క్రీస్తు జన్మకు సంబంధించిన చారిత్రక నిదర్శనాలు
🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯
పరిచయము :
✴️✴️✴️✴️✴️✴️✴️
ప్రపంచ చరిత్రలో క్రీస్తు ఎప్పుడూ విభిన్నమైన వ్యక్తే. మానవ చరిత్రలో ఎంతోమంది ప్రముఖుల యదార్ధ గాధల్నీ పరిశీలించేటప్పుడు ఫలానా వ్యక్తికి చారిత్రాత్మకత ఉందా ? అని అడిగితే సరిపోతుంది. కారణం కొందరి గాధలో వాస్తవికత సందేహమైతే కొందరిది వారి వారి ఉనికినే శంకించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. క్రీస్తు నరావతారం కాలాన్ని విభజిస్తే (క్రీస్తు పూర్వం-క్రీస్తుశకం), క్రీస్తు సిలువ నిత్యత్వాన్నే (పరలోకం-నరకం), విభజించింది. మానవ చరిత్ర చట్రానికి క్రీస్తే ఇరుసు. ఇహమునకు, పరమునకు ఆయనే నిర్దేశ ప్రమాణం.
క్రీస్తుకు చరిత్రాత్మకత వుందా అనటం
కంటే ఆయన చరిత్రాత్మకత ఎంత ? అనడం ఉత్తమమం. క్రీస్తు చారిత్రక పురుషుడు మాత్రమే కాదు ఆయన చరిత్రకు మూలపురుషుడుగా గుర్తించబడ్డాడు. క్రీస్తు చారిత్రాత్మకత ఎంత ?
క్రీస్తు జన్మకు సంబంధించిన చారిత్రక నిదర్శనాలు :
✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️
ఎ) నైసర్గిక నిదర్శనం :
💥💥💥💥💥💥💥💥💥
పాలస్తీనా నైసర్గికంగా చాలా ప్రాముఖ్యమైన సుందర ప్రదేశం. మూడు ప్రాముఖ్యమైన మతాలకు పాలస్తీనా పుట్టినిల్లు లాంటిది. భౌగోళికంగా పరిశీలిస్తే ఇది ఆఫ్రికా,ఆసియా ఖండాలకు మధ్య నెలకొని వుంది. ఇందువలన చారిత్రాత్మకంగా ప్రాముఖ్యమైన ప్రదేశం.సముద్ర మట్టానికి దాదాపు 700 వందల అడుగుల దిగువున వున్న గలిలయ సముద్రంలో యేసుక్రీస్తు ప్రయాణించినట్లు పాలస్తీనా చరిత్రలో లిఖించబడినది. ఆనాడు క్రీస్తు జన్మించిన స్థలం
బెత్లేహేములో ప్రస్తుతం 'చర్చ్ ఆఫ్ నేటి విటి' నిర్మించబడింది (క్రీ.శ. 326లో). ఆనాటి బెత్లహేము గ్రామం నేడు పెద్ద నగరంగా మన కనుల ముందు నిలిచి వుంది.
బి) రాజకీయ నిదర్శనం :
💐💐💐💐💐💐💐💐
మేరి నిండు చూలాలిగా గాడిద మీద బెత్లహేముకు 80 మైళ్ళ సుదీర్ఘప్రయాణం చేసిందని బైబిలు ప్రకారం వేదాంత పండితులు వ్యాఖ్యానిస్తు వుండగా కొందరు మేధావులుఅనుమానించారు. వారి వాదన గమనిస్తే జనాభా లెక్కల సేకరణ చేయడానికి స్వగ్రామం వెళ్ళాలనే ఆనవాయితీ అప్పటి రోమ్ సామ్రాజ్యంలో లేదని వారి వాదన. అయితే క్రీ.శ. 104వ సంవత్సరానికిచెందిన రోమా జనాభా లెక్కలకు సంబంధించిన శాసనం దొరకడంతో ఈ వాదన ముగిసిపోయింది.
రోమా సామ్రాజ్యానికి పన్ను కట్టే ప్రజలందరూ తమ తమ స్వగ్రామాలకు వచ్చి పేర్లు నమోదు చేయించుకోవాలనే ఆదేశాలు అందులో వున్నాయి. ప్రస్తుతం పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ మరియు స్కాలర్ షిప్ మంజూరు కొరకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆదేశాలు కొరకు అవసరమైన
నివాస, కుల, ఆదాయ దృవీకరణను ఎలా కోరిందో అలాగే ఆనాటి ప్రభుత్వం క్రీ.శ. 119కి చెందిన గడ్డి కాగితం పైన రాసిన మరో శాసనం ఈజిప్ట్ లోని బకయాస్ లో దొరికింది. ఇది ఓ గ్రామలెక్కల పత్రం. ప్రతి కుటుంబ సభ్యులు, బంధువుల వివరాలు రాసిన తర్వాత ఆ గ్రామ రిజిష్ట్రారు,మరో ముగ్గురు అధికారులు సంతకాలు చేస్తారు. క్రీస్తు జననానికి 60 సంవత్సరాల పూర్వమే రోమా సైనిక జనరల్ 'పాంపె' పాలస్తీనాను కైవసం చేసికోవడంతో మరియ యేసేపులకు బెల్లే హేములో వారి వారి పేర్లు నమోదు చేసికోవడం తప్పలేదు. హేరోదు రాజు కాలంలో కూడా కట్టించిన కోటల్లో ఒకటైన హెరోడియం శిధిలావస్థలో ఇప్పటికీ బెత్లహేముకు ఆగ్నేయంగా వుంది. హేరోదును భూస్థాపితం చేసింది కూడా ఇక్కడే, ఆనాటి కాంస్య నాణాలు కూడా క్రీస్తు ఆనాటి కాలంలో జన్మించాడనిరుజువు చేస్తున్నాయి.
సి) సాంస్కృతిక నిదర్శనం :
♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️
క్రీస్తు పుట్టుక సమయంలో గొర్రెల కాపరులు సాక్షిభూతంగా వున్నారని బైబిలు వివరిస్తుంది.
వారు రాత్రిపూట పొలంలో వున్నప్పుడు దూత వారికి శుభవార్త చెప్పిహెచ్చరించిందని పరిశుద్ధ లేఖనాలలో చూస్తాం. బెత్లహేము ప్రాంతంలో ఇప్పటికి రాత్రిపూట గొర్రెలను మేపడం కనిపిస్తుంది. గనుక 'మెస్సియ' పుట్టుక గురించి వారు కనిపెట్టడం సహజమే.క్రీస్తు కన్యకు జన్మించాడనే విషయాన్ని ఆనాటి చరిత్రకారులు, మతాధిపతులు, కొందరు అపార్ధం చేసికొన్నారు. ఈ వాదనను పరీక్షించటానికి ఆనాటి ప్రధాన యాజకుడు పాత నిబంధన ప్రకారం యోసేపును, మరియలను పిలిచి, సంఖ్యాకాండం 5:16 వచనం ప్రకారం బలవంతంగా నీటి పరీక్ష ఒకటి చేయించినట్లుగా చరిత్రకారుడైన 'పాల్ మేయర్' ఆనాటి చరిత్ర గూర్చి వివరించాడు.అయితే మరియ, యోసేపులు ఆ పరీక్షలో 'నిందా రహితులుగా' నిలవడం ఆనాటి మత పెద్దల్నిఆశ్చర్యపరిచింది.
డి) శాస్త్రీయ నిదర్శనం :
🔴🔴🔴🔴🔴🔴🔴🔴
క్రిస్మస్ తారగా చెప్పుకుంటున్న నక్షత్రం లేక ఆనాడు జ్ఞానులను నడిపించిన నక్షత్రం నిజానికి నక్షత్రం కాదు. అంగారకుడు, బృహస్పతి, శని గ్రహాలు అతి అరుదుగా ఆకాశంలో ఒక చోటకు చేరే ప్రక్రియ అప్పట్లో జరగడం వలన ఆ మూడు గ్రహాలు ఒక పెద్ద నక్షత్రంగా అగుపించాయని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. క్రీ.పూ. 7వ సంవత్సరంలో మే, సెప్టెంబరు, డిశంబరుమాసాల్లో ఈ మూడు గ్రహాలు ఒక దగ్గరికి చేరి చూపరులకు కనిపించాయని చెప్పారు. ఈ తేదీలు క్రీస్తు పుట్టుకకు సమీపంలో వుండటం గమనార్హం.ఇలా క్రీస్తు చారిత్రాత్మకత గురించి చెబుతూపోతే అనేక ఆధారాలున్నాయి. కాబట్టి ఆయన ఉనికి కన్యక జన్మలకు ఎంత చారిత్రక నిబద్దత ఉందో అర్ధమవుతుంది.
కనుక క్రీస్తు విభిన్నమైనవ్యక్తి మాత్రమే కాదు, విలక్షణమైనవాడు కూడా. పాఠకులు గమనించాల్సింది యేసుక్రీస్తు చారిత్రకపురుషుడు. అటువంటి నిజదేవుని ఆరాధకులమైన మనం నిజంగ ధన్యులం. యేసుక్రీస్తు చారిత్రక పురుషుడే కాదు, చరిత్రకే మూలపురుషుడని గమనించాలి. కన్యక జన్మనివ్వడమనేది బైబిలులో చారిత్రాత్మక వాస్తవంగా చెప్పబడింది. యేసుప్రభువు ఈ లోకంలోకి మనలానూతనంగా సృష్టించబడిన వ్యక్తిగా రాలేదు. కన్యక ద్వారా ఈ లోకంలో యేసు జన్మించాలంటే దానికి దైవికమైన జోక్యం అవసరం. సువార్తలు సరిగ్గా దాన్నే నమోదు చేశాయి.
క్రీస్తు గురించి చరిత్ర చెబుతున్న సత్యాలు :
✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️
1. యేసుక్రీస్తు 2020 సంవత్సరాల క్రితం జీవించాడు.
2. యేసుక్రీస్తు సిలువ పైనే మరణించాడు.
3. యేసుక్రీస్తు మూడు రోజుల తర్వాత సమాధిలో ఆయన శవం కనబడలేదు.
క్రీస్తు నరావతారం ఒక ఆశ్చర్యమైతే క్రీస్తు సిలువ మహాఆశ్చర్యం. యేసుక్రీస్తు త్యాగాన్ని గూర్చి మాట్లాడే ప్రతీసారి సిలువ కార్యం ప్రస్తావించడం కద్దు.
గత ఐదు వేల సంవత్సరాల కాలానికి సంబంధించి లభ్యమైన పురాతన రాతప్రతులనన్నింటిని
అన్ని కోణాలల్లోంచి పరిశోధిస్తే యించుమించు అన్ని ప్రతులు యేసుక్రీస్తు జననం, జీవితం, మరణం,
తిరిగి లేవటం రుజువయ్యాయి. నేడు సర్వప్రపంచం 'యేసుక్రీస్తు'ను మధ్యలో పెట్టుకొని కాలాన్ని
లెక్క పెట్టుకొంటోంది. ఆయన లేని చరిత్రకు
(Before Christ) మొదలు, ముగింపు ఊహించుకోవటం చాలా కష్టం. సత్య పరిశోధకుడెవరైనా యేసు చరిత్రలోకి వచ్చాడు, చరిత్రలోజీవించాడు. చరిత్రలో చనిపోయాడు, చరిత్రలో ఏకైక మనిషి తిరిగి లేచినవాడుగా మరణాన్ని గెలిచాడు, ఆయన సజీవుడు. ఆయన వ్యక్తులను మార్చగలడు, జీవితాలను సరిచేయగలడు అని ఇంగ్లాండ్ నాస్తికుడు “వాల్ గ్రీవ్" అన్నాడు.
ప్రియ నేస్తం ! నీవు యింకా క్రీస్తును వ్యక్తిగతంగానమ్మకపోతే, వాల్ గ్రీన్ వలె నమ్ము. అందుకే యేసు చరిత్ర పురుషుడే కాదు. యావత్ చరిత్రకు మూలపురుషుడు కూడా.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి