*ఒక పాస్టర్ గారు అడిగిన ""వింతైన ప్రశ్నలు""....*
ఒక పాస్టర్ గారు తమ సంఘంలో జరుగుతున్న మీటింగ్స్ కి ఒక సేవకుణ్ణి వాక్యం చెప్పడానికి పిలిచారు.
*ఆ మీటింగ్స్ కి ఇంచుమించు 150 మంది వచ్చారు.*
ఆ సేవకుడు వాక్యాన్ని బోధిస్తూ సంఘస్థులను *మీరు ఎప్పటి నుంచి మందిరానికి వస్తున్నారు, ఎంతకాలం నుంచి దేవుణ్ణి నమ్ముకుంటున్నారు అని ప్రశ్న అడిగాడు*
అందుకు ఆ సంఘస్తులు అందరూ ఇంచుమించు 10 సంవత్సరాల నుండి దేవునిలో ఉన్నాము, మందిరానికి వస్తున్నాము అని చెప్పారు.
*ఆ సేవకుడు దేవుని మందిరం కోసం వాక్యాన్ని బోధిస్తూ, దేవుని మందిరం అనగా దేవుని ఇల్లు*
అలానే
దేవుని మందిరం అనగా మనందరికి కూడా ఇల్లు
*మీరు దేవుని ఇంటికి, మీ ఇంటికి (మందిరం) ఇంచుమించు 10 సంవత్సరాల నుంచి వస్తున్నారు చాలా మంచిది*
మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను సమాధానం చెప్పండి అని అడిగాడు.
*సంఘస్థులందరు సమాధానము చెబుతామన్నారు.*
*మొదటి ప్రశ్న::*
*మీలో ఎంతమందికి చర్చిలో ఉన్న ఫ్యాన్ స్విచ్ లు తెలుసు? అనగా ఏ స్విచ్ వేస్తే ఏ ఫ్యాన్ తిరుగుతుందో ఎంతమంది కి తెలుసు??*
ఆ ప్రశ్నకు జవాబుగా ఐదుగురు చేతులు పైకి ఎత్తారు మాకు తెలుసు అని.
*రెండవ ప్రశ్న::*
ఈ 10 సంవత్సరాలలో కనీసం ఒక్కసారైనా మందిరాన్ని తుడిచిన వారు ఎంతమంది???
*ఈ ప్రశ్నకు 10మంది చేతులు ఎత్తారు మేము తుడిచాము అని.*
*మూడవ ప్రశ్న::*
ఈ 10 సంవత్సరాలలో ఎంతమంది మందిరంలో కుర్చీలు, తివాచీలు, బరకములు వేశారు మరియు తీశారు???
*ఈ ప్రశ్నకు ఏడుగురు చేతులు ఎత్తారు.*
*నాల్గవ ప్రశ్న::*
ఈ 10 సంవత్సరాలలో దేవుని మందిరాన్ని ఎంతమంది కడిగారు???
*ఈ ప్రశ్నకు ఆరుగురు మాత్రమే చేతులు పైకి ఎత్తారు మేము కడిగాము అని...*
అప్పుడు ఆ సేవకుడు ప్రియ దేవుని సంఘమా!!!
*ఇక్కడఇంచుమించు 150 మంది ఉన్నారు, మీరందరూ 10 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నారు*
కానీ ఫ్యాన్ స్విచ్ లు కోసం కేవలం 5గురుకి,
*మందిరాన్ని కనీసం ఒక్కసారైనా తుడిచినవారు 10మంది,*
మందిరంలో కుర్చీలు, బరకాలు, తివాచీలు వేసి తీసినవారు 7గురు,
మందిరాన్ని కడిగినవారు 6గురు మాత్రమే వున్నారు.
*మరి మిగిలినవారు????*
*మీరు నివాసము ఉంటున్న మీ స్వంత గృహాలలో 10 సంవత్సరాల నుండి నివాసము ఉంటే ఆ ఇంటిలో ఏది ఎక్కడ ఉంటుందో తెలియకుండా ఉంటుందా?*
ఆ గృహాన్ని శుభ్రం చేసుకోకుండా ఉంటారా?
కడుక్కోకుండా ఉంటారా???
*మీ ఇంటిని ఎంతో చక్కగా, బాధ్యతగా చేసుకుంటారు కదా!*
మరి మన దేవాది దేవుని మందిరం ఇంకెంత బాగా చూసుకోవాలి???
*దేవుని మందిరానికి ఏదో వచ్చి వెళ్లిపోయేవారముగా ఉండకూడదు.* అలా ఉంటే ఎన్ని సంవత్సరాల నుండి మందిరానికి వచ్చిన ఏమి తెలియవు మనకు...
*మీకు ఒక మాట!!*
*ఆనాడు యేసుప్రభువు గారి కాలంలో కొన్ని వేల మంది ప్రభువు చుట్టూ తిరిగారు, మేలులు పొందుకున్నారు, వెళ్లిపోయారు* కానీ ప్రభుని అంటుపెట్టుకుని ఉంది కేవలం 12 మంది శిష్యులే
*కాబట్టే 5రొట్టెలు 2చేపలు 5వేల మందికి పంచిపెట్టినప్పుడు తిన్న వారికి కొద్ది ఆహారమే (కడుపు నిండినంత మాత్రమే)*
కానీ వడ్డించి, పంచిపెట్టి, ఎత్తినవారికి (శ్రమ పడి పరిచర్య చేసిన వారికి) గంపలు నిండా మిగిలాయి
*(12 మందికి 12 గంపలు మిగిలాయి)*
(మత్తయి 14:15-20)
*కష్టపడిన వారికే ప్రతిఫలం ఎక్కువ, దీవెన ఎక్కువ, పరలోకంలో అంతస్తు ఎక్కువ...*
మనము కూడా శిష్యుల వలె బాధ్యతగా ఉండాలి.
దేవుని మందిరాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.
*ప్రార్ధన సమయానికి ముందే వచ్చి మందిరాన్ని తుడిచి కుర్చీలు వేసి అన్ని సిద్ధపర్చాలి, ప్రార్ధన అయ్యాక అన్నీ శుభ్రము చేసి వెళ్ళాలి...*
*దేవుడు నివసించే మందిరంలో కష్టపడటం అనేది ఎంత గొప్ప ధన్యత...*
*ఇప్పుడు భూలోకంలో దేవుని మందిరాన్ని ప్రేమిస్తే రేపు పరలోకంలో ఉన్న దేవుని మందిరంలో సంతోషముగా వుండే ధన్యత దొరుకుతుంది* అని ఆ సేవకుడు తన ప్రసంగాన్ని ముగించాడు....
*ఓ ప్రియ చదువరీ!!!*
మరి నువ్వేటువంటి వానిగా వున్నావు???
*ఇవే ప్రశ్నలు నిన్ను అడిగితే నీ దగ్గర నుండి ఎటువంటి జవాబు వస్తుంది???*
*నీ విశ్వాస జీవితం ప్రారంభించాక ఒక్కసారైనా దేవుని మందిరాన్ని తుడిచావా?*
దేవుని మందిరాన్ని కడిగావా?
*మందిరంలో కుర్చీలు, తివాచీలు, బరకాలు వేసావా?*
సౌండ్ సిస్టం ఆపరేట్ చేశావా???
*సమయానికి ముందే ఒక్కసారైనా దేవుని మందిరానికి వెళ్ళావా??*
దేవుని మందిరంలో కష్టపడే వానిగా వుంటున్నావా? లేక *దర్జాగా వెళ్లి కూర్చుని వచ్చే వానిగా వుంటున్నావా??*
ఆలోచించు...
*ప్రభువే భూలోకంలో పరిచర్య చేసాడు మరి మనము???* (మత్తయి 20:28)
*ప్రభువు తన సంఘం కోసము అనగా నీకోసం, నాకోసం తన రక్తాన్ని కార్చి ప్రాణమే పెట్టేసారు*
మరి అటువంటి దేవుని కొరకు మనము ఇంకెంత కష్టపడాలి???
*ఇప్పటి నుండైన కష్టపడే క్రైస్తవులుగా, సంఘస్థులముగా ఉందాము....*
ఆయన రాకడ అతి సమీపముగా ఉన్నది కాబట్టి బాధ్యత కలిగి ఉండి ఆయన రాకడలో ఎగిరివెళ్లిపోదాము.
*మన దేవాది దేవునికే మహిమ కలుగును గాక!!!!*👏👏👏
ప్రకటన 2:23
*మీలో ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చెదను..*.
కీర్తనలు 128:2
*నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము ననుభవించెదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును.*
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి