*బెత్లేహేము గురించి ఆసక్తి గల విషయాలు*
🎯🎯🎯🎯🎯🎯🎯🎯
👉ప్రపంచ ఖండములలో ఆసియా పెద్దది. ఇందు చిన్న, పెద్ద దేశములు 76కలవు. ఆసియా అన్ని ఖండములకు మధ్యగా నున్నది. దానిలోని చిన్న దేశమే పాలస్తీనా.
👉ఇది మధ్యధరా సముద్రమునకు, అరేబియా ఎడారికి మధ్య 70 మైళ్ళవెడల్పును, 145 మైళ్ళ పొడవును కలిగియున్నది. పాలస్తీనా దక్షిణ భాగంలోనిఇశ్రాయేలు దేశమునకు యెరూషలేము ముఖ్య పట్టణము. ఈ యెరూషలేమునకుప్రక్కనే ఉన్న చిన్న గ్రామము బెత్లేహేము. "యూదయ భెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైనదానవు కావు. ఇశ్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును". (మత్తయి 2:7)
👉లోకరక్షకుడైన యేసు బెత్లేహేములో జన్మిస్తాడన్న సత్యాన్ని పాత నిబంధన ప్రవక్తలు ప్రవచించినట్లుగా సుమారు 2021సంవత్సరముల క్రితము జగద్రక్షకుడైన యేసు క్రీస్తు సర్వ మానవులను జన్మ, కర్మ పాపముల నుండి విడిపించి రక్షించుటకుయెరూషలేము ప్రక్కనున్న బెల్లెహేము అను గ్రామములో కన్యకకు జన్మించి, 33 1/2 సం||లు యెరూషలేము ప్రాంతములలో సంచరించి; కుంటి వారికి కాళ్ళు.మూగవారికి నోరు, చెవిటివారికి చెవులు, కుష్ఠురోగులకు స్వస్థత, అంధులకు దృష్టి, అపవిత్రాత్మల చేత పీడింపబడువారికి విడుదల, సమాధానము లేనివారికి సమాధానము అనుగ్రహించి; సర్వలోక పాప పరిహారార్థము తన ప్రాణమును సిలువపై బలి పెట్టి, సమాధి చేయబడి, మూడవ దినమున మృత్యుంజయుడై లేచి,శిష్యులతో ఒలీవకొండకు వెళ్ళి వారిని ఆశీర్వదించి పరలోకారోహణుడయ్యెను.
👉ప్రభువైన యేసుక్రీస్తు జన్మించిన ఇశ్రాయేలు దేశం ప్రస్తుత ప్రపంచంలో ఎంతో అభివృద్ధి సాధించినది. “అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును".(యెషయా 35:1) అనే వాక్య ప్రకారము ఒకప్పుడు నిర్జీవముగా ఉన్న దేశాలు నేడు ఎంతో ఫలభరితముగా చేయబడినవి.ప్రతి సంవత్సరము10 నుండి 15 వేల మంది ఇతర దేశములలో ఉన్న యూదులు తిరిగి వస్తున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి