క్రిస్మస్ పండుగా?ఆరాధనా?(జాన్ ఆర్. రైస్ అభిప్రాయుపు,)
🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯
క్రిస్మస్ ని, క్రిస్మస్ కేరల్స్ ని తలచుకొన్నప్పుడు అంతు లేని ఆనందం నా హృదయాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. దేవదూతలు, గొఱ్ఱల కాపరులు, కన్య ప్రసవం, జ్ఞానులు తదితర అంశాల మీద ఉపన్యిసిస్తోంటే, తన్మయత్వం కలుగుతుంది నాలో!
కాని ఒక విషయం తలంచుకొన్నప్పుడు చెప్పలేని బాధ, దుఃఖం కలుగుతుంది. అదేమిటంటే చాలామంది క్రైస్తవులకి క్రిస్మసను గూర్చిన సదభిప్రాయం గాని, గౌరవ భావం గాని లేదు. క్రిస్మసను గూర్చి ఎంతో విముఖత వ్యక్తం చేస్తారు.
వాస్తవం చెప్పాలంటే, క్రీస్తు జన్మదినం ఎవరికీ తెలియదు. బైబిల్లో ఎక్కడా చెప్పబడలేదు కూడా! ఫలానా తేదీ అని ధృవపరిచేందుకు ఖచ్చితమైన మూలాధారా లేమీ లేవు. అందుచేత క్రిస్మస్ ని ఆచరించడం పాపం అని వీళ్ళ భావన! ఈ చిన్న కారణాన్ని బట్టి క్రిస్మస్ చేయకూడదనడం అవివేకం!
ప్రభువు జన్మదినం డిశంబరు 25కు దగ్గరగా ఉన్నట్లు బైబిలు పండితులు అభిప్రాయపడ్డారు. ఇంతకు ముందే చెప్పినట్లు, మనకు కావలసింది తేదీ కాదు, క్రీస్తు ప్రభువు పుట్టిన రోజు! అది డిశంబరు 25 అనుకొంటే ముంచుకొచ్చిన ప్రమాదమేమీ లేదు. క్రీస్తు ప్రభువంటే క్రైస్తవ లోకానికి ప్రగాఢమైన భక్తి, అనురాగాలు ఉన్నాయనేది సత్యం! ఆయన జన్మ వృత్తాంతం మన పిల్లలు తెలుసుకోవాలని ఎంతో ఆరాటపడతాం గాని, ఆ వృత్తాంతం వివరాలు మన పిల్లలకు ఏ రోజైతేనేం?
నిజమే, అధిక సంఖ్యాకులు క్రిస్మస్ ను విలాస దృక్పథంతోనే చూస్తారు. క్రీస్తు ప్రభువును అపకీర్తిపాలు చేస్తారు. ఆయన పట్ల కించిత్తు గౌరవ భావం కూడా కనుపరచరు. సంవత్సరంలో ఏ ఇతర రోజు కంటె క్రిస్మస్ రోజునే ఒళ్ళు తెలియనంతగా త్రాగుతారు, తందనాలాడతారు. ఇక వ్యాపారస్థులైతే అధిక ధనార్జనకు క్రిస్మస్సే అనువైన సమయమని, క్రిస్మస్ ఎప్పుడు వచ్చునా అని ఎదురు చూస్తుంటారు. ఇలా వివిధ వైఖరులతో దేవుని ఘనహీనం చేయడం ఎంత విచారము!
మనం అలాకాక, మన కొరకు భువికేతెంచిన రక్షకుని మనసారా పూజిద్దాం; క్రిస్మస్ ను అవకాశముగా తీసుకొని, క్రీస్తు నెరుగని మన స్నేహితులకు శుభవార్తను క్రిస్మస్ కానుకగా అందించుదాం!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి