ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

విశ్వాసము గల సమ్సోను

✳  *విశ్వాసము గల సమ్సోను*.......✍

దేవుడు తన కార్యములు చేయడానికి ఒక్కొక్కరిని ఒక్కోవిధముగా వాడుకుంటాడు. 
*ఐగుప్తు నుండి ఇశ్రాయేలు జనాంగాన్ని కానాను దేశానికి రప్పించడానికి మోషేను ఎన్నుకున్నాడు.* 

👉 కాని *మోషే సంసోను లా బలాన్ని ఉపయోగిఉంచలేదు.* కేవలము ని చెయ్యి చాపు, నీ కఱ్ఱ చాపు,కర్ర  సర్పమవ్వడం, నీరు రక్తమవ్వడం,ఈగల గుంపులు రప్పించడం,... నిర్గమ 7,8,9 అధ్యాl.మనకు కనబడుతాది.
👉 కాని *ఇక్కడ దేవుడు సంసోనుని బలమైన వ్యక్తిగా పుట్టించి, ఆయనే వాడుకున్నాడు.* ( న్యాయాధి 3: 5).

నా ప్రియ స్నేహితులారా...

 ఈ లోకములో నిన్ను, నన్ను తన రూపములో, ఈ విధముగా పుట్టించాడు అంటే దీనిలో ఒక కార్యము ఉంది. దానికోసమే నిన్ను పుట్టించాడు. ఒక్కొక్కరికి దేవుడు ఒక్కో తలాంతు ఇస్తాడు. 

👉 *అదేంటో నువ్వు దేవుని అడిగి, దేవుని కొరకే వాడాలి.* 

👉 ఇశ్రాయేలీయులు దేవుని దృష్టిలో దోషులు అవ్వడం వల్ల వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించాడు. 
*మరల వారిని విడిపించుటకు సంసోనుని ఎన్నుకున్నాడు.* (న్యాయది 13:1).

👉 పుట్టడము మొదలు సంసోను దేవునికి నాజీరు (వ్రతము) చేయబడ్డాడు (న్యాయది 13:5).

👉సంసోను తల్లిదండ్రులు దేవునికి విధేయులు.
*ఎందుకంటే ఎలా పెంచాలో నేర్పమని దేవుని అడిగారు.* (న్యాయది 3:8)

1⃣ *ఫిలిష్తీయులను నాశనము చేసే పని మీదే తీమ్నాతులో ఒక స్త్రీని చూసాడు.* తిమ్నాతు స్త్రీ ని చూసి ...
అక్కడ ఆచారం ప్రకారం విందు ఏర్పాటు చేసారు. ఆ విందులో తను అడిగిన పొడుపు కథకి సమాధానం కోసం ఆ స్త్రీ తొందర పెట్టగా సమాధానం చెప్పాడు. కోపముతో వెళ్ళిపోతే, ఆ స్త్రీ తండ్రీ ఆమెను తన స్నేహితునికి ఇచ్చే వివాహము చేసాడు.కొన్నిధినాల తరువాత తన భార్య కోసం వస్తే స్నేహితునితో వివాహము చేశాను అని అతని తండ్రీ చెప్పాడు. ఈ విధముగా ఫిలిష్తియులను దేవుడు సంసోనుకు ఇచ్చాడు. 

 *కోపముతో 300 నక్కలను సంసోను పట్టుకున్నాడు.* ఇది చాల విచిత్రము, ఎందుకంటే నక్కలు దొరకవు. మనిషి కనిపిస్తే చాలు పరుగులు పెడతాయి. 
అటువంటి నక్కలను ఏకంగా 300 వందలు పట్టుకొని, రెండేసి నక్కల తోకలకి దివిటీలు కట్టి ఫిలిష్తీయుల పంటలను నాశనము చేసాడు. 
👉 *అంటే మొదట వారిని ఆర్థికంగా నాశనము చేసాడు.* (న్యాయది 15:1-8)

2⃣ దీనికి ప్రతీకారం తీర్చుకోవడానికి యూధాదేశములోకీ వచ్చిన *ఫిలిష్తియులను 1000 ని చంపాడు. రెండవ నాశనము.*

👉ఇలాగే ఫిలిష్తీయులను నాశనము చేస్తాడు అనుకొనే సమయములో దెలీలా అనే వేశ్యను మోహించాడు.

👉 *ఇక్కడ మీకు ఒక విషయము చేప్పాలి.*

👉  *విశ్వాసములో బలపడుతున్నాము అనే సమయములో సాతాను చాల కాపాటోపాయములు చేస్తాది. వ్యక్తి పతనం ఇలాంటి పరస్త్రీ వలెనే జరుగును గమనించండి*

 👉మిత్రులారా..  
🔺చెడు వ్యాసనాలకి బానిసను చేస్తాడు. 
🔺ఇక్కడ సంసోను దెలీలా వద్దకు పోయినప్పుడు ఫిలిష్తియులు నాశనము చేయాలి అని దెలీలా తో ఒప్పందం చేసుకున్నాడు.
 *దెలీలా లాలించి సంసోనుని తన బలము పోవాలి అంటే ఏమి చేయాలి అని అడుగుతోంది.* 
సంసోను 3 సార్లు 
👎7నిరవంజి చువ్వలతో బంధిస్తే బలం పోతాది అని,
👎 పేనిన క్రొత్త త్రాళ్ళతో బంధిస్తే బలము పోతాది అని,
👎 నా తల జడలు 7 అల్లికలు అల్లిన బలం పోతాది అని చెప్తాడు.
(న్యాయా 16:7; 16:11; 16:13)

👉 *విసిగి నిజము చెప్పేస్తాడు. క్షౌరం చేసి, కళ్ళు పీకి, ఇత్తడి సంకెళ్లు వేసి, బంధించి, బందీ గృహములో తిరగలి విసురువాడయెను.*
బందీ అయిన సంసోనును ధాగోను గుడిలో బంధించి ఎగతాళి చేస్తున్నారు.

 *ఈ సమయములో సంసోను దేవుని ప్రార్ధించాడు. ఇక్కడ సంసోను విశ్వాసము గొప్పది. తను బందీ అయ్యాను అని బాధ పడకుండా ఫిలిష్తియుల నాశనము కొరకు ప్రార్ధిస్తున్నాడు.*

👉 మనము కూడా మనకి బాధలు శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోకుండా సంసానులా ప్రార్ధించాలి. 

👉 *నేను వ్యసనాలుకి బానిస అయిపోయాను,దేవునికి దూరం అయిపోయాను,త్రాగుడుకి బానిస అయిపోయాను,అమ్మయిలతో తిరుగుతున్నాను,ఇంటర్నెట్ లో చెడు దృశ్యాలు చూస్తున్నాను,చెడు కార్యములు చేస్తున్నాను,బాప్తీస్మము తీసుకున్నాను అయిన పాపములో పడిపోయాను అని బాధపడుచున్నవా???*
నా సంసోను కూడా దాదాపు ఇలాంటి పరిస్థితులలోనే దేవుని ప్రార్ధించాడు. దేవుడు సంసోను ప్రార్ధన విన్నాడు. 

👉 *సంసోను ప్రార్ధన విన్నటువంటి దేవుడు నీ ప్రార్ధన కూడా వింటాడు.*
 
👉 సంసోనులా విశ్వాసముతో ప్రార్ధించు. 

👉 *మునుపటి శక్తి కన్నా ఎక్కువ శక్తి సంసోనుకి ఇచ్చినట్లే నీకు ఇస్తాడు.*

*నేనును, ఫిలిష్తియులును చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి జనులందరి మీద పడి సంసోను జీవితకాలమందు చంపిన వారికంటే ఎక్కువ మందిని చంపేను. దేవునికి స్తోత్రం హల్లెలూయ.*

👉 *సంసొను దేవునికి విరోధముగా పాపము చేసిన, చివర్లో విశ్వాసముతో ప్రార్ధించాడు. హెబ్రీయులకు 11:32 లో విశ్వాసులకి ఉదాహరణగా నిలిచాడు.*

 అలాగే ఒకవేళ పాపములో కృంగిపోతే విశ్వాసముతో సంసోను వలే ప్రార్ధించు, సంసోను ప్రార్ధన వినినట్లే దేవుడు నీ ప్రార్ధన వింటాడు. 
అట్టి విశ్వాసము దేవుడు నీకు అనుగ్రహించును గాక!

*హల్లెలూయ...*

*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*

*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*
➖➖➖➖

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...