మహనీయుల హృదయములలో రక్షకుని గురించి
🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯
1. మహాత్మాగాంధీ :
🔷🔷🔷🔷🔷🔷🔷
క్రీస్తు జయంతి సందర్భంగా మహాత్మాగాంధీ ఈ విధంగా మాట్లాడారు.నిజానికి యేసుక్రీస్తు ఒక క్రిష్టియన్ మతస్థులకే చెందడు. సర్వమత వర్గాల వారు యేసుక్రీస్తును స్వకీయునిగా పరిగణించవచ్చును. ఎందువలననగా ఆయన చేసిన బోధలు క్రిస్టియనుల సొత్తేకాడు. అది సర్వమానవజాతికి చెందుతుంది.
2. రాజా రామమోహనరాయ్ :
🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶
సంఘ సంస్కర్త అయిన రాజారామ్ మోహనరాయ్ క్రీస్తును ఈ విధంగా పలికారు.
నజరేయుడైన యేసు అనగా దైవకుమారుడైన మెస్సీయా.ఆయన వెలుగువలె పరిశుద్ధుడు, గొట్టె పిల్లవలె నిర్దోషి. ఆత్మల జీవాహారం. దేవదూతల కంటే ఉన్నతుడు. సత్యమునకు కారణభూతుడు. యూదల యొక్కయు, అన్యజాతుల యొక్కయు, ఆత్మీయ యజమానుడు రాజునైయున్నాడు.
మత తత్వములకు సంబంధించి నేను జరిపిన సుదీర్ఘమును, నిరంతరమైన అన్వేషణలో నుండి ఈ విషయాలు నేను గ్రహించగలిగాను. ఇతరుల బోధలకన్నా క్రీస్తు యొక్క ప్రబోధలనలు సన్మార్గ
సిద్ధాంతములకు చాలా ఉపయోగకరమును, వివేక సంపనున్నడైన మనుష్యుని యొక్క వినియోగమునకు అత్యంత ప్రాముఖ్యమైనవై యున్నవి.
3. డా|| సర్వేపల్లి రాథాకృష్ణ :
♻️♻️♻️♻️♻️♻️♻️♻️
యేసుక్రీస్తు జీవితము స్వీయానుభవము దేవుని గూర్చిన ప్రత్యక్ష జ్ఞానానికి ప్రజల తార్కాణము. అతని ధర్మవర్తన భవ్యప్రవచనాలు దైవాంశ సంభరితాలు. జెరూసలేముకు అతడు ప్రయాణించే సన్నాహములో చూపిన సహనము, ప్రేమాదరములు, తొణికిసలాడే నిగర్వ బాషణము, ధర్మప్రభోదము, అతని ఆత్మ యొక్క పరమ పవిత్ర స్వరూపాన్ని వెల్లడిస్తున్నాయి.
దైవజ్ఞానమంటే యేసును చారిత్రక పురుషుడుగా తెలిసికోవడము సువార్తలలో చెప్పబడినట్లు అతనిని దేవుని దూతగా విశ్వసించడము కాడు. దేవుని రాజ్యభావానికి క్రీస్తు చిహ్నము. చారిత్రక పురుషుడైన యేసుకు భిన్నమై క్రీస్తు ద్వారా మోక్షము - స్వర్గ రాజ్యము సంప్రాప్తిస్తుంది. ఈ సత్యాన్ని గమనించి అనుసరించిన వారికి నాటికీ, నేటికీ, యేనాటికైనా క్రీస్తు, తత్వమహనీయత సువిదితమౌతుంది.
4. డా|| రాజేంద్రప్రసాద్ :
💠💠💠💠💠💠💠💠
భారత మాజీ రాష్ట్రపతి కీ||శే|| డాక్టర్ రాజేంద్రప్రసాద్ గారు 1955వ కీశే సంవత్సరం డిసెంబర్ లో క్రీస్తును గురించి ఈ విధంగా చెప్పారు. “అనేక యూరప్ దేశాలు క్రీస్తు ఎవరో ఎరుగక మును పే యేసు శిష్యులలో ఒకడైన తోమా భారతదేశానికి రావడం ఎంతో సంతోషించవలసిన విషయం. పశ్చిమదేశాల క్రైస్తవుల కంటే సుదీర్ఘమైన ఉన్నత చరిత్ర కలిగిన క్రైస్తవులు, క్రైస్తవ సంఘాలు మన దేశంలో ఉండడం మనకు గర్వకారణం” అన్నారు.
5. మహాకవి జాషువా :
🛑🛑🛑🛑🛑🛑🛑🛑
మహాకవి జాషువా క్రీస్తు చరిత్రలో ఖండ ప్రశంసలో అంటున్నాడు : సకల మానవ కిల్బిష మూలూడ్చ నరమూర్తి చేకొన్న నజరేతు చిన్నవాడు దశ లక్షకోటి దూతలు గొల్వ పరదైసు రాజ్యంబు పాలించు రాచ వాడు చావు పుట్టువులకు సంకెలల్ బంధించునది కారమర చేత సమరువాడు నక్షత్ర దీపంపునడుమింట బయనింప భూమి బుట్టిన బేతలేము పాపం.
ఏమి నోములు నోచితో యేసు ప్రభువు డాబు దర్పాలు గల్గు ఖండాతరముల జన్మమెత్తక నీ గడ్డ జనమ్మ మెత్తే ఆసియా కండమా ధన్యవమ్మ నీ నీవు.
6. రామకృష్ణ పరమ హంస :
🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰
ఇతడు వివేకానందుడు అనబడిన ఆధ్యాత్మిక మేదావికి గురువు. గొప్ప యోగిగా ప్రఖ్యాతిని పొందాడు. తన వ్యక్తిగత అనుభవమును తెలుపుచూ క్రీస్తు తనకు ప్రత్యక్షమైనాడని “రామకృష్ణా, నీ కొరకు నేను రక్తము కార్చితిని అని ప్రభువు పలుకగా విన్నానని తెలియజేశాడు. శ్రీ నిఖలానంద స్వామి "సూక్తిసుద” అను గ్రంథమును వ్రాశారు. అందులోని 76వ పేజిలో శ్రీ రామకృష్ణ పరమహంస క్రీస్తును దర్శించినపుడు జరిగిన | అనుభవములను గూర్చి ఈ విధంగా వ్రాయబడింది.
“ఒకనాటి మద్యాహ్నమున పంచవటియందు శ్రీ రామకృష్ణుడు పోవుచుండగా ఒకనొక వ్యక్తి ఆయనకు ఎదురుగా వచ్చుచు కన్పించెను. ఆ వ్యక్తి కన్నులు విశాల సుందరముగాను నమ్మోము సుప్రసన్నముగాను, 'ఆయన శరీరము
తెల్లగానుండి ప్రకాశించుచుండెను. వారు ఒకరినొకరు ఎదురుగా నిలిచియుండగా శ్రీ రామకృష్ణుని హృదయాంతరాళము నుండి ఒక వాణి యిట్లు విననయ్యెను. “క్రీస్తు దేవుని దర్శింపవోయి, సకల చేతనుల విముక్తికై తన హృదయ రక్తమును కార్చిన యతడు యితడే” ప్రాణుల మీద ప్రేమచే మూర్చి జీససు క్రీస్తు దేవుని ఆ దివ్యమై లోకమాతృనందనుడైన శ్రీ రామకృష్ణుని కౌగలించుకొని ఆయనలో కలసిపోయెను”.
7. వివేకానంద స్వామి :
🌀🌀🌀🌀🌀🌀🌀🌀
క్రీ.శ 1895 సంవత్సరం జూన్ నెల 18వ తేదీన సమస్ర ద్వీపము నందు శ్రీ వివేకానంద స్వామి తన శిష్యులను సమావేశపరచాడు. ఆ రోజు ఉదయం కూర్చున్న శిష్యుల వద్దకు బైబిల్ తీసుకొని వచ్చి యోహాను సువార్త 1:1-3 వచనాలు చదివి వివేకానంద స్వామి ఆ వచనాల భావాన్ని ఇలా వివరించారు.
“అది నిశ్శబ్దము, అది దేవుని యొద్దనుండెను. శబ్దమే దేవుడు, బ్రహమ్మము యొక్క ప్రత్యేక స్వరూపమగు క్రీస్తు ఇట్టివాడని తెలిసకొనబడుచున్నది. తెల్సికొనదగి యున్నది. బ్రహమ్మము ఇంద్రియాతీతము. పుత్రుని మాత్రమే తెలిసికొన గలము. క్రీస్తు మూలమున మాత్రమే బ్రహ్మమును గాంచగలం. మానవునికి వాని తత్వమును ప్రకటించు నిమిత్తము బ్రహ్మము క్రీస్తు ఆయెను. త్రిముర్యాత్యకముగా భావింపబడు క్రీస్తు మనకు ఆతీతుడు. ఏకాత్మగా భావింపబడెను. భగవదవతార మూర్తియగు క్రీస్తు తన దైవత్వమును మరచియుండని క్రీస్తు మనకు తోడ్పడగలడు. అతని యందెట్టి అపరిపూర్ణతయు లోపమును గానరావు.”
8.నెపోలియన్ చక్రవర్తి :
🌠🌠🌠🌠🌠🌠🌠🌠
ఐరోపా అంతటిని జయించిన నియంత, చక్రవర్తియునైన నెపోలియన్ చక్రవర్తి దేవుని గూర్చి ఈ విధంగా ఒప్పుకొనెను.
“నజరేయుడవైన యేసూ, నా కత్తితో నేను కొంతవరకు జయించాను. కానీ నీవు నీ ప్రేమతో లోకాన్నే జయించావు. నీవు దేవుడవు అని పలికెను. ఈ సంగతి "నెపోలియన్ ఆత్మకథ” అను గ్రంథములో వ్రాయబడింది.
9. జూలియస్ చక్రవర్తి :
✴️✴️✴️✴️✴️✴️✴️✴️
మహారోమా సామ్రాజ్యానికి అధినేతయై 800 పట్టణాలను జయించి క్రీస్తు విరోధిగా క్రైస్తవ సంఘమును హింసించిన జూలియస్ చక్రవర్తి చనిపోవుటకు ముందు ఈ విధంగా పలికెను.
“ఓ గలిలయుడా యేసూ, నీవు దేవుడువు. నీవే గెలిచావు నేను ఓడిపోయాను" అని కేకవేసి చనిపోయినట్లు 'అంతిమ దశలో జూలియస్' అను గ్రంథములో వ్రాయబడింది.
10. జాకీషర్మన్ :
✳️✳️✳️✳️✳️✳️✳️
జాకీ షర్మన్ అనే యూదుడు భూగర్భ శాస్త్రవేత్తయైన వ్యక్తి. త్రవ్వకాలలో బయటపడిన విషయాలను బట్టి బైబిలు సత్యమని అంగీకరించి ఒప్పుకున్నాడు.
11. చార్లెస్ డార్విన్:
💙💙💙💙💙💙💙
మనిషి కోతినుండి వచ్చాడు అనే పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించి నాస్తిక విప్లవానికి కారణమైన ప్రముఖులలో ఒకనిగా ఎంచబడిన వ్యక్తి చార్లెస్ డార్విన్. అతని అంతిమ దశలో తన సిద్ధాంతము తప్పు అని ఒప్పుకొని ప్రజలను సమకూర్చి - యేసును గూర్చి బోధించమని చెప్పినట్లు తెలియుచున్నది. ఈ విషయము డార్విన్ అంతిమ యాత్ర అను పుస్తకములో వ్రాయబడినది.
12. జె.జె. రూజో :
🤎🤎🤎🤎🤎🤎🤎
ఫ్రెంచి తత్వ శాస్త్రవేత్త అయిన జె.జె. రూజో (1712-1778) ఈ క్రింది విధంగా పలికారు.
“సోక్రటీసు ముని కాని క్రీస్తు దేవుడు”
13. ఫ్రాంక్ మోరిస్ :
💚💚💚💚💚💚
నాస్తికునిగా దేవుడు లేడని బోధించు ఫ్రాంక్ మోరిస్ అను న్యాయవాది ఇంగ్లాలో జీవించేవాడు. అతడు నాస్తిక సమ్మతమైన ఎన్నో గ్రంథాలు వ్రాశాడు. కాని చరిత్రలో పరిశోధనలో వెల్లడియైన సత్యాలను బట్టి ఆయన క్రైస్తవునిగా మారి క్రీస్తును గూర్చి ఈ క్రింది విధంగా సాక్ష్యమిచ్చాడు.
- బైబిల్ దేవుని వాక్యము. యేసు మరణించి తిరిగి లేచారు, ఆయనే దేవుడు”. -
14. గిల్బర్ట్ :
🧡🧡🧡🧡🧡🧡🧡
ఆక్స్ఫర్డు యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసిన 'గిల్బర్టు' అను నాస్తికుడు క్రీస్తు పునరుత్థానముపై పరిశోధనలు జరిపి పునరుత్థానము నిజమని గ్రహించి యేసు దేవుడని ఒప్పుకొన్నాడు. క్రీస్తును గూర్చి అనేక గ్రంథములు వ్రాసాడు.
15. నందపోరస్' రాజు
🖤🖤🖤🖤🖤🖤🖤🖤
క్రీ.శ. 49వ సంవత్సరములో పంజాబును పరిపాలించిన 'నందపోరస్' అనే రాజు తోమా అను అపొస్తులుని ద్వారా క్రీస్తును గూర్చి తెలుసుకొని యేసు దేవుడని ఒప్పుకుని క్రైస్తవుడైనట్లు చరిత్ర సాక్ష్యమిస్తుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి