*""పాల్ యాంగిచో"" గారు చెప్పిన ఒక అద్భుతమైన మాట*
నేను మా సంఘం పెరిగినప్పుడు (3000 మంది అయినప్పుడు) నేను గొప్పవాడిగా ఫీల్ అయ్యాను.
*నేను జ్ఞానిని, గొప్పోడిని అని అనుకునేవాడిని.*
అప్పటి నుంచి నా ప్రసంగాలను తత్వ జ్ఞానము, ప్రకృతి జ్ఞానము కోసం వుండే పుస్తకాలు చదివి సిద్ధము చేసుకునేవాడిని
*సంఘంలో ఎక్కువ జ్ఞానము, తత్వ జ్ఞానము కోసం ప్రసంగించేవాడిని.*
నా సొంత జ్ఞానముతోనే బోధించేవాడిని...
కానీ
*ఎంత గట్టిగా ప్రసంగించినా కానీ సంఘంలో చాలా మంది నిద్రపోయేవారు.* (కునుకుపాట్లు) చాలా బాధపడేవానిని.
*ఒకరోజు (ఆదివారం) మా సంఘానికి తత్వ జ్ఞానము బోధించే ప్రొపెసర్ వచ్చారు.*
నా ప్రసంగాన్ని విన్నాడు...
*ప్రార్ధన అయిపోయాక నా దగ్గరకు వచ్చి*
*నువ్వు పిల్లవాడిలా బోధించావు.*
*నేను బైబిలు మాటలు వినటానికి వచ్చాను కానీ అనుభవము లేని ఒక యవ్వనుని మాటలే వినవల్సివచ్చింది.*
చిన్నవాడివైన నీకు నాదొక సలహా!!!
*తత్వ జ్ఞానమును విడిచి బైబిలుని బోధించుము.*
*బైబిలు కి మించిన జ్ఞానము మరేదియు లేదు అని చెప్పారు.*
ఆ మాటలు విన్న నేను (యాంగిచో గారు) సిగ్గుతో తల దించుకున్నాను
*పుస్తకాల ద్వారా వచ్చే జ్ఞానము కాదు బైబిలు మాటల ద్వారా, దేవుని ఆత్మ ద్వారా వచ్చే మాటల ద్వారానే మనుస్యులను రక్షించగలమని తెలుసుకున్నాను*
అప్పటి నుంచి దేవుని ఆత్మ సహాయము ద్వారా బైబిలులోని మాటలనే బోధిస్తున్నాను.
మా సంఘంలో గొప్ప మార్పును, అభివృద్ధిని కనుగొన్నాను....
ఆహా!!!
*పాల్ యాంగిచో గారు చెప్పిన ఈ మాటలు నేటి నాలాంటి యౌవనస్తులకు అమూల్యమైన ముత్యములు వంటివి.*
*ఫ్రెండ్స్ మనము కూడా జ్ఞానము, లోకమును ఆధారము చేసుకుని కాదు, బైబిలును దేవుని ఆత్మను ఆధారము చేసుకుని సువార్త ప్రకటన చేద్దాము.*
అనేకులను క్రీస్తు మార్గములోనికి నడుపుదాము.
*మన దేవాది దేవుని రాకడ అతి సమీపంలో ఉన్నది కాబట్టి మెలకువగా ఉండి భక్తిని కాపాడుకుందాము.*
పాల్ యాంగిచో గారు చెప్పిన మాటలు ద్వారా *మన దేవాది దేవునికే మహిమ కలుగును గాక!!!*👏👏👏
ఈ మాటలు
*"పాల్ యాంగిచో" గారు వ్రాసిన ""జయజీవితమునకు తాళపు చెవులు"" అనే పుస్తకము లోనివి.*
20-22 పేజీలు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి