ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

క్రిస్మస్ సందేశాలు

✳ *క్రిస్మస్ సందేశాలు* ✳

(8 వ భాగము )

*యేసు పుట్టుక దేవుని మహిమ కొరకే*

_(లూకా 2:14 సర్వోన్నతమైన స్థలములలో *దేవునికి మహిమ..*)_

పై వాక్యంలో యేసు క్రీస్తు ఈలోకానికి వచ్చిన ఉద్దేశ్యం స్పష్టంగా కనబడుచున్నది. యేసు పుట్టుక *దేవునికి గొప్ప మహిమను* చేకూర్చేదని మనం గమనించాలి. యేసు వచ్చినది ఈ ఉద్దేశాన్ని నెరవేర్చడం కోసమే (యోహాను 17:4  చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమిమీద *నిన్ను మహిమ పరచితిని*).

దేవునికి మహిమ కలిగించుటకే యేసు ఈ లోకానికి వచ్చాడు. కారణం దేవునికి రావలసిన మహిమ సాతాను తనకు అపాదించుకొంటూ సర్వమానవులను రకరకాల విగ్రహారాధనతో మోసం చేస్తున్నాడు. (యెషయా 42:8 యెహోవాను నేనే; ఇదే నా నామము మరి ఎవనికిని *నా మహిమను నేనిచ్చువాడను కాను* నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెంద నియ్యను.) 

కనుక యేసు ఈ లోకానికి వచ్చి తన జీవితం ద్వారా అద్భుతమైన రీతిగా దేవునికి మహిమను కలిగించాడు.

క్రీస్తును పోలి, దేవుని బిడ్డలమైన మనం కూడా  ఏ పని చేసినా దాని యొక్క అత్యున్నతమైన ఉద్దేశం *దేవునికి మహిమ* కలగడమేనని గ్రహించాలి. విశ్వాసి ప్రవర్తన అంతటినీ ఏలవలసిన గొప్ప నియమం ఇది. 

విశ్వాసులు ఏమి చేసినా *దేవునికి మహిమ* కలిగించడానికే అన్నీ చేయాలని పౌలు భక్తుడు స్పష్టంగా చెప్పుచున్నాడు.  (1కొరి10:31  కాబట్టి మీరు భోజనముచేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును *దేవుని మహిమ* కొరకు చేయుడి.) 

విశ్వాసులంతా *దేవునికి మహిమ* కలుగు రీతిగా జీవిస్తే సంఘంలో చీలికలు, గుంపులు ఉండవు. విశ్వాసుల్లో అవినీతి ఉండదు, ఇతర విశ్వాసులను విమర్శించడం ఉండదు. ఇతరుల్ని అనాలోచితంగా బాధపెట్టే పనులు ఉండవు. మన చర్యలన్నిటినీ ఈ వాక్యపు వెలుగులో పరీక్షిస్తూ చూసుకుంటే, ఫర్వాలేదులే అనుకున్న అనేకమైన వాటిని మనం మానుకుంటాం. తద్వారా దేవునికి మన జీవితాల ద్వారా అద్భుతమైన *మహిమను* కలిగించిన వారమవుతాం. 

మనమందరం దేవునిని మహిమపరచాలని ఆయన కోరుకుంటున్నాడు. అసలు మనం సృజించబడినది *దేవుని మహిమ నిమిత్తమే.* (యెషయా 43:7  నా మహిమ నిమిత్తము నేను సృజించినవారిని నా నామము పెట్టబడిన వారినందరిని తెప్పించుము నేనే వారిని కలుగజేసితిని వారిని పుట్టించిన వాడను నేనే.)

సర్వసృష్టి *దేవుని మహిమ* పరచుచుండగా ఆయన బిడ్డలమైన మనం దేవునికి మహిమకరంగా జీవించలేక పోవడం విచారకరం. (కీర్తన 19:1 ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచుర పరచుచున్నది; 29:2 యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును  ఆయనకు ఆరోపించుడి ప్రతిష్ఠితములగు ఆభరణములను ధరించుకొని ఆయన  యెదుట సాగిల పడుడి. ప్రకటన 4:11  ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి; నీ చిత్తమునుబట్టి అవి యుండెను; దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద నర్హుడవు.)

దేవుని ఎలాగు మనం మన ఆత్మీయ జీవితాల ద్వారా మహిమ పర్చగలం.

*1. వాక్యపు వెలుగులో మన జీవితాలను కాచుకుంటే దేవునికి మహిమ:* అలనాడు గొల్లలు తనం మందలను అనగా తన ఆత్మీయ జీవితాలను కాచుకుంటూ ఉండగా వారిచుట్టూ *దేవుని మహిమ* ప్రకాశించింది. (లూకా 2:8-9  ఆ దేశములో కొందరు గొఱ్ఱల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారియొద్దకు వచ్చి నిలిచెను; *ప్రభువు మహిమ* వారిచుట్టు ప్రకాశించినందున..) 

మన ఆత్మీయ జీవితాలు ప్రభువునకు మహిమకరంగా ఉన్నాయా? పరీక్షించుకుందాం.

*2. దేవుని సేవ సంపూర్ణంగా చేయుట ద్వారా దేవునికి మహిమ:* అలనాడు మోషే ప్రత్యక్ష గుడారమునకు సంబంధించిన పనులన్నీ సంపూర్తి చేయగా దేవుని మహిమ గుడారములోనికి దిగివచ్చెను. (నిర్గ40:33 .. ఆలాగున మోషే పని సంపూర్తి చేసెను. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును  కమ్మగా *యెహోవా తేజస్సు మందిరమును* నింపెను.) 

మన సేవ దేవునికి మహిమకరంగా ఉందా? పరీక్షించుకుందాం.

*3. దేవునికి మన హృదయాలు బలిగా అర్పించుట ద్వార దేవునికి మహిమ రాగలదు:* అలనాడు సోలోమోను మందిరం ముందర నిలువబడి లెక్కింప శక్యంగాని బలులు అర్పించగా (1రాజు 8:5) దేవుని మహిమతో మందిరం నిండెను. (1రాజు 8:10-11  యాజకులు పరిశుద్ధస్థల ములోనుండి బయటికి వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను. కాబట్టి యెహోవా తేజోమహిమ యెహోవా మందిర ములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువుచేత యాజ కులు సేవచేయుటకు నిలువలేక పోయిరి.) 

మన హృదయాలు దేవునికి మహిమకరంగా బలి అర్పించబడినవా? పరీక్షించుకుందాం.

*4. ప్రభువుయందు మనము నిలిచి యుండుట ద్వార దేవునికి మహిమ:* యేసులో మనం నిలువబడినప్పుడు మనం జీవితాలు ఫలించడమే కాకుండా దేవునికి మహిమ కలుగగలదు. (యోహాను 15:7-8  నాయందు మీరును మీయందు నా మాటలును నిలిచియుండినయెడల మీకేది యిష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింప బడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును.) 

మనం ప్రభువులో నిలబడి దేవునికి మహిమకరంగా ఉన్నామా? పరీక్షించుకుందాం.   

*5. శ్రమలతో కూడిన జీవితం ద్వారా దేవునికి మహిమ రాగలదు:* క్రీస్తు శ్రమలతో కూడిన తన జీవితం ద్వారా దేవునికి మహిమ కలిగించాడు. మనం కూడా క్రీస్తుతోపాటు మహిమ పొందేందుకు ఆయనతోపాటు బాధలు అనుభవించే వారమైతే మనం దేవుని మహిమను పొందగలం. (రోమా 8:17  మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము; క్రీస్తుతో కూడ *మహిమ పొందుటకు* ఆయనతో శ్రమపడిన యెడల, క్రీస్తుతోడి వారసులము.) 

శ్రమలలో వెరువకుండా మన జీవితం దేవునికి మహిమకరంగా ఉందా? పరీక్షించుకుందాం.

*6. రూఢియైన విశ్వాసం ద్వారా దేవునిని మహిమ పరచగలం:* అలనాడు అబ్రహాం తన రూఢియైన విశ్వాసం ద్వారా దేవుని మహిమమ పరచాడు తద్వారా విశ్వాసమువలన బలము పొందుకున్నాడు. (రోమా 4:21  *దేవుని మహిమపరచి*, ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమువలన బలము నొందెను.) 

రూఢియైన విశ్వాసం ద్వారా మన జీవితం దేవునికి మహిమకరంగా ఉందా? పరీక్షించుకుందాం.

*7. ప్రార్ధన ద్వారా దేవుని మహిమ పరచగలం:* క్రీస్తును పోలి క్రీస్తువలె శ్రమనొంది క్రీస్తువలె శత్రువులకై ఆత్మ పూర్వకంగా ప్రార్ధించిన స్తెఫను *దేవుని మహిమను* చూడగలిగాడు.  (అపో 7:55  అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై ఆకాశము వైపు తేరిచూచి, *దేవుని మహిమను* యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి యుండుటను చూచి..)  

మన ప్రార్ధనా జీవితం దేవునికి మహిమకరంగా ఉందా? పరీక్షించుకుందాం

ప్రభువు ఈలోకంలో జన్మించినప్పుడు పరలోక మహిమ దిగివచ్చినది. దూత గణము ఎంతో మధురమైన గీతములతో   *సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ* అని ఆరాధించినారు. కారణం ఆయన మహిమ స్వరూపుడు. 

ఆయన జనన వార్త మహిమ సువార్త. ఈ మహిమ సువార్తను ప్రజలందరికి చాటి గొల్లలు ధన్యులయ్యారు. ప్రభువు యొక్క మహిమను అనుభవించారు. ప్రభువును మహిమ పరచేటి ధన్యకరమైన జీవితాలను పరిశుద్ధాత్మ దేవుడు మనకు కూడా  అనుగ్రహించును గాక! ఆమెన్!!

దైవాశ్శీసులు!!!

From the desk of..
Pastor Jyothi Raju Vemula
_(Soli Deo Gloria)_

Immanuel Bible College 
NIDUBROLU

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...