ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

బైబిల్ ఆవిర్భావం

బైబిల్ ఆవిర్భావం
🎯🎯🎯🎯🎯🎯🎯
క్రీ.శ. 400 సంవత్సరంలో  ‘జెరోం’ అనే భక్తుడు హెబ్రీ గ్రీకు భాషలనుండి ఎంతో శ్రమకోర్చి బైబిల్ అంతటిని లాటిన్ భాషలోకి తర్జుమా చేశాడు. దీనిని ‘వల్గేట్’ అని పిలుస్తారు. 

ఆ తరువాత 15 సంవత్సరాలు ఎంతో శ్రమపడి ‘జాన్ విక్లిఫ్’ మొదటిసారిగా 1383లో ఇంగ్లీష్ భాషలోనికి బైబిల్‌ను అనువాదం చేశాడు. దీని ఫలితంగా 1394లో విక్లిఫ్ హతసాక్షి అయ్యాడు. 

1445లో ‘గూటెన్ బర్గ్’ ముద్రణాయంత్రం కనుగొని 1456లో మొదటిసారిగా లాటిన్ బైబిల్ ను ముద్రించెను. అలా ప్రంపంచంలోనే మొట్టమొదట ప్రింటైన గ్రంథంగా బైబిల్ ప్రసిద్ధి గాంచింది. 

సరిగ్గా  విక్లిఫ్ మరణించిన 100 సంవత్సరాలకు అనగా 1495లో ‘విలియం టిండేల్’ జన్మించాడు. ఈయన 1525లో తిరిగి ఇంగ్లీష్ అనువాదం చేశాడు. 

బైబిల్ తర్జుమా చేయడం వల్ల నాటి మత ఛాదస్తవాదులు టిండేల్‌ను 1536లో కొయ్యకు కట్టి తారు పూసి కాల్చి చంపారు. అతని ప్రయాస, త్యాగం, మరణం ఫలితంగా 12 సంవత్సరాల తర్వాత అంటే 1548లో మొదటి ఇంగ్లీష్ బైబిల్ ముద్రించబడింది. 

1778వ సంవత్సరంలో ఫ్రాన్స్ దేశంలో ‘వాల్టేర్’ అను ఒక నాస్తికుడు ఇంకా 100 సంవత్సరాలకు బైబిల్ పూర్తిగా అంతరించి పోవునని ప్రవచించాడు. ఆ ప్రవచనముల ద్వారా బైబిల్‌నకు వ్యతిరేకముగా ఎన్నో బోధలు చేసి వాటిని తన ఇంటిలోనే అచ్చు యంత్రముల ద్వారా ముద్రించెను. అతని ఇల్లంతా బైబిల్‌కు వ్యతిరేకమైన కరపత్రములతో, పుస్తకములతో నిండి వుండెను. ఆ ప్రవచనములు నెరవేరలేదు గానీ, ఆయన చనిపోయిన తరువాత అతని ఇల్లు బైబిల్ పుస్తకశాలగాను, అతని అచ్చు యంత్రములు బైబిల్ అచ్చువేయు యంత్రములుగాను మారిపోయినవి. 
దేవునికి మహీమ కలుగును గాక.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...