*పరలోకంలో సాధు సుందర్ సింగ్ గారు చూసిన దర్శనములు= 1*
*అహంకారము గల పాదిరి - దీనుడైన సంఘ సభ్యుడు*
తాను ఒక గొప్ప విద్యావంతుడనియు, భక్తిపరుడనియు తలంచిన ఒక పాదిరి తన వృద్దాప్యమందు మరణించెను.
*అతడు మంచి వ్యక్తి అనుటలో ఎటువంటి సందేహములేదు.* పరదైసులో ప్రభువు నియమించిన స్థలమునకు తీసుకొని వెళ్ళుటకు దూతలు వచ్చిరి.
*ఆయనను మధ్య స్థలములో మిగతా మంచి ఆత్మలతోనుంచిరి.* అప్పటికే మరికొన్ని ఆత్మలు పరదైసు చేరుచుండెను.
*మధ్య స్థలమందు ఉండు' మంచి ఆత్మలకు కావలసిన హెచ్చరికలనిచ్చుటకు నియమింపబడిన దూతలకు పాదిరిని అప్పగించి మరొక మంచి ఆత్మను తోడ్కొని వచ్చు నిమిత్తము దేవదూతలు వెళ్ళిపోయిరి.*
పరదైసులో తరగతులు తరగతులుగ, ఒకదానికంటె ఒకటి ఉన్నతమైన స్థలములు భూమిమీద వారి జీవితములోని మంచితనమును బట్టి ఆత్మలు చేర్చుకొనవలసిన స్థలము నియమింపబడుచున్నది.
*పాదిరిగారిని ఒక స్థలములో విడిచి పెట్టి వెళ్ళిన దూతలు మరొక ఆత్మను తోడ్కొనివచ్చిరి.* అయితే వారు పాదిరిగారు ఉండిన స్థలమును దాటి ఉన్నత స్థలములోనికి ఆ ఆత్మను తీసుకొని వెళ్ళిరి.
*ఇందును బట్టి పాదిరి, “ఆ మహిమగల దేశమునకు చేర్చకుండ నన్ను సగమార్గములోనే విడిచి పెట్టుటకు మీకు ఏమి హక్కుగలదు?*
నన్ను విడిచి పెట్టి మరో వ్యక్తిని ఉన్నత స్థలములోనికి ఎందుకు తీసుకొని వెళ్ళుచున్నారు?
*పరిశుద్ధత విషములోను, మిగతా విషయములలోను నేను. అతనికంటే, మీకంటే తక్కువ వాడనా?" అని కేకలు వేసెను.*
అందుకు దేవదూతలు ఖచ్చితమైన జవాబు ఇచ్చిరి.
*"ఇక్కడ పెద్ద, చిన్న అనే తేడాలేదు. ఎక్కువ, తక్కువ అను తారతమ్యము లేదు. మీకు 'అనుగ్రహించబడిన జీవితము, మీ విశ్వాసమును బట్టి ఆయా స్థలములయందు మానవులు ఉంచబడుచున్నారు*. నీవు ఉన్నత స్థలములో ప్రవేశించుటకు ఇంకా సిద్ధముగా లేవు గనుక మరికొంత సమయము ఇక్కడ ఉండపలసినదే!
*నియమింపబడిన మా సహదాసుల బోధ నేర్చుకొనిన తర్వాత ప్రభువు ఆజ్ఞానుసారముగా నిన్ను ఉన్నత స్థలములలోనికి ఆనందముగా తీసుకొని వెళ్ళెదము."*
*ఆవేదన చెందిన పాదిరి, “పరలోము చేరు మార్గమును గూర్చి నా జీవిత కాలమెల్ల బోదించితిని*. ఇంకను నేను నేర్చుకొనవలసినది ఏమి యున్నది?
ఇదంతా నాకు తెలుసు" అని పల్కెను.
ఉపదేశించు దూతలు ఇలాగు జవాబు చెస్పిరి.
*“మేము ఇప్పుడు వెళ్ళవలెను. నీ ప్రశ్నలకు తర్వాత జవాబు చెప్పెదము. నీ కొరకు వారిని ఆపలేము.*
మా స్నేహితుడా, మేము ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుట నీ మేలు కొరకే! అభ్యంతర పడవద్దు. నీవు ఒంటరిగా ఇక్కడనున్నానని తలంచుచున్నావు గాని ప్రభువు ఇక్కడనే ఉన్నాడు; అయితే నీవు ఆయనను చూడలేక పోతివి.
*నాకు అంతా తెలుసు అని చెప్పుటలో నీవు కనుపరచిన అహంకారము నీవు ఆయనను చూడకుండను, ఉన్నత స్థలము చేరకుండను అడ్డగించు చున్నది.*
అహంకారమునకు విరుగుడు వినయము. దానిని అభ్యసించుము. నీ కోరిక అనుగ్రహించబడును."
అంతలో మరో దేవదూత 'ఇట్లనెను.
*“ఇప్పుడు నీకంటే ఎక్కువ స్థాయిలోనికి నడిపించబడిన వ్యక్తి విద్యావంతుడు కాదు, కీర్తిగాంచిన వ్యక్తియు కాదు, నీవు అతనిని పరిశీలించి చూడలేదు. అతడు నీ సొంత "సంఘసభ్యుడే".*
ప్రజలకు అతనిని గూర్చి పెద్దగా తెలియదు. అతడు అతి సామాన్యుడు. *విరామము లేకుండా కష్టపడే వాడు. అతడు పనిచేసిన స్థలమందు చురుకు తనముగల ఉత్తమ పనివాడు అని అందరు అనెడివారు. అతనిని పరిచయమైన వారందరికి అతని క్రైస్తవ ప్రవర్తన తెలుసు*.
ఇటీవలె సమాప్తమైన ఫ్రాన్స్ యుద్ధములో అతడు పాల్గొనెను. గాయపడిన సహ సైనికులకు సహాయపడు చుండగ గుండు తగిలినందున. హఠాత్తుగా మరణించెను.
*ఆకస్మికముగ మరణము సంభవించినను అతడు దానికి సిద్ధముగా ఉండెను గనుక మధ్య స్థితిలో ఉండకుండ ఉన్నత స్థితిలోనికి నడిపించబడుచున్నాడు. కేవలము ఆత్మీయముగా అతడు యోగ్యుడు గనుక హెచ్చింపబడెను*.
లోకమందుండగ అతడు ప్రార్థనా పరునిగాను, వినయము గలవానిగాను ఉండెను గనుక ఈ పరదైసులో అతనికి స్థలము సిద్ధపరచబడెను. *తనకు నియమింపబడిన స్థానమును బట్టి అతడు సంతోషించుచున్నాడు. కృతజ్ఞత గలవాడై ప్రభువును కొనియాడుచున్నాడు.*
ప్రభువు తన కృపతో అతనిని రక్షించి నిత్య జీవమును ఇచ్చెను.”
*ప్రియ చదువరీ!!!*
*చూసావా! భూమి మీద మనము ఎంత ఎక్కువ భక్తి చేస్తే పరలోకంలో అంత అంతస్తు దొరుకుతుంది.*
ఎక్కువగా కష్టపడే క్రైస్తవునిగా ఉంటే ఎక్కువ స్థానము, ఎక్కువ మహిమ మనకు దొరుకుతుంది.
*మన క్రియలు, ప్రయాసాను బట్టే దేవుడు మనకు జీతమును ఇస్తారు.*
Revelation(ప్రకటన గ్రంథము) 22:12
*ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వానివాని క్రియచొప్పున ప్రతివాని కిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నాయొద్ద ఉన్నది.*
ఈ మాటలు::
*'సాధు సుందర్ సింగ్' గారు వ్రాసిన ""పరలోక దర్శనములు"" అను పుస్తకములోనివి.*
పేజీ 44-46
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి