ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రెండవ క్రూరమృగము(అబద్ధ ప్రవక్త )


రెండవ క్రూరమృగము(అబద్ధ ప్రవక్త )
🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯
మరియు భూమిలోనుండి మరియొక క్రూరమృగము పైకివచ్చుట చూచితిని. గొఱ్ఱపిల్ల కొమ్మువంటి రెండు కొమ్ములు దానికుండెను; అది ఘటసర్పమువలె మాటలాడు చుండెను; అది ఆ మొదటి క్రూరమృగమునకున్న అధి కారపు చేష్టలన్నియు దానియెదుట చేయుచున్నది; మరియు చావుదెబ్బతగిలి బాగుపడియున్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించువారును నమస్కారము చేయునట్లు అది బలవంతము చేయుచున్నది. అది ఆకాశమునుండి భూమికి మనుష్యులయెదుట అగ్ని దిగివచ్చునట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది. కత్తి దెబ్బ తినియు బ్రదికిన యీ క్రూరమృగమునకు ప్రతిమను చేయవలెనని అది భూనివాసులతో చెప్పుచు, ఆ మృగము ఎదుట చేయుటకు తనకియ్యబడిన సూచనలవలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. మరియు ఆ మృగముయొక్క ప్రతిమ మాటలాడునట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లును, ఆ మృగముయొక్క ప్రతిమకు ప్రాణ మిచ్చుటకై దానికి అధికారము ఇయ్యబడెను. కాగా కొద్దివారుగాని గొప్పవారుగాని, ధనికులుగాని దరిద్రులుగాని, స్వతంత్రులుగాని దాసులుగాని, అందరును తమ కుడిచేతిమీదనైనను తమ నొపటియందైనను ముద్ర వేయించుకొనునట్లును, ఆ ముద్ర, అనగా ఆ మృగము పేరైనను దాని పేరిటి సంఖ్యయైనను గలవాడు తప్ప, క్రయ విక్రయములు చేయుటకు మరి యెవనికిని అధికారము లేకుండునట్లును అది వారిని బలవంతము చేయు చున్నది. బుద్ధిగలవాడు మృగముయొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము; అది యొక మనుష్యుని సంఖ్యయే; ఆ సంఖ్య ఆరువందల అరువది యారు; ఇందులో జ్ఞానము కలదు.
ప్రకటన 13: 11-18

🎯*దుష్ట త్రయం:*
1. సాతాను ( ఘటసర్పం, లూసిఫర్)
2. మొదటి క్రూర మృగము
(అంత్య క్రీస్తు)
3. రెండవ క్రూర మృగము
(అబద్ధ ప్రవక్త)

🎯మొదటి క్రూర మృగము
* అనగా అంత్య క్రీస్తు.
* రాజకీయ నాయకుడు
* సముద్రములోనుండి వచ్చును.
* Anti Christ

🎯రెండవ క్రూర మృగము
* అనగా అబద్ధ ప్రవక్త
* మత నాయకుడు
* భూమిలోనుండి వచ్చును
* Anti Spirit

అంత్య క్రీస్తు సముద్రములోనుండి వస్తున్నాడు. సముద్రము అనగా? భక్తి హీనుల సమూహము. అబద్ధ ప్రవక్త భూమిలోనుండి వస్తున్నాడు. భూమి అనగా? ఒక దేశం కావచ్చు. ప్రజలను మరింత సులభముగా మోసం చెయ్యడానికి, ఇశ్రాయేల్ దేశము నుండే ఈ అబద్ధ ప్రవక్త రావచ్చు అనేది కొందరి అభిప్రాయం.

భూమిలో నుండి వస్తున్నాడు అంటే? అతడు పునరుద్ధానము చెందిన వ్యక్తి కావొచ్చు అనేది మరికొందరి అభిప్రాయము.

అబద్ధ ప్రవక్త రూపం మాత్రం గొర్రెపిల్ల. స్వభావం మాత్రం క్రూరమృగం.

🎯*అబద్ద ప్రవక్తలను గూర్చి ప్రభువు ముందుగానే హెచ్చరించారు:*

అబద్ధ ప్రవక్తలనుగూర్చి జాగ్రత్తపడుడి. వారు గొఱ్ఱల చర్మములు వేసికొని మీయొద్దకు వత్తురు కాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు.
మత్తయి 7:15

ఆ కాలమందు ఎవడైననుఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పినయెడల నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులును అబద్ధపు ప్రవక్తలును వచ్చి, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచు టకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనబరచెదరు.
మత్తయి 24:23,24

🎯*వారు కలిగియుండే ఆత్మ, క్రీస్తు విరోధి ఆత్మ:*

యే ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు; దీనినిబట్టియే దేవుని ఆత్మను మీరెరుగుదురు. క్రీస్తువిరోధి ఆత్మ వచ్చునని మీరు వినినసంగతి ఇదే; యిదివరకే అది లోకములో ఉన్నది.1 యోహాను 4 : 3

*గొఱ్ఱపిల్ల కొమ్మువంటి రెండు కొమ్ములు దానికుండెను*:
అబద్ద ప్రవక్తకు రాజ్యాధికారం వున్నదని “కొమ్ములు” సూచిస్తున్నాయి.గొర్రెపిల్ల ప్రభువైన యేసు క్రీస్తుయై వున్నాడు. ఆయనకు భూలోకమందును, పరలోకమందును గల నిదర్శనంగా, ఏడు కొమ్ములను గూర్చి చెప్పబడింది. (ప్రకటన 5:6)

రెండు అనే సంఖ్య సాక్ష్యమునకు సూచన. క్రీస్తు, దేవునికి సాక్షిగా వున్నవిధంగా, అబద్ధ ప్రవక్త అంత్య క్రీస్తుకు సాక్షిగా ఉండును.

*అది ఘటసర్పమువలె మాటలాడు చుండెను:*

సర్పము మాట్లాడినది మొదటిగా ఏదోను తోటలోనే. ఒక వ్యక్తికోసం మాట్లాడువారు ప్రవక్తలు. దేవుని కోసం మాట్లాడువారు దేవుని ప్రవక్తలు. అబద్ధ ప్రవక్త సాతాను నోరై యున్నాడు. సాతాను ఆత్మ ఆయన ద్వారా మాట్లాడును.

అందుకతడునేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా ఆయన నీవు అతని ప్రేరేపించి జయము నొందుదువు; పోయి ఆ ప్రకారము చేయుమని అతనికి సెలవిచ్చెను.
1 రాజులు 22:22

*ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించువారును నమస్కారము చేయునట్లు అది బలవంతము చేయుచున్నది.*

ఆ మొదటి మృగమునకు అనగా అంత్య క్రీస్తుకు, భూజనులందరూ నమస్కారము చేయునట్లు బలవంతము చేసేవాడు అబద్ధ ప్రవక్త. ఇతడు తన సర్వాధికారము ఉపయోగించి అంత్యక్రీస్తును గొప్పచేసి గౌరవపరచును.

*పరిశుద్ధాత్ముడు ప్రభువును ఘనపరచును:* ఆయనను Holy Spirit అంటాము.

అయితే ఆయన, అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యము లోనికి నడిపించును; ఆయన తనంతట తానే యేమియు బోధింపక, వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనివి తీసికొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును.యోహాను 16:13,14

*అబద్ధ ప్రవక్త, అంత్య క్రీస్తును ఘనపరచును.* అందుచే అబద్ధ ప్రవక్తను Anti Spirit అనడంలో తప్పులేదు.

మరియు భూమిలోనుండి మరియొక క్రూరమృగము పైకివచ్చుట చూచితిని. గొఱ్ఱపిల్ల కొమ్మువంటి రెండు కొమ్ములు దానికుండెను; అది ఘటసర్పమువలె మాటలాడు చుండెను; అది ఆ మొదటి క్రూరమృగమునకున్న అధి కారపు చేష్టలన్నియు దానియెదుట చేయుచున్నది; మరియు చావుదెబ్బతగిలి బాగుపడియున్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించువారును నమస్కారము చేయునట్లు అది బలవంతము చేయుచున్నది. అది ఆకాశమునుండి భూమికి మనుష్యులయెదుట అగ్ని దిగివచ్చునట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది. కత్తి దెబ్బ తినియు బ్రదికిన యీ క్రూరమృగమునకు ప్రతిమను చేయవలెనని అది భూనివాసులతో చెప్పుచు, ఆ మృగము ఎదుట చేయుటకు తనకియ్యబడిన సూచనలవలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. మరియు ఆ మృగముయొక్క ప్రతిమ మాటలాడునట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లును, ఆ మృగముయొక్క ప్రతిమకు ప్రాణ మిచ్చుటకై దానికి అధికారము ఇయ్యబడెను. కాగా కొద్దివారుగాని గొప్పవారుగాని, ధనికులుగాని దరిద్రులుగాని, స్వతంత్రులుగాని దాసులుగాని, అందరును తమ కుడిచేతిమీదనైనను తమ నొపటియందైనను ముద్ర వేయించుకొనునట్లును, ఆ ముద్ర, అనగా ఆ మృగము పేరైనను దాని పేరిటి సంఖ్యయైనను గలవాడు తప్ప, క్రయ విక్రయములు చేయుటకు మరి యెవనికిని అధికారము లేకుండునట్లును అది వారిని బలవంతము చేయు చున్నది. బుద్ధిగలవాడు మృగముయొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము; అది యొక మనుష్యుని సంఖ్యయే; ఆ సంఖ్య ఆరువందల అరువది యారు; ఇందులో జ్ఞానము కలదు.
ప్రకటన 13: 11-18

*రెండవ క్రూర మృగము*
* అనగా అబద్ధ ప్రవక్త
* మత నాయకుడు
* భూమిలోనుండి వచ్చును
* Anti Spirit

*అది (రెండవ క్రూర మృగము) ఆకాశమునుండి భూమికి మనుష్యులయెదుట అగ్ని దిగివచ్చునట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది.*

ప్రవక్తయైన ఏలియా గారు, రెండు సందర్భములలో ఆకాశమునుండి అగ్ని భూమి మీదకి దింపెను.

అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి, దహనబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసెను.
1 రాజులు 18:38

అందుకు ఏలీయానేను దైవజనుడనైతే అగ్ని ఆకాశమునుండి దిగివచ్చి నిన్ను నీ యేబదిమందిని దహించునుగాక అని యేబదిమందికి అధిపతియైన వానితో చెప్పగా, అగ్ని ఆకాశమునుండి దిగి వానిని వాని యేబదిమందిని దహించెను.
2 రాజులు 1:10

*ఈ అబద్ధ ప్రవక్త కూడా, తానే నిజమైన ప్రవక్తనని రుజువు చేసుకోవడానికి ఇట్లాంటి సూచక క్రియలు చేస్తాడు.సూచక క్రియలంటే మనుష్యులకు ఎంతో ఇష్టం. అందుచే అబద్ధ ప్రవక్త వారిని ఈ విధంగా మోసం చేస్తాడు.*

ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతియందు అభిలాషగల వారందరును శిక్షావిధి పొందుటకై, అబద్ధమును నమ్మునట్లు మోసముచేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు.
2 థెస్స 2:11,12

*ఆ మృగముయొక్క ప్రతిమ మాటలాడునట్లును, ఆ మృగముయొక్క ప్రతిమకు ప్రాణ మిచ్చుటకై దానికి అధికారము ఇయ్యబడెను.*

అబద్ధ ప్రవక్త, ప్రజలను బలవంతము చేసి, క్రూరమృగము యొక్క ప్రతిమను తయారు చేయిస్తాడు. అంతేకాదు, ఆ ప్రతిమకు ప్రాణంపోసి, అది మాట్లాడేలా చేస్తాడు. ఇది లోకమంతటికి అమోఘమైన, మానవాతీతమైన శక్తి ప్రదర్శన. దీనితో అనేకమంది ఆ ప్రతిమను మ్రొక్కడానికి సిద్ధపడతారు.

*ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లును, అబద్ద ప్రవక్తకు అధికారము ఇయ్యబడెను.*

ఏడేండ్ల శ్రమకాలంలో చంపబడిన వారు అబద్ద ప్రవక్తచే చంపబడినవారే కావొచ్చు.

అటు తరువాత నేను చూడగా, ఇదిగో, ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆయా భాషలు మాటలాడువారిలో నుండియు వచ్చి, యెవడును లెక్కింపజాలని యొక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకొన్నవారై, ఖర్జూరపుమట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల యెదుటను నిలువబడి సింహాసనా సీనుడైన మా దేవునికిని గొఱ్ఱపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరును సింహాసనముచుట్టును పెద్దలచుట్టును ఆ నాలుగు జీవులచుట్టును నిలువబడియుండిరి. వారు సింహాసనము ఎదుట సాష్టాంగపడి ఆమేన్‌;

యుగయుగములవరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతా స్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి; ఆమేన్‌.
పెద్దలలో ఒకడుతెల్లని వస్త్రములు ధరించుకొనియున్న వీరెవరు? ఎక్కడనుండి వచ్చిరని నన్ను అడిగెను. అందుకు నేను అయ్యా, నీకే తెలియుననగా అతడు ఈలాగు నాతో చెప్పెనువీరు మహాశ్రమలనుండి వచ్చిన వారు; గొఱ్ఱపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపుచేసికొనిరి.
ప్రకటన 7:9-14

కాగా కొద్దివారుగాని గొప్పవారుగాని, ధనికులుగాని దరిద్రులుగాని, స్వతంత్రులుగాని దాసులుగాని, అందరును తమ కుడిచేతిమీదనైనను తమ నొపటియందైనను ముద్ర వేయించుకొనునట్లును, ఆ ముద్ర, అనగా ఆ మృగము పేరైనను దాని పేరిటి సంఖ్యయైనను గలవాడు తప్ప, క్రయ విక్రయములు చేయుటకు మరి యెవనికిని అధికారము లేకుండునట్లును అది వారిని బలవంతము చేయు చున్నది. బుద్ధిగలవాడు మృగముయొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము; అది యొక మనుష్యుని సంఖ్యయే; ఆ సంఖ్య ఆరువందల అరువది యారు; ఇందులో జ్ఞానము కలదు.

*అబద్ధ ప్రవక్త, లోక ప్రజలంతా “క్రీస్తు విరోధిని” పూజించడానికి, పక్కా వ్యూహాన్ని అమలు చేస్తాడు.*

* మొట్టమొదట రాజకీయ అధికారం, సైనిక బలం ప్రజలమీద ప్రభావం చూపుతాయి.
* మోసగించే అద్భుతాలు ( ఆకాశము నుండి అగ్నిని దింపడం ద్వారా, తానే ప్రవక్తనని, ప్రతిమకు ప్రాణం పోయడం ద్వారా తానే దేవుడనని)
* క్రయ విక్రయాల విషయంలో రాజ్య తంత్రం ( ముద్ర వుంటేనే గాని, ఏ వస్తువైనా కొనడానికి గాని, అమ్మడానికిగాని వీలుండదు.)

*ఇక రెండే రెండు మార్గాలు:*
* అబద్ధ ప్రవక్త ప్రకటించే అంత్య క్రీస్తును పూజించాలి. (లేదా)
* ఆకలితో అలమటించి చావాలి. లేదా అబద్ధ ప్రవక్తచేత చంపబడాలి.

ఈ రెండు మార్గాలలో దేనిని ఎన్నుకోవాలో ప్రజలకు అత్యంత క్లిష్టమైన పరీక్షగా వుండబోతుంది.

*అంత్య క్రీస్తును పూజించకపోతే?*
* మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేసే అధికారం అబద్ధ ప్రవక్త కలిగియున్నాడు. ప్రకటన 13:15

*అంత్య క్రీస్తును పూజిస్తే?*
🌐🌐🌐🌐🌐🌐
* మరియు వేరొక దూత, అనగా మూడవ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఈలాగు చెప్పెను ఆ క్రూరమృగమునకు గాని దాని ప్రతిమకు గాని యెవడైనను నమస్కారముచేసి, తన నొసటియందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొనినయెడల ఏమియు కలపబడకుండ దేవుని ఉగ్రతపాత్రలో పోయబడిన దేవుని కోపమను మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల యెదుటను గొఱ్ఱపిల్ల యెదుటను అగ్నిగంధకములచేత వాడు బాధింపబడును. వారి బాధసంబంధమైన పొగ యుగయుగములు లేచును; ఆ క్రూరమృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారముచేయువారును, దాని పేరుగల ముద్ర ఎవడైనను వేయించుకొనినయెడల వాడును రాత్రింబగళ్లు నెమ్మదిలేనివారై యుందురు.
ప్రకటన 14: 9-11

*666:*
🌠🌠🌠🌠🌠🌠
మానవుని సంఖ్య: 6
( ఆరవ దినమున సృష్టించ బడ్డాడు)

ఆ మానవుడు పాపములోపడి పతనమైపోతే, అతనిని రక్షించడానికి మరొక “6 “ అనే దైవ నరుడు, మనుష్య కుమారుడు (యేసు క్రీస్తు) వచ్చాడు.
ఇప్పుడు ఆ సంఖ్య :66

ఆ క్రీస్తును నేనే అంటూ ఏడేండ్ల శ్రమకాలంలో మరొక “ 6 “ అనే మనుష్యుడు (అంత్య క్రీస్తు) రాబోతున్నాడు.
ఇప్పుడు ఆ సంఖ్య: 666

*ఈ అంత్య క్రీస్తు అనే మనుష్యుడు ఎప్పటికి క్రీస్తు కాదు.*

దేవుని సంఖ్య : 7 (పరిపూర్ణమైనది)
మానవుని సంఖ్య : 6

6 ఎప్పటికీ 7 కాలేదు.
అంటే? మానవుడు ఎప్పటికి దేవుడు కాలేడు.

ఒక 6 ప్రక్కన మరొక 6 వున్నా, (అంటే 66 ) అది 7 కాలేదు.

66 ప్రక్కన మరొక 6 వున్నా,
(అంటే 666 ) అది 7 కాలేదు.

అంటే? మానవుడు ఎప్పటికి దేవుడు కాలేడు.

*666 ముద్రను ఎక్కడ ముద్రిస్తారు?*
⭕⭕⭕⭕⭕⭕⭕⭕
*666 ముద్రను కుడి చేతిమీదగాని, నొసటియందుగాని ముద్రించుకోవాలని అతడు బలవంతం చేస్తాడు.*

కుడిచేతిమీద ముద్రించుకోవడం వలన, (అంత్యక్రీస్తుకు రైట్ హ్యాండ్) అతనికి “కుడి భుజంగా” వుంటారు. అంటే? అతడు చెప్పినట్లే చేస్తారు.

నొసటియందు ముద్రించడం వలన, వారి తలంపులలో కూడా అంత్య క్రీస్తుకు లోబడివుంటారు అనేది అతని ఉదేశ్యం కావొచ్చు.

అంత్య క్రీస్తు, ప్రజలను ముద్రించడానికి ఉపయోగిస్తాడు అనుకొంటున్న RFDI చిప్ కూడా, కుడి చేయి, నొసటి భాగాలలో మాత్రమే, అది పనిచేయడానికి తగిన ఉష్ణోగ్రత కలిగివున్నాయని పరిశీలకులు తెలియజేస్తున్నారు.

ప్రియ విశ్వాసి! కృపాకాలం ముగించబడబోతుంది. దేవుని రాకడ సమీపమౌతుంది. ప్రభువు రాకడకై నీవు సిద్దమేనా? సరిచేసుకుందాం! ప్రభవు రాకడకై సిద్దపడదాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!ఆమెన్! 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...