ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ప్రపంచంలో ఏ గ్రంధానికి లేనటువంటి తిరుగులేని ఆధారాలు ఒక్క బైబిల్ గ్రంధానివే...*

*ప్రపంచంలో ఏ గ్రంధానికి లేనటువంటి తిరుగులేని ఆధారాలు ఒక్క బైబిల్  గ్రంధానివే...*


👉ఒక గ్రంధాన్ని గాని పుస్తకాన్ని గాని సత్యమని చెప్పాలన్న.. నమ్మాలన్న కొన్ని రంగాల్లో ఆ గ్రంధము ఋజువు చేయబడాలి. శాస్త్రీయ ఆధారాలు.. భౌగోళిక ఆధారాలు, పురావస్తు నిదర్శనాలు, చారిత్రక ఆధారాలు, విశ్వవ్యాప్త అంగీకారం ఆ గ్రంధాన్ని ధృడపరచుతాయి. 

👉ప్రపంచంలో ఏ గ్రంధానికి లేనటువంటి తిరుగులేని ఆధారాలు, నిదర్శనాలు పరిశుద్ధ గ్రంధానికి ఉన్నాయి. దేవుని అధికార ముద్ర, ప్రవక్తల ప్రవచనాలు ఇవన్నీ బైబిల్ ప్రత్యేకతకు తార్కాణాలు. అనునిత్యమూ ఎన్నో ఎన్నో పరిశోధనలు ప్రపంచంలో జరుగుతూనే ఉన్నాయి. ఎన్నో విశిష్ట నిధులు బయటపడుతూనే ఉన్నాయి. దాదాపు చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన, విలువైన నిధులు కొన్ని సం||రాల క్రితం బయటపడ్డాయి. అవే ఖుమ్రాన్ గుహలలో బయటపడ్డ బైబిల్ యొక్క వ్రాతప్రతులు ఖుమ్రాన్ గుహలలో లభించిన తిరుగులేని ఆధారాలు బైబిల్ యొక్క చారిత్రక ఔన్నత్యాన్ని తెలియచేస్తున్నాయి. వాటినే మృతసముద్రపు వ్రాతప్రతులు (Dead Sea Scrolls) అని కూడా అంటారు. వాటి వివరాల్లోకి వెళితే... 

👉ఇశ్రాయేలీయుల దేశంలో ఉన్న మృత సముద్రానికి ఒక మైలు దూరంలో ఈ ఖుమ్రాన్ గుహలు కనబడతాయి. ఈ ప్రాంతమే ఇప్పుడు ప్రపంచమంతా చర్చనీయాంశం. సహజసిద్ధంగా ఏర్పడిన ఈ ఖుమ్రాన్ గుహలలోనే బైబిల్ వ్రాతప్రతులు దొరికాయి. క్రీ||పూ||134 సం||లో జాన్ హిర్కనస్ పాలనలో ఈ ఖుమ్రాన్ గుహలలో కొంతమంది గ్రీకులు ఉండేవారు. ఆ తరువాత క్రీ.శ.68లో రోమన్లు వారిని అక్కడ నుండి పంపించి వేశారు. ఖుమ్రాన్ గుహల్లో జరిగిన అనేక పరిశోధనల్లో బైబిల్కి సంబంధించిన అద్భుత వ్రాతప్రతులు బయటపడ్డాయి. 1947 సం|| నుండి 1956 సం|| వరకు జరిగిన పరిశోధనల్లో 900కు పైగా లిఖిత పత్రాలు లభ్యమయ్యాయి. దాదాపు ఖుమ్రాన్ ప్రాంతంలో ఉన్న 11 గుహల్లో అవి లభ్యం కావడం గమనార్హం. బైబిల్ గొప్పతనం అర్ధం చేసుకోవడానికి ఆ గుహల ఫోటోగ్రాఫ్స్ చూడండి. 

👉అది 1947 ఫిబ్రవరి 16... ఖుమ్రాన్ గుహల ప్రాంతంలో గొర్రెల కాపరులుగా ఉన్న మహ్మద్ ఎదీబ్ మరియు అతని తమ్ముడు మొదటిసారిగా మట్టి కుండలను ఈ ప్రాంతాల్లో చూశారు. ఎంతో ఆశతో ఆసక్తితో ఆ కుండల యొద్దకు వెళ్ళి వాటిలో ఏమైనా విలువైన వస్తువులు ఉన్నాయనుకున్నారు. కాని వారికి వాటిలో కొన్ని చర్మపు కాగితాలు, పైపరస్ బెరడులపై వ్రాసిన వ్రాతప్రతులు కనబడ్డాయి. వారి దృష్టి బహుశా భౌతిక సంబంధమైన వస్తువులపై ఉంది గాని ఆ గ్రంధముల యొక్క విలువ బహుశా అప్పటికి వారికి తెలీదు. ఆ మట్టి కుండల్లో లభ్యమైన ఆ పత్రాలను తమ గృహాలకు తీసుకొని వెళ్ళి అందరికి చూపించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన సలహా ఏమిటంటే ఎక్కడో చోట, ఎవరికోకరికి వీటిని అమ్మేస్తే కొంతైనా డబ్బులు రాబట్టవచ్చునని కొన్ని రోజులు వాటిని వారి దగ్గర ఉంచుకొని చివరకు వాటిని 29 డాలర్లకు అమ్మేస్తారు. ఆ విలువైన పత్రాలు అనేకుల చేతులు మారి సిరియా దేశపు బిషప్గా ఉన్న అతానిసియస్ సామ్యూల్ చేతిలో పడ్డాయి. ఆయనను మార్ సామ్యూల్ అని కూడా పిలుస్తారు. డెడ్సీ స్క్రాల్స్ గూర్చి అధ్యయనాల్లో ప్రముఖంగా కనిపించేది ఇతని పేరు. కారణం ఆ పత్రాలు. గ్రంధపు చుట్ట విలువ మొదటిగా తెలుసుకున్నది ఇతనే. 

👉మార్ సామ్యూల్ వీటిని జాగ్రత్తగా పరిశీలించడం ప్రారంభించాడు. హెబ్రీ భాషలో వ్రాయబడిన ఆ లిఖిత పత్రాలను శ్రద్ధగా అధ్యయనం చేసి వాటి విశిష్టతను తెలుసుకొన్నాడు. ప్రపంచమంతా నివ్వెరపోయే ఓ అద్భుత వ్యాఖ్యను చేశాడు. 'ప్రపంచంలోనే అత్యంత విలువైన పత్రాలు నా దగ్గరున్నాయి' అని మార్ సామ్యూల్ బహిరంగ వ్యాఖ్య చేశాడు. మార్ సామ్యూల్ పరిశోధనల్లో తేలిన ఫలితార్ధమిదే. ఖుమ్రాన్ గుహల్లో దొరికిన కుండల్లో లభ్యమైన వ్రాతప్రతులు సామాన్యమైనవి కావు. అవి విలువైన 'బైబిల్' గ్రంధము యొక్క వాస్తవ వ్రాతప్రతులు. దేవాది దేవుని ప్రేరేపణతో, ప్రత్యక్షతలతో వ్రాయబడిన గ్రంధాలు. క్రీ.పూ.ఎన్నో సంవత్సరాలకు ముందే పరమతండ్రి, స్వయంభవుడు అయిన దేవుడు ప్రజానీకానికి ఇచ్చిన ఆజ్ఞలు, సూచనలు, వాగ్దానాలు, ప్రవక్తలు దైవాత్మ ప్రేరేపణతో వ్రాసిన మాటలు. అప్పటికి మార్ సామ్యూల్ యొద్ద ఉన్న గ్రంధాలు ఈ విధంగా గుర్తించబడ్డాయి. 

👉Isaiah Scroll  (యెషయా గ్రంధము). 
The Community Rule (కమ్యూనిటీ రూల్). Habakkuk Pesher (హబక్కుకూ గ్రంధ వ్యాఖ్యానము). Genesis Apocryphon  ఈ లోపులో ఇశ్రాయేలు దేశానికి స్వాతంత్య్రం రావడం, చెదిరిపోయిన యూదులందరూ ఆయా దేశాల నుండి ప్రోగుచేయబడి ఒకచోట ఒక దేశంగా సమకూడడం ఆ వెనువెంటనే ప్రక్కదేశాలు ఇజ్రాయేల్పై యుద్ధానికి రావడం చరిత్రలో గమనించదగ్గ విషయాలు. ఆ యుద్ధ భీభత్సంలో ఈ దివ్యజ్ఞాన గ్రంధం యొక్క మూల లిఖిత పత్రాలకు ఎటువంటి హాని కలుగకూడదనే ఉద్దేశ్యంతో బిషప్ మార్ సామ్యూల్ వీటన్నింటిని లెబనాన్ తీసుకొని వెళ్ళిపోయాడు. 

👉ఎట్టకేలకు అత్యంత విలువైన, ప్రతిష్టాత్మకమైన ఈ గ్రంధాల గొప్పతనాన్ని గుర్తించిన ఇజ్రాయేల్ దేశంలో హిబ్రూ యూనివర్శిటీలో ప్రొఫెసర్ బెంజిమన్ మాజర్ మరియు ప్రొఫెసర్ యదీన్ వాటిని యెరూషలేమునకు తీసుకొనివచ్చారు. అందుకుగాను వారు ఖర్చుచేసిన మూల్యం ఎంతో తెలుసా? అక్షరాల రెండు లక్షల యాభైవేల డాలర్లు. 1947 నుండి 1956 వరకు దాదాపు 900 డాక్యుమెంట్లు ఖుమ్రాన్ గుహలలో లభించాయి. వాటిలో ఎన్నో ఎన్నో శ్రేష్టమైన అంశాలు దాగి ఉన్నాయి. కీర్తనలు గ్రంధం, సామెతల గ్రంధం, ప్రవక్తల గ్రంధాలు, చారిత్రక గ్రంధాలు ఇలా అనేక గ్రంధాలు ఈ గుహల్లోనే లభ్యమయ్యాయి. 

👉యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యధార్ధమైనది (కీర్త 19:7) మరియు సత్యమైనవి (కీర్త 19:9) అని పరిశుద్ధ గ్రంధం సెలవిస్తున్న రీతిగా తిరుగులేని ఆధారాలు నిదర్శనాలు బైబిల్ గొప్పతనాన్ని నిరూపిస్తున్నాయి...

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...