ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

బైబిలులోని ""హూషై""గారి క్లుప్త చరిత్ర

*బైబిలులోని ""హూషై""గారి క్లుప్త చరిత్ర...*

"హూషై" గారి కోసం నేటి క్రైస్తవ యువత ఖచ్చితముగా తెలుసుకోవాలి.

*హూషై గారు దావీదు గారికి నమ్మకమైన ప్రాణ స్నేహితుడు.*
దావీదు గారి కోసం ప్రాణము ఇవ్వడానికైనా సిద్ధపడే స్నేహితుడు.

*రాజైన దావీదు గారిని తన కొడుకైన అబ్షాలోము గారు మోసం చేసి, మోసపూరితముగా ఇశ్రాయేలీయుల ప్రజలను తనవైపు త్రిప్పుకుని హెబ్రోనులో తనకు తాను రాజుగా ప్రకటించుకుంటాడు.*

ఈ వార్త విన్న దావీదు గారు తన సహచరులతో నా కుమారుడైన అబ్షాలోము చేతిలో నుండి మనము తప్పించుకుని రక్షణ పొందలేము.
*కాబట్టి అబ్షాలోము చేతిలో మనము చావకుండా ఉండాలి అంటే పారిపోవాలి అని చెప్పి తన అనుచరులను తీసుకుని*
*అరణ్యానికి పారిపోతారు.*
(2సమూ 15 వ అధ్యాయం)

ఈ విషయం తెలుసుకున్న అబ్షాలోము గారు ఎలాగైనా సరే తన తండ్రిని వెదకి చంపి అధికారంగా రాజు అవ్వాలని అనుకుంటాడు.

*రాజైన దావీదు గారు అరణ్యంలో పాద రక్షలు లేకుండా ఒలీవ కొండ ఎక్కుతూ వుంటారు.*
ఇంతలో ఒకరు వచ్చి రాజా! నీ మంత్రి అయిన అహీతోపెలు గారు కూడా నీ కుమారుడైన అబ్షాలోము కుట్రలో చేరిపోయాడు అని చెప్తారు.

*ఆ వార్త విన్న దావీదు గారు అహీతోపెలు చేసే ఆలోచనలను చెడగొట్టమని ప్రార్ధించి ఒలీవ కొండమీదకు ఎక్కుతాడు.*
అక్కడ దేవుణ్ణి ఆరాధించే ఒక స్థలము ఉంది. 

*ఇంతలో ఒకరు పై వస్త్రాలు చింపుకుని తలమీద ధూళి పోసుకొని దావీదు గారి దగ్గరకు వస్తాడు ఆయనే "హూషై"" గారు.*

*తన స్నేహితుడైన దావీదు గారి పరిస్థితి చూసి చాలా దుఃఖించి, నేను కూడా నీతో వస్తాను అని అడుగుతారు.*

అందుకు దావీదు గారు తన స్నేహితుడైన హూషై గారితో వద్దు నువ్వు నాతో రావద్దు.
*నువ్వు పట్టణానికి తిరిగి వెళ్లి నా కుమారుడైన అబ్షాలోము తో రాజా! ఇంతవరకు నీ తండ్రికి సేవ చేసినట్లు ఇకను నీకు సేవ చేసెదను అని చెప్పి అబ్షాలోము చెంత చేరు.*

*అక్కడ నా పక్షముగా నువ్వు "గూఢచారిగా" ఉండి ప్రతీ విషయాన్ని నాకు తెలుపుతూ ఉండు.*
నువ్వు అక్కడ ఉంటే అహీతోపెలు యొక్క ఆలోచనను చెడగొట్టగలవు అని చెప్తారు.

*తన స్నేహితుడు అడిగిన సహాయం కోసం ఏమి ఆలోచించకుండా సరే నేను గూఢచారిగా వెళ్తాను అని దావీదు గారికి మాట ఇస్తాడు హూషై గారు.*
(2సమూ 15:32-37)

*అబ్షాలోము గారి దగ్గరకు గూఢచారిగా వెళ్లడం అంటే మాములు విషయం కాదు.*
*తన తండ్రినే చంపాలి అని చూస్తున్న అబ్షాలోము గారికి హూషై గారు దావీదు గారి గూఢచారి అని తెలిస్తే ఎంత భయంకరంగా చంపేస్తాడో హూషై గారికి తెలుసు.*

పైగా అబ్షాలోము గారితో ఉన్న సైన్యం, అహీతోపెలు గారు కూడా ఎంత భయంకరమైన వారో కూడా తెలుసు అన్ని తెలిసికూడా తన స్నేహితుని కోసం ప్రాణాన్ని పణంగా పెట్టి గూఢచారి గా వెళ్లి అబ్షాలోము గారి చెంత చేరతాడు. *నిజంగా హూషై గారి ధైర్యం, స్నేహితునిపై ఉన్న ప్రేమ చాలా అద్భుతమైనది.*
(2సమూ 16:15-19)

*దావీదు గారు అనుకున్నట్టే అహీతోపెలు గారు దావీదు గారిని ఎలా చంపాలో అని అబ్షాలోము గారికి ఒక ఆలోచనను ఇస్తాడు.*
ఈ ఆలోచన అబ్షాలోము గారికి చాలా బాగా నచ్చుతుంది.

*కానీ దావీదు గారు అహీతోపెలు చేసే ఆలోచనను చెడగొట్టుము అని ముందుగానే దేవునికి ప్రార్ధించాడు కాబట్టి దేవుడు అహీతోపెలు గారి ఆలోచనను చెడగోటేస్తారు.*
ఎలాగంటే!!

*అహీతోపెలు గారి ఆలోచనను విన్న అబ్షాలోము గారు హూషై గారిని పిలిచి అహీతోపెలు గారు చెప్పిన ఆలోచనను మొత్తం హూషై గారికి చెపుతాడు.*

అది విన్న హూషై గారు ఈ ఆలోచన ఎలాగైనా చెడగొట్టి నా స్నేహితుని ప్రాణం కాపాడాలి అని అనుకుని
రాజా! అహీతోపెలు గారు చెప్పిన ఈ ఆలోచన అంత సరైనది కాదు అని చెప్పి
హూషై గారే ఒక మంచి ఆలోచనను చెప్తారు.

*ఈ ఆలోచన అబ్షాలోము గారికి, అక్కడ ఉన్న ప్రతీ ఒక్కరికీ బాగా నచ్చుతుంది.*
వెంటనే అబ్షాలోము గారు అహీతోపెలు గారి ఆలోచనను పక్కన పెట్టి హూషై గారి ఆలోచన ప్రకారం చేయటానికి సైనికులకు ఆజ్ఞ ఇస్తాడు.
(2సమూ 17:1-15)

*ఈ హూషై గారు వెంటనే ఈ వార్తను అక్కడున్న యాజకులైన సాదోకు, అబ్యాతారు గార్లకు చెప్పి ఈ విషయం వెంటనే దావీదు గారికి తెలియచేయండి అని చెప్తాడు.*

యాజకులైన సాదోకు, అబ్యాతారు గార్లు తమ కుమారులైన యోనాతాను, అహిమయస్సు అనువారిని దావీదు గారి దగ్గరకు పంపుతారు.

*ఈ ఇద్దరూ దావీదు గారికి వర్తమానము తీసుకెళ్తున్నారని అబ్షాలోము గారి యొక్క పనివాడు తెలుసుకుని అబ్షాలోము గారితో చెప్తాడు.* వెంటనే అబ్షాలోము గారు తన సైనికులతో వారినిద్దరిని చంపేయండి అని ఆజ్ఞ ఇస్తారు.
*కానీ దేవుని కృప వలన ఆ ఇద్దరూ దావీదు గారి దగ్గరకు క్షేమముగా చేరుకుని వర్తమానము తెలియచేస్తారు.*

అది విన్న దావీదు గారు అక్కడ నుంచి తన జనులను తీసుకుని యొర్దాను నది దాటి వెళ్ళిపోతారు.
(2సమూ 17:15-22)

*వార్త పట్టుకెళ్తున్నారని తెలిసి యోనాతాను, అహిమయస్సు గార్లను చంపేయండి అని ఆజ్ఞ ఇచ్చిన అబ్షాలోము గారికి*
*అసలు ఆ ఆలోచన ఇచ్చింది హూషై గారే అని తెలిస్తే హూషై గారిని ఎంత భయంకరంగా చంపేస్తాడో ఒక్కసారి ఆలోచించండి.*

తన స్నేహితుని కోసం భయంకరమైన చోటుకు వెళ్లి గూఢచారిగా పని చేసి తన స్నేహితుడైన దావీదు గారి ప్రాణాలను కాపాడాడు ఈ హూషై గారు.

*హూషై గారు తన స్నేహితుని కోసం చేసిన సాహసం నిజంగా చాలా ఆశ్చర్యమైనది, భయంకరమైనది...*

దావీదు గారు హూషై గారిని భయంకరమైన మనుస్యుల మధ్యకు పంపించాడు. హూషై గారు వెళ్లారు, వెళ్లిన పని ముగించారు.
అలాగే...

*శిష్యులైన వారిని కూడా ప్రభువు తోడేళ్ల మధ్యకు పంపించారు.*
వారు మేము వెళ్ళము అని అనలేదు.
*సర్వ సృష్టికి వెళ్లారు దేవుడు అప్పగించిన పని చేసారు. చివరికి దేవుని కోసం హతసాక్ష్యులు అయిపోయారు.*
(లూకా 10:3)

*ఓ క్రైస్తవ యువతి యువకా!!*

*మరి నువ్వు నేను తోడేళ్ల మధ్యకు వెళ్తున్నామా??*

ఈరోజుల్లో అపవాది మనుస్యులను క్రూరంగా తయారు చేస్తుంది.

*ఎక్కడ చూసినా దారుణాలు, అత్యాచారాలు, దొంగతనాలు, మోసాలు, హత్యలు..*
*మనిషిలో మానవత్వం, ప్రేమ, దయ, కనికరం కనుమరుగు అయిపోతున్నాయి.*

*నశించిపోతున్న మనుష్యులు రక్షింపబడాలి అంటే వారందరూ క్రీస్తు రక్తములో కడగబడి ఆయన ప్రేమను అందుకోవాలి, రుచి చూడాలి..*

అలా జరగాలి అంటే హూషై గారివలె, ప్రభువు యొక్క శిష్యుల వలె మనము కూడా భయంకరమైన సమాజంలోకి ధైర్యంగా వెళ్లి క్రీస్తు సువార్తను చాటాలి..

*క్రీస్తు ప్రేమను బోధతో, బ్రతుకుతో చూపించాలి..*

*ఎందరో మిషనేరీలు క్రీస్తు కొరకు ప్రాణాలను కోల్పోయారు, ఆస్తులను, కుటుంబాలను కోల్పోయారు. సుఖాలను, సంతోషాలను త్యాగం చేశారు.*

మనము మాత్రం ఇంకా బాధ్యత లేని క్రైస్తవులముగానే కాలాన్ని వృధా చేస్తున్నాము....

*మనం*
*అపవాదిని ఎదిరించాలి.*
వాడి ఆలోచనలను నాశనం చేయాలి.
*వాడిని వాడి సైన్యాన్ని చితకత్రోక్కాలి...*
(ఎఫెసి 6:10-18, రోమా 16:20, 1యోహాను 3:8)
*అప్పుడు క్రీస్తు రాజ్యము వ్యాప్తి చెందుతుంది..*

*హూషై గారు తన స్నేహితుని కోసం చేసినట్టు మనము కూడా మన ప్రాణ స్నేహితుడైన యేసుప్రభువు గారికోసం చేద్దాము.*

*ఆయన సర్వ సృష్టికి వెళ్లి సువార్త ప్రకటించమని చెప్పారు*
(మార్కు 16:16)

*ఆయన చెప్పినట్టు చేస్తే మనము కూడా యేసుప్రభువు గారికి స్నేహితులము అవుతాము*
(యోహాను 15:14)

ప్లీజ్ ఫ్రెండ్స్ దేవునికి స్నేహితులము అయ్యే గొప్ప అవకాశాన్ని పోగొట్టుకోవద్దు.

*దేవుని రాకడ అతి దగ్గరలో ఉంది కాబట్టి త్వరగా మనము సువార్తను వెదజల్లుదాము, ఆత్మలను రక్షించి క్రీస్తువారికి బహుమతిగా ఇద్దాము.*

*హూషై గారి ద్వారా మన దేవాది దేవునికే మహిమ కలుగును గాక!!!!*

*మరనాత= ప్రభువు వచ్చుచ్చున్నాడు.*
1కోరింది 16:22.

*ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను.*
ప్రకటన 22:7

*ప్రభువైన యేసూ రమ్ము..*
ప్రకటన 22:20.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...