అంశం) కొలస్సయి పత్రిక నుండి పరిశుద్ధుల విధి ఏమిటి.
🎯🎯🎯🎯🎯🎯🎯🎯
కొలస్సీయులకు 1: 1-2
కొలొస్సయిలో ఉన్న పరిశుద్ధులకు, అనగా క్రీస్తు నందు విశ్వాసులైన సహోదరులకు.
దేవుని చిత్తమువలన క్రీస్తుయేసు అపొస్తలుడైన పౌలును సహోదరుడైన తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది. మన తండ్రియైన దేవుని నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక.
1) పరిశుద్ధులు పైనున్న వాటిమీదనే గాని భూసంబంధమైన వాటిమీద మనస్సు పెట్టుకొనకుడి.
💥💥💥💥💥💥💥💥💥💥💥
కొలస్సీయులకు 3: 1-4
మీరు క్రీస్తుతో కూడ లేపబడినవారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండియున్నాడు.పైనున్న వాటిమీదనేగాని, భూసంబంధమైనవాటిమీద మనస్సు పెట్టుకొనకుడి;
ఏలయనగా మీరు మృతిపొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడ దేవునియందు దాచబడియున్నది.
మనకు జీవమై యున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడ మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు.
2) పరిశుద్ధులు క్రీస్తు వాక్యాము మీలో సమృద్ధిగా నివశింపనియ్యుడి.
♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️
కొలస్సీయులకు 3: 16
సంగీత ములతోను కీర్తనలతోను ఆత్మసంబంధమైన పద్యములతోను ఒకనికి ఒకడు బోధించుచు, బుద్ధిచెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియ్యుడి.
కీర్తనలు 119: 11
నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని యున్నాను.
3) పరిశుద్ధులు ఏమి చేసినా సమస్తము ఆయన పేరట చేయుడి.
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
కొలస్సీయులకు 3: 17
మరియు మాటచేత గాని క్రియచేత గాని, మీరేమి చేసినను ప్రభువైన యేసుద్వారా తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, సమస్తమును ఆయన పేరట చేయుడి.
4) పరిశుద్ధులు నవీన స్వభావమును ధరించికొవాలి
♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️
కొలస్సీయులకు 3: 5,8-10
కావున భూమిమీదనున్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనయైన ధనాపేక్షను(లోభత్వమును) చంపివేయుడి.
ఇప్పుడైతే మీరు, కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీనోట బూతులు అను వీటినన్నిటిని విసర్జించుడి.ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి; ఏలయనగా ప్రాచీన స్వభావమును (ప్రాచీన పురుషుని)దాని క్రియలతో కూడ మీరు పరిత్యజించి, జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించినవాని పోలికచొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొనియున్నారు.
5) పరిశుద్ధులు ప్రార్ధన యందు నిలకడగా ఉండి..
మెలకువగా ఉండండి.
🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀
కొలస్సీయులకు 4: 2-4
ప్రార్థనయందు నిలుకడగా ఉండి కృతజ్ఞతగలవారై దానియందు మెలకువగా ఉండుడి.మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలెనని(ప్రవేశద్వారము తెరువవలెనని) మాకొరకు ప్రార్థించుడి.
6) పరిశుద్ధులు సంభాషణ ఉప్పు వేసినట్టు...
కృపాసహితముగాను ఉండనియ్యుడి.
🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀
కొలస్సీయులకు 4: 5-6
సమయము పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు, సంఘమునకు వెలుపటి వారియెడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి.ప్రతి మనుష్యునికి ఏలాగు ప్రత్యుత్తరమియ్యవలెనో అది మీరు తెలిసికొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడు రుచిగలదిగాను కృపా సహితముగాను ఉండనియ్యుడి.
7) పరిశుద్ధులు ఉద్యోగo విషయంలో... మీ యజమానులైనవారికి అన్ని విషయములలో విధేయులైయుండుడి.
💥💥💥💥💥💥💥💥💥💥
కొలస్సీయులకు 3: 22-25
దాసులారా, మనుష్యులను సంతోషపెట్టు వారైనట్టు కంటికి కనబడవలెనని కాక, ప్రభువునకు భయపడుచు శుద్ధాంతఃకరణగలవారై, శరీరమునుబట్టి మీ యజమానులైనవారికి అన్ని విషయములలో విధేయులైయుండుడి.
ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని యెరుగుదురు గనుక,
మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మన స్ఫూర్తిగా చేయుడి, మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులైయున్నారు.అన్యాయము చేసినవానికి తాను చేసిన అన్యాయముకొలది మరల లభించును, పక్షపాతముండదు.
8) పరిశుద్ధులు సాటి క్రైస్తవుల విషయంలో క్షమించుట, ప్రేమించుట ఉండాలి.
☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️
కొలస్సీయులకు 3: 13-14
ఎవడైనను తనకు హానిచేసెనని యొకడనుకొనిన యెడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి, ప్రభువు (క్రీస్తు)మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి.వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి.
9) పరిశుద్ధులు గృహ విషయంలో...
⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐
కొలస్సీయులకు 3: 18-20
భార్యలారా, మీ భర్తలకు విధేయులైయుండుడి; ఇది ప్రభువునుబట్టి యుక్తమైయున్నది.
కొలస్సీయులకు 3: 19
భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠురపెట్టకుడి.
కొలస్సీయులకు 3: 20
పిల్లలారా, అన్ని విషయములలో మీ తలిదండ్రుల మాట వినుడి; ఇది ప్రభువునుబట్టి మెచ్చుకొనతగినది.
కొలస్సీయులకు 3: 21
తండ్రులారా, మీ పిల్లల మనస్సు క్రుంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి.
10) పరిశుద్ధులు మనుష్యుల యొక్క పారంపర్యాచార విషయంలో జాగ్రత్త. ఉండాలి.
💥💥💥💥💥💥💥💥💥💥
కొలస్సీయులకు 2: 8
ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును, అనగా ఈ లోకసంబంధమైన(భూతములు) మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానముచేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైన ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి.
మత్తయి 15: 6-9
మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నారు
వేషధారులారా ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది;మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు .
11) పరిశుద్ధులు ధర్మశాస్త్ర నియమాల విషయంలో తీర్పు తీర్చు ఎవనికి అవకాశమియ్యకుడి.
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
కొలస్సీయులకు 2: 16-17
కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ అమావాస్య విశ్రాంతి దినము అనువాటి విషయములోనైనను, మీకు తీర్పు తీర్చనెవనికిని అవకాశమియ్యకుడి.ఇవి రాబోవువాటి ఛాయయేగాని నిజస్వరూపము(మూలభాషలో-శరీరము) క్రీస్తులో ఉన్నది
గలతియులకు 4: 5
మనము దత్తపుత్రులము(స్వీకృతపుత్రులము) కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి యున్నవారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయెను.
గలతియులకు 4: 9-11
యిప్పుడు మీరు దేవునిని ఎరిగినవారును, మరి విశేషముగా దేవునిచేత ఎరుగబడినవారునై యున్నారు గనుక, బలహీనమైనవియు నిష్‌ప్రయోజనమైనవియునైన మూల పాఠముల తట్టు మరల తిరుగనేల? మునుపటివలె మరల వాటికి దాసులైయుండ గోరనేల?మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను , సంవత్సరములను ఆచరించుచున్నారు.
మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమై పోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను.
12) పరిశుద్ధులు ఈక్రింది వాటిని ధరించుకోవాలి.
💥💥💥💥💥💥💥💥💥💥
కొలస్సీయులకు 3: 12
కాగా, దేవునిచేత ఏర్పరచబడినవారును పరిశుద్ధులును ప్రియులునైనవారికి తగినట్లు, మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి