ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

బైబిలులోని ""ఇత్తయి"" గారి క్లుప్త చరిత్ర..

*బైబిలులోని ""ఇత్తయి"" గారి క్లుప్త చరిత్ర...*


*ఇత్తయి అనగా "దేవుడు నాతో వున్నాడు" అని అర్థము.*

ఈయన గాతు పట్టణానికి చెందినవాడు, గాతు పట్టణస్థులను గిత్తీయులు అని పిలిచేవారు.
*ఇత్తయి గారు గొప్ప యుద్ధ వీరుడు...*

*ఇత్తయి గారి జీవితం, ఆయన చేసిన తీర్మాణము నిజముగా చాలా చాలా ఆశ్చర్యమైనది...*
ఆయన చేసిన తీర్మాణమే ఆయనను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టింది...

*ఇత్తయి గారి జీవితాన్ని పరిశీలిద్దాము పదండి.....*

*దావీదు గారు రాజుగా పరిపాలిస్తున్నప్పుడు గాతు పట్టణం నుండి ఇత్తయి గారు, అతని సహోదరులైన 600మంది గిత్తీయులు నివాస స్థలము కోసం యెరూషలేము వస్తారు.*
(2సమూ 15:18)

ఆయన వచ్చిన మరునాడే దావీదు గారు తన రాజ్యాన్ని విడిచి అరణ్యములోకి పారిపోవలసి వస్తుంది.
కారణం....
*దావీదు గారి కుమారుడైన అబ్షాలోము గారు మోసము చేసి హెబ్రోనులో తనకు తాను రాజుగా ప్రకటించుకుంటాడు. ఇశ్రాయేలీయుల ప్రజలు కూడా అబ్షాలోము మోసపు మాటలకు మోసపోయి అతని పక్షముగా చేరతారు.*

ఇవన్ని రాజైన దావీదు గారు విని మనలను అబ్షాలోము చంపేస్తాడు. అతని చేతిలో నుంచి మనలను మనము రక్షించుకోలేము కాబట్టి అరణ్యములోకి పారిపోదాము అని తన అనుచరులకు చెప్పి అరణ్యానికి పారిపోతారు.
(2సమూ 15:1-16)

*దావీదు గారితో పాటు ఈ ఇత్తయి గారు, అతని సహోదరులైన 600 మంది గిత్తీయులు దావీదు గారి ముందు నడుస్తారు.*

వీరిని చూసిన దావీదు గారు ఇత్తయి గారిని పిలిచి నీవు, నీ సహోదరులు నివాస స్థలము కోరు పరదేశులై వున్నారు.
నువ్వు, నీ సహోదరులు మాతో ఎందుకు వస్తున్నారు??
*నిన్ననే వచ్చిన నీకు, మీ సహోదరులకు ఎక్కడికి పోవుదుమో తెలియకయున్న మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు?*

నువ్వు, నీ సహోదరులు తిరిగి అబ్షాలోము ఉన్న రాజ్యానికి వెళ్లిపోండి అని చెప్తారు...

*అందుకు ఇత్తయి గారు పలికిన మాటలు నిజంగా అద్భుతమైనవి.*

*ఇత్తయి గారు నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవము తోడు నా యేలినవాడవును, రాజువగు నీ జీవము తోడు, ఏ స్థలమందు నువ్వు వుంటావో ఆ స్థలమందే నీ దాసుడనైన నేను ఉంటాను అని దావీదు గారితో మనవి చేస్తారు....*

అందుకు దావీదు గారు సరే నాతో కూడా రావచ్చును అని చెప్తారు.
ఇత్తయి గారు, 600మంది గిత్తీయులు దావీదు గారితో అరణ్యానికి వెళ్తారు...

*కడుపున పుట్టిన అబ్షాలోము తండ్రిని విడిచిపెట్టి శత్రువుగా మారిపోయి అధికారం కోసం తండ్రినే చంపేయాలని చూస్తున్నాడు.*

ఎంతో నమ్మి మంత్రిగా తన దగ్గర పెట్టుకున్న అహీతోపెలు గారు కూడా దావీదు గారిని విడిచిపెట్టి అబ్షాలోము గారి చెంత చేరిపోయాడు.
(2సమూ 15:31)

*శత్రు దేశాల నుంచి కాపాడి, సంతోషకరమైన జీవితాన్ని ఇచ్చినా సరే ఇశ్రాయేలీయుల ప్రజలు కూడా దావీదు గారిని విడిచి అబ్షాలోము చెంత చేరిపోయారు.*
(2సమూ 15:1-6)

*కానీ ఎక్కడో పొరుగు రాజ్యం నుంచి వచ్చిన ఇత్తయి గారు మాత్రం దావీదు గారిని అంటిపెట్టుకున్నాడు. శ్రమలో నేను నీకు తోడుగా ఉంటాను అని దావీదు గారికి అభయాన్ని ఇస్తున్నాడు.*
నివాస స్థలము కోసం వచ్చిన ఇత్తయి గారు చివరికి నివాస స్థలము వదిలి అరణ్యానికి దావీదు గారితో వెళ్లిపోయాడు...

*అరణ్యంలో సుఖము ఉండదు అని తెలుసు, అబ్షాలోము గారి చేతికి చిక్కితే తనను, తన సహోదరులైన 600 మంది గిత్తీయులను కూడా చంపేస్తాడు అని తెలుసు,* అసలు తిరిగి వస్తామో లేదో అని కూడా తెలుసు
*అన్ని తెలిసి కూడా దావీదు గారితో వెళ్లడానికి ఇష్టపడిన ఇత్తయి గారి జీవితం నిజముగా చాలా చాలా స్ఫూర్తిదాయకమైనది...*

ఈరోజుల్లో చాలామంది క్రైస్తవులు ఎప్పటినుంచో దేవునిలో వుంటున్నారు
కానీ చిన్న సమస్య వస్తే, చిన్న నష్టం వస్తే, ప్రార్ధించిన మనవి జరగకపోతే దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నారు.
మరికొంతమందైతే దేవుణ్ణి దూషిస్తున్నారు కూడా...

*పుట్టినప్పటి నుంచి క్రీస్తులో ఉన్న వారుకుడా ఎవరో దేవుని కోసం తెలియని వారు వచ్చి బైబిలు లో తప్పులు ఉన్నాయి, బైబిలు లో ఉన్న దేవుడు మంచివాడు కాదు అని అబద్ధపు ప్రచారాలు చేస్తుంటే అవి విని సందేహపడి దేవుణ్ణి విడిచిపెడుతున్నారు చాలా విచారకరము.*😔😔

*బైబిలు తెలియని వారు వచ్చి బైబిలు తప్పు అని చెప్తే బైబిలు కోసం తెలిసినవారు సందేహపడటం ఏమిటో విడ్డూరం....*

ప్రియ క్రైస్తవ సహోదరులారా!!!
*మనము విడిచిపెట్టే క్రైస్తవులముగా కాదు*
*హత్తుకునే క్రైస్తవులముగా ఉండాలి.*
క్రీస్తుని ఎత్తిచూపే క్రైస్తవులముగా ఉండాలి.

*శ్రమలో తనకు తోడుగా ఉన్న ఇత్తయి గారిని దావీదు గారు గొప్పగా హెచ్చించారు.*

*అబ్షాలోము గారితో యుద్ధానికి వెళ్తున్న తన సైన్యాన్ని మూడు భాగాలుగా చేసి*
*ఒక భాగానికి ఇత్తయి గారిని నాయకునిగా పెట్టాడు.*
(2సమూ 18:2)

*పొరుగు రాజ్యపు వాడిని తన రాజ్యపు సైనికులకు నాయకునిగా నియమించాడు అంటే దావీదు గారు ఇత్తయి గారిని ఎంత ప్రేమించాడో, నమ్మాడో ఒక్కసారి ఆలోచించండి....*

కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, అవమానాలు, ప్రాణాపాయలు వచ్చినా సరే క్రీస్తుని విడిచిపెట్టకుండా గట్టిగా హత్తుకున్నవారిని దేవుడు కూడా అధికారులనుగా చేస్తాడు.

*పరలోకంలో తన సింహాసనముపై కూర్చోబెట్టుకుంటాడు...*

*ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరు కూడా అబద్ధపు ప్రచారాలు విని, కష్టాలు, నష్టాలు వచ్చాయి అని, చేసిన ప్రార్ధనలు నెరవేరట్లేదు అని దయచేసి దేవునికి దూరం అవ్వకండి..*
రెండు చేతులు జోడించి వేడుకుంటున్నాను...🙏🙏🙏

*మొదటివారు కడపడి వారు అవుతారు అని ప్రభువు చెప్పారు*
(మత్తయి 19:30)

*అబ్షాలోము, అహీతోపెలు, ఇశ్రాయేలీయుల ప్రజలు మొదటి వారు కానీ చివరకి కడపటి వారు అయ్యారు.*

*ఇత్తయి గారు కడపటి వాడు కానీ మొదటి వాడు అయ్యాడు.*

దేవుని రాకడ అతి సమీపముగా ఉన్నది.
దయచేసి ఎవరూ కడపటి వారు అవ్వకండి
మొదటివారముగానే ఉండి దేవుని రాకడలో వెళ్లిపోదాము....

*ఇత్తయి గారి జీవితం ద్వారా మన దేవాది దేవునికే మహిమ కలుగును గాక!!!*

*మరనాత= ప్రభువు వచ్చుచ్చున్నాడు.*
1కోరింది 16:22.

*ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను.*
ప్రకటన 22:7

Revelation(ప్రకటన గ్రంథము) 1:7
*ఇదిగో ఆయన మేఘా రూఢుడై వచ్చుచున్నాడు; అవును ఆమేన్‌.* 

*ప్రభువైన యేసూ రమ్ము..*
ప్రకటన 22:20.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...