అంశం) దేవుడు
🎯🎯🎯🎯🎯🎯🎯
పరిచయం...
🔰🔰🔰🔰🔰🔰🔰
దేవుడు మహా మహిమాన్వితుడు .ఆయన్ను మనము పూర్తిగా అర్ధం చేసుకోలేము.ఆయన ఆది అంతాలు లేనివాడు.ఆయన సర్వాంతర్యామి. ఆయన లేని స్ధలము లేదు.యోబు 11: 7
దేవుని గూఢాంశములను నీవు తెలిసికొనగలవా? సర్వశక్తుడగు దేవుని గూర్చి నీకు పరిపూర్ణ జ్ఞానముకలుగునా?.దేవుడు పరలోకంలో నివసిస్తూ సర్వలోకాన్ని పరిపాలిస్తున్నాడు.బైబిల్ లో
ఇలా చెబుతున్నది.యెషయా 66: 1యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు ఆకాశము నా సింహాసనము భూమి నా పాద పీఠము .
కీర్తనలు 47: 8 దేవుడు అన్యజనులకు రాజైయున్నాడు దేవుడు తన పరిశుద్ధ సింహాసనము మీద ఆసీనుడై యున్నాడు.
1) దేవుడు ఎలాంటి వాడు.
🌀🌀🌀🌀🌀🌀🌀🌀
A) దేవుడు సర్వ సృష్టికర్త.
💥💥💥💥💥💥💥💥
నెహెమ్యా 9: 6
నీవే, అద్వితీయుడవైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును, భూమిని దానిలో ఉండునది అంతటిని, సముద్రములను వాటిలో ఉండునది అంతటిని సృజించి వాటినన్నిటిని కాపాడువాడవు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది.
కీర్తనలు 139: 13
నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడవు నీవే.
B) దేవుడు సర్వ శక్తి సంపన్నుడు.
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
రోమీయులకు 9: 19-21
అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు.మంటిమీద కుమ్మరివానికి అధి కారము లేదా?
1దినవృత్తాంతములు 29: 11
యెహోవా, భూమ్యాకాశములయందుండు సమస్తమును నీ వశము; మహాత్మ్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి; యెహోవా, రాజ్యము నీది, నీవు అందరిమీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని యున్నావు.
ఎఫెసీయులకు 3: 20
మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటికంటెను, ఊహించు వాటన్నిటికంటెను అత్యధికముగా చేయ శక్తిగల దేవుడు.
C) దేవుడు సర్వజ్ఞడు.
♦️♦️♦️♦️♦️♦️♦️♦️
హెబ్రీయులకు 4: 13
మరియు ఆయన దృష్టికి కనబడని సృష్ఠము ఏదియు లేదు. మనమెవనికిలెక్క యొప్పచెప్పవలసియున్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది.
1యోహాను 3: 19
దేవుడు మన హృదయముకంటె అధికుడై, సమస్తమును ఎరిగియున్నాడు ..
D) దేవుడు పరిశుద్ధుడు.
⭐⭐⭐⭐⭐⭐⭐⭐
1సమూయేలు 2: 2
యెహోవావంటి పరిశుద్ధ దేవుడు ఒకడునులేడు నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు మన దేవునివంటి ఆశ్రయదుర్గమేదియు లేదు.
E) దేవుడు ఆత్మ.
🌀🌀🌀🌀🌀🌀🌀
యోహాను 4: 24
దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను.
F) దేవుడు మిరూ తెలిసికోగల ఒక వ్యక్తి.
☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️
యాకోబు 4: 8
దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును,
కీర్తనలు 145: 18
తనకు మొఱ్ఱపెట్టువారి కందరికి తనకు నిజముగా మొఱ్ఱపెట్టువారి కందరికి యెహోవా సమీపముగా ఉన్నాడు.
G) దేవుడు ప్రేమ గల తండ్రి.
🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈
1యోహాను 3: 1
మనము దేవుని పిల్లలమని పిలువబడునట్లు తండ్రి మనకెట్టి ప్రేమ ననుగ్రహించె చూడుడి; మనము దేవుని పిల్లలమే.
⭕ 2) మనము ఎవరము?
🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀
A) దేవుని సృష్టి.
🌟🌟🌟🌟🌟🌟🌟
కీర్తనలు 139: 14-16
నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది.నేను రహస్యమందు పుట్టిననాడు భూమి యొక్క అగాధస్థలములలో విచిత్రముగా నిర్మింపబడిననాడు నాకు కలిగినయెముకలును నీకు మరుగై యుండ లేదు నేను పిండమునై యుండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములన్నియు నీ గ్రంథములో లిఖితము లాయెను.
B) దేవుని సొత్తు.
♦️♦️♦️♦️♦️♦️
1కోరింథీయులకు 6: 19-20
మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు.విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి.
C) దేవుని ఆరాధించడానికి పిలువబడ్డాము.
⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐
ప్రకటన గ్రంథం 4: 10-11
ఆ యిరువది నలుగురు పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై యుండువాని యెదుట సాగిలపడి, యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి; నీ చిత్తమునుబట్టి అవి యుండెను; దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద నర్హుడవని చెప్పుచు, తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి.
3) నిర్ణయం తీసుకో.
🔥🔥🔥🔥🔥🔥🔥🔥
యేసు ఇలా అన్నాడు ....మత్తయి 22: 37
అందుకాయననీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననునదియే.
యెహోషవా ఇలా అన్నాడు.
యెహోషువ 24: 15
యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవిం చెదరో నేడు మీరు కోరుకొనుడి; మీరె వరిని సేవింప కోరుకొనినను నేనును నా యింటివారును యెహోవాను సేవించెదము అనెను.
నేడు నీవు నీ హృదయం లో క్రీస్తు స్థానం ఇవుము.
ప్రకటన గ్రంథం 3: 20_21
ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపుతీసిన యెడల, నేను అతనియొద్దకు వచ్చి అతనితో నేనును, నాతోకూడ అతడును భోజనము చేయుదుము.నేను జయించి నా తండ్రితోకూడ ఆయన సింహాసనమునందు కూర్చుండియున్న ప్రకారము జయించువానిని నాతోకూడ నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి