*||| జ్యేష్ఠుల సంఘము |||*
హెబ్రీ. 12:23
*జ్యేష్ఠుడున్నాడని*
*అనడముతోడనే కనిష్ఠుడున్నాడని మనసుకి తట్టకమానదు.*
జ్యేష్ఠుల సంఘము అని హెబ్రీయుల పత్రికలో చదవగానే కనిష్ఠ సంఘము ఉన్నదని
తట్టకమానదు.
*జ్యేష్ఠుడనగా మొదటి కుమారుడు,* కనిష్ఠుడనగా కడవరి
కుమారుడు.
*ఇక్కడ జ్యేష్ఠుల సంఘమనగా నూతన యెరూషలేములో*
*ఉండే పెండ్లికుమార్తె సంఘము అని ఊహింపవచ్చును.*
పూర్వము యూదుల కుటుంబములో జ్యేష్ఠుడు ప్రభువు సేవకు ప్రత్యేకింపబడినవాడు.
*తక్కిన కుమారులు తండ్రియొక్క కుటుంబములోని వారుకారు అని చెప్పకూడదు.*
*జ్యేష్ఠులు జ్యేష్ఠులే. మీరు* *పరలోకమున పన్నెండు మంది,*
*పండ్రెండు సింహాసనములమీద కూర్చుందురని ప్రభువు చెప్పలేదా?* (మత్త. 19:28)
*దీనినిబట్టి చూడగా కొందరూ సింహాసనములమీద*
*నుందురనియు, కొందరు పరలోక రాజ్యవాసులైనను సింహాసనముల మీద నుండరనియు కనబడుచున్నదిగదా?*
అంతస్థుల భేదముకలదు.
అందరును సంతోషమే అనుభవింతురు. ప్రభువు శిష్యులు పన్నిద్దరు.
*1.రూపాంతరమప్పుడును (మత్త. 17:1-8)*
2.యాయీరు ఇంటిలోనికి
వెళ్ళినప్పుడు (లూకా. 8:51)
*3.గెత్సేమనె తోటకు వెళ్ళినప్పుడు (మార్కు 14:33)*
ప్రభువు, పేతురు, యాకోబు, యోహానులను మాత్రమే
తీసికొని వెళ్ళాను.
*ఆత్మీయరీతిగా వీరు పన్నిద్దరిలో జ్యేష్ఠులేకదా?*
ఇది అంతస్థుల తేడ.
*అబ్రాహామునకు విశ్వాసులకు తండ్రి అను బిరుదు కలదు* (రోమా. 4:11).
అబ్రాహాము వేరు తక్కిన విశ్వాసులు వేరు.
*ఉభయులును విశ్వాసులే! అయినను తేడా గలదు.*
విశ్వాసులందరు విశ్వాసుల తండ్రియని బిరుదు పొందలేదు.
*విశ్వాసులు కృపను అల్పముగా* నెంచుటగాని, దేవుడు విశ్వాసులలో
కొందరియెడల పక్షపాతము కనబరచుటగాని, ఈ వంశములోలేదు.
*అంతస్థునుబట్టి సంకల్పన అబ్రాహాము తన కుమారుని బలి ఇచ్చుటకు పర్వత శిఖరము ఎక్కినప్పుడు సంహార యత్నములో అతని హృదయమున అదివరకున్న విశ్వాసముకూడ శిఖరమెక్కెను.*
వట్టినేలమీద నుండి జలప్రళయమందు తేలితేలి నావ అరారాతు
కొండనెక్కిన సంగతి ఇక్కడ జ్ఞాపకమునకు వచ్చుచున్నది.
*క్రైస్తవ సంఘము కూడ ఈలోక శ్రమలలో తేలితేలి అబ్రాహాము కొండకును,*
నోవహు కొండకును మించిపోయెను.
*ఇంక ఎత్తుననున్న మహిమ*
*మేఘమునకు వెళ్ళవలసిన సంగతికూడ జ్ఞాపకమునకు వచ్చుచున్నది.*
విశ్వాస విషయములో నోవహు, అబ్రాహామును ఉన్నత స్థితి గలవారని కనబడుచున్నది.
*అట్లే మహౌన్నత స్థితిగలవారందరు నూతన యెరూషలేము వాస్తవ్యులౌదురు.* హనోకు, ఏలియా విశ్వాసము
వల్లనేగదా ఆరోహణమైరి?
*అట్లే రేపు క్రైస్తవ సంఘమును విశ్వాసమువల్ల ఆరోహణమగును.* ఆరోహణము కాకుండ
మృతులై పరలోకమునకు వెళ్ళనివారికి విశ్వాసములేదు? ఉన్నదిగాని ఆరోహణము కాలేదు. ఇదియే తేడ.
*భక్తులందరు అంతస్థులో తేడా ఉన్నదని కనబరచుటకు యీ కథలు పేర్కొనబడినవి.*
*పండ్రెండు గోత్రములున్నవిగదా?* ప్రభువు జన్మగోత్రముగా యూదా గోత్రమేఎన్నుకొనబడెను.
*ఆ గోత్రములో అనేక వంశములున్నవిగాని దావీదు వంశము ఎన్నుకొనబడెను.* భక్తుల యొక్క జీవిత చరిత్ర అంతటిలో ఇట్టి అంతస్థులు కనబడుచున్నవి.
*దేనారములు, మీనాలు*
(లూకా.19:13-25)
*ఉపమానములయందు ఏమి యున్నది?* వారి వారి
వర్తక ఫలితములలో తేడా కనబడుచున్నది
(ఎందుకంటే వారివారి సమర్ధతలో తేడ ఉన్నది)
*గనుక, మరియు వారికి ఇవ్వబడిన బహుమానములోకూడ తేడ గలదు.*
పది పట్టణములమీదను, ఐదు
పట్టణముల మీదనుగల అధికారములలో తేడ గలదుకదా!
*నక్షత్రములలో ఆ నక్షత్రము మహిమ వేరు, ఈ నక్షత్ర మహిమవేరు!*
పట్టణముల మీదనుగల అధికారములలో తేడ గలదుకదా!
(1కొరింధి. 15:41)
*రెండు మహిమలే గాని మహిమలలో తేడ ఉన్నది?*
*ఆమె ఎక్కువ ప్రేమించినందువల్ల ఆమె ఎక్కువ పాపములు క్షమింపబడెను* (లూకా. 7:47) అని ప్రభువు పాపాత్మురాలైన స్త్రీనిన గూర్చిన విషయములో చెప్పెనుగదా?
(ప్రకటన 3:21) లో ఏడు సంఘములను గూర్చిన చరిత్రలోని తేడ గుర్తించదగినది ఏలాగనగా,
లవొదికయ సంఘములోని జయశీలులు ప్రభువు సింహాసనము మీద ఉందురని వ్రాయబడియున్నది.
*ప్రియ చదువరీ!!!*
*భువిలో మనము ఎక్కువగా దేవుని కొరకు శ్రమిస్తే, ఆయన పని బహుగా చేస్తే, మన విశ్వాసాన్ని పర్వతాన్ని ఎక్కిస్తే, ప్రతి దినము ఏకాంతముగా ప్రభు సన్నిధిలో కనిపెడితే మనము కూడా పరలోకంలో జ్యేష్ఠులముగా ఉండగలము...*
ప్రభువు జనులను శిష్యులనుగా చేయండి అని తన శిష్యులకు ఆజ్ఞ ఇచ్చారు.
*శిష్యులు అంటే ఆయనను వెంబడించేవారు, ఆయనను లోకానికి చూపించేవారు ఆయనను తమ జీవితములో లోకస్థులకు కనుపరుచువారు....*
జ్యేష్ఠులముగా ఉండు భాగ్యమును, ఆయన రాకడకు ఎత్తబడు మహా భాగ్యమును మన అద్వితీయ దేవుడు మనకు దయచేయును గాక!!!👏
ఈ వర్తమానము::
*ముంగమూరి దేవదాసు అయ్యగారు వ్రాసిన ""మహిమ వార్తవళి"" అను పుస్తకము లోనిది...*
పేజీ 39 నుంచి 41 వరకు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి