*ఇద్దరు క్రైస్తవ సహోదరుల మధ్య సంభాషణ!!!!.*
ఇద్దరు క్రైస్తవ సహోదరులు బస్ స్టేషన్ లో కలుసుకున్నారు. *ఒకరికొకరు మీరు క్రైస్తవుల అని అడిగి తెలుసుకున్నారు.*
ఒకని పేరు శ్యామ్, ఇంకొకరి పేరు విజయ్.
*శ్యామ్ విజయ్ ని మీరు ఎప్పటినుంచి దేవునిలో వుంటున్నారు అని అడిగాడు అందుకో విజయ్ 4 సంవత్సరాల నుంచి అన్నాడు.*
మరి మిరెప్పటినుంచి దేవునిలో వుంటున్నారు అని అడిగాడు విజయ్ *అందుకు శ్యామ్ నేనా 10 సంవత్సరాల నుంచి అని గర్వంగా చెప్పాడు.*
అలా కొన్ని కొన్ని విషయాలు మాట్లాడుకున్నాక శ్యామ్ ని విజయ్ ఒక ప్రశ్న అడిగాడు. శ్యామ్ మీరు 10 సంవత్సరాల కాలంలో ఎన్ని జతల బట్టలు చిరిగి పోయాయని మార్చారు అని అడిగాడు.
*అందుకు శ్యామ్ 20 జతల బట్టలు అన్నాడు.*
అందుకు విజయ్ మీరు డ్రెస్ బాగా ఉపయోగిస్తారన్నమాట.
మరి *ఎన్ని జతల చెప్పులు మార్చారు అని అడిగాడు విజయ్*
శ్యామ్ 10 జతలు అని చెప్పాడు.
*వాచ్ లు ఎన్ని మర్చుంటారు అని అడిగాడు విజయ్*
6 అని చెప్పాడు శ్యామ్.
మీరు అన్నిటిని బాగా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు అని అన్నాడు విజయ్, అందుకు శ్యామ్ మన శరీరము, పాదముల రక్షణ చూసుకోవటం మన ఆరోగ్యానికి మంచిది కదా అని అన్నాడు.
అవును నిజమే బాగా చెప్పారు కృతజ్ఞతలు అన్నాడు విజయ్.
మరి *ఈ 10 సంవత్సరాలలో ఎన్ని బైబిలు గ్రంధాలను మార్చారు అని అడిగాడు విజయ్.*
అందుకు ఏంటి బైబిలు ని మార్చటామా? అర్ధం కాలేదు అని అన్నాడు శ్యామ్, అందుకు విజయ్ ఎక్కువగా ఉపయోగించిన్నందుకు బట్టలు, చెప్పులు అరిగిపోయి, నలిగిపోయి, చిరిగిపోయాయని మార్చేశారు కదా మరి
*బైబిలు ని కూడా మీరు ఈ 10 సంవత్సరాలలో రోజు తిరగేసి చదవటం వలన కాగితాలు నలిగి, చిరిగి ఉంటాయి కాబట్టి ఎన్ని బైబిలు మార్చరో అని అడుగుతున్నా అని అన్నాడు విజయ్.*
*హహ్హహహహ 10 సంవత్సరాల నుంచి నేను ఒక్క బైబిలు నే వాడుతున్నాను.*
ఇప్పటికీ నా బైబిలు తళతళ మెరిసిపోతు కొత్త బైబిలు వలె ఉంటుంది తెలుసా అని అన్నాడు శ్యామ్.
అందుకు విజయ్ శరీరము, పాదములు రక్షణ కోసం ఆలోచిస్తు రోజు బట్టలు, చెప్పులు ఉపయోగిస్తున్న మీరు మీ ఆత్మను, శరీరమును కూడా రక్షించగలిగే బైబిలు గ్రంథమును ఎందుకు ఉపయోగించటం లేదు???.
*శరీరము గొప్పదా?? ఆత్మ గొప్పదా??*
*యే గ్రంధము ఇవ్వని, జ్ఞానము, ధైర్యము, ఆదరణ, రక్షణ, నిత్యజీవము మన బైబిలు గ్రంధము ఇస్తుంది.* అటువంటి గ్రంథమును చదవకుండా ఉన్న మీరు క్రైస్తవులు ఎలా అవుతారు??
దేవునిలో మీ పాదములు నడవాలి అంటే బైబిలు చదివి తీరాలి.
మీ శరీరము అక్షయ శరీరముగా మారాలి అంటే బైబిలు చదవాలి.
దేవునితో పరలోకంలో ఉండాలి అంటే బైబిలు చదవాలి.
*అన్నము, నీరు, వస్త్రాలు, చెప్పులు, ఎలా కచ్చితంగా మానకుండా ఉపయోగిస్తామో అలానే బైబిలు గ్రంథమును ప్రతి రోజు చదివి ధ్యానించాలి.*
*ఈరోజుల్లో క్రైస్తవ యువతి యువకులలో 99% బైబిలు గ్రంథమును చదవటం లేదు.*
దేవుని హృదయం, ఆయన చిత్తం, ఆయన మార్గం అన్ని బైబిలు గ్రంధములోనే ఉన్నాయి.
*దేవుని మనసును తెలుసుకొని వారు ఎన్ని సంవత్సరాల నుంచి దేవునిలో ఉంటే ఏమి ఉపయోగం???*
*బైబిలు లోని తప్పులను వేతకాలని క్రైస్తవేతరులు మానకుండా బైబిలు చదువుతుంటే* నేను దేవుని బిడ్డను దేవుని కోసం ప్రాణమును ఇచ్చేస్తాను అని చెప్పుకుని తిరుగుతున్న మనం మాత్రం బైబిలు గ్రంధాన్ని చదవకుండా నిర్లక్ష్యం చేస్తున్నాము.
*ఆకాశము, భూమి, బంగారం వెండి, ముత్యముల కంటే ఎన్నో వేల రేట్లు గొప్పది దేవుడు మనకిచ్చిన బైబిలు గ్రంధము.*
*బైబిలు గ్రంథమును ఒక్కసారి మనస్ఫూర్తిగా చదువు దేవుని ప్రేమ ఎంత గొప్పదో తెలుస్తుంది అని విజయ్ శ్యామ్ కి చెప్తాడు.*
ఆ మాటలు విన్నా శ్యామ్ తలదించుకుని క్షమించండి, ఇప్పటి నుండి మానకుండా బైబిలు చదివి అనేకుల చేత చదివిస్తాను అని చెప్తాడు.
*ఓ క్రైస్తవ యువకా!!!!*
*మరి నువ్వు ఎన్ని బైబిలు గ్రంధాలను మార్చవు???*
ఒక్కసారి ఆలోచించు.
దేవుని రాకడ చాలా దగ్గరలో ఉంది.
ఆయన వచ్చే సమయానికి ఒక్కసారైనా మనస్ఫూర్తిగా బైబిలు చదివి ముగించు.
*మరనాత=యేసుప్రభువు త్వరగా వచ్చుచున్నాడు 1కోరింది 16:22*
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి