"#క్రీస్తు_శాస్త్రము_పార్ట్-2
దైవ కృత్యాలు (Divine Offices):
#దేవుడు_మాత్రమే_చేయగలిగే_కార్యములు
1. సృష్టించుట (Creation):
యేసు ప్రభువు సృష్టికర్త.
సృష్టించబడిన వ్యక్తి సృష్టి చేయలేడు.
(హెబ్రీ 1:10; యోహాను 1:3; కొలస్సీ1:16).
దేవుని కుమారుడే నిత్య వాక్యము. ఆయనే సృష్టికర్త.
2.పాపక్షమాపణ (Forgiveness) :
యేసుక్రీస్తు ప్రభువు పక్షవాయువుగలవాన్ని బాగు చేసినప్పుడు నీ పాపాలు క్షమించబడ్డాయని వానితో చెప్పాడు.
అప్పుడు అక్కడున్నవారు దేవుడు ఒక్కడే గదా పాపాలు క్షమించగల సమర్ధుడు, ఈయన దేవదూషణ చేస్తున్నాడని సణుగుకొనిరి. అప్పుడు ప్రభువు తనకు పాపాలను క్షమించే అధికారం ఉంది అని నిక్కచ్చిగా చెప్పారు.
(మార్కు 2:5-10; లూకా 7:48; ప్రకటన 1:6).
3. నిర్వాహకుడు (Administrator) :
దేవుడు సృష్టికర్త మాత్రమే కాదుకాని, సృష్టిని భద్రపరిచి, సంరక్షించి, పోషించి, నిర్వహిస్తున్నవాడు
(హెబ్రీ 1:2-4).
యేసుక్రీస్తు తన మహత్తుగల మాటచేత సమస్తాన్ని నిర్వహిస్తున్నాడు.
4. నిత్యజీవ ప్రదాత (Life giver ) :
దేవుడు నిత్యుడు. ఆయనలోని జీవం నిత్యం నిలిచేది. మానవులకు ఆయన నిత్యజీవాన్ని ప్రసాదిస్తాడు.
(యోహాను 10:28; యోహాను 17:2).
యేసుక్రీస్తు నిత్యజీవాన్ని తనయందు విశ్వాసముంచువారికి ప్రసాదించును.
5. పునరుత్థానం కలుగజేయువాడు( Ressurector) :
మృతులను సజీవులుగా చేయగలవాడు దేవుడు
(యోహాను 6:39; యోహాను 6:44).
“అంత్యదినమందు యేసుక్రీస్తు ప్రభువు మృతులను తిరిగి లేపును”.
6. న్యాయాధిపతి (Judge) :
దేవుడు న్యాయాధిపతి. అందరికి న్యాయం తీర్చువాడు(2 తిమోతి 4:1).
యేసుక్రీస్తు ప్రభువు సజీవులకును, మృతులకును తీర్పు తీర్చువాడు( రోమా 2:16).
యేసుక్రీస్తు మనుష్యులు చేసెడి రహస్య
కార్యాలను తీర్పు తీర్చును. (2 కొరింథీ 5:19). విశ్వాసులకు ఆయన తీర్పు తీర్చును. (ప్రకటన 20:21)
ప్రభువు మృతులైన పాపులకును తీర్పు తీర్చును.
7.రూపాంతరపరచువాడు (Transformer) :
శరీరాలను రూపాంతరపరచువాడు దేవుడు మాత్రమే. మన మట్టి శరీరాలను మహిమశరీరాలుగా రూపాంతర
పరచగలడు (ఫిలిప్పీ 3:21).
యేసుక్రీస్తు విశ్వాసుల హీనమైన మట్టి శరీరాలను మహిమగల శరీరాలుగా మార్చగలడు.
8. సమస్తాన్ని లోపరచుకొనువాడు ( Subduer ) :
దేవుడు మాత్రమే సమస్తాన్ని లోపరచుకోగలడు. అది దేవునికి మాత్రమే సాధ్యమయ్యే విషయం.
(ఫిలిప్పి 3:21).
యేసుక్రీస్తు తనకు సమస్తాన్ని లోపరచుకొను శక్తిగలవాడు.
9. పరిశుద్ధాత్మను పంపుట ( sending the Holy Spirit ) :
యోహాను 14:16 లో తండ్రి పరిశుద్ధాత్మను అనుగ్రహించును అని ప్రభువు చెప్పాడు. అనగా
పరిశుద్ధాత్మను పంపు పని దేవునిదే. దేవుడు కాని వ్యక్తి పరిశుద్ధాత్మను పంపలేడు. 26వ వచనములో తండ్రి
నా నామమున పరిశుద్ధాత్మను పంపుతాడు అని ప్రభువు చెప్పాడు. యోహాను 15:26 లో "తండ్రి యొద్దనుండి
మీ యొద్దకు నేను సత్యస్వరూపియైన ఆత్మ లేదా ఆదరణకర్తను పంపుదును” అని ప్రభువు చెప్పాడు. కనుక
యేసుక్రీస్తు ప్రభువు తానే పరిశుద్ధాత్మను ఈ లోకములోనికి పంపుతున్నట్లుగా స్వయంగా చెప్పాడు.
10. లయం చేయుట ( Destroyer ) :
(హెబ్రీ 1:10-12; ప్రకటన 21:5). యేసు ప్రభువు ఈ సృష్టి అంతటిని లయపర్చి నూతన సృష్టిని
చేయబోతున్నాడు. సృష్టికర్తయే లయకర్త. దేవుడు లయకర్త.
ఈ పది కృత్యాలు దేవుడే నిర్వహించగలడు. మనుష్యులుగాని దేవదూతలు కాని ఈ కార్యాలు
చేయలేరు.
యేసుక్రీస్తు దేవుడు కనుకనే ఈ కార్యాలన్నీ చేయగలడు.
ఈ సమాచారము::
'జోషి లీలన్ రెడ్డి' గారు వ్రాసిన ""క్రీస్తు శాస్త్రము"" అను పుస్తకము లోనిది.
పేజీ 20-21
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి