ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

క్రిస్మస్ సందేశాలు

✳ *క్రిస్మస్ సందేశాలు* ✳

(20 వ భాగము )

*రక్షణ కార్యాన్ని రెండు స్వభావాలు పంచుకోవడం*
(వాక్యం శరీరధారి ఆయెను - 3వ భాగము)


ఆది.కా 3:15  మరియు నీకును స్త్రీకిని నీ సంతాన మునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. *అది నిన్ను తలమీద కొట్టును;* నీవు దానిని మడిమె మీద కొట్టుదువని చెప్పెను.

*7. యేసుయొక్క మానవ స్వభావానికి దైవ లక్షణాలు ఎప్పుడు వచ్చినవి:*యేసు తన దైవిక స్వభావాన్ని బట్టి సర్వశక్తిమంతుడుగా ఉన్నాడు, సర్వజ్ఞానిగా ఉన్నాడు, సర్వంతర్యామిగా ఉన్నాడు, నిత్యుడుగాను మరియు దైవిక ఘనతను కలిగి యున్నాడు. అయితే యేసు యొక్క మానవ స్వభావానికి ఈ లక్షణాలు ఏమిలేవు.

కాని యేసు మరియ గర్భంలో ప్రవేశించినపుడు మానవ స్వభావంతో దైవ స్వభావం కలిసినప్పుడు ఈ దైవ లక్షణాలన్నిటిని మానవ స్వభావం స్వీకరించింది. 

యేసు యొక్క మానవ స్వభావంనకు ఈ దైవిక గుణాలకు ఇవ్వబడుటను గూర్చి పౌలు యేసును *"దేవుని రూపంలో"* ఉన్నట్లు తన పత్రికలో పిలుస్తాడు:

ఫిలిప్పి 2:6-8  *ఆయన దేవుని స్వరూపము* కలిగిన వాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను మరియు, *ఆయన  ఆకారమందు  మనుష్యుడుగా కనబడి,* మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను.

ఇక్కడ పౌలు యేసు యొక్క మానవ శరీరం గురించి మాట్లాడటం లేదు. శరీరధారి కాక ముందు “వాక్యం”గా ఉన్న యేసును గురించి కూడా పౌలు మాట్లాడటం లేదు. రెండింటి కలయిక అయిన దైవమానవ స్వరూపం గురించి మాట్లాడు చున్నాడు.

ఫిలిప్పీయులకు 2: 6-8 వ్రాయబడినట్లుగా వాక్యం శరీరధారిగా మారిన స్థితిని గురించి మాట్లాడుతూ ఉన్నది. యేసు అను మనిషి దేవుని రూపంలో ఉన్నాడు. మనుష్యకుమారుడు దైవిక శక్తులు కలిగి ఉన్నాడు. యేసు శరీరపరంగా దేవుని రూపంలో ఉన్నప్పటికీ, ఆయన ఎల్లప్పుడూ తన దైవిక శక్తులను ఉపయోగించలేదు. 

బదులుగా యేసు ఒక సేవకుని రూపాన్ని తీసుకున్నాడు మరియు మన పాపాల కోసం సిలువపై చనిపోయే స్థితి వరకు తనను తానే  తగ్గించుకుని రిక్తుడైనాడు.  

*8. విమోచన కార్యాన్ని దైవ మానవ స్వభావాలు పంచుకోవడం The Sharing of the Work of Redemption:* యేసు క్రీస్తులో, దైవ స్వభావం మరియు మానవ స్వభావం రెండు కూడా విమోచన కార్యాన్ని పంచుకుంటాయని బైబిలు మనకు చూపుతుంది.

1 కొరి 15:3-4 నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతిపొందెను, *సమాధి చేయబడెను*(మానవ స్వభావం), 4  లేఖనముల ప్రకారము మూడవ దినమున *లేపబడెను.*
(దైవ స్వభావం).

గల 1:4  మన తండ్రియైన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములోనుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను.

1 యోహా 3:8  అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి; అపవాది యొక్క క్రియలను లయపరచుటకే *దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను.*

ఆది.కా 3:15  మరియు నీకును స్త్రీకిని నీ సంతాన మునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. *అది నిన్ను తలమీద కొట్టును;* నీవు దానిని మడిమె మీద కొట్టుదువని చెప్పెను.

లూకా 19:10  నశించినదానిని వెదకి *రక్షించుటకు మనుష్య కుమారుడు* వచ్చెనని అతనితో చెప్పెను.

1తిమో 2:5  దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే; ఆయన *క్రీస్తుయేసను నరుడు.*

లూకా 2:11  దావీదు పట్టణమందు నేడు *రక్షకుడు మీ కొరకు పుట్టి యున్నాడు,* ఈయన ప్రభువైన క్రీస్తు.

పై వాక్య భాగాలలో, రక్షణ కార్యం అనేది  యేసును దేవుని కుమారుడిగా మరియు మనుష్యకుమారునిగా వర్ణిస్తుంది. ఈ రక్షణ కార్యంలో పాలుపొందుకొనే  *రెండు స్వభావాలు కూడా ముఖ్యమైనవి.* 

పాపులమైన మనము రక్షకుని యొక్క బలి అనగా తీవ్రమైన శ్రమ మరియు మరణం ద్వారా మాత్రమే  రక్షింపబడగలం. కానీ యేసు కేవలం దేవునిగా ఈలోకానికి వచ్చి తనకు తానే శ్రమకులోనై మరణించడం అనేది సాధ్యంకాదు. కారణం దైవస్వభావం శ్రమకు లోనుకాదు. దేవుడిని ఎవరైనా శిలువ వేయగలరా? అది అసాధ్యం.  

అదే విధంగా, యేసు కేవలం మానవుడిగా సర్వలోక పాప విముక్తి కొరకు సరిపోయిన పరిపూర్ణ బలిని అర్పించలేడు. కాబట్టి పాపము మరియు మరణము నుండి మనలను కాపాడడానికి యేసు యొక్క వ్యక్తిత్వంలోని మానవ స్వభావం మరియు దైవిక స్వభావం రెండు కూడా అత్యవసరం.

*9. యేసుకు దైవిక ఘనత ఉందని బైబిలు మనకు చూపిస్తుంది:* రక్షణ కార్యాన్ని దిగ్విజయంగా యేసు దైవమానవ రూపంలో నెరవేర్చాడు గనుక యేసే నిజమైన దేవునిగా గొప్ప ఘనత పొందాడు.
అంతేగాక తీర్పుతీర్చు ఆధికారం కుమారునికి అప్పగించుట ద్వార దేవుడే తన కుమారుడైన యేసును  ఘనపరచాడు. 

మనుషులందరి తీర్పు యేసుప్రభువు చేతిలోనే ఉంటుంది. తీర్పును యేసుప్రభువు చేతుల్లో పెట్టడంలో తండ్రి ఉద్దేశం చూడండి. తండ్రి అయిన దేవుణ్ణి ఘనపరచినట్టుగానే మనుషులు యేసును ఘనపరచాలి. కుమారుడైన యేసునందు దైవ  తత్వం, దైవ స్వభావం పరిపూర్ణంగా లేకపోతే తండ్రి ఎన్నడూ ఇలా కోరడు. దేవునికి మాత్రమే చెందే ఘనతను సృష్టించబడిన ఎవరికీ దేనికీ మనుషులు ఇవ్వరాదు. 

మనుషులు దేవుని కుమారుణ్ణి ఘనపరచకపోతే వారు దేవుణ్ణి అసలు ఘనపరచరు. 

యోహాను 5:22-23  తండ్రి యెవనికిని తీర్పు తీర్చడు గాని  తండ్రిని ఘనపరచునట్లుగా *అందరును కుమారుని ఘనపరచ వలెనని* తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి యున్నాడు; *కుమారుని ఘనపరచనివాడు* ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు. 

(ఫిలిప్పి 2:9-11  అందుచేతను పరలోకమందున్నవారిలో గాని, భూమిమీద ఉన్నవారిలో గాని భూమి క్రింద ఉన్నవారిలో గాని, *ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లును* ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామ మునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను.)

దేవుడైన యేసు మనిషిగా వచ్చి మరణం పాలై సాతానును ఓడించి విశ్వానికి మహా దేవుడైన యెహోవా అవతారం తానేననే అని ప్రపంచమంతటికీ చాటి చెప్పాడు. 

నిజ దేవుడైన యేసు మానవుడుగా ఈలోకంలో పుట్టి ఆయన సాధించిన అద్భుతమైన రక్షణ కార్యాన్ని బట్టి భూమి మీద మరియు పరలోకంలో కూడా సర్వ అధికారమంతా ఉన్న మహా ప్రభువు యేసేనని ఇప్పుడు విశ్వాసులు సంతోషంగా ఒప్పుకుంటారు. ఇష్టమున్నా లేకపోయినా ప్రతి ఒక్కరూ ఇలా ఒప్పుకోవలసి వస్తుంది. 

విజయుడై పునరుత్థానునిగా లేచిన తరువాత యేసులోని మానవ లక్షణాలు ఏమైనాయో రేపు చూద్దాం.
(To be continued..)

దైవాశ్శీసులు!

From the desk of...
Pastor Jyothi Raju Vemula 
_(Soli Deo Gloria)_

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...