ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

దైవాజ్ఞలను అనుసరించి దీవించబడిన ఎలీసబెతు.



దైవాజ్ఞలను అనుసరించి దీవించబడిన ఎలీసబెతు. లూకా 2:5(క్రిస్మస్ సందేశాలు)
🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯
ఎలీసబెతు అనగా “దేవుని యొక్క ప్రమాణము” అని అర్ధము. ఈమె యాజకుడైన 'జెకర్యా భార్య బాప్తీస్మమిచ్చే 'యెహాను తల్లి, కన్య మరియకు బంధువురాలు. నిందారహితమైన మచ్చలేని పవిత్ర స్త్రీలను మాత్రమే 'యాజకులు వివాహమాడేవారు. లేవి. 21:1-7. వారిలో ఎలీసబెతు ఒకరిగా వుండుట ధన్యకరము. అయితే ఈ ప్రసంగములో “దేవుని ప్రమాణము" ఆమె జీవితంలో నెరవేర్చబడుటకు ఆమె కలిగియున్న శ్రేష్టమైన లక్షణములను తెలుసుకొనెదము. 

1. దైవాజ్ఞలను అనుసరించిన ఎలీసబెతు. లూకా 1:6
⭕⭕⭕⭕⭕⭕⭕⭕⭕⭕
దేవుడు చెప్పిన ఆజ్ఞలలో ఏదియూ తప్పిపోక అనుసరించిన స్త్రీ ఎలీసబెతు అని చెప్పవచ్చు. ఎందుకనగా, ఒక దైవజనునికి 'కుమార్తె'గా మరొక దైవ జనునికి భార్యగా అన్ని విషయాలలో నమ్మకత్వము కలిగి, తన భర్తతో కలసి ధర్మశాస్త్ర విధులను అనుసరించెను. అవును! దేవుని ఆజ్ఞలను మనం అలక్ష్యము చేస్తే అవమానము, అశాంతి కలుగును గనుక నేటి నుండైన దేవుని ఆజ్ఞలను గైకొనుము. 

1. పాపము చేయువాడు ఆజ్ఞను అతిక్రమించును. 1యోహాను3:4 
2.నీ ఆజ్ఞలను నేను లక్ష్యము చేయునపుడు. కీర్తనలు 119:6 
3. కన్యకను నేను చూచిన యెడల దేవుని ఆజ్ఞ, యోబు 31:2 
4. ఆదేవుని ఆజ్ఞలను అనుసరించి, ఎజ్రా 6:14 

2. న్యాయవిధుల చొప్పున నడిచిన ఎలీసబెతు. లూకా 1:6
🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀
ఈమె దేవుని న్యాయవిధుల చొప్పున నడుచుకుంటూ తన భర్తతోపాటు యుక్తముగా ప్రవర్తించింది. అవును! దేవుని న్యాయవిధులను అలక్ష్యము చేయక ప్రవర్తిస్తే న్యాయాధిపతియైన దేవుడు మనలను అన్ని విషయాలలో మన పక్షమున నిలబడి కార్యములను చేయును. 

1. దేవుని న్యాయవిధులన్నిటిని నేను. 2 సమూ. 22:23
2. ఏవి న్యాయమైనవో వాటిమీద. ఫిలిప్పీ 4:8
3. వారి నడవడిలో న్యాయము. యెషయా 59:8 4. దేవుడు న్యాయముగా నడుచుట కోరుకొనును. మీకా 6:8 

3. నిరపరాదిగా నడిచిన ఎలీసబెతు. లూకా 1:6
🌠🌠🌠🌠🌠🌠🌠🌠🌠🌠
ఎలీసబెతును గూర్చి ఎవ్వరూ చెడుగా మాట్లాడలేకపోయారు. ఎందుకనగా దేవునితో తనకున్న వ్యక్తిగత సహవాసము వల్ల, దేవుని దృష్టిలో తన భర్తతో పాటు నిరపరాధిగా నడుచుకొని దేవుని మెప్పు పొందింది. అవును! దేవునిని కలిగిన్న మనమును కూడా నిందలేనివారిమిగాను, నిరపరాధులముగాను నేటి దినములలో జీవించుదాం. 

1. నిషమార్గమున నడచుకొనువారు నాకు. కీర్తనలు 101:6
2. నిరపరాదులు అంతకంతకు. యోబు 17:9
3. నిరపరాదులను అతడు విడిపించును. కీర్తనలు 72:12
4. యేసు, నిరోషియు, నిష్కల్మషుడును. హెబ్రీ 7:26 

4.దైవదృష్టిలో నీతిమంతురాలు ఎలీసబెతు. లూకా 1:6
🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰
ఎలీసబెతు తన భర్తతోపాటు 'నీతిమంతురాలు'గా జీవించునట్లు మనం ఇక్కడ గ్రహించగలము. ఆమె గొడ్రాలుగా ఉన్నప్పటికిని కృంగిపోక, భర్తను వేధించలేక, బాధలో కూర్చొనక, దేవుని దృష్టిలో 'నీతి'గానే జీవించింది గాని ఎన్నడు దేవుని దూషించలేదు. నిజమే గదా! క్రీస్తు పిల్లలు దేవుని నీతిని దరించుకోవాలి. దినదినము " నీతియుక్తముగా బలులు” దేవునికి అర్పించువారై వుండాలి. 

1. నీతిని జరిగించు ప్రతివాడును. 1యోహాను 3:7
2. నీతిని బట్టి దేవుడు ప్రతిఫలమిచ్చును. కీర్తనలు 18:20
3. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము. సాయి.
4. నీతిని అనుసరించి నడుచుకొనుడి. యెషయా 56:1 

5. దైవానుగ్రహం పొందుకున్న ఎలీసబెతు. లూకా 1:13
♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️
ఎలీసబెతు మరియు జెకర్యా బహుకాలము గడిచిన వృద్ధులు అయినను 'నిరీక్షణ'ను మాత్రం కోల్పోలేదు. పిల్లలు పుట్టడము దేవుని చిత్తము కాడేమోనని నిరాశ పడలేదు, అలసిపోలేదు. అయితే ఎలీసబెతు 'దూత' చెప్పినట్లుగా తన వృద్ధాప్యములో “గర్భవతి"యై బహుగా సంతోషించినదై, అవమానము నుండి ఆశీర్వాదమును పొంది ప్రభువును స్తుతించెను. లూకా 1:10-24;1:57-60. అవును! దేవుని చిత్తము నెరవేర్చుటలోను, దేవుని కార్యాభివృద్ధిలోను ఇలాంటి పట్టుదల కలిగి, ధన్యులముగా పిలువబడెదము. 

1. ఇశ్రాయేలు వంశస్తుల పట్ల కనికరము చూపిన దేవుడు. యెషయా 63:7 
2. అబ్రహామునకు అతని సంతానమునకు కనికరము. లూకా 1:54 
3. సహించినవారిని ధన్యులనుకొనుచు. యాకోబు 5:11
4. స్త్రీలు చూచి ధన్యురాలందురు. పరమ. 6:9 

వృద్ధాప్యములోనున్న 'ఎలీసబెతు'ను దర్శించి, ప్రభువు మార్గాన్ని సరళ పరచిన 'యెహను'కు జన్మనిచ్చిన ఈమె వంటి దైవభక్తి, దైవకార్యములయందు ఆసక్తి కలిగిన స్త్రీలను దేవుడు ఈ తరంలో పురికొల్పి, ప్రభువు పనిలో వాడుకొనును గాక. 


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...