అంశం) నజరేతు బాలునిగా క్రీస్తు(లూకా 2:40-52)
🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯
క్రీస్తు యొక్క బాల్యదినములలో దీనమైన నజరేతు ఇంటిలో బాలునిగా ఉన్నప్పుడు
ఆకాశములో ఎన్ని నక్షత్రములు మెరిశాయో.
1. ఎదుగుచున్న బాలుడు.
🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤
బాలుడు ఎదుగు చుండెను. "కుమారునిగా” ఆయన
సహజాతీతమైయున్నాడు అయితే తన బాల్యములో ఆయన సహజముగా ఉన్నాడు.
లూకా 2:40
2. ఆత్మయందు బలమునొందుట.
🤎🤎🤎🤎🤎🤎🤎🤎🤎🤎🤎🤎
“ఆత్మయందు వృద్ధి చెందు చుండెను”. మనుష్యుని
యొక్క ఆత్మీయ స్వభావము తన స్వతంత్రత మరియు జ్ఞానము నందు ఋజువు
చేయబడుతుంది (1 కొరింథీ 2:11).
3. జ్ఞానము గల మనస్సు. “
💜💜💜💜💜💜💜💜💜💜💜
వివేకము చేత నింపబడెను”. తెలివి కలిగియుండుట మంచిదే,గాని వివేకముతో నింపబడుట చాలా శ్రేష్ఠము. జ్ఞానమును సరియైన విధముగా
అన్వయింపజేయుటయే వివేకము.
లుకా 2:40,52
4.కృపనొందిన బాలుడు. “
💛💛💛💛💛💛💛💛💛💛
దేవుని కృప ఆయనపై నుండెను”.లుకా 2:40,52
5. నిజమైన ఇశ్రాయేలీయుడు.
🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡
పస్కాపండగను ఆచరించుటకు తన తల్లిదండ్రులతో
కూడ ఆయన యెరూషలేముకు వెళ్ళెను.
( లుకా 2: 41,42).
6.నిలచిపోయిన బాలుడు.
💙💙💙💙💙💙💙💙💙💙
తాను నిలచియుండుటకు కారణము ఆయన ద్వారానే ఇవ్వబడినది. తాను తన తండ్రి పనియందు ఉండవలసియున్నదని ఆయన భావించాడు(లూకా2:49).తాను ఈ లోకములోనికి ఒక ప్రత్యేకమైన పనికొరకు వచ్చియున్నాడనే వివేచన
ఆయనపై ఒత్తిడిని కలుగజేయుచున్నది.
7. మరువబడిన కుమారుడు (లూకా2:44-47).
💜💜💜💜💜💜💜💜💜💜💜
యేసు తల్లిదండ్రులు ఆయనను ఒక్క దినమున
పోగొట్టుకొనిరి, తిరిగి కనుగొనుటకు మూడు దినములు పట్టెను. ఆయన వారితో ఉన్నాడని వారు అనుకొన్నారు. గాని అనుకొనుట వాస్తవము కాదు. ఆశీర్వాదములు పొగొట్టు కొనుట కంటే దానిని మరలా సంపాదించు కొనుటకు ఎక్కువ సమయము
పడుతుంది.
8. కేంద్రమైన వ్యక్తి (47).
💛💛💛💛💛💛💛💛💛
ఆయన "బోధకులమధ్య” ఉండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలడుగుచుండెను.
9. ఉన్నతమైన సంబంధము (49).
🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡
ఆయన "నేను నా తండ్రి పనుల మీద నుండవలె
నని మీరెరుగరా?” అని చెప్పినప్పుడు మరియ మదిలో ఎంతగా తడబాటు చెందినదో
గదా! ప్రాముఖ్యముగా ఆమె చెప్పిన సమాధానము చూడండి; “నీ తండ్రియు నేనును
దు:ఖపడుచు నిన్ను వెదుకుచుంటిమి”.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి