*హార్ మెగిద్దోను యుద్ధం*
🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯
ఒక దూత సూర్యబింబములో నిలిచి యుండుట చూచితిని. అతడు గొప్ప శబ్దముతో ఆర్భటించి రండి, రాజుల మాంసమును సహస్రాధిపతుల మాంసమును బలిష్ఠుల మాంసమును గుఱ్ఱముల మాంసమును వాటిమీద కూర్చుండువారి మాంసమును, స్వతంత్రులదేమి, దాసులదేమి, కొద్దివారిదేమి, గొప్పవారిదేమి, అందరియొక్క మాంసమును తినుటకై దేవుని గొప్ప విందుకు కూడిరండని ఆకాశమధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను.మరియు ఆ గుఱ్ఱముమీద కూర్చున్నవానితోను ఆయన సేనతోను యుద్ధముచేయుటకై ఆ క్రూరమృగమును భూరాజులును వారి సేనలును కూడియుండగా చూచితిని.అప్పుడా మృగమును, దానియెదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించినవారిని మోసపరచిన ఆ అబద్ధప్రవక్తయు, పట్టబడి వారిద్దరు గంధకముతో మందు అగ్ని గుండములో ప్రాణముతోనే వేయబడిరి. వారి మాంసమును పక్షులన్నియు కడుపార తినెను.
ప్రకటన 19:17-21
హార్ మెగిద్దోను అనేది హెబ్రీ పదము.
* హార్ : అనగా కొండ
* మెగిద్దోను: కనాను దేశాన్ని, యెహోషువా స్వాధీన పరచుకున్న తర్వాత, ఇస్సాకార్ సరిహద్దు వద్ద గల, మనస్సే గోత్రముయొక్క భూభాగమునకు చెందిన ఒక ప్రాంతమే మెగిద్దోను.
🌀హార్ మెగిద్దోను ఎక్కడవుంది?*
* కర్మెలు, గిల్బోవా పర్వతాలకు మధ్య.
🌀హార్ మెగిద్దోను గత చరిత్ర*:
గిద్యోను, మిద్యానీయులను ఇక్కడనే ఓడించెను. (న్యాయాధి 6,7 అధ్యాయములు)
* ఈజిప్ట్ రాజైన ఫరోనెకో, యోషీయా రాజును ఇక్కడనే హతమార్చెను.(2 రాజులు 23:29)
🌀చివరి హార్ మెగిద్దోను యుద్దము ఎవరిమధ్య జరుగబోతోంది?*
* క్రీస్తుకు, క్రీస్తు విరోధి సైన్యాలకు మధ్య
🌀*ఎప్పుడు జరుగబోతోంది?*
* ఏడేండ్ల శ్రమలకు, క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలనకు మధ్య కాలములో ఈ యుద్ధము జరుగబోతోంది.
సాతాను దుష్టత్రయం (సాతాను, అంత్య క్రీస్తు, అబద్ధ ప్రవక్త) నోటనుండి వెలువడిన కప్పలువంటి అపవిత్రాత్మలు, సర్వలోక సైన్యాలను క్రీస్తుకు విరోధంగా పోగుజేస్తాయి.
ఆరవ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానదిమీద కుమ్మరింపగా తూర్పునుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడునట్లు దాని నీళ్లు యెండి పోయెను. మరియు ఆ ఘటసర్పము నోట నుండియు క్రూరమృగము నోటనుండియు అబద్ధ ప్రవక్త నోటనుండియు కప్పలవంటి మూడు అపవిత్రాత్మలు బయలువెడలగా చూచితిని. అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే; అవి సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతట ఉన్న రాజులను పోగుచేయవలెనని వారియొద్దకు బయలు వెళ్లి హెబ్రీభాషలో హార్ మెగిద్దోనను చోటుకు వారిని పోగుచేసెను.ప్రకటన 16:12-15
అప్పుడు క్రీస్తుకును, క్రీస్తు విరోధి సైన్యాలకును మధ్య ఈ యుద్ధము జరుగబోతోంది.
*హార్మెగిద్దోను యుద్ధమునకుగల కారణములు:*
⭕⭕⭕⭕⭕⭕⭕⭕⭕⭕
1. దేవుడు ఇశ్రాయేలీయులను రక్షించుటకు, వారి పక్షముగా యుద్ధము చేయును.
నేను వారి పాపములను పరిహరించినప్పుడు నావలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరును రక్షింప బడుదురు.రోమీయులకు 11:27
2. సంఘము ఎత్తబడిన తర్వాత, అంత్య క్రీస్తు ఏడేండ్ల పరిపాలన తర్వాత, అతని పాలనను అంతమొందించి, క్రీస్తు రాజ్యాన్ని స్థాపించుటకు.
3. దేవుడు తన్నుతాను, సృష్టి కర్తగా, సర్వాధికారిగా, సర్వ శక్తిమంతునిగా రుజువు పరచుకొనుటకు.
4. ఇశ్రాయేలీయులను, సంఘమును హింసించిన శత్రువులపై ప్రతీకారం తీర్చుకొనుటకు.
5. భూరాజులందరిని జయించి, ప్రపంచమంతా ఒకే రాజ్యము నెలకొల్పడానికి,
ఇశ్రాయేలీయులను నాశనము చేయుటకు అంత్య క్రీస్తు నాయకత్వములో భూరాజులును, సైన్యమును సమకూర్చును. వారు మెగిద్దోను లోయలో యుద్ధమునకు దిగగా ఇశ్రాయేలీయులు దిక్కులేని స్థితిలో, రక్షణ కొరకు దేవునిని ప్రార్ధిస్తారు. అప్పుడు ప్రభువు వారిని రక్షించుటకు బహిరంగ రాకడలో ప్రత్యక్షమగును.
యెషూరూనూ, దేవుని పోలినవాడెవడును లేడు ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును మహోన్నతుడై మేఘవాహనుడగును.ద్వితీ 33:26
అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధము చేయు రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయును. ఆ దిన మున యెరూషలేము ఎదుట తూర్పుతట్టుననున్న ఒలీవ కొండమీద ఆయన పాదములుంచగా ఒలీవకొండ తూర్పు తట్టునకును పడమటి తట్టువకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపుతట్టునకును సగముకొండ దక్షిణపుతట్టు నకును జరుగును గనుక విశాలమైన లోయ యొకటి యేర్పడును. కొండలమధ్య కనబడులోయ ఆజీలువరకు సాగగా మీరు ఆ కొండలోయలోనికి పారిపోవుదురు. యూదారాజైన ఉజ్జియా దినములలో కలిగిన భూకంపము నకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోవు దురు, అప్పుడు నీతోకూడ పరిశుద్దులందరును వచ్చెదరు. నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును.
జెకర్యా 14:3-5
యెరూషలేము ఎదుట తూర్పుతట్టుననున్న ఒలీవ కొండమీద ఆయన పాదములుంచగా ఒలీవకొండ తూర్పు తట్టునకును పడమటి తట్టువకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపుతట్టునకును సగముకొండ దక్షిణపుతట్టు నకును జరుగును గనుక విశాలమైన లోయ యొకటి యేర్పడును. ఇది యెహోషాపాతు లోయ.
అన్యజనులనందరిని సమకూర్చి, యెహోషాపాతు లోయలోనికి తోడుకొనిపోయి, వారు ఆ యా దేశముల లోనికి నా స్వాస్థ్యమగు ఇశ్రాయేలీయులను చెదరగొట్టి, నా దేశమును తాము పంచుకొనుటనుబట్టి నా జనుల పక్షమున అక్కడ నేను ఆ అన్యజనులతో వ్యాజ్యె మాడుదును.....
తీర్పు తీర్చు లోయలో రావలసిన యెహోవాదినము వచ్చే యున్నది; తీర్పుకై జనులు గుంపులు గుంపులుగా కూడి యున్నారు.సూర్య చంద్రులు తేజోహీనులైరి; నక్షత్ర ముల కాంతి తప్పిపోయెను.యెహోవా సీయోనులో నుండి గర్జించుచున్నాడు; యెరూషలేములోనుండి తన స్వరము వినబడజేయుచున్నాడు; భూమ్యాకాశములు వణకుచున్నవి. అయితే యెహోవా తన జనులకు ఆశ్రయ మగును, ఇశ్రాయేలీయులకు దుర్గముగా ఉండును.
యోవేలు 3:2,14-16
ప్రభువు ఒలీవల కొండమీద నుండి మెగిద్దోను లోయలోనున్న శత్రువులతో యుద్ధము చేయును. ఆయన నోటినుండి వాడిగల ఖడ్గం బయలువెళ్లి శత్రువులను వధించును.
అప్పుడా ధర్మవిరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటియూపిరిచేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశముచేత నాశనము చేయును.2 థెస్స 2:8
*క్రీస్తు విరోధి సైన్యముల మాంసము ఆకాశ పక్షులు కడుపారా భుజించును.*
*పక్షులకు విందు:*
⭕⭕⭕⭕⭕⭕
మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచి యుండుట చూచితిని. అతడు గొప్ప శబ్దముతో ఆర్భటించి రండి, రాజుల మాంసమును సహస్రాధిపతుల మాంసమును బలిష్ఠుల మాంసమును గుఱ్ఱముల మాంసమును వాటిమీద కూర్చుండువారి మాంసమును, స్వతంత్రులదేమి, దాసులదేమి, కొద్దివారిదేమి, గొప్పవారిదేమి, అందరియొక్క మాంసమును తినుటకై దేవుని గొప్ప విందుకు కూడిరండని ఆకాశమధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను.
ప్రకటన 19:17,18
అమెరికా దేశంలో విమానం పరిమాణంలో నున్న, పక్షులు వెలుగులోనికి వచ్చాయట. అవి ఎగురుతుంటే, బిల్డింగులు సహితం కంపిస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి.
అంతే కాకుండా, హార్ మెగిద్దోనుకు సమీపంలో బయార్డ్ అనే విచిత్రమైన పక్షులు కనుగొన్నట్లు తెలుస్తుంది. అవి టన్నులకొద్దీ మాంసాన్ని జీర్ణం చేసుకొనే శక్తిని కలిగివున్నాయట. ప్రారంభములో సంవత్సరానికి అవి రెండు గుడ్లు పెట్టేవని, ఇప్పుడైతే, సంవత్సరానికి పండ్రెండు గుడ్లు పెట్టుచూ వాటి సంతానాన్ని అభివృద్ధి చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇవన్నీ హార్ మెగిద్దోను యుద్ధం కోసం సన్నద్ధమవుతున్నట్లు గ్రహించగలము.
హార్ మెగిద్దోను యుద్దములో క్రీస్తుకు విజయం, భూరాజులు నేలమట్టం.
అంత్య క్రీస్తు, అబద్ధ ప్రవక్త ప్రాణంతోనే అగ్నిగుండములో వేయబడతారు. మొట్టమొదట అగ్ని గుండములోనికి ప్రవేశించేది వీరిద్దరే.
*హార్ మెగిద్దోను యుద్ధము తర్వాత సాతాను అగాధములో వెయ్యి సంవత్సరాలు బంధించబడును.*
మరియు పెద్దసంకెళ్లను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపుచెవిగల యొక దేవదూత పరలోకమునుండి దిగివచ్చుట చూచితిని. అతడు ఆదిసర్పమును, అనగా అపవాదియు సాతానును అను ఆ ఘటసర్పమును పట్టుకొని వెయ్యి సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి, ఆ వెయ్యి సంవత్సరములు గడచువరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను; అటుపిమ్మట వాడు కొంచెము కాలము విడిచి పెట్టబడవలెను.ప్రకటన 20:1-3
హార్మగిద్దోను యుద్ధము అనంతరము, ప్రపంచమంతా ప్రభువు స్వాధీనము చేసుకొని, వెయ్యేండ్ల పరిపాలన ప్రారంభించును.
ప్రియ విశ్వాసి! కృపాకాలం ముగించబడబోతుంది. దేవుని రాకడ సమీపమౌతుంది. ప్రభువు రాకడకై నీవు సిద్దమేనా? లేకుంటే, ఉగ్రతనుండి తప్పించుకోలేవు. సరిచేసుకుందాం! ప్రభవు రాకడకై సిద్దపడదాం!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి