ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Holy Bible పూర్తి చరిత్ర సంక్షిప్తంగా

Holy Bible పూర్తి చరిత్ర సంక్షిప్తంగా
♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️
దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది. (2తిమోతి 3:16, 17) 

ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మవలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగ పలికిరి. (2పేతురు 1:21) 

యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు ఆయన వాక్కు నా నోట ఉన్నది. (2సమూయేలు 23:2) 

మనుష్యజ్ఞానము నేర్పుమాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు, ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. (1కొరిందీ 2:13) 

కాబట్టి బైబిలు నందు గల మాటలు దైవ ప్రేరేపితములు. అవి మనుష్యుల ఊహలు, మాటలు కాదు... 

■బైబిలు వేటిపై వ్రాసారు?
🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻
●ప్యాపిరస్ అనే కాగితము లాంటి బెరడు మీద 

●చర్మపు చుట్టల మీద 

●మట్టితో చేసిన అచ్చుల మీద 

■బైబిలు ప్రతులు ఎక్కడ దొరికాయి?
❤️❤️❤️❤️❤️❤️❤️❤️
●సెయింట్ కాధరిన్ చర్చి నందు 

●మృత సముద్రము దగ్గర ఉన్న ఖుమ్రాన్ గుహల నందు 

●మృత సముద్రము దగ్గర ఉన్న ఖుమ్రాన్ గుహల నందు మట్టి కుండ పాత్రలలో ఉంచబడ్డాయి, ఆ మట్టి కుండాల్లో చర్మపు చుట్టలుగా చుట్టబడి భద్రపరచబడినయి. 

■బైబిలు యొక్క అమరిక
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
◆బైబిలు 66 పుస్తకముల యొక్క సముదాయము... 

◆బైబిలు అనే మాట బిబ్లియా అనే గ్రీకు పదము నుండి వచ్చినది... 

◆బైబిలును సుమారు 40 మంది 1500 సంవత్సరముల పాటు వ్రాసిరి... 

◆బైబిలులోని 66 పుస్తకములను పాత, క్రొత్త నిబంధన అనే 2 విభాగములుగా చేయటము జరిగినది...

◆పాత నిబంధన హీబ్రూ బాషలోను, క్రొత్త నిబంధన గ్రీకు బాషలోను వ్రాయబడినవి... 

◆క్రీ.పూ 2వ శతాబ్దములో పాత నిబంధన లేఖనములు గ్రీకు లోనికి తర్జుమా చేయబడినవి, దీనినే సేప్తువజింట్ వర్షన్ అంటారు... 

◆రోమన్ బాషలోని అంకెల ప్రకారము LXX అని కూడా పిలుస్తారు... 

◆72 మంది పండితులు 72 రోజులలో ఈ అనువాదము పూర్తి చేసిరి... 

◆పాత నిబంధన గ్రంధములో మొత్తము 39 పుస్తకములు కలవు... 

◆వీటి ఎంపిక క్రీ.శ. 100వ సంవత్సరములో యూదు పండితుల సమావేశములో జరిగినది అని ఒక అవగాహన కలదు... 

◆క్రొత్త నిబంధన గ్రంథములోని పుస్తకముల సంఖ్య 27... 

◆ వీటిని క్రీ. శ. 50-100 సంవత్సరముల మద్యలో గ్రంధస్థము చేసిరి... 

◆ఈ 27 పుస్తకములను క్రీ.శ. 367లో అలెగ్జాండ్రియ బిషప్ అతనేషియస్ నిర్ణయించారు... 

◆ఇవి కాక రోమన్ కాధలిక్ బైబిలు నందు 14 పుస్తకములు అధికముగా ఉండును. వీటిని అపోక్రిప అంటారు... 

◆బైబిలును అధ్యాయములుగా బిషప్ స్టీఫెన్ ల్యాంగ్టన్ క్రీ.శ 1238 లో విభజించారు... 

◆బైబిలును వచనములుగా రాబర్ట్ స్టీఫెన్స్ క్రీ.శ. 1551 లో విభజించారు... 

◆పూర్వకాల మందు బైబిలును స్క్రైబ్స్  అనేవారు చేతితో క్రొత్త ప్రతులను వ్రాసేవారు... 

■బైబిలు యొక్క  – పాత నిబంధన – కొత్త నిబంధన గ్రంథకర్తలు వారి వృత్తి 

●రాజులు – దావీదు, సొలోమోను 

●పండితులు – మోషే 

●ప్రవక్తలు – యెషయా, యిర్మియా, యెహెజ్కేలు, సమూయేలు, నాతాను, గాదు, హోషేయ, యోవేలు, ఓబధ్యా, యోనా, మీకా, నహూము, జెఫన్యా, హగ్గయి, జెకర్యా, మలాకీ. 

●జాలరులు – పేతురు, యోహాను, యాకోబు 

●యుద్ద వీరుడు – యెహోషువ 

●రాజకీయ వేత్తలు – దానియేలు, నెహెమ్యా 

●శాస్త్రి – ఎజ్రా 

●పశులకాపరి – ఆమోసు 

●వ్యవసాయదారుడు – హబక్కూకు 

●వేదాంతి – అపోస్తలుడైన పౌలు 

●వైద్యుడు – లూకా 

●శిష్యులు – యూదా, మార్కు

■బైబిలు సాహిత్య రీతులు
💥💥💥💥💥💥💥💥💥💥
●ఆజ్ఞలు, కట్టడలు, న్యాయవిధులు 

●చరిత్ర 

●పద్యము, కీర్తనలు 

●సామెతలు, జ్ఞానయుక్తమైన సూక్తులు 

●సువార్తలు 

●పత్రికలు 

●దర్శనములు 

●ప్రవచనములు 

●గద్యము 

●ప్రార్థనలు 

●వంశావలులు 

■బైబిలు తర్జుమా
🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶
★క్రీ.పూ 2వ శతాబ్దములో పాత నిబంధన లేఖనములు గ్రీకు లోనికి తర్జుమా చేయబడినవి. దేనినే సేప్తువజింట్ వర్షన్ అంటారు... 

★రోమన్ బాషలోని అంకెల ప్రకారము LXX అని కూడా పిలుస్తారు... 

★72 మంది పండితులు 72 రోజులలో ఈ అనువాదము పూర్తి చేసిరి... 

★క్రీ.శ. 383లో జేరోమ్ అనే భక్తుడు బైబిలును లాటిన్ బాషలోనికి అనువదించాడు. దీనినే లాటిన్ వల్గేట్  బైబిలు అంటారు... 

★క్రీ.శ. 1384 లో జాన్ విక్లిఫ్ బైబిలును ఇంగ్లీషు లోనికి తర్జుమా చేసినాడు... 

◆దీనిలో మొత్తము 80 పుస్తకములు కలవు. (పాత నిబంధన + క్రొత్త నిబంధన + అపోక్రిప) 

★క్రీ.శ. 1522 లో మార్టిన్ లూధర్ క్రొత్త నిబంధన జర్మనీ బాషలో చేసెను... 

★క్రీ.శ. 1526 లో విలియం టిండెల్ క్రొత్త నిబంధన ఇంగ్లీషులో ముద్రించెను... 

★క్రీ.శ. 1611 లో కింగ్ జేమ్స్ బైబిలు ఇంగ్లీషులో ముద్రించెను... 

■బైబిలు తర్జుమా - తెలుగు
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
★క్రీ.శ. 1727 లో జర్మన్ లూధరన్ మిషనరీ బెంజిమిన్ షూల్జ్ తెలుగులో క్రొత్త నిబంధన అనువాదము చేసారు...

★క్రీ.శ. 1732 లో జర్మన్ లూధరన్ మిషనరీ బెంజిమిన్ షూల్జ్ తెలుగులో పాత నిబంధన అనువాదము చేసారు... 

★క్రీ.శ. 1742 లో జర్మనీకి చెందిన ఫిలిప్ ఫెబ్రీషియన్ తెలుగులో అనువాదము చేసారు... 

★క్రీ.శ. 1795 లో కెప్టెన్ జేమ్స్ డాడ్స్ స్కాటిష్ అధికారి తెలుగులో అనువాదము చేసారు... 

★ఈ పైన పేర్కొన్న ఏ అనువాదము కూడా ముద్రణకు నోచుకోలేదు... 

★క్రీ.శ. 1805 – 1811 వరకు విలియం కెరీ బృందము తెలుగు అనువాదము చేసారు... 

★క్రీ.శ. 1812 లో వారి ప్రెస్ అగ్ని ప్రమాదానికి గరి అయి అనువాద ప్రతి కాలిపోయేను... 

★క్రీ.శ. 1818 లో మరలా అనువదించి క్రొత్త నిబంధన ప్రచురించిరి... 

★క్రీ.శ. 1821 లో పంచ కాండములు ముద్రించిరి... 

★క్రీ.శ. 1854 లో పాత నిబంధన ముద్రించిరి... 

★క్రీ.శ. 1857 లో తొలి సంపూర్తి బైబిలు పాత, క్రొత్త నిబంధనలతో మద్రాసు ఆక్సలరీ వారు ముద్రించారు... 

★క్రీ.శ. 1911, 1953 లో తెలుగు బైబిలునకు భాష సవరణలు జరిగాయి... 

ఇది మన బైబిల్ యొక్క చరిత్ర, మరియు వివరణ 

హల్లెలూయ...*
*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*
*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*
➖➖➖➖➖➖➖➖

✴️✴️✴️✴️✴️✴️✴️✴️✴️✴️
📖 నిజమైన దైవ గ్రంధం బైబిల్ 📖 
♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️
1) మహాదేవుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, ముల్లోకాల చక్రవర్తి అయిన దేవునికి స్తోత్రములు మరియు పరిశుద్ధులైన మీ అందరికీ, మన ప్రభువునూ పరిశుద్ధుడునైన క్రీస్తు యేసు ఉన్నతమైన, రక్షించ శక్తిగల నామములో శుభములు వందనములు 

నేడు మనిషి తన ముందున్న ప్రకృతిని అణువణువునా పరిశీలించి పరిశోధిస్తున్నాడు. కానీ తన గురించి తన బ్రతుకు పరమార్ధం గురించి తెలుసుకోనకుండా చని పోతున్నాడు. మనిషిలోని  దైవత్వాన్ని మేల్కొలుపుతూ.... దేవుని దగ్గరకు చేర్చడానికి మనిషి మట్టి మెదడుకు ఉన్న జ్ఞానం సరిపోతుందా? సరిపోదు. అందుకే మానవ శాస్త్రాలను తలదన్నే సత్య వేద గ్రంధమైన బైబిల్ నుండి ఎంతో నేర్చుకోవాలి. బైబుల్ ఎంత గొప్పదో, దానికి వున్న ప్రాముఖ్యత ఏలాంటిదో, అది మనిషికి ఏలాంటి మార్గాన్ని చూపుతుందో తెలుసుకొనుట ఎంతైనా మంచిది. 

2)🔥 *బైబిల్ అర్థం*📖🔥
🟪🟪🟪🟪🟪🟪🟪🟪🟪🟪
బైబిల్ అను పదానికి *బిబ్లీయా అను గ్రీకు పదం మూలం. బిబ్లీయా అనగా పుస్తకాల సమూహం.* BIBLE = Book of Books (66). బైబిల్ దేవుని మనసు. బైబిల్ మనిషికి పరలోకానికి  ఒక *ఆహ్వాన పత్రిక* (Invitation). తండ్రి తన మనసును తన బిడ్డలకు తెలియజేయాలని వ్రాసిన *స్వర్గలేఖ బైబిల్*. 

బైబిల్ వేర్వేరు ప్రాంతాలకు, కాలాలకు, తరాలకు చెందిన సుమారు 40 మంది ప్రవక్తలు రాసిన ఒకే ఒక దైవ గ్రంధం బైబిల్. 66 పుస్తకాలు రాయడానికి దాదాపు 60 తరాల కాలం పట్టింది. రచయితలు.. ఆయా స్థలాలలో ఉండి రాశారు. 

మోషే అరణ్యంలో... 
యిర్మియా గోతిలో...
దావీదు కొండ ప్రక్కన,రాజనగరులో, చెరసాల
గోడల మధ్య.....
లుకా సముద్రంలోను....
భూమి మీద ప్రయాణం చేస్తూ రాశారు.
యోహాను పత్మాసు ద్వీపమందు పరవాసిగా ఉండగా రాశాడు. 

3)🔥 *విశ్వసనీయమైనది*🔥
🟦🟦🟦🟦🟦🟦🟦🟦🟦🟦🟦
అంతే కాకుండా రచయితలు అత్యధికమైన దుఃఖం సంతోషంలో ఉన్నప్పుడు పరిశుద్దాత్మతో ప్రేరేపించబడి రాశారు.  ఖచ్చితమైన ఆధారాలు ఉన్న శాస్త్ర గ్రంధం బైబిల్. నమ్మదగినది. చారిత్రక భౌగోళిక ఆధారాలు కలిగిన ఒకే ఒక్క గ్రంధం బైబిల్. 

మహాత్ములైన
అబ్రహం లింకన్...
మదర్ తెరిసా.... మహాత్మాగాంధీ....
లాంటివారికి మార్గదర్శక గ్రంధం బైబిల్. 

*ముద్రణా యంత్రం కనుగొన్న తర్వాత మొట్టమొదటిగా ముద్రించబడిన గ్రంధం బైబిల్*. 

అన్ని భాషల్లోకి తర్జుమా చేయబడిన ఏకైక గ్రంధం బైబిల్. అంతే కాకుండా ప్రపంచంలో అనేకుల చేత (46.6℅ మంది) విశ్వసింపబడిన గ్రంధరాజంగా పేరెన్నికగన్నది. ఒక రాష్ట్రం ఒక దేశం కాకుండా ఆఫ్రికా ఆసియా యూరప్ ఖండాల్లో హీబ్రు గ్రీకు ఆరామిక్ భాషలో వ్రాయబడిన, అనేకుల చేత ఆస్వాదించబడే ఒకే ఒక పుస్తకమే బైబిల్. 

4)🔥 *బైబిల్లో శాస్త్రాలు* 🔥
🟩🟩🟩🟩🟩🟩🟩🟩🟩🟩🟩
బైబిల్లో చట్టం కలదు కానీ అది చట్ట సంబంధ పుస్తకం కాదు. బైబిల్ లో చరిత్ర కలదు కానీ అది History పుస్తకం కాదు. బైబిల్లో భూగోళశాస్త్రం కలదు కానీ అది Geography కాదు. బైబిల్ లో జంతుశాస్త్రం కలదు కానీ అది Botany కాదు. బైబిల్లో ఖగోళ శాస్త్రం కలదు కానీ అది Astronomy కాదు. 

5)🔥 *బైబిల్ యధార్ధత* 🔥
🟧🟧🟧🟧🟧🟧🟧🟧🟧🟧
మానవుడు జ్ఞానవంతుడు...బైబిల్ అతనికి నీతిమార్గము చూపిస్తుంది.
మనిషి రోగములు బాధలు అనుభవించువాడు...బైబిల్ తనకు ఒక గొప్ప వైద్యుని చూపిస్తుంది. మానవుడు పాపాత్ముడు...బైబిల్ తనకు దయామయుణ్ణి పరిచయం చేస్తుంది. మానవుడు భక్తిపూరితుడు....బైబిల్ నిజ దేవుని చూపించును. 

నిరుత్సాహపడితే.....ధైర్యాన్నిస్తుంది.
బలహీనులకు.... బలం ఇస్తుంది.
దుఃఖపడు వారిని ఓదారుస్తుంది.
నిరాశ చెందిన వారికి నిరీక్షణ ఇస్తుంది.
వర్తమాన భూత భవిష్యత్కాలములలో మానవునికి దారిచూపు నది బైబిల్. 

6)🔥 *అధికారం కలిగినది*🔥
🟥🟥🟥🟥🟥🟥🟥🟥🟥🟥
బైబిల్ సలహాలు ఇవ్వదు, అభిప్రాయాలు వెలిబుచ్చదు. క్షమాపణలు సవరణలు చెయ్యదు. దేవుడు సెలవిచ్చిన దేమనగా... అంటుంది. *బైబిల్ సాక్షాత్తు దేవుని మాట*. లేఖనములన్నియు దైవ ప్రేరేపణలు అoటుంది. ఏమి తీయ వద్దు ఏమీ కలప వద్దు అని ఖండితంగా ఆజ్ఞాపిస్తుంది. ఇలా చేయండి లేకపోతే శిక్ష తప్పదు అంటుంది. చివరి పేజీలో *సమాప్తము* అని వ్రాయబడింది. అనగా ఇక లేదు సంపూర్ణమైనది అని అర్థం. *(ఏ గ్రంధం యొక్క సపోర్ట్ ఈ గ్రంధానికి అవసరం లేదు. సశేషం)* 

7)🔥 *ఐక్యత, పొందిక* 🔥
◼️◼️◼️◼️◼️◼️◼️◼️◼️◼️
లోకమంతటిపై దాని ప్రభావం ఉంది. 40 మంది రాసినా ఐక్యతగా, పొందికగా వందలకొలది (Controversial) వివాదాత్మకు విషయాలను క్రమబద్ధంగా వివరిస్తుంది. 

*ఉదాహరణకు*
మీరు కోరిన ఒక విషయం మీద ఎవరైనా 10 మంది రచయితలను తీసుకోండి. వారి (ఒక్క టాపిక్ పై వారికిచ్చిన) రచనలను ఒకే సంపుటిలో పెట్టండి. మనకు కనిపించేది ఏమిటి? కలగూరగంప. పొంతన లేని అభిప్రాయాలు కనిపిస్తాయి. కానీ బైబిల్ అలాంటి పుస్తకం కాదు.

8)🔥 *నిలిచి ఉన్నది* 🔥
💠💠💠💠💠💠💠💠💠
ఈ సత్య వేద గ్రంధాన్ని రూపుమాపుటకు ఎన్నో ప్రయత్నాలు జరిగినా.... అది ఇప్పటికీ నిలిచే ఉంది. రాజులు అధికారులు అహంకారముతో దీనిని సమూలంగా నాశనం చేయభూనుకున్నారు. కానీ వారు మరణించారు.... గ్రంథం నిలిచే ఉంది. బైబిల్ విచిత్రమైనది. శతాబ్దాల తరబడి పరిశోధించబడుతూ ముక్కలుగా విరవబడి కోయబడి దూషించబడి కాల్చబడి తిరస్కరించబడింది. అయినప్పటికీ *చెక్కుచెదరని జిబ్రాల్టర్ శిలలాగా నిశ్చలంగా నిలబడి ఉంది.* దీని ప్రచారం అధికమైంది. ముందు కన్నా ఇప్పుడు ప్రేమించబడుతూ... ఆధరింపబడుతూ... ఆచరించబడుతూ... ప్రకటించబడుతుంది. యుగాల శతాబ్దాల తరబడి విశ్వాస బ్రష్త్తుల సుత్తెలు ఈ గ్రంథాన్ని కొడుతున్నా.....అవి అరిగి పోయాయి కానీ వారు కూడా మరణించారు అంతరించారు కానీ గ్రంథం నిలిచే ఉంది. ఇది దేవుని గ్రంథం కానట్లయితే దీనిని మానవులు ఏనాడో రూపుమాపి ఉండేవారు. ఇంకా ఏమని చెప్పాలంటే బైబిల్ దేవుని గ్రంథం కాకపోతే మానవుడు దాన్ని రూపుమాపడానికి ఇంత కంకణం కట్టుకునే వారు కాదు. 

9)🔥 *పరిశుద్ధతకు ముఖ్యస్థానం* 🔥
🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷
పూర్తిగా నైతికమైన బోధలు. పాపం చేయకుండా జీవించుటయే దీని ముఖ్య ఉద్దేశం. *క్రీస్తు నాలో పాపం ఉన్నది అని ఎవరు నిరూపించగలరు?* అని సవాలు చేశాడు. పౌలు క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుంది. *బైబిల్ లో గల వ్యక్తుల రచయితల యొక్క తప్పులను పాపాలను బైబిల్ ఖండిస్తుంది. బుద్ధి కలిగేలా బోధిస్తుంది.* 

*ఉదా*-- 

*దావీదుచే హత్య, వ్యభిచారం...*
*పేతురు బొంకు.....*
*యోనా అవిధేయత...* *తోమా అవిశ్వాసం.....* ఇవేవీ కప్పి పుచ్చలేదు. 

10)🔥 *మిశ్రితము సరళత* 🔥
🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶
బైబిల్ కష్టమైన రచన కాదు. దీని భాష తేలికైనది. కొన్నిసార్లు పురాతనమైనది. అయినా ఎంతో అఘాధమైనది. గొప్ప విద్యావంతులైన పండితులను సైతం దాని పరిశోధనలో జీవితమంతా చాలీనంత ఎంత పని పెట్టగలదు. 

11)🔥1500 సంవత్సరాల కాలం 40 మంది రాసినప్పటికీ, అందులో ఏ మాత్రం పరస్పర విరుద్ధమైన సంగతులు లేకపోవటం ఆశ్చర్యకరం. (కానీ అర్థం కాక, అర్థం చేసుకొని సామర్థ్యం లేక అపార్దమ్ చేసుకునేవారు అనేకులు) దాన్ని రాసిన వారు అందరూ రకరకాల వృత్తులు వారు రాజులు, రైతులు, తత్వవేత్తలు, చేపలు పట్టే జాలర్లు, పశువుల కాపరులు, కవులు, పండితులు, వైద్యుడు, పన్ను కట్టించుకోనే అధికారి, యూదామత గురువు... కూడా అందులో ఉన్నారు. 26 పుస్తకాలు ఎంతో విశేషమైన ప్రేరేపితాలు. ఎందుకంటే 40 మంది రచయితల కలములు, చేతి వేళ్ళు దేవుని వాక్యమును ప్రత్యక్ష ప్రత్యక్షపరచటానికి దేవుడు వాడుకున్నాడని కచ్చితంగా చెప్పవచ్చు. 66 పుస్తకాలను ఓకే గ్రంథంలోని అధ్యాయాలుగా భావించవచ్చు. ప్రతి అధ్యాయానికి ఒక సామాన్య అంశం ఉంది. అది *_పూలదండలో దారం లాగా అన్నిపూలను కలిపే ఆ దారం, ఆధారం, ఆ అంశం యేసు. ఆయనే ఆదియు అంతము లేనివాడు._* 

12)🔥 *చారిత్రక ఆధారాలు* 🔥
✴️✴️✴️✴️✴️✴️✴️✴️✴️✴️
10000 లాటిన్, 5300 New Testament పురాతన గ్రీకు వ్రాతప్రతులు, 9300 ఇతర రచనలు దొరికినవి. New Testament 24000 వ్రాతప్రతులు ఆధారాలున్నాయి. హిస్టారికల్ జియోగ్రాఫికల్ జియోలాజికల్ పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. *బుక్స్ ఎక్జిబిషన్ లో ఒక బుక్ గా మిగిలిపోతుంది అని కామెంట్ చేసిన చరిత్రకారుడు ఓల్టేర్ ఇంట్లో బైబిల్ ని ముద్రించుటకు ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేయబడింది*. Encyclopedia Britanica యొక్క 15 వ సంచిక (1974) యేసును గూర్చి వివరించడానికి 20000 పదాలను ఉపయోగించింది. అరిస్టాటిల్ సిసిరో అలెగ్జాండర్ జూలియస్ సీజర్ మహమ్మద్ నెపోలియన్, వీరిలో ఎవరికైనా ఇచ్చిన స్థలము కంటే ఇది ఎంతో ఎక్కువ. విభిన్న దేశాలు ఈజిప్ట్ ఇజ్రాయెల్ బాబిలోనియా ఇరాక్ ఏథెన్స్ రోమ్ అలెగ్జాండ్రియా మరియు భుజనులందరి గూర్చి అనేక ప్రవచనాలు కలవు. 

13)🔥 *బైబిల్ ఒక పజిల్*🔥
🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺
అన్ని పుస్తకాల మాదిరిగా దీన్ని చదివితే గత చరిత్ర తెలుస్తుంది. కానీ అందలి దాగి ఉన్న దేవుని మనసునీ గానీ నీతిని గాని తెలుసుకోవాలంటే పజిల్ లాగా బైబిల్ ని చదవాలి. అందుకే దేవుడు రాయించారు.. *కొంత ఇచ్చట, కొంత అచ్చట అని.* అదే దాని ప్రాముఖ్యత. 

14)🔥 *విమోచన సందేశం*🔥
🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻
దేవుడు మానవులను రక్షించుటకు చేసిన ఏర్పాటు...
క్రీస్తును మానవులందరి కొరకు బలియాగం చేయటం.✝ 

*_మనం ఎక్కడ నుండి వచ్చామో.....?🐾_* *_ఇక్కడ ఎందుకున్నామో.......?_*👫
*_ఎక్కడికి వెళుతున్నామో.....?_*🏃🏾🏃🏾‍♀️ 

చెప్పే ఏకైక గ్రంథం బైబిల్.📖 

కనుక... 

*_బైబిల్ ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని తెలుసుకొని.....నిన్ను నువ్వు మలుచుకొని.....పరిశుద్ధునిగా మసులుకొని.....పరలోకాన్ని చేరుకొని.....కన్న తండ్రితో ఆనందించాలని ఆశిస్తూ..._

🛑🛑🛑🛑🛑🛑🛑🛑🛑🛑
*పుస్తకం Vs. రచయితలు* 
♻️♻️♻️♻️♻️♻️♻️♻️
1) ఆదికాండము: మోషే
2) నిర్గమ: మోషే
3) లేవీయకాండము: మోషే
4) సంఖ్య కాండము: మోషే
5) ద్వితీయోపదేశకాండము: మోషే
6) జాషువా: జాషువా
7) న్యాయధిపతులు: సమూయేలు
8) రూత్: సమూయేలు
9) 1 సమూయేలు: సమూయేలు; గాదు; నా తా ను 
10) 2 సమూయేలు: గాడ్; నా తా ను 
11) 1 రాజులు: యిర్మీయా
12) 2 రాజులు: యిర్మీయా
13) 1 దిన వృత్తాంతము లు: ఎజ్రా
14) 2 దిన వృత్తాంతము లు: ఎజ్రా
15) ఎజ్రా: ఎజ్రా
16) నెహెమ్యా: నెహెమ్యా
17) ఎస్తేర్: మొర్దెకై
18) యోబు: మోషే
19) కీర్తనలు: దావీదు మరియు ఇతరులు
20) సామెతలు: సొలొమోను; Agur; లేముఎల్
21) ప్రసంగి: సొలొమోను
22) సొలొమోను పాటలు: సొలొమోను
23) యెషయా: యెషయా
24) యిర్మీయా: యిర్మీయా
25) విలాప వ్యాక్యములు: యిర్మీయా
26) యెహెజ్కేలు: యెహెజ్కేలు
27) దానియేలు : దానియేలు
28) హోషీయా: హోషీయా
29) యోవేలు: యోవేలు
30) అమోసు : అమోసు
31) ఓబద్యా: ఓబద్యా
32) యూనా : యోనా
33) మీకా: మీకా
34) నహుము: నహుము 
35) హబక్కుకు : హబక్కుకు 
36) జెఫన్యా: జెఫన్యా
37) హగ్గయి : హగ్గయి
38) జెకర్యా: జెకర్యా
39) మలాకీ: మలాకీ
40) మత్తయి: మత్తయి
41) మార్క్: మార్క్
42) లూకా: లూకా
43) యోహాను: అపొస్తలుడైన యోహాను
44) అపోస్థలుల కార్యాలు : లూకా
45) రోమీయులకు : పౌలు
46) 1 కొరింథీయులు: పౌలు
47) 2 కొరింథీయులు: పౌలు
48) గలతీయులు: పౌలు
49) ఎఫెసీయులు: పౌలు
50) ఫిలిప్పీయులు: పౌలు
51) కొలొస్సయులు: పౌలు
52) 1 థెస్సలొనీకయులు: పౌలు
53) 2 థెస్సలొనీకయులు: పౌలు
54) 1 తిమోతి: పౌలు
55) 2 తిమోతి: పౌలు
56) తీతుకు : పౌలు
57) ఫిలేమోన్: పౌలు
58) హెబ్రీయులు: తెలియదు
59) జేమ్స్: జేమ్స్ (యేసు సోదరుడు)
60) 1 పేతురు: పీటర్
61) 2 పేతురు: పీటర్
62) 1 యోహాను: అపొస్తలుడైన యోహాను
63) 2 జాన్: అపొస్తలుడైన యోహాను
64) 3 యోహాను: అపొస్తలుడైన యోహాను
65) యూదా : యూదా (యేసు సోదరుడు)
66) ప్రకటన: అపొస్తలుడైన యోహాను 

* బైబిల్ గణాంకాలు *
♥️♥️♥️♥️♥️♥️♥️♥️
* అద్భుతమైన బైబిల్ వాస్తవాలు మరియు గణాంకాలు *
♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️
బైబిల్లోని పుస్తకాల సంఖ్య: * 66 *
అధ్యాయాలు: 1,189
వాక్యాలు : 31,101
పదాలు: 783,137
అక్షరాలు: 3,566,480
బైబిల్లో ఇచ్చిన వాగ్దానాల సంఖ్య: 1,260
ఆజ్ఞలు: 6,468
ప్రవచనాలు: 8,000 కన్నా ఎక్కువ 

👉🏼 నెరవేర్చబడిన ప్రవచనాలు: 3,268 వాక్యాలు
నెరవేరని ప్రవచనాలు : 3,140
ప్రశ్నల సంఖ్య: 3,294
పొడవైన పేరు: మహేరు షాలాల్‌ హాష్‌ బజ్‌, (యెషయా 8: 1)
పొడవైన వచనం: ఎస్తేర్ 8: 9 (78 పదాలు)
👉🏼 చిన్నదైన పద్యం: యోహాను 11:35 (2 మాటలు: "యేసు కన్నీళ్లు విడిచినాడు".
👉🏼 మధ్య పుస్తకాలు: మీకా మరియు నహుమ్
👉🏼 మధ్య అధ్యాయం: కీర్తన 117
👉🏼 చిన్న అధ్యాయం (వచనం సంధ్య ద్వారా): 117 వ కీర్తన (వాహనాల సంఖ్య ద్వారా)
పొడవైన పుస్తకం: కీర్తనలు (150 అధ్యాయాలు)
👉🏼 చిన్న పుస్తకం (పదాల సంఖ్య ప్రకారం): 3 యోహాను
పొడవైన అధ్యాయం: కీర్తన 119 (176 వాక్యాలు )
"దేవుడు" * అనే పదం ఎన్నిసార్లు కనిపిస్తుంది: 3,358
"ప్రభువు" * అనే పదం ఎన్నిసార్లు కనిపిస్తుంది: 7,736
వేర్వేరు రచయితల సంఖ్య: 40
భాషలు 1,200 కు పైగా బైబిల్ అనువదించబడిన భాషల సంఖ్య 

* పాత నిబంధన గణాంకాలు: *
♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️
పుస్తకాల సంఖ్య: 39
అధ్యాయాలు: 929
వచ నాల సంఖ్య: 23,114
పదాలు: 602,585
అక్షరాలు: 2,278,100
👉🏼 మధ్య పుస్తకము: సామెతలు
👉🏼 మధ్య అధ్యాయం: yobu 20
👉🏼 మధ్య వచనం 2 దినవృత్తాంతములు 20: 17,18
అతిచిన్న పుస్తకం: ఓబద్యా
చిన్నదైన వచనం: 1 దినవృత్తాంతములు 1:25
పొడవైన వచనం: ఎస్తేర్ 8: 9 (78 పదాలు)
పొడవైన అధ్యాయం: కీర్తనలు 119 

* క్రొత్త నిబంధన గణాంకాలు: *
🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶
పుస్తకాల సంఖ్య: 27
అధ్యాయాల సంఖ్య: 260
వాహనాల సంఖ్య: 7,957
పదాలు: 180,552
అక్షరాలు: 838,380
👉🏼 మధ్య పుస్తకము: 2 థెస్సలొనీకయులు
👉🏼 మధ్య అధ్యాయాలు: రోమన్లు 8, 9
👉🏼 మధ్య వచనం అపొస్తలుల కార్యములు 27:17
చిన్న పుస్తకం: 3 యోహాను
👉🏼 చిన్న వచనం యోహాను 11:35
పొడవైన వచనం: ప్రకటన 20: 4 (68 పదాలు)
పొడవైన అధ్యాయం: లూకా 1 

బైబిల్లో 8,674 వేర్వేరు హీబ్రూ పదాలు ఉన్నాయి, 5,624 భిన్నమైనవి గ్రీకు పదాలు మరియు కింగ్ జేమ్స్ వెర్షన్‌లో 12,143 వేర్వేరు ఆంగ్ల పదాలు. 

సుమారు 40 మంది రచయితలు రాసిన బైబిల్
1,600 సంవత్సరాల కాలంలో వ్రాయబడింది
40తరాలకు పైగా వ్రాయబడింది. ఆదిమ  హిబ్రూ, గ్రీక్ మరియు అరామిక్ అనే మూడు భాషలలో వ్రాయబడింది మరియు మూడు ఖండాలలో వ్రాయబడింది: యూరప్, ఆసియా మరియు ఆఫ్రికా
వేర్వేరు ప్రదేశాలలో వ్రాయబడింది: అరణ్యం, చెరసాల, అంతపురము, జైలు, ప్రవాసంలో, ఇంట్లో
అన్ని వృత్తుల నుండి పురుషులు రాశారు: రాజులు, రైతులు, వైద్యులు, మత్స్యకారులు, పన్ను వసూలు చేసేవారు, పండితులు మొదలైనవారు.

వేర్వేరు సమయాల్లో వ్రాయబడింది: యుద్ధం, శాంతి, పేదరికం, శ్రేయస్సు, స్వేచ్ఛ మరియు బానిసత్వం.విభిన్న మనోభావాలలో వ్రాయబడింది: నిరాశ యొక్క లోతుల వరకు ఆనందం యొక్క ఎత్తులు వైవిధ్యభరితమైన విభిన్న విషయాలపై మరియు సిద్ధాంతాలపై సామరస్యపూర్వక ఒప్పందంలో వ్రాయబడింది. 

బైబిల్లో 10 పొడవైన పుస్తకాలు *
🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺
1) కీర్తన - 150 అధ్యాయాలు, 2,461 వాక్యాలు, 43,743 పదాలు
2) యిర్మీయా - 52 అధ్యాయాలు, 1,364 వాక్యాలు, 42,659 పదాలు
3) యెహెజ్కేలు - 48 అధ్యాయాలు, 1,273 వాక్యాలు, 39,407 పదాలు
4) ఆదికాండము - 50 అధ్యాయాలు, 1,533 వాక్యాలు, 38,267 పదాలు
5) యెషయా - 66 అధ్యాయాలు, 1,292 వాక్యాలు, 37,044 పదాలు
6) సంఖ్య  కాండం 36 అధ్యాయాలు, 1,288 వాక్యాలు, 32,902 పదాలు
7) నిర్గమ - 40 అధ్యాయాలు, 1,213 వాక్యాలు, 32.602 పదాలు
8) ద్వితీయోపదేశకాండము - 34 అధ్యాయాలు, 959 వాక్యాలు, 28,461 పదాలు
9) 2 దిన - 36 అధ్యాయాలు, 822 వాక్యాలు, 26,074 పదాలు
10) లూకా - 24 అధ్యాయాలు, 1,151 వాక్యాలు, 25,944 పదాలు 

* బైబిల్లో 10 చిన్న పుస్తకాలు *
🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻
1) 3 యోహాను - 1 అధ్యాయం, 14 వాక్యాలు, 299 పదాలు
2) 2 యోహాను - 1 అధ్యాయం, 13 వాక్యాలు, 303 పదాలు
3) ఫిలేమోను - 1 అధ్యాయం, 25 వాక్యాలు, 445 పదాలు
4) యూదా - 1 అధ్యాయం, 25 వాక్యాలు, 613 పదాలు
5) ఓబద్యా - 1 అధ్యాయం, 21 వాక్యాలు, 670 పదాలు
6) తీతుకు - 3 అధ్యాయాలు, 46 వచనం సంఖ్య 921 పదాలు
7) 2 థెస్సలొనీకయులు - 3 అధ్యాయాలు, 47 వచనం సంఖ్య, 1,042 పదాలు
8) హగ్గయి - 2 అధ్యాయాలు, 38 వచనం సంఖ్య, 1,131 పదాలు
9) నహుము - 3 అధ్యాయాలు, 47 వచనాలు, 1,285 పదాలు
10)యోనా - 4 అధ్యాయాలు, 48 వచనాల  సంఖ్య 1,321. 


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...