*బైబిలులో చెప్పబడిన అన్యదేవతలు...*
1. *అషేరాదేవి* (Asherh or Ashtaroth, 1 రాజులు 18:19) - (1 రాజులు7:13; మత్తయి 11:21)
*తూరు యొక్క ముఖ్యమైన దేవతయైన ఈ అషీరాదేవి సముద్ర స్త్రీగా పరిగణించబడెను. గిద్యోను తండ్రియైన యోవాసు ఈ దేవతను ఆరాధించుచుండెను. దేవుని ఆజ్ఞ ప్రకారము గిద్యోను బయలుయొక్క సహవాసియైన ఈ అషేరాదేవి (దేవతాస్తంభమును) ని నాశనము చేసెను.*
న్యాయా. 6:24-32
2. అష్తారోతు (Ashtoreth) దేవత *కనానీయుల దేవతయు మరియు బయలు యొక్క మరియొక సహవాసియునైన ఈ అష్తారోతు దేవతను ఇశ్రాయేలీయులు ఆరాధించుచుండగా సమూయేలు వారిలో గొప్ప పునరుజ్జీవమును తెచ్చి యెహోవా దేవునివైపు మళ్లించెను.*
1 సమూయేలు 7:3,4
3. బయలు దేవత -
*కనానీయుల ప్రధాన దేవతయైన ఈ బయలు దేవతకు మరియు యెహోవా దేవునికి కర్మేలు పర్వతముపై జరిగిన పోరాటములో ఏలీయా విజయము సాధించి దాని ప్రవక్తలందరిని వధించెను. ఆ తరువాత కొంతకాలమునకు యెహూ బయలు దేవత ఇశ్రాయేలీయుల మధ్య నుండకుండ పూర్తిగా నాశనముచేసెను.*
1 రాజులు 18:17-40; 2 రాజులు 10:28; 11:18
4. బయెల్జెబూలు (దయ్యముల రాజు) -
*దయ్యము పట్టిన గ్రుడ్డివాడును, మూగ వాడునైన ఒకనిని ప్రభువైన యేసు స్వస్థపరచగా, అది చూచిన పరిసయ్యులు “దయ్యములకు అధిపతియైన బయెల్హబూలువలననే దయ్యములను వెళ్లగొట్టు చున్నాడుగాని మరియొకని వలన కాదని” యేసును నిందించిరి.*
మత్తయి 10:25; 12:24
5. *దాగోను దేవుడు*-
ఫిలిష్తీయుల ముఖ్యమైన వ్యవసాయ దేవుడు (God of
Agriculture) ను మరియు *బయలు దేవతకు తండ్రియునైన దాగోను (విగ్రహము) ను అతని గుడిలోనే దేవుని నిబంధన మందసము నాశనము చేసెను. ఇదే గుడిని సమ్సోను కొంతకాలము తరువాత పడగొట్టెను.*
1 సమూయేలు 5:1-7; న్యాయాధిపతులు 16:23-30
6. *అర్తెమిదేవి* -
అనేక రొమ్ములతో వికృతమైన ఆకారము కలిగి భూలోకమంతటను పూజింపబడుచున్న ఈ దేవతకు వ్యతిరేకముగా అపొస్తలుడైన పౌలు ఎఫెసు పట్టణములో మాట్లాడెను. *ఈ దేవత అనేక ఇతర దేవుళ్లకు, మనుష్యులకు, జంతువులకు, మొక్కలకు సహితము పెంపుడు తల్లిగా ఆరాధించబడినది.*
అపొ.కా. 19:27, 35
7. ద్యుపతి (బృహస్పతి) - *లుస్త్రలోని ప్రజలు అపొస్తలుడైన పౌలు ఒక కుంటివానిని స్వస్థపరచుట చూచి, పౌలుతోకూడనున్న బర్నబాకు రోమీయుల ప్రధాన దేవుడైన “ద్యుపతి” పేరు పెట్టిరి.*
అపొ.కా. 14:12, 13
8. హెర్మే -
*ద్యుపతి కుమారుడైన హెర్మే పేరును లుస్త్రలో ముఖ్య ప్రసంగియైన పౌలుకు ఆ పట్టణ ప్రజలు పెట్టిరి*.
అపొ.కా. 14:12
9. మెరోదకు -
*బబులోనీయులకు ప్రధాన దేవుడు మరియు నెబుకద్నెజరుకు ఇష్టుడైన దేవుడు*
యిర్మీయా 50:2
10. *మొలెకు దేవత*.
పరిశుద్ధ లేఖనములలో ప్రస్తావించబడిన అన్యదేవతలందరిలో అత్యంత హేయమైన ఈ అమ్మోనీయుల దేవతకు సొలొమోను యెరూషలేము
ఎదుటనున్న కొండమీద బలిపీఠములు కట్టించెను. అదేవిధముగా రాజైన
*ఆహాజు మరియు అతని మనుమడైన మనషే, దేవునినుండి వెడలిపోయి రక్తపిపాసియైన ఈ దేవతా విగ్రహములకు తమ కుమారులను బలి ఇచ్చిరి.*
1 రాజులు 11:7; 2 దినవృత్తాంతములు 28:1-4; 33:6
11. *నన్న దేవుడు* (Nanna) -
ఊరు పట్టణముయొక్క చంద్ర దేవుడు (Moon God).
*అబ్రాహాము రక్షింపబడక ముందు ఈ దేవుణ్ణి ఆరాధించెను.*
యెహోషువ 24:2
12. నెబో -
*బబులోనీయుల దేవుడు.* యెషయా 46:1
13. నిస్రోకు -
*అషూరు రాజైన సన్హెరీబు ఆరాధించు దేవత.*
2 రాజులు 19:37
14. రిమ్మోను -
*సిరియనుల సైన్యాధిపతియు మరియు కుష్ఠరోగియైన నయమాను స్వస్థతనొందకమునుపు ఆరాధించిన దేవుడు.*
2 రాజులు 5:15-19
15. *తమ్మూజు దేవత -*
*గర్భోత్పత్తి కలిగించు దేవత.*
యెహెజ్కేలు 8:14
16. పేర్లులేని దేవతా విగ్రహములు
అ.
*రాహేలు తన తండ్రియింట దొంగిలించిన గృహదేవతలు.*
ఆది. 31:19
ఆ.
*సీనాయి కొండవద్ద ఇశ్రాయేలీయులు తయారుచేసిన బంగారు దూడ.*
నిర్గమకాండము 32
ఇ.
*యరొబాము రెండు బంగారు దూడలను చేయించి ఒకటి బేతేలునందును, రెండవదానిని దాను నందును ఉంచెను.*
1 రాజులు 12:28-31
ఈ.
*నెబుకద్నెజరు దూరాయను మైదానములో నిలువబెట్టించిన బంగారు ప్రతిమ.*
దానియేలు 3:1
ఉ.
*పౌలు ఏథెన్సులో చూచిన పేరు తెలియని దేవతా విగ్రహములు.*
అపొ.కా. 17:22-23
ఊ.
*క్రూరమృగముయొక్క ప్రతిమ.* ప్రకటన 13:14
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి