ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

చంద్రుడిపైకి తీసుకెళ్ళినా మొట్టమొదటి బైబిల్

*చంద్రుడిపైకి తీసుకెళ్లినా మొట్టమొదటి బైబిల్*
🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔻🔻

🔻భూమిపైనే కాదు అంతరిక్షంలో చంద్రుడి పై కూడా విద్యుత్ బల్బ్ వెలుగులో చూడబడి చదవబడిన మొట్టమొదటి గ్రంధం ఏదైనా ఉందంటే అది పరిశుద్ధ గ్రంధమైన బైబిల్ మాత్రమే అని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది...

🔻ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా (NASA) పరిశుద్ధ గ్రంధాన్ని (The Holy Bible) ఫిబ్రవరి 1971 అపోలో మిషన్ 14 (NASA's February 1971 Apollo 14 mission) ద్వారా【1×1inch (2.5/2.5.Cm)】ఇంచ్ పరిమాణం గల మూడువందల (300 Bible's) బైబిల్స్ ని అంతరిక్షం (Space) లోకి పంపించారు...

🔻అంతరిక్షంలోకి తీసుకెళ్లిన బైబిల్స్ అతి సూక్ష్మమైన ఛాయాగ్రహణా (Microfilm) లో 1,245 పేజీలు మరియు 773,746 పదాల నిడివి (Length) తో ఒక్కో బైబిల్ ని ముద్రించి అలా 300ల బైబిల్స్ ని , మహోన్నతుడైన మహా దేవుని కృపతో చంద్రుడిపై నడిచిన అస్ట్రోనాట్ ఎడ్గర్ మిచెల్ (Edgar Mitchell) కృషి వలన అపోలో ప్రేయర్ లీగ్ ( Apollo Prayer League ) సహకారంతో అంతరిక్షంలోకి తీసుకువెళ్లడం జరిగింది...

🔻అలాగే నాసా అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో నమ్మకమైన క్రీస్తు విశ్వాసియైన జాన్ స్టౌట్ (John Stout) గారి అధ్వర్యంలో అంతరిక్షంలోకి వెళ్తున్న వ్యోమాగాముల (Astronauts) కొరకు ప్రత్యేకంగా ప్రార్ధించడం జరిగింది...

🔻అపోలో 14 లో తీసుకెళ్లిన 300 ల బైబిల్స్ లలో, 200 బైబిల్స్ ని అపోలో 14 కమాండ్ మౌడ్యూల్ "కిట్టి హాక్" (Apollo 14 command module "Kitty Hawk") లోనే భద్రపరిచి ఉంచారు... ఆ బైబిల్స్  కిట్టి హాక్ తో పాటే కక్ష్యలో పరిభ్రమిస్తూ ఉంటాయి...

🔻మరో 100 బైబిల్స్ అస్ట్రోనాట్ ఎడ్గర్ మిచెల్ (Edgar Mitchell) మరియు అపోలో మిషన్ కమాండర్ అలాన్ షేపర్డ్(Alan Shepard) కలిసి చంద్రుని పై "హైల్యాండ్"(Highland) అనే ప్రదేశంలో భద్రపరిచారు...
ప్రస్తుతం ఆ 100 బైబిల్స్ "అంటరేస్"(Antares) అనే చంద్రుని మాడ్యుల్ (ఉపగ్రహం ) తో ఉన్నాయి...

🔻ఈ యొక్క సమిష్టి బైబిల్స్ ని మొట్టమొదటి లూనార్ బైబిల్స్  అని పిలుస్తారు...

🔻అపోలో 14 భూమికి తిరిగివచ్చినప్పుడు, ఎడ్గర్ మిచెల్ చెక్కుచెదరకుండా బైబిళ్ళను తిరిగి జాన్ స్టౌట్ కి సమర్పించాడు, అపోలో ప్రార్థన లీగ్ యొక్క సభ్యులకు 50 వాక్యపేజీ(Microfilm) ముక్కలను చేతికి కట్టాడు మిగిలినవి జాన్ స్టౌట్ చేత భద్రపరచబడినాయి...
(Truth Research Center of India)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...