అంశం) ఇంటిపైన స్టార్స్ పెట్టాలా...?
🎯🎯🎯🎯🎯🎯🎯🎯
నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును - సంఖ్యా 24:17
అది రెండవ ప్రపంచ యుద్ధము జరుగుతున్న సమయం. ఇంగ్లాండ్ దేశమందు ఓ తండ్రి తన కుమారుని వెంటబెట్టుకొని క్రిస్మస్ ఆరాధనకు దగ్గర్లో ఉన్న పట్టణానికి వెళ్ళి, అక్కడ ఆరాధన ముగించుకొని చీకటి పడుతున్నవేళ వారి గ్రామానికి వస్తూ, ఓ చిన్న గ్రామాన్ని దాటుచు ఉండిరి. ఆ గ్రామములో కొన్ని ఇండ్లపై నక్షత్రాలు వ్రేలాడదీసి ఉండెను. అది గమనించిన ఆ కుమారుడు తన తండ్రిని, డాడీ..! కొన్ని గృహాలపై నక్షత్రాలు ఎందుకు వ్రేలాడదీశారు అని ప్రశ్నించెను. అందుకా తండ్రి, బాబు..! ఇవి రెండవ ప్రపంచ యుద్ధం జరుగుచున్న రోజులు. “ఎవరి కుమారుడైన మన దేశ రక్షణకోసం ప్రాణాలు తెగించి యుద్ధంలో పోరాడుచున్నట్లయితే అందుకు గుర్తుగా ఆ ఇంటిపై నక్షత్రమును వ్రేలాడదీస్తారని చెప్పెను.
అలా ఊరుదాటుతూ ఉండగా ఆ కుమారునికి ఆకాశములో చక్కని నక్షత్రము తళు క్కుమంటూ తన కళ్ళకు కనబడెనట. వెంటనే డాడీ...! డాడీ...! చూడు చూడు ఆ నక్షత్రము చూడు అంటూ “డాడీ! దేవుని కుమారుడు యుద్ధానికి వెళ్ళాడా? " అని అమాయకంగా ప్రశ్నించెనట. ఆ సందేహము నీకెందుకు వచ్చింది బాబు! అని ప్రశ్నించగా... “మీరే
చెప్పారుగా కుమారుడు యుద్ధానికి వెళ్ళితే నక్షత్రము వ్రేలాడదీస్తారని ", అదిగో చూడు! ఆకాశంలో నక్షత్రము వ్రేలాడుతుంది. బహుశ దేవుని కుమారుడు యుద్ధానికి వెళ్తుంటాడు అని అంటుండగా .... అవును బాబు! నువ్వు చెప్పింది కరెక్టే! “దేవుని కుమారుడు 2000 సం.ల క్రితము మన అందరి రక్షణ కొరకు, మన క్షేమము కొరకు, మనము ప్రశాంతముగా జీవించుట కొరకు దేవుడు తన కుమారుడు మరణపు ముల్లును విరుచుటకు మరియు నరకము నుండి ప్రజలను తప్పించుటకు, ఆయన యుద్ధానికి వెళ్ళి తన ప్రాణాలను త్యాగము చేసి మనలందరిని బ్రతికించెను అని చెమ్మగిల్లిన కళ్ళతో తన కుమారుని చూస్తూ చెప్పెను.
అందుకే కాబోలు నేడు క్రైస్తవులంతా తమ గృహాలపై స్టార్స్ వ్రేలాడదీస్తారు...
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి