ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

క్రిస్మస్

✳ *.....క్రిస్మస్....* ✳

(ఇరవై ఒకటవ  భాగము)

♻ *యేసు జన్మించిన సంవత్సరం...✍*

*ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో కాలాన్ని యేసు క్రీస్తు జననం ఆధారంగా అంచనా వేస్తారు.*
👉 కాని ఆయన వాస్తవంగా జీవించాడా? 
👉జీవించినట్లయితే ఆయన ఎప్పుడు జన్మించాడు? 
అనే విషయాన్ని పరిశీలిద్దాం...

🔺కొంత కాలం క్రితం, దేవుడు లేడని నమ్మే ఒక వ్యక్తితో సంభాషించాను, అతడు నాస్తికుడు, ఏదో సామాన్యమైన నాస్తికుడు కాదు. అసలు క్రీస్తు ఉనికేలేదని వక్కాణించే తీవ్రవాది.

ఈ నాస్తిక స్నేహితుడు వింతైన విశ్వాసి, గ్రుడ్డి విశ్వాసని నాకనిపిస్తుంది.  ఇలాంటి గుడ్డి నమ్మకంతో అనేకమంది సువార్తికులను అవమానానికి గురిచేశాడు.
 *యేసు క్రీస్తుఉనికి కేవలం క్రొత్త నిబంధనకే పరిమితం కాదు.*
👉 క్రైస్తవేతరులు సైతం ఆయన జీవించాడని , అత్యద్భుతకార్యాలు చేశాడని గ్రహిస్తారు. 

*మిష్నా అనే యూదుల ప్రాచీన గ్రంధాల్లో,*
👉 చరిత్రకారుడైన *జోసెఫస్* రచనల్లో మరియు మొదటిశతాబ్ది చరిత్రకారులైన *ధాలస్*, *సెరాపియన్,* *టాకిటస్* అను వారు తమ రచనలలో క్రీస్తు అని పిలువబడే ఒకవ్యక్తి పాలస్తీనా ప్రాంతంలో జీవించినట్లు, మరియు పొంతిపిలాతు కాలంలొ చనిపోయినట్లు లిఖించారు.

*యఫ్.యఫ్.బ్రూస్ అనే బ్రిటిష్ పండితుని* మాటలలోచెప్పాలంటే జూలియస్ సీజర్ ఎంత చారిత్రాత్మక వాస్తవమో క్రీస్తు కూడా అంతే చారిత్రాత్మక వాస్తవం.

*కాబట్టి క్రీస్తు జీవించాడన్నది వాస్తవమైతే ఆయన తప్పక జన్మించి వుండాలి.*

👉బైబిల్ లోని సువార్తలు ఏమిచెబుతున్నాయంటే ఆయన హేరోదు మహారాజు మరణానికి కొద్దికాలం ముందుగా జన్మించాడని. *అయితే ఈ హేరోదు రాజు మరణాన్ని ఖచ్చితంగా లెక్కకట్టవచ్చు.*

✳ హేరోదు చంద్ర గ్రహణం తరువాతచనిపోయినట్లు జోసెఫస్ గ్రంధస్తం చేశాడు. ఇది క్రీ.పూ.4 వ సంవత్సరం మార్చి 12 లేదా 13 వ తారీఖుల్లో ఏర్పడింది. అంతేకాక 
✳ *పస్కాపండుగకు ముందే హేరోదు మరణించినట్లు కూడా జోసెఫస్తెలియజేసాడు.*
 ఈ పస్కాపండగ అదే సంవత్సరం క్రీ.పూ 4 వ సంII ఏప్రియల్ 11 వ తారీఖున వచ్చింది. జోసెఫస్ ఇతర రచనలు,వివరాల ఆధారంగా *హేరోదుమహారాజు మరణాన్ని ఖచ్చితంగా క్రీ.పూ.4 వసంవత్సరం మార్చి 29 లేదా ఏప్రియల్ 4 వ తారీఖుగాలెక్క కట్టవచ్చు.*

♻క్రీస్తు పూర్వం (BC) లో క్రీస్తు జన్మించాడని చెప్పడంఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. 

👉క్రీస్తు పూర్వం, క్రీస్తు శకంగా విభజించి వాడబడుతున్న మన అధునిక క్యాలెండర్ 
*క్రీ.శ. 525 సంII* లో రూపొందించబడినది. 

అప్పటి మొదటి పోప్ పాశ్చాత్య సంఘ ఉపయోగార్ధం ఒకప్రామాణిక క్యాలెండర్ ను రూపొందించవలసినదిగా 
*జాన్ డయోనైసియస్* (Dionysius) అనే ఒకసాధువును కోరాడు.
👉 దురదృష్టవశాత్తు డయోనైసియస్ క్రీస్తు పూర్వం ,క్రీస్తు శకాలు లెక్కించటంలో 
*సుమారు 4 సంవత్సరాల కాలన్ని పొరపాటుగా అంచనావేశాడు.*

 ♻మత్తయి గ్రంధకర్త ప్రకారంగా హేరోదు బేత్లహేములో 2సంII అంతకంటే తక్కువ వయసున్న పిల్లలందరినిచంపించి వేసినట్లు తెలియజేసాడు. కాబట్టి క్రీస్తు జననము క్రీ.పూ 6 వ సం తరువాతనే జరిగివుండాలి.

👉 మిగతా ఆధారాల ప్రకారం మెస్సియా అని పిలువబడే వ్యక్తి క్రీ.పూ 5 లొ కాని 4 మొదటి భాగంలొగాని జన్మించియుంటాడని ప్రస్ఫుటంగాతెలియబడుచున్నది.

👉నాస్తికుడైన నా స్నేహితుడు ఇలాంటి అంచనాలను తేలికగాకొట్టి పారేస్తాడు. 
*"క్రీస్తు పుట్టిన దినాన్ని ఖచ్చితంగా అంచనా వేయలేని మీరు ఆయన జీవించాడని ఎలా చెబుతారని ప్రశ్నిస్తాడు?*
 ఇది ఒక మంచి ప్రశ్న. 

👉ఈమద్య మా అమ్మాగారి జన్మదినాన అభినందనలు తెలియజేస్తూ
*"అమ్మా ఇప్పుడు కేక్ మీద ఎన్ని క్యాండీల్స్  పెట్టాలి?"*
అని అడిగాను. 
🔺అందుకు మా తల్లి నాకు తెలియదు. నాకు ఏ మాత్రం గుర్తులేదని చెప్పింది మిగతా విషయాలు మాట్లాడి ఫోను ముగించాను.  
👉మా అమ్మ వయసును ఖచ్చితంగా చెప్పలేనుగాని ఫోనులో మా అమ్మ తో మాట్లాడిన విషయం వాస్తవం. ఆమె వయస్సు ఆమెకే గుర్తు లేదు. అప్పటికీ ఆమెముసలితనంలో లేదు. అంత మాత్రాన ఆమె ఒక అభూత కల్పన కాదు. కాబట్టి నేను  మా అమ్మతో మాట్లాడటం కల్పనగా భావిస్తే నీవు చదువుతున్నది అంతా వ్యర్ధం.

♻ *యేసు జన్మించిన దినం*

రాబోయే డిసెంబర్ 25 గురించి తల్లిదండ్రులు తమపిల్లలకు *వృద్ధుడైన సెయింట్ నిక్ (St. Nick)*
 గురించి ఒక కల్పితమైన కథను చెబుతారు.

🔺 మనలోకొంతమంది మన రక్షకుని జన్మదినాన్నిజరుపు కుంటాము. కాని 
*అతడు నిజంగా జన్మించాడా?*

*యేసు జననం డిసెంబర్ 25వ తారీఖుననే నిజంగా జరిగిందా?*
👉 బైబిల్ పండితులు క్యాలెండర్ లోని ప్రతీ మాసాన్ని కూడా ప్రతిపాదించారు. కాని *ఎందుకు మనము డిసెంబర్ మాసములోనే యేసు జన్మదినాన్నిజరుపుకుంటాము?*

👉డిసెంబర్ 25న జరుపుకునే సాంప్రదాయం చాలాప్రాచీనమైనది. *హిప్పొలైటస్(Hippolytus) 2వశతాబ్దములో , క్రీస్తు జన్మదినం ఇదే అని వాదించాడు.*

👉తూర్పుదేశాలకు సంబంధించిన సంఘాలవారు,జనవరి 6వ తేదీని ప్రతిపాదించారు.

👉కాని 4వ శతాబ్దములో, *జాన్ క్రిసోస్తం (John Chrysostom) డిసెంబర్ 25 మాత్రమే ఖచ్చితమైనదినమని వాదించాడు.*

👉అప్పటి నుండి ఇప్పటి వరకు ,తూర్పు సంఘాలు మరియు పశ్చిమాల వారు డిసెంబర్25ను అధికారికంగా క్రీస్తు జన్మదినంగా ఆచరింపసాగారు.

♻ *ఈ ప్రస్తుత నవీన కాలంలో, సాంప్రదాయకమైన తారీఖు సవాలు చేయబడింది.*
👉 ఆధునిక పండితులు యేసు జన్మించిన దినాన గొఱ్ఱెల కాపరులు బేత్లెహేము చుట్టుప్రక్కల వున్న కొండలలో తమ గొఱ్ఱెలను కాస్తున్నట్లుగా సూచిస్తున్నారు. లూకా కొంత మంది గొఱ్ఱెల కాపరులుతమ గొఱ్ఱెలను రాత్రి సమయాన మేపుచుండగా దేవదూత ప్రత్యక్షమైనట్లు వివరించాడు. (2:8).

ప్రాచీన యూదులకు సంబంధించిన వివరాల ప్రకారం బేత్లెహేము చుట్టు ప్రక్కల ఉండే గొఱ్ఱెల కాపరులు సంవత్సరమంతా గొఱ్ఱెలను కాయుచుండేవారు. కనుక,డిసెంబర్ 25ను సాంప్రదాయకంగాను సరియైనదేనని గ్రహించగలము. 
👉 *దీనిని వ్యతిరేకించుటకు సరైన ఆధారం ఏదీ లేదు.*

🔺బేత్లహేము చుట్టుప్రక్కల గొఱ్ఱెలను ఒక ప్రత్యేక సందర్భముకై పెంచుతారు. *అవి సాధారణమైన గొఱ్ఱెలు కావు. అవి అర్పణ కొరకైన గొఱ్ఱెలు.*
👉 వసంత కాలపు తొలి దినాలలొ వచ్చే పస్కా పండగ కొరకు వాటిని ప్రత్యేకంగా పెంచుతారు.

పాపులైన మానవులకు బదులుగా త్వరలొ బలి కాబడే ఈ నిష్కల్మషమైన నిరపాయకరమైన గొఱ్ఱెలను కాపాడే ఈ గొఱ్ఱెల కాపరులకు దేవుడు మెస్సియ యొక్క జననాన్ని మొదటిగా ప్రత్యక్షపరిచాడు.
👉 వారు శిశువునుచూచినపుడు, ఆయనను గూర్చి ముందే ఎరిగియున్నారా? వారు తమ హృదయాలలోబాప్తీస్మమిచ్చు యోహాను  తరువాత పలికిన విధంగా
*"ఇదిగో లోక పాపములను మోసికొని పోవు దేవునిగొఱ్ఱెపిల్ల "*
 అని లోలోపల తలంచి యుండివుంటారేమో!

✳ *అయినప్పటికీ , క్రీస్తు జన్మదినం పలానదినం అని మనము ఖచ్చితంగా చెప్పలేము.*
👉 కాని శీతాకాలపు తొలిదినాలలో అయివుండవచ్చనునది సముచితమైన ఊహ.

*18 శతాబ్దాలుగా డిసెంబర్ 25వ తారీఖు   క్రీస్తు జన్మదినంగా పిలువబడింది. ఇంతకుమించిన సాక్ష్యాధారాలు లేకుండా ఈజన్మదినాన్ని మార్చడం మంచి నిర్ణయం కాదు.*

♻ ఇప్పుడు వున్న అనిశ్చతకు మనము ప్రాచీన సంఘాన్ని తప్పు పట్టవచ్చు.
🔺 *కాని వారు అసలు క్రీస్తు జన్మదినాన్ని ఆచరీంచలేదు. వారికి అది అంత ప్రాముఖ్యమైనది కాదు. వారు ఆయన యొక్క మరణ, పునరుజ్జీవాల గురించి మాత్రమే శ్రద్ధ కలిగి వున్నారు.*

🔺కాని *ఆధునిక మానవుడు దాన్ని పూర్తిగా తలక్రిందులు చేశాడు.*

👉ఈ క్రిస్మస్ సమయంలో నీ యొక్క చలువ అద్దాలను తీసివేసి, దుర్గంధంలో, తీవ్రమైన చలి మరియువణుకుచున్న , జంతువులతొ పశువులతొట్టి దృశ్యాన్ని మరల దగ్గరగా పరిశీలిద్దాం. 
*ఆ జంతువులుపాతనిబంధన బల్యర్పణ విధానాన్ని గుర్తుచేస్తాయి.*
👉 అవి వాటి మద్య వున్న బాలునికి ఛాయ వలె వున్నవి. *ఆయనను విశ్వసించు వారందరును జీవించునట్లుగా...*

*హల్లెలూయ...*

*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*

*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*
➖➖➖➖➖➖➖➖➖

కామెంట్‌లు