ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

క్రిస్మస్

✳ *.....క్రిస్మస్....* ✳

(పదహారవ  భాగము)

♻ *యేసుక్రీస్తు దైవత్వము* ♻
(ఐదవ భాగము)

✳ *యేసుప్రభులవారు మనతో నివాసం చేయడానికి భూలోకానికి ఎందుకు వచ్చారు?* 

యోహాను 1: 14
*ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణు డుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వి తీయకుమారుని( లేక, జనితైకకుమరుని) మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి.*

    ప్రియులారా! మనం గతకొన్ని రోజులుగా యేసుప్రభులవారి దైవత్వం కోసం ధ్యానం చేస్తున్నాం! ఆయన సృష్టికర్త అనియు, దేవుడు అనియు, యెహోవాదేవుడే శరీరదారిగా యేసుక్రీస్తుగా వచ్చారనియు, ధ్యానించుకొన్నాం! 

🔺 *ఈరోజు యేసుప్రభులవారు మనతో నివాసం చేయడానికి భూలోకానికి ఎందుకు వచ్చారు?* 

*దేవుడు అని బైబిల్ లో ఎక్కడ వ్రాయబడింది ?* అనే విషయాలు ధ్యానించుకొదాం

 అని చాలామంది అడుగుతుంటారు కదా! ఎక్కడ వ్రాయబడి ఉన్నదో చూసుకుందాం!

   గతభాగాలలో మనం ధ్యానం చేస్తూ-  *యేసుప్రభులవారు అనేకసార్లు తండ్రీ-నేను ఏకమైయున్నాము, (యోహాను 10:30), నన్ను చూసినవారు తండ్రిని చూసినట్లే* (యోహాను 14:9), 

👉 అనగా నేనే – తండ్రిని, దేవుణ్ణి అని చెప్పారు. ఇక్కడ కొంతమందికి సందేహం కలుగువచ్చు, అది ఎలా?  ఒకసారి ఆగి ఆలోచిద్దాం! యెషయా 44:2; హెబ్రీ 11:3; కీర్తనలు 33:6 

*సమస్తమును తండ్రియైన దేవునిమూలముగా , ఆయన వాక్కుద్వారా కలిగెను. యోహానుసువార్త మొదటి అధ్యాయం ప్రకారం. ఆ వాక్యము శరీరదారిగా, కృపాసత్య ... మనమధ్య _నివశించెను.* వాక్యము= శరీరదారి, ఇదే వాక్కు సమస్తమును సృష్టించెను!  కావున యేసుప్రభులవారు సృష్టికర్త మరియు దేవుడు! 

 👉  *ఇక ఆ దేవునికి మనుష్యులతో గడపటం ఇష్టం! అందుకే మానవులను చేసుకున్నారు,* అందుకే చల్లనిపూట ఆదాము హవ్వలతో షికారు చేయడానికి ఏదేను వనముకి దేవుడు వచ్చి, వారితో ముచ్చటించేవారు. ఆదికాండం 3:8. అయితే సర్పము/ సాతాను కుయుక్తి వలన మోసపోయి, పాపంలో పడిపోయి, ఆ సహవాసం కోల్పోయాడు మానవుడు. దేవునితో సహవాసం ఆగిపోయింది. అయితే జెకర్యా 2:10 లో దేవుడు మరలా మానవులతో వాగ్దానం చేస్తున్నారు 

*“సీయోను వాసులారా! నేను మీ మధ్య నివాసం చేస్తాను”* ఇదే 
యెహోవావాక్కు!!! *అదే వాక్కు శరీరదారిగా మనమధ్య నివసించెను*. యోహాను 1:14; శరీరదారి అనగా వాక్కు అనగా యేసుప్రభులవారు మనతో నివాసం చేయడానికి భూలోకానికి వచ్చారు. 


🔺 *ఎందుకు వచ్చారు?* 🔺

*1) మానవులతో సహవాసం చేసి, తిరిగి దేవునితో వారిని సమాధాన పరచి, సందిచేసి, దేవునితో సహవాసం/ లింక్ ఏర్పాటు చేద్దామని;* కొలస్సీ 1:20-22;

 *2) వారి పాపాలు తీసివేయాలని;* 

    మరి యెహోవాదేవుడు భూమిమీదకు వచ్చారా? అంటే ఆయనవాక్కు – ఆయన వాక్యము – యేసయ్య రూపంలో శరీరదారిగా భూమిమీదకు రావడం జరిగింది. ఇది ఇంకా బాగా అర్ధం కావడానికి 

*బైబిల్ పండితులు చక్కని ఉదాహరణ చెబుతారు:* ఒక మనిషి గోతిలో పడిపోయి – రక్షించండి అని అరుస్తున్నాడు. మరి ఆవ్యక్తిని గోతిలోనుండి తీయాలి అంటే మరో వ్యక్తి ఆగోతిలోనికి దిగితే పడిన వ్యక్తిని తీయగలడా? తీయలేడు కదా! ఆ వ్యక్తి ఒడ్డున ఉండి, తనచేయి చాపిగాని, ఒక త్రాడు ఇచ్చి గాని ఆ వ్యక్తిని తీయాలి. *ఇక్కడ గోతిలో పడిన వ్యక్తి మానవుడు; ఒడ్డున ఉండి చేయి అందించినది యెహోవాదేవుడు. ఆ చేయి అనగా ఆయనవాక్కు = యేసుప్రభులవారు*!!! ఇదీ బైబిల్ పండితుల వివరణ!! 

   అయితే దురదృష్టవశాత్తు ఆ గొయ్య సాతానుగాడి వశంలో ఉంది! ఇప్పుడు మానవుని రక్షించడానికి వాడు ఒప్పుకోవడం లేదు, *దానికి మూల్యం చెల్లించమన్నాడు, అది ఆయన ప్రాణం, ఆయన రక్తం ! యేసుప్రభులవారు ఆయన రక్తాన్ని, ఆయన ప్రాణాన్ని మానవులకోసం బలిగా ఇవ్వడానికి సంతోషంగా ఒప్పుకున్నారు.* అందుకోసమే ఆయన వచ్చారు! రక్తమిచ్చి, మనల్ని పాపగోతినుండి విడిపించారు, ఆయన చనిపోయారు. సాతానుగాడు గెలిచినట్లు పండగచేసుకున్నాడు, గాని ఆయన మూడవరోజు విజయుడై, లేచి, చెరను చెరగా తీసుకుపోయారు. ఎఫెసీ 4:8; వాడి కబంధహస్తాలలో ఉన్న మానవాళిని విడిపించారు. ఆయన దేవుడు, దైవ మానవుడు; ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు. ఇదీ జరిగింది! జెకర్యా 2:10 ప్రకారం దేవుడు తనవాక్కును పంపించి, మానవులను విడిపించి, మానవులతో సహవాసం చేస్తున్నారు! 


  ఇంతవరకు యేసుప్రభులవారు శరీరదారిగా ఎందుకు వచ్చారో చూసుకున్నాం! ఇక దేవుడు అని ఎక్కడుందో చూసుకుందాం!

🔺 *యేసుక్రీస్తు దేవుడు అని బైబిల్ లో ఎక్కడుంది?* 🔺
 

 ఆయన నోటితోనే నేను- తండ్రి ఏకమైఉన్నాము , నేనే తండ్రిని అని చెబుతున్నా చాలామందికి అర్ధం కావడం లేదు, గాని యూదులకు అర్ధమయ్యింది, అందుకే ఆయనను ఘోరాతిగోరంగా చంపించారు! 
ఇక మనం Direct References చూసుకుందాం!

1). మొదటగా పాతనిబంధన నుండి ధ్యానం చేసుకుందాం! 
యెషయా 9: 6
ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు *కుమారుడు* అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త *బలవంతుడైన దేవుడు* *నిత్యుడగు తండ్రి* సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.

  ఆయన మొదట కుమారుడు = యేసుప్రభువు, తర్వాత *బలవంతుడైన దేవుడు*, చూశారా ఎంత స్పష్టంగా రాయబడిందో, ఆ నిత్యుడగు తండ్రి= యెహోవాదేవుడు. కాబట్టి ఇక్కడ యెహోవాదేవుడే యేసుప్రభులవారుగా జన్మిస్తారు అని కొన్నివందల సం.ల క్రితమే యెషయా గారు ప్రవచించారు!

2) మరలా యోహాను సువార్త మొదటి అధ్యాయము. వాక్యము= దేవుడు; వాక్యము= శరీరదారి = యేసుక్రీస్తు; కాబట్టి దేవుడు= యేసుక్రీస్తు

3) గతభాగంలో చూసుకున్నట్లు , యేసయ్య పునరుత్థానం అనంతరం-తోమాగారికి కలిగిన ప్రత్యక్షత : *నా ప్రభువా! నాదేవా*! ఇక్కడ తోమాగారు యేసుప్రభులవారిని దేవా అనగా నా దేవుడా అని పిలుస్తున్నారు! యోహాను 20:28-29;

4) అపోస్తలుల కార్యములు 20:28 లో లూకాగారు, పౌలుగారు అత్మాభిషేకంతో చెబుతున్న మాటను రికార్డు చేసి రాస్తున్నారు: *దేవుడు తన స్వరక్తమిచ్చి*, సంపాదించిన సంఘము . . ..  ఈ భాగం ప్రకారం తన స్వరక్తమిచ్చినది ఎవరు? ఏ దేవుడు? యేసుప్రభులవారు మాత్రమే!! కాబట్టి ఇక్కడ పౌలుగారు యేసుప్రభులవారిని దేవుడు అని పిలుస్తున్నారు! 

5) రోమీయులకు 9: 5
పితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తువీరిలో పుట్టెను. *ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరముస్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్‌.*
   ఇక్కడ పౌలుగారు యేసుప్రభులవారిని సర్వాదికారియైన దేవుడు అంటున్నారు! ఇది డైరెక్ట్ రెఫరెన్సు కాదా!

6) కొలస్సీ 1:15-17 ఈయన *అదృశ్య దేవుని స్వరూపి* అంటున్నారు. ఇంకా సృష్టికర్త అంటున్నారు. అనగా దేవుడే కదా!

7)  కొలస్సీయులకు 2: 9
*ఏలయనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది*;
 ఇది తిరుగులేని statement!! దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత అనగా దేవుడు ఎప్పుడైనా మానవునిగా మారితే, అది యేసుప్రభులవారే!! 

8) ఫిలిప్పీ 2:6-8; *ఆయన దేవుని స్వరూపము గలవాడైయుండి. . . .* అనగా దేవుని స్వారూపం అనగా దేవుడు, మానవులకోసం పరలోకం వదలి భూలోకానికి వచ్చారు అని స్పష్టముగా రాస్తున్నారు!

9) 1 తిమోతీ 4:10; మనుష్యులందరికీ రక్షకుడు, విశ్వాసులకు రక్షకుడునైన *జీవముగల దేవునియందు* . .. . ఇక్కడ మనుష్యులందరికీ రక్షకుడు ఎవరు? యేసుప్రభులవారు మాత్రమే కదా! ఆయన పేరే యేసుక్రీస్తు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు!! కాబట్టి ఇక్కడ యేసుప్రభులవారిని జీవముగల దేవుడు అని అభివర్ణించారు!

10) 2 పేతురు 1:1 మన దేవునియొక్కయు, రక్షకుడైన యేసుక్రీస్తు . . . ఇక్కడ పౌలుగారే కాదు పేతురు గారు కూడా యేసయ్యను దేవుడు అని పిలుస్తున్నారు!

11) చివరగా తిరుగులేని Direct Super Statement: తీతుకు 2:13 
అనగా *మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు* మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెనని మనకు బోధించుచున్నది.
ఇక్కడ పౌలుగారు *యేసయ్యను దేవుడు అనడం లేదు- మహాదేవుడు* అంటున్నారు!!! Great God and Saviour Jesus Christ. 

   మరి ఇన్ని direct statements/ references ఉంటే ఎక్కడ రాసి ఉంది చూపించండి అని అడుగుతున్నారు కదా, అసలు వీడెప్పుడైనా బైబిల్ చదివితే కదా! దేవునివాక్యం జాగ్రత్తగా చదివి, పరిశీలిస్తే ఇవన్నీ మనకు అర్ధం అవుతాయి గాని ఏదో అలా చదువుకుంటూ పోతే ఏమీ అర్ధం కాదు! 
*కాబట్టి ప్రియ క్రైస్తవులారా! బైబిల్ ప్రతీరోజు చదవండి! అర్ధం చేసుకోండి! ఇలాంటి తప్పుడుబోధలకు, ముఖ్యంగా యెహోవా సాక్షులు లాంటివారికి బుద్ధి చెప్పండి!*  

  పైన ఉదాహరించినట్లు యేసుప్రభులవారు రక్షకుడు, దేవుడు, ప్రభువు,సృష్టికర్త! 

👉 *మరి నీవు ఆయనను నీ రక్షకుడిగా, యజమానిగా, ప్రభువుగా అంగీకరించావా?* అయితే నీవు ధన్యుడవు!! 
ఒకవేళ ఇంకా అంగీకరించలేదా? ఇప్పుడే నీ పాపములు ఒప్పుకుని, నీ సొంత రక్షకునిగా, దేవునిగా అంగీకరించు! 
నీ హృదయం ఆయనకివ్వు! 
ఆయన నిన్ను చేర్చుకోడానికి సిద్ధముగా ఉన్నారు!

*హల్లెలూయ...*

*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*

*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*
➖➖➖➖➖➖➖➖➖➖

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...