ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

యేసు క్రీస్తు శరీరధారి అగుటకు కారణములు .


యేసు క్రీస్తు శరీరధారి అగుటకు కారణములు .
🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯
1. పాపులను రక్షించుటకు క్రీస్తు ఈ లోకమునకు వచ్చెను. 
💥💥💥💥💥💥💥💥
1తిమోతికి 1: 15
​పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్య మైనదియునైయున్నది. 

2. నశించిన దానిని వెదకి రక్షించుటకు.
💧💧💧💧💧💧💧💧
లూకా 19: 10
నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. 

3. ధర్మశాస్త్రము నెరవేర్చుటకు
✳️✳️✳️✳️✳️✳️
మత్తయి 5: 17
ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టి వేయవచ్చితినని తలంచవద్దు; నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు.

4. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు
✴️✴️✴️✴️✴️✴️✴️
యోహాను 18: 37-38
అందుకు పిలాతునీవు రాజువా? అని ఆయనను అడుగగా యేసునీవన్నట్టు నేను రాజునే; సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని; ఇందు నిమిత్తమే యీ లోకమునకు వచ్చితిని; సత్యసంబంధియైన ప్రతివాడును నా మాట వినుననెను.అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి? అని ఆయనతో చెప్పెను. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్లి అతనియందు ఏ దోషమును నాకు కనబడలేదు; 

5. పరిచారము చేయుటకు 
🔶🔶🔶🔶🔶🔶🔶🔶
మార్కు 10: 45
మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెననెను. 

6. విమోచన క్రయధనముగ తన ప్రాణము నిచ్చుటకు
🔷🔷🔷🔷🔷🔷🔷🔷
మత్తయి 20: 28
ఆలాగే మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెనని చెప్పెను. 

7. అపవాది క్రియలను లయపరచుటకు 
🌠🌠🌠🌠🌠🌠🌠
1యోహాను 3: 8
అపవాది(సాతాను) మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి; అపవాది(సాతాను) యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. 

8. లోకపాపమును మోసికొనిపోవుటకు
🔰🔰🔰🔰🔰🔰🔰
యోహాను 1: 29
మరువాడు యోహాను యేసు తనయొద్దకు రాగా చూచి ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్ల. 

9. సమస్తమును తెలియజేయుటకు
🌟🌟🌟🌟🌟🌟🌟🌟
యోహాను 4: 25-26
ఆ స్త్రీ ఆయనతో క్రీస్తన బడిన మెస్సీయ వచ్చునని నేనెరుగుదును; ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా
యేసునీతో మాటలాడు చున్న నేనే ఆయననని ఆమెతో చెప్పెను. 

10. దైవరాజ్య సువార్తను ప్రకటించుటకు
💠💠💠💠💠💠💠
లూకా 4: 43
ఆయననేనితర పట్టణములలోను దేవుని రాజ్యసువార్తను ప్రకటింపవలెను; ఇందునిమిత్తమే నేను పంపబడితినని వారితో చెప్పెను. 

11. లోకమును రక్షించుటకు
⭕⭕⭕⭕⭕⭕⭕
యోహాను 3: 17
లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకేగాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంపలేదు. 

12. తండ్రి చిత్తము నెరవేర్చుటకు 
🛑🛑🛑🛑🛑🛑🛑
యోహాను 6: 39
నా యిష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు; నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకమునుండి దిగి వచ్చితిని. 

13. గొర్రెలకు సమృద్ధిగా జీవము కలుగుటకు
🎯🎯🎯🎯🎯🎯🎯
యోహాను 10: 10
దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరిదేనికిని రాడు; గొఱ్ఱెలకు జీవము కలుగుటకును అది సమృధ్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 

14. మంచి కాపరిగా తన ప్రాణము పెట్టుటకు 
♻️♻️♻️♻️♻️♻️
యోహాను 10: 11-18
నేను గొఱ్ఱెలకు మంచి కాపరిని; మంచి కాపరి గొఱ్ఱెలకొరకు తన ప్రాణము పెట్టును. 

15. శిష్యులను సత్యమందు ప్రతిష్ఠ చేయుటకు
🤎🤎🤎🤎🤎🤎🤎🤎
యోహాను 17: 18-19
నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని.వారును సత్యమందు ప్రతిష్ఠ చేయ బడునట్లు వారికొరకై నన్ను ప్రతిష్ఠ చేసికొనుచున్నాను. 

16. భూమి మీద అగ్ని వేయుటకు
🌀🌀🌀🌀🌀🌀🌀🌀
లూకా 12: 49
నేను భూమిమీద అగ్నివేయ వచ్చితిని; అది ఇదివరకే రగులుకొని మండవలెనని యెంతో కోరుచున్నాను. 

17. అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు
💚💚💚💚💚💚💚💚
హెబ్రీయులకు 2: 14-15
కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణముయొక్క బలముగలవానిని, అనగా అపవాదిని(అనగా-సాతాను) మరణముద్వారా నశింపజేయుటకును,
హెబ్రీయులకు 2: 15
జీవితకాలమంతయు మరణభయముచేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును, ఆయనకూడ రక్తమాంసములలో పాలివాడాయెను. 

18. ధర్మశాస్త్రమునకు లోబడినవారిని విమోచించుటకు
🧡🧡🧡🧡🧡🧡🧡
గలతియులకు 4: 4-5
అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను;ఆయన స్త్రీయందు పుట్టి,
మనము దత్తపుత్రులము(స్వీకృతపుత్రులము) కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి యున్నవారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయెను. 

19. మధ్యవర్తిత్వము జరుపుటకు
🤍🤍🤍🤍🤍🤍🤍🤍
1తిమోతికి 2: 5
దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్య వర్తియు ఒక్కడే; ఆయన క్రీస్తుయేసను నరుడు.
హెబ్రీయులకు 9: 15
ఈ హేతువుచేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధములనుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున, పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్తనిబంధనకు మధ్యవర్తి యైయున్నాడు. 

20. ధర్మశాస్త్ర శిక్ష నుండి తప్పించుటకు
🤎🤎🤎🤎🤎🤎🤎🤎
రోమీయులకు 8: 1
కాబట్టి యిప్పుడు క్రీస్తుయేసునందున్నవారికి ఏ శిక్షావిధియు లేదు. 

21. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చుటకు
💙💙💙💙💙💙💙💙
రోమీయులకు 8: 3-4
శరీరము ననుసరింపక ఆత్మననుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతివిధి నెరవేర్చబడవలెనని పాప పరిహారమునిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. 

22. ఆదాము దోషమును తీసివేయుటకు 
🧡🧡🧡🧡🧡🧡🧡🧡
(1కొరిందీ15:20,22,45,49) 

23. మరల వచ్చి మనలను కొనిపోవుటకు
🔸🔸🔸🔸🔸🔸🔸🔸
యోహాను 14: 3
నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచినయెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నాయొద్ద నుండుటకు మిమ్మును తీసికొని పోవుదును. 

24. లేఖనముల ప్రకారము లేఖనములు నెరవేర్చుటకు, ప్రవక్తల ప్రవచనములను నెరవేర్చుటకు ప్రభువు పరమును వీడి, ఈ లోకమునకు ఏతెంచెను.
🌐🌐🌐🌐🌐🌐🌐
1కోరింథీయులకు 15: 3-4
నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతిపొందెను, సమాధి చేయబడెను,లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...