ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ప్రభుబల్ల యొక్క పరమార్థం

*🌈ప్రభుబల్ల యొక్క పరమార్ధం.*


*📖మీరు ఈ రొట్టెను తిని, యీ పాత్రలోనిది త్రాగు నప్పుడెల్ల ప్రభువు వచ్చువరకు ఆయన మరణమును ప్రచురించుదురు.(1కోరింథి 11:26)*


*🔹1. ప్రభుబల్ల అంటే ఏంటి?*

*🔸2. దానిని ఎప్పుడు సమీపించాలి (తీసుకోవాలి)?*

*🔹3. ఎందుకు తీసుకోవాలి?*

*🔸4. దేనికోసం తీసుకోకూడదు?*

అనే ఈ నాలుగు అంశాలు ధ్యానిద్దాము. మనకు చాలా సంఘాలు ఉన్నాయి. కొంతమంది శనివారం తీసుకుంటారు. కొంతమంది మొదటి ఆదివారము & చివరి ఆదివారము తీసుకుంటారు. మరికొంతమంది ప్రతిరోజు తీసుకుంటారు.


☘ *1. ప్రభుబల్ల అంటే ఏమిటి?*

యెహోవా వారితో ఇలాగు సెలవిచ్చెను - పస్కాపశువును వధించి, హిస్సోపు కుంచె తీసుకొని, రక్తములో ముంచి, ద్వార బంధపు పైకమ్మికిని, రెండు నిలువ కమ్మిలకు ఆ రక్తము రాయవలెను. ఐగుప్తీయులను సంహరించుటకు వచ్చినపుడు ఈ రక్తము చూసి సంహరకుడు లోపలికి రాడు. దీనిని కట్టడగా ఆచరించవలెను. (నిర్గమ 12:21-25) పస్కా పశువును వధింపవలసిన పులియని రొట్టెల పండుగ దినము రాగా, యేసు పేతురును, యోహానును చూచి మీరు వెళ్లి మనము భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుడని వారిని పంపెను (లూకా 22:7-8) ఆ రోజు దేవుడు పస్కా బలికి సాదృశ్యముగా, బలి పశువుకి సరూప్యముగా రొట్టెను, బలి పశువు రక్తానికి సరూప్యముగా ద్రాక్షరసాన్ని ఇచ్చెను. (లూకా 22:17-20) ఇకనుంచి ఆ రొట్టెను యేసు శరీరమునకు సాదృశ్యముగా, ద్రాక్షరసాన్ని యేసు రక్తానికి సారూప్యముముగా మనము తీసుకుంటున్నాము. ఈ ప్రక్రియనే ప్రభుబల్ల అంటాము.


☘ *2. ప్రభుబల్ల ఎప్పుడు తీసుకోవాలి?*

ఈ ప్రభుబల్ల ఒక్కొక్క సంఘము ఒక్కో రోజు తీసుకుంటుంది. కాని ఆది అపొస్తలులు ప్రతి ఆదివారము ప్రభుబల్ల తీసుకున్నట్లు బైబిల్ లో స్పష్టముగా ఉంది. *"ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినపుడు."* (అపో 20:7) ప్రభుబల్ల ప్రతి ఆదివారము తీసుకోవాలి, కాని కొందరు ప్రతిరోజు అంటారు. *"ప్రతిదినము దేవాలయములో కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు..."* (అపో 2:46) ఇక్కడ ప్రతిరోజు ఇంటింట రొట్టె విరుచుట అనేది శరీర ఆహారము ప్రభుబల్ల కాదు. ప్రతినెల మొదటి ఆదివారము ప్రభుబల్ల తీసుకోవాలి అనికూడా లేదు. కాబట్టి ప్రతి ఆదివారం తీసుకోవాలి. ప్రతి ఆదివారమే ఎందుకు తీసుకోవాలి అంటే, ప్రతి ఆదివారము సంఘ ఆరాధన ఉంటుంది కాబట్టి (1కోరింథి 16:2) ఆదివారము పునరుద్దాన దినము కావున, (మత్తయి28:1) ఆదివారమే అపొస్తలులు ప్రభుబల్ల సమీపించారు కాబట్టి, (అపో 20:7)


☘ *3. ఎందుకు ప్రభుబల్ల తీసుకోవాలి?*

🔹"మనము దీవుంచు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట, క్రీస్తు రక్తములోనిది త్రాగుటయే గదా?" (1కోరింథి10:16)

🔸ప్రభుబల్లలో పాలు పొందునపుడు. అయన బలియాగాన్ని జ్ఞాపకము చేసుకోనుచున్నాము. (1కోరింథి 11:24)

🔹ఈ కార్యము ఆది సంఘం దినదినము, ప్రతి ఇంట కుడుకొనుచు ఆచరించేవారు. (అపో. 2:42)

🔸దీనిని ప్రభువు వచ్చు వరకు ఆచరించెదము. (1కోరింథి 11:26)

🔹అయన మరణము ప్రచురించుచున్నాము. (1కోరింథి 10:16-17)

🔸దీనిలో పాలు పొందునపుడెల్ల మనలను మనము పరీక్షించుకుంటాము. (1 కోరింథి 11:28)


☘ *4. ప్రభుబల్ల దేనికోసం తీసుకోకూడదు?*

పాపాలు క్షమింపబడుటకు కాదు. పాపాలు కేవలం మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తం బాప్తీస్మం పొందితేనే పాపాలు క్షమింపబడతాయి. శరీర ఆరోగ్యం కోసం కాదు. ప్రభుబల్ల వలన శరీర ఆరోగ్యము రాదు, నిత్య జీవము కలుగును. (యోహాను 6:53-59)

ఇది దేవుని శరీరం, రక్తం అని కాకుండా అయోగ్యముగా స్వీకరిస్తే బలహీనులము, రోగులము అవుతాము. (1కోరింథి 11:30)


💥 *ముగింపు:-*

తెలియక కొందరు రక్షణ, ఆశీర్వాదము, రోగ విముక్తి కొరకు, సమస్యల పరిష్కారము కొరకు, ఫలహారం కొరకు ప్రభు బల్లలో పాలు పొందుతున్నారు. అలా కాకుండా నిర్దోషమైన చేతులతో ప్రభు బల్లలో పాలు పంచుకుందము. అయోగ్యులముగా కాక ప్రభుబల్లకు సంబంధించి అన్ని విషయాలు తెలుసుకొని, యోగ్యులగా ప్రభుబల్ల సమీపిద్దాము. అప్పుడే నిత్యజీవ పాత్రులము అవుతాము.

*అట్టి కృప దేవుడు మన అందరికి అనుగ్రహించును గాక..ఆమెన్! ఆమెన్!! ఆమెన్!!!*

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...