ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

విలియం టిండేల్ జీవితచరిత్ర

*విలియం టిండేల్ జీవితచరిత్ర*

*పూర్తి పేరు:-* విలియం టిండేల్ 
*జన్మస్థలం:-* గ్లాస్టర్ షైర్ లోని స్లింబ్రిడ్జి, ఇంగ్లాండ్ 
*జననము:-* క్రీస్తు శకం 1495 లో
*మరణం:-* 1536 అక్టోబర్ 6 
*రక్షణానుభవం:-* 21 సంవత్సరాల వయసులో 
*సేవా ఫలితము:-* అనేక శ్రమల మధ్య బైబిల్ ను ఆంగ్లంలోకి తర్జుమా చేసి అనేకులకు అందునట్లు చేసి చివరికి హతసాక్షి అయ్యాడు.

*వ్యక్తిగత సాక్ష్యం:-* విలియం టిండేల్ యొక్క తల్లిదండ్రుల గురించి, జన్మస్థానము, జన్మ కాలమును గురించి అంత తేటతెల్లంగా మనకు తెలియకపోయినప్పటికీ ఇంగ్లాండ్ దేశంలోని గ్లాస్టర్ షైర్ లోని స్లింబ్రిడ్జిలో 1495 లో జన్మించి ఉండవచ్చు. ఇతనికి చిన్న వయసు నుండి దేవుని గ్రంధాలు చదవడం అంటే చాలా ఆసక్తి. ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో మంచి విద్యను అభ్యసించాడు. అయితే ఈయన నూతన నిబంధనను గ్రీకు భాషలో చదివాడు. ఈ గ్రంథమును చదువుతున్నప్పుడు అతనికి అది మానసిక శక్తిని గాక హృదయ మార్పును కలుగజేసింది. అంతేకాక *తన హృదయాన్ని ఆకర్షించిన ఈ గ్రంథము దేవుని వాక్యమని, అది ప్రతీ వారు చదివి మేలు పొందునట్లు తన యొక్క మాతృభాష అయినా ఇంగ్లీషులోనికి అనువదించాలని సంకల్పించాడు.* అదేవిధంగా తాను చదివిన గ్రంధంలోని సత్యాలను బోధించడం కూడా మొదలుపెట్టాడు. అయితే ఆ దినములలో బైబిల్ గ్రంథమును సామాన్యులు చదవకూడదని చట్టం ఉండేది. *అయితే ఆ దినములలో ప్రభువు శిష్యులకు నేర్పిన ప్రార్థనను, పది ఆజ్ఞలను తమ పిల్లలకు కొంతమంది తల్లిదండ్రులు ఇంగ్లీష్ లో నేర్పించారని నేరం మోపబడిన ఏడుగురు వ్యక్తులను కర్రకు కట్టి కాల్చి చంపారు*. అలాంటి భయంకరమైన దినములలో విలియం టిండేల్ ఆంగ్లంలోనికి క్రొత్త నిబంధన తర్జుమా చేయాలని పూనుకొనెను. అయితే అతని దేశములో ఆ పని సాధ్యం కానందువల్ల తప్పించుకొని జర్మనీకి పారిపోయి పని ప్రారంభించాడు. కొలగ్నె అను పట్టణంలో అధికారులు నూతన నిబంధన కాగితాలను అపహరించుట చూచినప్పుడు విలియం టిండేల్ దానిని అచ్చు వేయుటకు మరొక పట్టణమునకు పోవలసి వచ్చెను. అలాగు అనేక శ్రమల మధ్య కొత్త నిబంధన మొదటి రెండు ముద్రణలను 1525 లో ముగించాను. ఆపై వేలకొలది నూతన నిబంధనలను పెద్ద పెద్ద సంచులలో మూటలు కట్టి ఓడలపై ఇంగ్లాండ్ దేశమునకు పంపుటలో విజయము సాధించెను. మతాధికారులు వాటిని కాల్చి వేయు ఉద్దేశంతో ఎంతో వెల చెల్లించి దొంగచాటుగా కొనిరి. కానీ ఆ డబ్బు మరిన్ని బైబిల్స్ ప్రింట్ చేయుటకు సహాయపడెను. అతడు ఒక నూతన నిబంధన గ్రంథమును అప్పటి రాణియగు ''ఆనీ బొలన్'' కు బహూకరించెను. ఆ గ్రంథమును నేటికీ బ్రిటిష్ ప్రదర్శనశాలలో ఉన్నది. మత గురువులు అతనిపై పగపట్టి అతన్ని చంపుటకు పన్నాగం పన్ని అతనిని బంధించి చెరసాలలో వేసిరి. విలియం టిండేల్ 15 నెలలు జైలులో గడిపెను. ఆ సమయంలో కూడా అతడు తర్జుమా పనిని కొనసాగించెను. చివరికి 1536 అక్టోబర్ లో ఒక శుక్రవారమున ఆ చీకటి బిలము నుండి వెలుపలికి తీసి గొంతు పిసికి అతని శరీరము బూడిద రంగులొనికి వచ్చేవరకూ హింసించి చంపారు. *అతని చివరి మాటలు ''ప్రభువా ఇంగ్లాండ్ రాజు నేత్రములు తెరువుము'' విలియం టిండేల్ తాను చనిపోవుటకు 10 సంవత్సరాల ముందే నేను తర్జుమా చేసిన కొత్త నిబంధన గ్రంథమును కాల్చిన మీరు ఒక రోజు నన్ను కూడా కాల్చెదరు. అయినా నేను ఈ నూతన నిబంధన గ్రంథమును తర్జుమా చేయడంలో నా పనిని నేను ముగించెను అని అనెను.* టిండేల్ చనిపోయిన తరువాత కొన్ని సంవత్సరములకే ఇంగ్లాండ్ లోని సాధారణ ప్రజలు కూడా వారి సొంత భాషలో బైబిల్ ను కలిగి ఉండే మార్గం ఏర్పడింది. టిండేల్ బైబిల్లోని 90 శాతం పదములు వంద సంవత్సరాల తర్వాత వెలువడిన ''కింగ్ జేమ్స్'' తర్జుమాల్లో కూడా కనబడినవి. క్రైస్తవ హతసాక్షి అనగా, క్రీస్తును త్యజించుటకంటే ఆయన కొరకు మరణించుట కొరకే ఎన్నిక చేసుకొనుట. దేవుని రాజ్యము విస్తరింపచేయుటకై ప్రాణమును కూడా అర్పించుటకు తెగించుట. క్రైస్తవ సాక్ష్యం ఘోర శ్రమను భరించుట. మరణం వరకు నమ్మకంగా ఉండుటయే. అలా జీవించిన వారిలో విలియం టిండేల్ ఒకరు.

♻️ ఈ భక్తుడి జీవిత చరిత్ర మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీ మిత్రులకు షేర్ చేసి ఆత్మీయంగా వారిని కూడా బలపరచండి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...