుస్తకం బైబిలే.!!!
అయితే.. 

👉#మొట్టమొదట ప్రింటింగ్ ప్రారంభించినప్పుడు  గుటెన్ బర్గ్ మొదటిసారి "180" బైబిల్ కాపీలను ముద్రించాడు. అలా చెయ్యడానికి క్రీ.శ.1453 నుండి1456 వరకు, అంటే 180 కాపీలను ముద్రించడానికి పట్టిన కాలం సరాసరి 3 సంవత్సరాలు...ఆ బైబిల్ లను లాటిన్ భాషలో ముద్రించాడు. 

👉అయితే ఇన్ని వందల సంవత్సరాల తర్వాత గుటెన్ బర్గ్ ముద్రించిన ఆ 180 బైబిల్ కాపిలలో 50 కాపీలు మాత్రమే లభ్యమయ్యాయి...
లభ్యమైన బైబిల్లు బహుగా వాడబడి, చిరిగిపోయి శిథిలావస్థలో ఉన్నాయి... 

👉#గూటేన్ బర్గ్ ప్రింట్ చేసిన మొదటి 3 మాస్టర్ కాపిలలో ఒక దాన్ని అమెరికాలోని "లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్" వారు 2 కోట్ల రూపాయలు వెచ్చించి సొంతం చేసుకున్నారు.... 

👉ఆ తరువాత 1994 లో రెండవ కాపీని మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ "135" కోట్ల రూపాయలు అక్షరాలా ఒక వంద ముప్పై ఐదు కోట్ల రూపాయలు వెచ్చించి రెండవ మాస్టర్ కాపీని సొంతం చేసుకున్నాడు. 

👉#మిగిలిన 47 కాపీలు ప్రపంచంలోని ఆయాదేశాలు సొంతం చేసుకున్నాయి. ఆ దేశాల జాబితా మరియు వారు సొంతం చేసుకున్న బైబిల్స్ సంఖ్యలు చూస్తే... 

👉 ఆస్ట్రియా-1,... బెల్జియం -1,... డెన్మార్క్ -1,... ఫ్రాన్స్ -3,... జర్మనీ-12,... వాటికన్ సిటీ -2,... జపాన్-1,... పోర్చుగల్ -1,... పోలాండ్-1,... రష్యా-2,... స్పెయిన్ -2,... స్విట్జర్లాండ్ -2,... ఇంగ్లాండ్ -8,... అమెరికా-10,...  మొత్తం 47 కాపీలు. మిగిలిన ఒకే ఒక్క కాపి న్యూయార్క్ సిటీ లో వేలంలో ఉంది. ప్రస్తుతం ఎవరైన కొనాలంటే దాని విలువ 200 కోట్లకు పైమాటే...
  
👉#అయితే బిల్ గేట్స్ ప్రపంచములోనే బహు గొప్ప ధనవంతుడు, ఆయనకే బైబిల్ అంత అవసరమైతే దాని విలువ 135 కోట్లు అయినప్పటికీ కొన్నాడంటే మన కళ్ళ ముందే మనకు అందుబాటులో ఉన్న బైబిల్ ని సొంతం చేసుకొని ధ్యానిస్తున్నామా..? ఆలోచించండి..! 


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...