ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సాధు సుందర్ సింగ్"" గారు స్విట్జర్లాండ్ లో చెప్పిన ప్రసంగము = 3*

*""సాధు సుందర్ సింగ్"" గారు స్విట్జర్లాండ్ లో చెప్పిన ప్రసంగము = 3*

అంశము::
*""సమృద్ధిజీవము""*

పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 10:10 చదివి ప్రసంగమును ప్రారంభించెదము.

*"దొంగ దొంగతనమును హత్యను నాశనము చేయుటకే వచ్చునుగాని మరి దేనికి నీరాడు; గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను"*

దాదాపు 2 వారముల క్రిందట నేను యెరూషలేమునందు ఉంటిని.
అచ్చట దేవాలయము సమీపమున రక్షకుడు నడిచిన స్థలమందు నేను నడచితిని. శరీరాకారములో ప్రభువు అక్కడ లేకపోయినను అది నాలో గొప్ప
ప్రభావమును కలుగజేసినది. బహుశా ఆ స్థలమందే ఆయన ఈ మాటలను పలికియుండవచ్చును. "

*గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితిని".* మనము జీవము పొందవలెననియు దానిని సమృద్ధిగా పొందవలెననియు ఆయన చెప్పెను.

*జీవము, సమృద్ధి జీవముల మద్యగల వ్యత్యాసమును స్పష్టపరచుటకు ఒక దృష్టాంతమును చెప్పగోరుచున్నాను.*

*మా దేశమందు కొన్ని సంవత్సరముల క్రిందట ఒక మనుష్యుడు ఉండెను.* దీర్ఘకాల వ్యాధినిబట్టి అతడు ఎక్కువకాలము జీవించని స్థితిలో మంచము మీద ఉండెను. అతనిని పరామర్శించువారు ఎవరును లేరు.

*ఆ సమయమందు తనవైపు ఒక పాము వచ్చుటను చూచెను. తన ప్రాణమును కాపాడుకొనవలెనని అతడు కోరుకొనినను అతని ఆరోగ్యము బాగోలేక పోయినందున ఏమియు చెయ్యలేకపోయెను.* అతనికి జీవము ఉండెను గాని ఆ జీవము నిష్ప్రయోజనముగా నుండెను. 

*ఒక రాయిని తీసుకొని ఆ పామును చంపలేకపోయెను.* పాము తనవైపు చూచుటను బట్టి భయపడెను. నిస్సహాయ స్థితిలో ఉండిన అతనిని పాము కరవగా అతడు అర్ధగంట సమయములోనే చనిపోయెను.

*ఆ తరువాత అతని బంధువు ఒకడు వచ్చి పామును చంపెను. అతడు బలవంతుడు గనుక ఆ పామును చంపగలిగెను.* చాలమంది క్రైస్తవులు
జీవమును పొందియున్నారు గాని వారు ఆత్మీయముగా శక్తి లేనివారైయున్నారు.

*పామును చంపుటకు కావలసిన ఆత్మీయ శక్తి వారికి లేదు, వారికి సరిపడు జీవము ఉన్నదిగాని ఆ జీవము నిష్ప్రయోజనమైనదిగా ఉన్నది.* అట్టి క్రైస్తవులు
తమకు తాము సహాయపడలేరు. తమ జీవమును రక్షించుకొనలేని వీరు ఇతరులకు ఎలాగు సహాయపడగలరు? ఎదుటివారి యెడల వీరికి ప్రేమలేదు, ఎదుటివారికి సహాయపడాలనే ఆతృత వీరికి లేదు.

*ఒకవేళ అట్టికోరిక వారికి ఉండినను సహాయపడగలిగిన బలము లేదు. ఇందువలన మనుష్యుల ఆత్మకు శతృవైన సాతాను వచ్చి కాటువేసి వెళ్ళుచున్నాడు.* పాపము వారి ఆత్మలను నశింపజేయుచున్నది. అయితే
రక్షకుడు తాను జీవమును మాత్రమే గాక సమృద్ధి జీవమును ఇచ్చుటకు వచ్చినట్లు చెప్పుచున్నాడు. ఈ సమృద్ధి జీవమును మనము కలిగియుండినపుడు
శత్రువును జయించగలిగినంత బలముగలవారమై యుందుము.

*ఈ సమృద్ధి జీవమును పొందని క్రైస్తవులు ప్రార్థించుటకు ఇష్టపడరు, దేవుని వాక్యమును చదువుటకు ఇష్టపడరు.*

నాకు ఒకవ్యక్తి తెలుసు. అతడు
చాలా దినములు ఆస్పత్రిలో ఉండెను. తినుటకు ఆహారముండినను తన అనారోగ్యమునుబట్టి అతడు ఆనందముగా భుజింప లేకపోయెను. అతడు
ఆకలి కోల్పోయిన స్థితిలో ఉండెను.

*చాలామంది ఆత్మీయ జీవితము జీవించుచున్నారుగాని వారిలోని పాపమును బట్టి ఆత్మీయ రుచిని కోల్పోయినవారై దేవుని వాక్యమును అనుభవించలేక పోవుచున్నారు*. దేవుని వాక్యములో పొరపాటు లేదుగాని వారిలోనే పొరపాటు ఉన్నది. కాబట్టి సమృద్ధి జీవము పొందినవారు దేవుని వాక్యమును అనుభవించుదురు; అది వారికి నిజమైన ఆత్మీయ ఆహారముగానుండును.

 నిజముగా సమృద్ధి జీవమును పొందినవారు, క్రీస్తుయేసు నందు గల నిజ జీవితమును కనుగొనెదరు. చాలామంది క్రైస్తవులకు క్రీస్తునందు ఆనందము లేదు. వారు లోకానందముతో నిండియున్నారు గనుక
క్రీస్తునందుగల ఆనందమును కనుగొనలేకపోవుచున్నారు.

 *ఇందువలన క్రీస్తునందు పొరపాటు ఉన్నదని తలంచరాదు; పొరపాటు వారిలోనే ఉన్నది!*

కొన్ని సంవత్సరముల క్రిందట నేను క్రైస్తవేతరునిగా జీవించితిని.
క్రీస్తును ద్వేషించుటవలన ఆయన శత్రువుగా నుంటిని. ఈ లోకసంబంధమైన వాటితో నా కోరికలను తృప్తి పరచుకొనుటకు ప్రయత్నించితిని గాని అవి తృప్తిపరచలేకపోయెను.

 *లోకానుసారమైన యెన్నో నా ఇంట ఉండెనుగాని అవన్నియు నా ఆత్మను తృప్తిపరచలేకపోయెను. ఎందుకనగా మన హృదయము లోకానుసారమైన వాటితో సంతృప్తి చెందజాలదు*. మన హృదయమును
సృష్టించిన దేవుని వలననే అది తృప్తి పరచబడును. అవును, ఆయన మాత్రమే తృప్తి పరచగలడు!

*నేను క్రీస్తును నా సొంతరక్షకునిగా అంగీకరించినపుడు నా ఇంటిని, నా సొంత ప్రజలను, నా ప్రాంతమును విడిచి పెట్టవలసి వచ్చెను*. 
అయితే
నేను సమస్తమును క్రీస్తునందు కనుగొంటిని. లోకము ఇవ్వలేని, లోకము తీసుకొనలేని ఆశ్చర్యకరమైన శాంతి, సమాధానములను నేను క్రీస్తునందు కనుగొంటిని. 

నా స్నేహితులతో బసచేయుచు నేను వసతిగా జీవించినపుడు మాత్రము కాదుగాని శ్రమల మధ్యను నేను సమాధానమును కనుగొంటిని.

*నేపాల్ దేశమందు సువార్త ప్రకటించుటకు వెళ్ళిన దినమును నేను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. అక్కడ ప్రజలు తమ మతమునకు వ్యతిరేకముగా నేను చెప్పునవి ఆలకించుటకు ఇష్టపడలేదు*. “మా రాజు
అనుమతి లేకుండా ఎలాగు నీవు ఇక్కడకు వచ్చితివి?” అని వారు అడిగిరి.

“మీ రాజు యొద్ద నేను అనుమతి పొందలేదన్న మాట నిజమేగాని రాజులకు రాజయొక్క అనుమతిని పొంది ఇక్కడకు వచ్చితిని” అని నేను జవాబిచ్చితిని.

*“అయితే మీ రాజు నిన్ను పంపినయెడల ఆయన నిన్ను ఎలాగు రక్షించునో చూద్దాం" అని చెప్పిన ఆ ప్రజలు నన్ను చెరశాలలో వేయించిరి*. చేతులు
కదల్చుటకు కూడా వీలు లేనంత గట్టిగా బిగించిరి.
అంతేకాదు, నా బట్టలన్నియు తీసివేసిరి. నేను పూర్తిగా దిగంబరిగా నుంటిని.

 *అప్పుడు నా శరీరములోని రక్తమును పీల్చుటకు జలగలను నా మీద వేసిరి*. ప్రారంభములో అది ఎంతో బాధగా నుండెను. అర్ధగంట సమయము నేనెంతో వేదనను అనుభవించితిని. ఆ తర్వాత ఒక అద్భుతము
జరిగెను.

నా పరమ తండ్రి తక్షణము నాకు సహాయము చేయలేదుగాని ఒక ఆశ్చర్యకరమైన శక్తి నా మీదకు వచ్చెను. ఆయన మహిమగల ప్రసన్నత
చెరశాలను పరలోకముగా మార్చివేసెను.

*పాటలు పాడుట నాకు తెలియదు అయినను ఆ సమయమందు నేను మౌనముగా ఉండలేకపోతిని.* హింసల మధ్య స్తుతి కీర్తనలను పాడుట ప్రారంభించాను. అవి ఎంతో ఆశ్చర్యకరమైన కీర్తనలు!

*అప్పుడు వారు వచ్చి - నీ రాజు నీకు ఎలాగు సహాయము చేయగలిగెను? నీవు చెరశాలలోనుండగా నిన్ను రక్షించలేక పోయెను కదా? అని అడిగిరి.*
అయితే నేను, “ఆయన కృపను బట్టి నేను స్వతంత్రుడనైయున్నాను.
నా ఆత్మలో సమాధానము ఉన్నది. అట్టి సమాధానము మీకు లేదు" అనిజవాబు ఇచ్చాను.

*చెరశాలలో ఉండిన ఒక్క వ్యక్తి ఇంతకుమునుపే మార్కు సువార్తను చదివియుండెను. అతడు క్రీస్తునందుండిన జీవముగల శక్తిని గుర్తించి యుండెను*. చెరశాలను దేవుడు పరలోకముగా మార్చగలడని ఆ వ్యక్తి గ్రహించెను.

*ప్రజలు గవర్నర్ వద్దకు వెళ్ళి, “ఆ వ్యక్తిని చెరశాలలో బంధించుటవలన ఏమి ప్రయోజనము*? అతడు ప్రసంగించుచుండగా ఎవరూ పట్టించుకొన లేదుగాని ఇప్పుడు చెరశాలలో ఉంచబడిన తరువాత చాలామంది వచ్చి ఆయన మాట వినుచున్నారు" అని చెప్పిరి. 

*అప్పుడు గవర్నర్, “అతనిని బైటకు పంపివేయండి. అతడు వెర్రివాడు” అని ఆజ్ఞాపించెను.*
అంతకుమునుపు సువార్త ప్రతిని చింపివేసిన వ్యక్తి వచ్చి - ఒక వెర్రివాడు అంత సంతోషముగా ఉండగలడా? 

ఒకవేళ వెర్రివాడు అంత సంతోషముగా ఉంటే నేనుకూడ వెర్రివానిగా మారగోరుచున్నాను. అంతేకాదు, ఈ లోకమంతయు అలాగు మారవలెనని కోరుచున్నాను అని ప్రకటించెను.

*అతడు నా వద్దకు వచ్చి, “నన్ను క్షమించండి" అని బ్రతిమాలెను. అందుకునేను, "రక్షకుని యొద్దకు వెళ్ళండి; ఆయన మిమ్మును క్షమించును" అని వివరించితిని*. 

తరువాత కాలమందు ఆ వ్యక్తి బాప్తిస్మము పొందెను. అతడు ఆశ్చర్యకరమైన సంతోషమును, సమాధానమును కనుగొనెను.

*ఎన్నో ఆశ్చర్యకరమైన అద్భుతములను నేను చూసినపుడు జీవముగల దేవుని ప్రేమను మరింతగా గుర్తించితిని. క్రైస్తవ దేశములందు జీవించు అనేకులు - అద్భుతములు కేవలము కట్టుకథలు అని చెప్పుచున్నారు.*

అద్భుతములను నమ్ముట లేదు. వారు గ్రహించలేక పోవుటయే దానికి కారణము. వారు అనుభవము లేనివారైయున్నారు గనుక గ్రహించుటలేదు.

*దక్షిణ ఇండియాలో చలివాతావరణములేదు. నేను టిబెట్టును గూర్చి వివరించుచూ నీటిమీద ఒక నీటి బ్రిడ్జిన్ను చూచిన విశేషమును అక్కడ వివరించితిని. అయితే ప్రజలు - అది అసాధ్యము, నీటిమీద నీటి బ్రిడ్జ్ ఎలాగు ఉంటుంది?* అని విస్మయము చెందిరి.

తీవ్రమైన చలి ప్రభావమువలన నదిలోని పైనీరు అంతయు ఐస్ గా మారినది అనియు అది నీటి మీద ఒక బ్రిడ్జి వలె ఉండినదనియు విశదపరచాను.
క్రింద నీరు; దాని పైన గడ్డగా మారిన బ్రిడ్జి వంటి ఐస్! ఈ విషయమును చలిదేశములయందు జీవించువారు నమ్ముదురు గాని మిగతావారు నమ్ముటకు సంశయించుదురు.

*పాపమందు జీవించు అనేకులు ఉన్నత పర్వతము ఎక్కజాలరు, నీటిమీద నీటి బ్రిడ్జ్ ఉన్నదనే వాస్తవాన్ని నమ్మజాలరు. అదే సమయమున ప్రార్థనాపరులైన వారు, చలిదేశమందున్నవారు నీటి బ్రిడ్జ్ ను గూర్చి చెప్పినపుడు నమ్ముచున్న ప్రకారము విశ్వసించెదరు.* అద్భుతములు జరుగుచున్నవా? అని కొందరు నన్ను ప్రశ్నించినపుడు, “అవును, నేను వాటిని అనుభవించుచున్నాను.

ప్రభువైన యేసుక్రీస్తు ఒక మహత్తర శక్తిగా ఉన్నాడు” అని జవాబిచ్చుచున్నాను.
రక్షకుడైన యేసుక్రీస్తుతో జీవించుట ద్వారా ఆత్మసంబంధమైన అనుభవములు పొందుటకు మనకు ఒక అవకాశము ఇవ్వబడుచున్నది. 

*మనము సినిమా థియేటర్ లోనికి వెళ్ళి ఆశ్చర్యకరమైన సంగతులను చూడలేము. దేవుని ఆశ్చర్యకరమైన సంగతులను చూడగోరిన యెడల ప్రార్థనయందు సమయమును వెచ్చించవలెను.*  నీ కుతూహలమును తృప్తి పరచుటకు కాదు, ఆత్మను తృప్తి పరచుటకు ప్రభువు అద్భుతమును జరిగించును.

*ఆశీర్వదించబడిన ప్రభువు పాదసన్నిధానములో మనము కూర్చొన్నపుడు మన ప్రాణము తృప్తిచెందును.* ప్రతిదినము కనీసము 20 నిమిషములు మనము
ఆయన సన్నిధిలో బైబిల్ చదివి ప్రార్థించవలెను. నేను ఆ అనుభవమును కలిగియున్నాను.

*మీరు ఆయనను ఎరిగినవారై ఆయన చిత్తానుసారముగ సమస్తమును చేసినయెడల ధన్యులగుదురు. మన రక్షకుడు తన వాక్యము ద్వారా మీతో మాట్లాడుచున్నాడు. ఆయన సమృద్ధి జీవమునిచ్చుటకు వచ్చెను. దానియందు సమాధానము సంతోషము గలదు.* సమృద్ధి జీవములేనివారు జీవశ్చవము వలె ఉన్నారు. 

*మన పాపము, పాపపుస్థితిని గ్రహించుటకు ఆశీర్వదించబడిన ఆయన పాదముల చెంతచేరి సమృద్ధి జీవమును అడుగుటకు ప్రభువు సహాయము చేయును గాక!* 

ఇహమందు సమృద్ధి జీవమును, పరమందు ఆయన నిత్య నివాసమును చేరి ఆయనను ముఖాముఖిగా దర్శించు ధన్యతను ప్రభువు
అనుగ్రహించునుగాక!

ఇప్పుడు మనకు భాష సమస్య ఉన్నదిగాని అక్కడ భాష సమస్య ఉండదు.
ఆశీర్వదించబడిన ఆ దేశమందు మనమందరము కలుసుకొందుము.

నిన్నటి దినము నేను చెప్పిన ప్రకారము మనము స్విస్ వారమైనను ఇంగ్లీషువారమైనను హైందవులమైనను అక్కడ క్రీస్తు యేసునందు ఒకే దేశముగానుందుము.

*జీవమును, సమృద్ధి జీవమును పొందుటకు ఇక్కడను సదా అక్కడను జీవించుటకు దేవుడు తానే సహాయము చేయునుగాక!*

ఈ ప్రసంగము
*సాధు సుందర్ సింగ్ గారు స్విట్జర్లాండ్ లో చెప్పిన ప్రసంగములు అను పుస్తకములోనిది...*
పేజీ నెం. 5-15

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...