✳ *.....క్రిస్మస్....* ✳
(ఇరవై ఐదవ భాగము)
*యేసు పుట్టుక దేవుని మహిమ కొరకే....✍*
లూకా 2:14 సర్వోన్నతమైన స్థలములలో *దేవునికి మహిమ..*
👉పై వాక్యంలో యేసు క్రీస్తు ఈలోకానికి వచ్చిన ఉద్దేశ్యం స్పష్టంగా కనబడుచున్నది. యేసు పుట్టుక *దేవునికి గొప్ప మహిమను* చేకూర్చేదని మనం గమనించాలి.
👉యేసు వచ్చినది ఈ ఉద్దేశాన్ని నెరవేర్చడం కోసమే (యోహాను 17:4 చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమిమీద *నిన్ను మహిమ పరచితిని*).
*దేవునికి మహిమ కలిగించుటకే యేసు ఈ లోకానికి వచ్చాడు.*
👉 కారణం దేవునికి రావలసిన మహిమ సాతాను తనకు అపాదించుకొంటూ సర్వమానవులను రకరకాల విగ్రహారాధనతో మోసం చేస్తున్నాడు.
(యెషయా 42:8 యెహోవాను *నేనే; ఇదే నా నామము మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చువాడను కాను* నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెంద నియ్యను.)
*కనుక యేసు ఈ లోకానికి వచ్చి తన జీవితం ద్వారా అద్భుతమైన రీతిగా దేవునికి మహిమను కలిగించాడు.*
👉మనలో చాలామందికి క్రిస్మస్ జ్ఞాపకాలు చాలావరకు భావోద్రేకాలు ,సంప్రదాయాలకు సంబంధించినవే .
👉ఒక వ్యక్తికి ఈ విషయాలు మానసిక ఆనందం , ఉల్లాసం కలిగించవచ్చు .
👉కాని ఆత్మలో నిజమైన ఆనందాన్ని కలిగించవు .
*నిజమైన , పరిణతి చెందిన విశ్వాసికి వీటితో సంబంధం లేకుండానే క్రీస్తులో ఎడతెగని ఆనందం అనుభవించగలడు*
♻ *అయితే క్రిస్మస్ జరుపుకోవద్దా ?*
👉 తప్పక జరువుకోండి .లోకస్తుల్లా కాదు , *విశ్వాసులకు తగిన విధంగా జరుపుకోండి .*
👉 (అతి)లోకస్తులు క్రిస్మస్ ను బారుల్లోనూ , సినిమా థియేటర్లలోనూ క్లబ్బు ల్లోనూ జరుపుకోగలరు .
👉సాధారణ క్రైస్తవులు ఇంటి ,పంటి , వంటి క్రిస్మస్ లు ఆచరించగలరు . ఈ విధంగా ఆనందించడంలో తప్పేమీ లేదు .ఎదో ఒక సందర్భంలో కుటుంబంలో కలిసి ఆనందంగా అందరూ కలిసి గడపాల్సిందే .ఒకరినొకరు అభినందించు కోవడానికి ఈ సమయాన్ని ఆసరాగా చేసుకుని కుటుంబాలు స్నేహితులు మధ్య బంధాలు బలపరచుకోవడం మంచిదే .
ఒక సమాజంలో బ్రతుకుతున్న ప్రతీ ఒక్కరికీ కొన్ని సంప్రదాయాలు తప్పనిసరి.
👉 ప్రతీ వ్యక్తికీ ఆధ్యాత్మికతో పాటు మానసిక ఉల్లాసం కూడా అవసరమే .
*అయితే మనం చేసేవి దేవుని చిత్తానికి లోబడి ఉండాలి .*
*తప్పక దేవుణ్ణి మహిమ పరిచేదిగా ఉండాలి .*
👉 ఆడంబరాలు,దుబారాలు ఆర్థికంగానూ, ఆధ్యాత్మికంగానూ మంచిదికాదు.
♻ *క్రైస్తవులనబడేవారు చేసే క్రిస్మస్ లు ఎలాంటివి ?*
👉 ఈ సందర్భంగా వారు దేవాలయ అలంకరణ కొరకు ఎంత ఖర్చు చేస్తున్నారో గమనించండి .( క్రైస్తవ?)
👉 వినోదం , మ్యూజిక్ , అటపాటల మీద ఎంత ఖర్చు చేస్తున్నారో కూడా గమనించండి .
*దీని వల్ల ఆధ్యాత్మిక ప్రయోజనం ఎంతో అంచనా వేయండి.*
♻ *నిజానికి క్రీస్తు యేసు పుట్టుక డిసెంబరు 25 , మాత్రం కాదు .ఇది పారంపర్యంగా జరుపు కుంటున్న ఒక ఆచారం మాత్రమే .*
👉 అయినా ఈ పారంపర్య ఆచారాన్ని అవకాశంగా తీసుకొని కొందరు
🔹క్రీస్తు నెరుగనివారిని ,
🔹 సమాజంలో అభాగ్యులను చేరుకోవడానికి కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు .
🔹హెచ్ఐవి+ వ్యాధిగ్రస్థులకు,
🔹 అనాధ బాలలకు ,
🔹మానసిక వికలాంగులకు,
🔹 పేదలు , భిక్షాటన చేసేవారికి,
🔹చెరసాలలో ఉన్నవారికి ,
🔹 పేద రోగులకు ,
🔹 హిజ్రాలకు , వేశ్యలకు సాయం చేసి
*సువార్త అందించడానికి ఈ అవకాశం వినియోగించు కుంటున్నారు.*
👉క్రైస్తవేతర సాటి ఉద్యోగులకు పరిచయస్తులకు సువార్త అందించడానికి ఈ అవకాశాన్ని వాడుకుంటున్నారు .
👉 నీవు సాదా క్రైస్తవుడు ఐతే నీకేమీ నేను చెప్పడం లేదు .
*నీకు ఆత్మలో మంట ఉంటే ప్రభువును ఘనపరచని పారంపర్యాచారాలను ప్రక్కన పెట్టి దుబారాలు తగ్గించి మన ప్రభువు మహిమ కొరకు పాటుపడ వలసందిగా మీకు గుర్తు చేస్తున్నాను .*
👉 ఆయన పుట్టుక జగమందరికీ శుభవార్తే .
🔺అయినా ఈ రోజుకూ శుభవార్త వినని జాతులు ఇంకా చాలా ఉన్నాయి .
🔺ఈ శుభవార్త తెలియక ఇంకా మరణ దాస్యం క్రింద ఉన్న ప్రజలు మన కళ్ల ముందే కన్పిస్తున్నారు .
🔺మన చుట్టూ ఎందరో అభాగ్యులు సాయం కొరకు చూస్తున్నారు .
*వాళ్ళను విస్మరించి ఘనంగా క్రిస్మస్ జరుపుకుంటే దేవుడు హర్షిస్తాడా ?*
👉 ఈ అభాగ్యులకు చేస్తే నాకు చేసినట్టే అంటాడు మన ప్రభువు.
*అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచినా తండ్రిచేత ఆశీర్వదింప బడినవారలారా, రండి; లోకము పుట్టినది మొదలుకొని మీకొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి; దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినై యుంటిని నన్ను చేర్చు కొంటిరి; దిగంబరినై యుంటిని, నాకు బట్టలిచ్చితిరి; రోగినైయుంటిని, నన్ను చూడ వచ్చితిరి; చెరసాలలో ఉంటిని నాయొద్దకు వచ్చితిరని చెప్పును అందుకు నీతిమంతులుప్రభువా, యెప్పుడు నీవు ఆకలిగొని యుండుట చూచి నీకాహార మిచ్చి తిమి? నీవు దప్పిగొనియుండుట చూచి యెప్పుడు దాహమిచ్చితిమి ? ఎప్పుడు పరదేశివై యుండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి? దిగంబరివై యుండుట చూచి బట్టలిచ్చితిమి? ఎప్పుడు రోగివై యుండుటయైనను, చెరసాలలో ఉండుట యైనను, చూచి, నీయొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అందుకు రాజుమిక్కిలి అల్పులైన యీ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును.*
మత్తయి 25 : 34 - 40
👉క్రీస్తును పోలి, దేవుని బిడ్డలమైన మనం కూడా ఏ పని చేసినా దాని యొక్క అత్యున్నతమైన ఉద్దేశం *దేవునికి మహిమ* కలగడమేనని గ్రహించాలి.
👉 విశ్వాసి ప్రవర్తన అంతటినీ ఏలవలసిన గొప్ప నియమం ఇది.
👉విశ్వాసులు ఏమి చేసినా *దేవునికి మహిమ* కలిగించడానికే అన్నీ చేయాలని పౌలు భక్తుడు స్పష్టంగా చెప్పుచున్నాడు.
1కొరి10:31
*కాబట్టి మీరు భోజనముచేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును "దేవుని మహిమ"కొరకు చేయుడి.*
👉విశ్వాసులంతా దేవునికి మహిమకలుగు రీతిగా జీవిస్తే
🔹సంఘంలో చీలికలు, గుంపులు ఉండవు.
🔹 విశ్వాసుల్లో అవినీతి ఉండదు,
🔹ఇతర విశ్వాసులను విమర్శించడం ఉండదు.
🔹 ఇతరుల్ని అనాలోచితంగా బాధపెట్టే పనులు ఉండవు.
*మన చర్యలన్నిటినీ ఈ వాక్యపు వెలుగులో పరీక్షిస్తూ చూసుకుంటే, ఫర్వాలేదులే అనుకున్న అనేకమైన వాటిని మనం మానుకుంటాం.*
👉తద్వారా దేవునికి మన జీవితాల ద్వారా అద్భుతమైన *మహిమను* కలిగించిన వారమవుతాం.
👉మనమందరం దేవునిని మహిమపరచాలని ఆయన కోరుకుంటున్నాడు. అసలు మనం సృజించబడినది *దేవుని మహిమ నిమిత్తమే.*
యెషయా 43:7
*నా మహిమ నిమిత్తము నేను సృజించినవారిని నా నామము పెట్టబడిన వారినందరిని తెప్పించుము నేనే వారిని కలుగజేసితిని వారిని పుట్టించిన వాడను నేనే*
👉సర్వసృష్టి దేవుని మహిమ పరచుచుండగా
*ఆయన బిడ్డలమైన మనం దేవునికి మహిమకరంగా జీవించలేక పోవడం విచారకరం.*
కీర్తన 19:1
*ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచుర పరచుచున్నది;*
కీర్తనలు 29:2
*యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి ప్రతిష్ఠితములగు ఆభరణములను ధరించుకొని ఆయన యెదుట సాగిల పడుడి.*
ప్రకటన 4:11
*ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి; నీ చిత్తమునుబట్టి అవి యుండెను; దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద నర్హుడవు*
*హల్లెలూయ...*
*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*
*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి