ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

దేవుని గొప్ప కృప యేసుగా ఈ లోకంలో ప్రత్యక్షమైనది

దేవుని గొప్ప కృప యేసుగా ఈ లోకంలో ప్రత్యక్షమైనది
🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯
(తీతు 2:11  ఏలయనగా సమస్త మనుష్యులకు *రక్షణకరమైన దేవుని కృప* ప్రత్యక్షమై...) 

గొప్ప దేవుని యొక్క గొప్ప కృపయే యేసుగా ఈ లోకంలో ప్రత్యక్షమైనది. దేవుని కృప అనేది ఒక వియుక్త భావన లేదా ఒక లక్షణం కాదు. దేవుని కృప అనేది ఒక వ్యక్తి. యేసు క్రీస్తు దేవుని కృప యొక్క వ్యక్తిత్వం. వాక్యం దేవుడై యుండెను, ఆ వాక్యమే వాక్యము శరీరధారిగా *కృపా*సత్యసంపూర్ణుడుగా మన మధ్య నివసించుటకు ఈలోకంలో *జన్మించెను.* 

ఏదెను వనంలో ఆదాము చేసిన పాపం వల్ల వారూ చనిపోవడం నిశ్చయం అయినది. అయితే దేవుని కృప మానవాళి అంతటికీ ప్రవహించడం అనేది అంతకంటే మరెక్కువగా నిశ్చయం. 

దేవుని కృప అందరికీ అందుబాటులోకి వచ్చింది. క్రీస్తులో నమ్మకం ఉంచితే అందరూ విముక్తి, రక్షణ పొందుతారని అర్థం. (యోహాను 1:14) సర్వ మానవ పాప పరిహారార్ధం  ఈ లోకానికి వచ్చిన కుమారుడు సంపూర్ణమైన కృపతో అనగా *దేవుని యొక్క గొప్ప కృప* అనే వ్యక్తిగా ఈ లోకంలో జన్మించినాడు గనుక ఆయనకు కృపా సత్య సంపూర్ణుడు అని పిలువబడ్డాడు. 

*1. సమస్త మనుష్యులకు రక్షణార్ధమైన దేవుని కృప:* 
🌠🌠🌠🌠🌠🌠🌠🌠🌠🌠🌠
(తీతు 2:11  ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై..) ఈ లోకంలో ప్రత్యక్షమైన యేసు అనే కృప ద్వారా మాత్రమే పాపవిముక్తి. కృప ద్వారా వచ్చు రక్షణ అన్ని రకాల మనుషుల కోసం ఉన్నది. పేదల కోసం, ధనవంతుల కోసం, వృద్ధుల కోసం, పడుచువారి కోసం, స్త్రీలకోసం, పురుషుల కోసం ప్రత్యక్షమైంది. కేవలం యూదుల కోసమే కాక లోకంలో ఉన్న ప్రజలందరి కోసం, అంతటా ఉన్న మనుషులందరి కోసమూ ప్రత్యక్షమైంది. 

కీర్తన 119:64 యెహోవా, భూమి నీ కృపతో నిండి యున్నది. యెషయా 6:3 సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది. అవును మనం కేవలం కృప ద్వారా మాత్రమే అనగా యేసు నందు విశ్వాసముంచుట ద్వారా మాత్రమే రక్షించ బడగలం. ఎఫెస్సి 2:8  మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే. 

రక్షణ విషయములో మానవునికి భాగము కొంచెమైనను లేదు. అది దేవుని ద్వారానే మనకు అనుగ్రహించ బడినది. అది కేవలము దేవుని వరమే. (తీతు 3:6  మనమాయన కృపవలన నీతిమంతులమని తీర్చబడి,) 

*2. కృప వెంబడి కృప:*
🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀
(యోహాను 1:16  ఆయన పరిపూర్ణతలోనుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితివిు) పాప విముక్తిద్వారా మనుష్యులను రక్షించిన కృప వారిని విడిచి పెట్టునది కాదు. వారిలో ఉండి వారిని బలపరచునది. కృప వెంబడి కృప అనే పదాల యొక్క గ్రీకు భావం మనం చూస్తే, అస్తమానం ప్రవహించే నది ఈ కృపను సూచిస్తూ ఉంది. 

సముద్రం అలల్లాగా ఒక కృప చర్య తరువాత మరో కృప చర్య వస్తూ ఉండడం. ఈ కృప ప్రవహించే మార్గం యేసు క్రీస్తు. యేసు అనబడిన ఆ కృప నీలో ఉదయిస్తే, కృపతో నీ గిన్నె నీ జీవితం నింపబడడమే గాక పొంగి పొర్లుతూ అనేకుల జీవితాలలోనికి నీ ద్వారా ప్రవహిస్తూ ఉంటుంది. అదే క్రైస్తవ సంపూర్ణత. యేసు ద్వార ఈ కృప అనేకులకు విస్తరించు చున్నది. 

రోమా 5:15  ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన యెడల మరి యెక్కువగా దేవుని కృపయు, యేసుక్రీస్తను ఒక మనుష్యుని కృప చేతనైన దానమును అనేకులకు విస్తరించెను. 

*3. కృపయే సువార్త:*
🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰
ఆనాడు దేవుడు మహిమ స్వరూపుడుగా ప్రత్యక్షగుడారం లోనికి దిగివచ్చాడు. ఇశ్రాయేలీయుల మధ్య మహిమగా నివసించాడు. అదేవిధంగా యేసు కృపాస్వరూపుడుగా మానవులను రక్షించుటకు ఈ లోకంలో జన్మించినాడు. 

కృపా వాక్యంగా మన మధ్య నివసిస్తునాడు. ఆనాడు మహిమ దేవుడు మానవ నిర్మిత గుడారంలో నివసించాడు. ఈనాడు కృపామయుడు దేవునిచేత నిర్మితమైన మన దేహమనే దేవాలయంలో నివసిస్తున్నాడు. ఆ కృపయే దేవుని వాక్యంగా సువార్తగా మారి ఈనాడు లోకంలో అనేకులను రక్షించుచున్నది. 

మోషే ద్వారా ధర్మశాస్త్రము ఇవ్వబడిన నాడు మూడు వేలమంది చనిపోయారు. కారణం ధర్మశాస్త్రము మనలను రక్షించలేదు. (నిర్గమ 32:28  లేవీయులు మోషే మాటచొప్పున చేయగా, ఆ దినమున ప్రజలలో ఇంచుమించు మూడు వేలమంది కూలిరి) యేసు క్రీస్తు కృప సువార్తగా ఈ లోకానికి పరిశుద్ధాత్మ ద్వార అందించబడినప్పుడు మూడు వేలమంది రక్షించబడ్డారు. (అపో 2:41  కాబట్టి అతని వాక్యము అంగీకరించినవారు బాప్తిస్మము పొందిరి, ఆ దినమందు ఇంచుమించు మూడువేల మంది చేర్చబడిరి.) 

*4. కృప మనకు భోదించునది:* 
⭕⭕⭕⭕⭕⭕⭕⭕⭕⭕
దేవుని కృప తెలివిగల ఉపదేశకుని వంటిది. ఇది విశ్వాసులకు ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా జీవించకూడదు అని నేర్పిస్తుంది. “నేను నీకు రక్షణ ఇచ్చాను కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు చేయవచ్చు” అని కృప చెప్పదు. 

(రోమా 6:1  ఆలాగైన ఏమందుము? కృప విస్తరింపవలెనని పాప మందు నిలిచియుందుమా?  6:15  అట్లయినయెడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగువారముకామని  పాపము  చేయుదమా? అదెన్న టికిని కూడదు.) 

ఈ కృప అనబడిన యేసు మనకు నేర్పించేది ఏమంటే, పాపానికీ స్వార్థానికీ సైతానుకూ “వద్దు” అని చెప్పడం, దేవునికీ భయభక్తులకూ మంచితనానికీ “అవును” అని చెప్పడం నేర్పిస్తుంది. కృప మనకు ఇంకా నేర్పుతున్నది ఏమంటే, మనం భక్తిహీనతనూ లోక సంబంధమైన ఇచ్ఛలనూ విసర్జించి ఈ భయంకరమైన అంత్య దినాలలో మనసును అదుపులో ఉంచుకొంటూ ఉండాలి. నీతిన్యాయాలతో, భక్తితో బ్రతుకుతూ ఉండాలి. ఎలా జీవించాలో కృపద్వారా నేర్చుకోవడమే క్రీస్తులో మనకు ఆధ్యాత్మిక జీవితం ఉంది అనడానికి రుజువు. 

*5. ఆయన చూపు కృప ఎంతో గొప్పది:* 
💠💠💠💠💠💠💠💠💠💠💠
(కీర్తనలు 86:13 ప్రభువా, నా దేవా, నాయెడల నీవు చూపిన కృప అధికమైనది.) మనం కేవలం కృప ద్వార మాత్రమే రక్షించ బడితిమి. "అర్హత లేనివాడు అర్హునిగా ఎంచ బడడమే కృప యొక్క నిర్వచనం. మనకు అర్హత లేకపోయినా యేసు తన కృప ద్వారా మనలను రక్షించుటకు కృపా స్వరూపుడుగా ఈ లోకంలో జన్మించినాడు. ప్రభువా అని పిలువడానికి కూడా అర్హతలేని మనకు తండ్రీ అని పిలిచే యోగ్యత నిచ్చింది ఆయన కృప. 

*6. ఆయన కృప మనకు చాలును:* 
🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷
(2 కొరింది 12:9 అందుకునా కృప నీకు చాలును,) ఎటువంటి వ్యక్తిగత, కుటుంబ, మానసిక, ఆర్ధిక, సామాజిక సమస్యలైనా సరే భయపడవద్దు. దిగులు చెందవద్దు. నీ ప్రియ రక్షకుడు నీకిస్తున్న వాగ్దానం 'నా కృప (యేసు) నీకు చాలు' కారణం ఆయన మన యెడల చూపు కృప గొప్పది. 

అవును! అవి ఎట్లాంటి పరిస్థితులైనాసరే. చివరకు అది అగ్నిగుండమైనా సరే. ఆయన కృప నీకు తోడుగా వుండబోతుంది. 

పౌలు అడిగినదాని కన్నా శ్రేష్ఠమైన దాన్ని ప్రభువు ఇచ్చాడు. గొప్ప వాగ్దానాన్నీ ప్రభువు మనందరకూ ఇచ్చాడు. మనం క్రీస్తు మూలంగా ఆధ్యాత్మికంగా బలపడదలచుకుంటే మనం మన బలహీనతలను గ్రహించాలి. అప్పుడు ఆయన కృప మనకు చాలు. తన వారందరికీ, అన్ని పరిస్థితుల్లోనూ, అన్ని తరాల్లోనూ ఆయన కృప చాలు. 

పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు యెషయా 54:10 

*7. మనమేమై యున్నామో అది దేవుని కృప:*
🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶
పౌలు " నేనేమైయున్నానో, అది దేవుని కృపవలననే అయి యున్నాను" అని 1 కొరింది 15:10 లో చెప్పుచున్నాడు. కొంతమంది కొరింతీయులు అతని విద్య, నాగరికత, తదితర అర్హతలను బట్టి అతడు గొప్ప అపొస్తలుడయ్యెనని అన్నారు. పౌలయితే తానేమైయున్నాడో అది కేవలము దేవుని కృప వలననే అని మిక్కిలి స్పష్టముగా చెప్పుచున్నాడు. 

అవును అది  ప్రతి దైవ సేవకుల విషయములో కూడా వాస్తవం. మనము ఏమైయున్నామో అది మన విద్యార్హతలు, ఆస్తిపాస్తులు, ఉద్యోగాలు, తెలివితేటలు బట్టి అయి ఉన్నామని మనము గర్విస్తాం. కాని ఇదంతా దేవుని కృప అని గ్రహించినప్పుడే మనము ఆయన సేవకులముగా ఉండి, అనేక విధములుగా ఆయన సేవ చేయగలుగుదుము. 

మనము చేయునదంతయు ఆయన కృపను బట్టియేగాని, మనము సాధించిన దేనిని బట్టి కూడా ఆయన సేవ చేయలేమని దేవుని వాక్యంలో మనము స్పష్టముగా చూచుచున్నాము.
కీర్తనలు 103:11 భూమికంటె ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయనయందు భయభక్తులు గలవారియెడల ఆయన  కృప అంత అధికముగా ఉన్నది. 

అట్టి గొప్ప కృపను నిర్లక్ష్యం చెయ్యొద్దు. చులకన చెయ్యొద్దు.  ప్రభువు తన గొప్ప కృపను మన హృదయాలలో సమృద్ధిగా కుమ్మరించును గాక. ఆమెన్! 


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...