ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

క్రిస్మస్

✳ *.....క్రిస్మస్....* ✳

(పద్నాలుగవ భాగము)

♻ *యేసుక్రీస్తు దైవత్వము* ♻

 (మూడవ భాగము)

యోహాను 1: 1
*ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.*

యోహాను 1: 14
*ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణు డుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వి తీయకుమారుని( లేక, జనితైకకుమరుని) మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి.*

    మనం యేసుప్రభులవారి దైవత్వం  గురించి ధ్యానం చేస్తున్నాము

 యేసుప్రభులవారి దైవత్వాన్ని సవాలు చేసినట్లుగా మరి ఏ దేవుణ్ణి, దేవతను ఏ దేశములో కూడా ఇంతవరకు సవాలు చేయలేదు! అందుకే పరిశుద్ధాత్ముడు ముందుగా గుర్తెరిగి, పౌలుగారిని వాడుకొని, ఆ సవాళ్లు అన్నింటికీ ధీటైన జవాబు వ్రాయించడం జరిగింది!

కొలస్సీయులకు 1: 15
*ఆయన అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడైయున్నాడు.*

      ఈ వచనంలో ఆయన అనగా *యేసుప్రభులవారు అదృశ్యదేవుని స్వరూపి* అని రాస్తున్నారు!

 దేవుడు అదృశ్యుడు!! ఆయన మన కన్నులకు కనిపించరు!!! ఒకవేళ మన కన్నులు ఆయనను, ఆయన మహిమను, ఆ కోటివేల సూర్యకాంతులను చూస్తే మన కళ్ళు పేలిపోతాయి!! 

కీర్తనలు 50:2,3; ప్రకటన 4:3-5;
1తిమోతికి 6: 16
*సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వముగలవాడైయున్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు; ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక. ఆమేన్‌.*

  *కాబట్టి మన కళ్ళతో ఆయనను చూడలేము!* యోహాను 1:18 యేసుప్రభులవారు చెబుతున్నారు: 
*ఎవరూ ఎప్పుడునూ దేవుణ్ణి చూడలేదు, ఆయన కుమారుడే – లోకానికి దేవుణ్ణి బయలు పరిచాడు!* 

👉 అనగా ఆయన ఎలాంటివాడు, ఆయన గుణగణాలు ఎలాంటివి లోకానికి యేసుప్రభులవారి ద్వారానే తెలిసింది! 

ఇదే విషయం పౌలుగారు: 
*సకల యుగములకు రాజై ఉన్నట్టియు, అక్షయుడగు అనగా క్షయము కాని వాడు, నాశనం కానివాడు, అదృశ్యుడును – అనగా ఎవరికీ కనపడని వాడునూ, ఇంకా అధ్వితీయుడునూ- అనగా ఏకైక దేవుడు, మరో దేవుడు లేదు అంటున్నారు!*

 1 తిమోతీ 1:17; 
ఇక 6:16 మరోసారి చూసుకుంటే
 *సమీపింపరాణి తేజస్సు, అమరుడు అనగా చావులేనివాడు, మనుష్యులలో ఇంతవరకు ఎవరూ ఆయనను చూడలేదు, చూడలేడు అంటున్నారు!* అందుకే ఇలాంటి దేవుణ్ణి మోషేగారు అదృశ్యుడైనవానిని చూస్తున్నట్టుగా స్థరబుద్ధికలవాడై విశ్వసించినట్లు చూస్తాం హెబ్రీ 11:27; 

👉 *ఆ తర్వాత నిజంగా మోషేగారు దేవునిమహిమను, మహిమ రూపాన్ని వెనుకనుంచి  చూసారు. ఇలా ఆయన మహిమను మంటిరూపముతో చూసిన వ్యక్తి మోషేగారు మాత్రమే!*

👉 *ఆ తర్వాత దేవుడు – యేసుప్రభులవారి రూపంలో ఈలోకానికి వచ్చాక, అనేకులు దేవుణ్ణి/ యేసుప్రభులవారిని చూడగలిగారు!*

👉 ఇలాంటి అదృశ్యదేవుణ్ణి – ఆయన ఎలాంటివారో, యేసుప్రభులవారు వెల్లడిచేశారు! కారణం ఆయన మానవరూపం దాల్చిన దేవుడు! 

అందుకే కొలస్సీ 2:9 లో పౌలుగారు *ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు శరీరముగా నివసించుచున్నది అని నొక్కివక్కానించి యేసుప్రభులవారే దేవుడు అని చెబుతున్నారు!* 

  యోహాను సువార్త మొదటి అధ్యాయం జాగ్రత్తగా చదివి అర్ధం చేసుకుంటే ఇది క్లియర్ గా అర్ధం అవుతుంది. 1:1 & 1:14 రెండూ కలిపి చదవాలి!  
*ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యమే దేవుడైయుండెను. . ఇదే వాక్యము శరీరదారియై కృపా సత్యసంపూర్ణునిగా మనమధ్య నివసించుచుండెను!* – 

*ఆ శరీరదారి యేసుప్రభులవారు!*
*Mathematics లో ఆల్జీబ్రా* అనే విభాగం చేసినవారికి ఇది బాగా అర్ధం అవుతుంది. ఇవో పెద్ద సమీకరణాలు! ఇలాంటివి బైబిల్ లో చాలా ఉన్నాయి గాని మచ్చుకు రెండు చూద్దాం! 

1⃣ *ఆదియందు వాక్యము ఉండెను. వాక్యము= దేవుడు;వాక్యము శరీరధారియై భూలోకానికి వచ్చెను.*
👉 అలా వచ్చినది ఎవరు?  *శరీరదారి= యేసుప్రభులవారు.*  కావున *వాక్యము= శరీరదారి= యేసుప్రభులవారు. కాబట్టి దేవుడు = యేసుప్రభులవారు!!!*

2⃣ 2&3 వచనాలు ప్రకారం *ఆయన సృష్టికర్త!*
👉 అనగా దేవుడు. 4,5,6,9 ప్రకారం *వెలుగు ఉంది, ఆ వెలుగు లోకములో ప్రకాశిస్తుంది గాని లోకము దానిని గ్రహించలేదు!*

 *యేసుప్రభులవారు నేను లోకమునకు వెలుగును అన్నారు* 8:12; 
కావున *సృష్టికర్త= దేవుడు;*

 *వెలుగు= ఏసుప్రభువు; వెలుగు = దేవుడు; కావున దేవుడు = యేసుప్రభులవారు!!!*

    యోహాను 14:9 లో ఫిలిప్పు యేసయ్యను అడుగుతారు—
*మాకు తండ్రిని చూపించు, అంతేచాలు! అందుకు యేసుప్రభులవారు అన్నారు: ఫిలిప్పు నన్ను చూస్తే, తండ్రిని అనగా దేవుణ్ణి చూసినట్టే, కారణం మేమిద్దరం కలసి యున్నాము!*
 14:20; అనగా *నేనే తండ్రి, తండ్రి= నేను, కావున తండ్రి= దేవుడు = యేసుప్రభులవారు!!*

👉 కావున ఆయనే తండ్రి, దేవుని స్వరూపం! మరొకసారి మీకు గుర్తుచేస్తున్నాను, *ఇశ్రాయేలీయులు యేసుప్రభువులవారిని ఎందుకు చంపించారు?*
 
1. నేను దేవుని కుమారుణ్ణి అనడం, 
2. తండ్రి నేను కలసి ఉన్నాము అనడం. అంటే నేనే దేవుణ్ణి అనడం వల్లనే!! 
ఇప్పడు కోతికి పిల్ల పుడితే కోతి అవుతుంది. మనిషికి పిల్ల పుడితే మనిషి అవుతాడు. 
*అదే దేవుడికి కుమారుడు ఉంటే దేవుడౌతాడు.* అంతేకదా! ఈ విషయం యూదులకు తెలుసు కాబట్టి వారు మండిపడి యేసయ్యని చంపారు. ఇంత చిన్నవిషయం వీరికి తెలియకుండా పోయింది.  ఇంత చిన్న లాజిక్ ప్రజలకి అర్ధం కాకుండా పోతుంది.

   ఇంకా మనకు 2 కొరింథీ 4:4 లో *దేవుని స్వరూపియైన క్రీస్తుమహిమ . . .* అంటున్నారు. 

*యేసుప్రభులవారు= దేవునిస్వరూపి;* ఇంకా హెబ్రీ 1:3 .హెబ్రీయులకు 1: 3

*ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును,(లేక, ప్రతిబింబమును) ఆయన తత్వముయొక్క మూర్తి మంతమునైయుండి, తన మహత్తుగల మాటచేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, దేవదూతలకంటె ఎంత శ్రేష్ఠమైన నామము పొందెనో వారికంటె అంత శ్రేష్ఠుడై, ఉన్నత లోక . .*  చూడండి ఎంతక్లియర్ గా చెబుతున్నారో. 

*కాబట్టి యేసుక్రీస్తు = దేవునిస్వరూపి = దేవుడు! ఆ నిజదేవున్ని ఎవరైతే తెలుసుకోగలరో వారు జ్ఞానము గలవారు, ధన్యులు! పరలోకానికి హక్కుదారులు!!*

అట్టి ధన్యత ప్రతీ ఒక్కరికీ కలుగును గాక!

*హల్లెలూయ...*

*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*

*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*
➖➖➖➖➖➖➖➖➖➖

కామెంట్‌లు