✳ *.....క్రిస్మస్.....* ✳
(పదవ భాగము)
♻ *....విధేయత.....*♻
మత్తయి 1: 20
*అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడవైన యోసేపూ, నీ భార్యయైన మరియను చేర్చు కొనుటకకు భయపడకుము, ఆమె గర్భము ధరించునది పరిశుద్ధాత్మవలన కలిగినది; ఆమె యొక కుమారుని కనును;*
*క్రిస్మస్ లో ప్రధానమైన అంశాలలో "విధేయత" ఒకటి.*
👉 *ఇద్దరు యవ్వనుల యొక్క విధేయతే క్రీస్తు శరీరధారిగా లోకానికి రావడానికి కారణమయ్యింది.*
1⃣ *మరియ:*
ఆమె కన్యక.
లూకా 1:27
*లోక మాలిన్యము తనకు అంటకుండా జీవించిన పరిశుద్దురాలు.*
👉దానిలో ఎట్టిసందేహం లేదు.
*ఆమెను పరిశుద్దమైన స్త్రీగా మనము గౌరవించాలి.*
👉 తన జీవితాన్ని మన జీవితాలకు ఆదర్శప్రాయంగా మలచుకోవాలి.
కాని,
*ఆరాధించడానికి వీల్లేదు.*
👉కారణం?
*మనుష్యలు గాని, దేవదూతలు గాని ఆరాధనకు యోగ్యులుకారు. దేవుడొక్కడే ఆరాధనకు పాత్రుడు.*
*జ్ఞాలులు కుడా యేసును మాత్రమే ఆరాధించారుగాని, మరియను గాని, యోసేపును గాని కాదు.*
👉ఎట్లాంటి పరిస్థితులలో ఆమె యేసు ప్రభువుకు తల్లి అయ్యే ధన్యతను పొందుకోగలిగింది?
*మరియ హృదయంలో అద్భుతమైన సంఘర్షణ.*
🔺ఒక వైపు రక్షకునికే తల్లి అయ్యే ధన్యత.
🔺మరొక పైపు వివాహం కాకుండా తల్లి అయితే?
లోకంలోఎట్లా జీవించగలగడం?
రాళ్లతో కొట్టి చంపేస్తారు.
👉చివరకి ఒక నిర్ణయానికి వచ్చేసింది.
*నిందలు, అవమానం భరించడానికే సిద్దపడింది.*
👉 దేవుడు పంపిన, దూత చెప్పిన వర్తమానముకే విధేయురాలయ్యింది.
*తాను అనుకున్నట్లే జరిగింది.*
*లోకం సూటిపోటి మాటలతో ఆమెను హేళన చెయ్యడం ప్రారంభించింది.*
*మరియ పరిశుద్దత ఏంటో ఇప్పుడు బయటపడిందని, లోకం కోడై కూస్తుంది.*
*చివరకి కొంతకాలం ఇంట్లోనుండి వెళ్ళిపోవలసి వచ్చింది.*
👉అన్నిటిని భరించింది.
కాబట్టే!
*లోక రక్షకునికి తల్లి అయ్యింది.*
🔹దేవుని మాటకు గొర్రెల కాపరులు విధేయులయ్యారు.
🔹దేవుని మాటకు మరియ విధేయురాలయ్యింది.
*మన సంగతేంటి?*
👉ఇంకనూ ఎదురాడు వారిగానే జీవిస్తున్నామా?
👉అవిధేయులుగానే బ్రతుకుతున్నామా?
*ఇంకెంత కాలం?*
🔺ఆయనను ఇంకనూ, పశువుల తొట్టెలోనున్న శిశువుగానే చూస్తూ జోలపాటలు పాడే సమయమిది కాదు.
🔺 ఆయన కృపా మయుడు, ప్రేమామయుడు అంటూ, జీవితాన్ని సరిచేసుకోకుండా వాయిదాలు వేసే సమయమిది కాదు.
2⃣ *యోసేపు.*
*ఇద్దరు యవ్వనుల యొక్క విధేయతే క్రిస్మస్.*
*విధేయత లేని నీవు క్రిస్మస్ ఆరాధన చేయలేవు.*
👉 యోసేపు:
*అతడు నీతిమంతుడు.*
👉 మత్తయి 1:19
*పరిశుద్ధ గ్రంధములో వ్రాయబడిన నీతిమంతులలో యోసేపు ఒకడు.*
*నీతి అంటే?*
👉 ఆయనను నమ్మడమే నీతి.
👉నీతిమంతుడు అంటే? ఆయనను నమ్మినవాడు.
*నీతిమంతుని లక్షణం?*
🔺 ఇతరులను అవమాన పరచకపోవడం.
*అందుకే నీతిమంతుడైన యోసేపు ఒక తీర్మానమునకు వస్తున్నాడు. మరియను అవమాన పరచకుండా రహస్యముగా విడచి పెట్టాలని.*
👉 వివాహం కాక మునుపే తాను ప్రధానం చేసుకున్న మరియ గర్భం ధరించిందని ఊరంతా తెలిసింది. అది యోసేపుకు గొప్ప అవమానం. కాని, ఆ అవమానాన్ని తానే భరించడానికి నిర్ణయించుకున్నాడు గాని, *ఇతరులను అవమాన పరచడానికి ఇష్టపడినవాడు కాదు.*
*యోసేపు విధేయుడు:*
👉 దూత వర్తమానం తెచ్చాడు. మరియ పరిశుద్దాత్మ వలన గర్భంధరించింది. ఆమెను చేర్చుకోవడానికి వెనుకాడవద్దని.
*దేవుని మాటకు విధేయుడయ్యాడు.*
👉 ఆమెను చేర్చుకున్నాడు.
గర్భం ధరించిన స్త్రీని చేర్చుకుంటే లోకం ఊరుకుంటుందా?
👉వాటన్నిటిని భరించాడు. అందుకే,
*ఈ లోకంలో లోకరక్షకునికి తండ్రిగా పిలవబడుచున్నాడు.*
*దేవుని మాటకు యోసేపు విధేయుడయ్యాడు.*
*మన సంగతేంటి?*
విదేయత గురించి మాట్లాడుతూ వుంటె ఒక జరిగిన సంఘటన గుర్తుకు వస్తుంది.
*LTTE అధినేత ప్రభాకరన్ ను* అమెరికన్ జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చేస్తున్నాడు.
*జర్నలిస్ట్:* ఇంత తక్కువ సైన్యంతో దేశమునే వణికిస్తున్నారు ఎట్లా సాధ్యము?
*ప్రభాకరన్* *'విధేయత'*
*జర్నలిస్ట్ :* మా సైన్యం కూడా విధేయతతోనే వుంటుంది. మీ విధేయతలో ప్రత్యేకత ఏమిటి?
*ప్రభాకరన్:* అతనికి తన సైన్యం పేర్లున్న బుక్ ఒకటిచ్చి, ఇద్దరు పేర్లు పిలవమన్నాడు. పిలవగా, ఆ ఇద్దరూ పరుగులెత్తుకొంటూ వచ్చారు. *వారితో చెప్పాడు ప్రభాకరన్ మీ ఇద్దరూ చచ్చిపొండి. వెంటనే వారేమి ప్రశ్నించ లేదు. తమ మెడలో నున్న పోటాషిం సైనైడ్ ప్యాకెట్స్ నోటిలో వేసుకొని గిలగిలా తన్నుకొంటూ చచ్చిపోయారు.*
మరొక ఇద్దరి పేర్లు పిలవమన్నాడు. జర్నలిస్ట్ భయపడుతూ మరొక ఇద్దరి పేర్లు పిలిచాడు. *వారూ పరుగులెత్తుకొంటూ వచ్చారు. వారితో చెప్పాడు ప్రభాకరన్ వీళ్ళను తీసుకొనివెళ్లి సమాధి చెయ్యండని. వారు ఏమి జరిగిందని ఒక్క మాట కూడా ప్రశ్నించకుండా తీసుకొని వెళ్లి సమాధిచేసారట.*
ప్రభాకరన్ చెప్పాడు *'విధేయత'* అంటే ఇది.
👉 *అవును! విధేయత 'ప్రశ్నించదు'.*
అయితే, ఒక్క విషయం?
👉 *ఒక మనిషి, ప్రాణంతీసే మరో మనిషికి అంత విధేయత చూపగలిగితే?*
👉 *ప్రాణం పెట్టిన ప్రియరక్షకునికి ఇంకెంత విధేయత చూపగలగాలి?*
నీవు నీకు నచ్చినట్లుగా జీవిస్తే దేవుని ఆశీర్వాదాలు పొందలేవు. ఒకవేళ, నీకు నచ్చినట్లుగా నీవు జీవిస్తున్నప్పటికీ సాఫీగానే నీ జీవితం సాగిపోతుందా?
*చదువులోను, ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ బాగానే రాణించ గలుగుతున్నావా?* దానిలో నీ జీవితానికి సమాధానం మాత్రం వుండదు. ఎంతో కాలం రాణించలేవు కుడా.
👉 *ఇద్దరు యవ్వనుల యొక్క విధేయతే క్రీస్తు శరీరధారిగా లోకానికి రావడానికి కారణమయ్యింది.*
యేసు తల్లియైన మరియ అన్నిటిని భరించింది.
కాబట్టే!
*లోక రక్షకునికి తల్లి అయ్యింది.*
*యోసేపు దేవుని మాటకు విధేయుడయ్యాడు.*
ఆమెను చేర్చుకున్నాడు.
గర్భం ధరించిన స్త్రీని చేర్చుకుంటే లోకం ఊరుకుంటుందా?
వాటన్నిటిని భరించాడు. అందుకే,
*ఈ లోకంలో లోకరక్షకునికి తండ్రిగా పిలవబడుచున్నాడు. దేవుని మాటకు యోసేపు విధేయుడయ్యాడు.*
*దేవుని మాటకు విధేయత చూప గలిగితే దేవుడు నిన్ను, నిన్ను బట్టి నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని, నీ దేశాన్ని ఆశీర్వదిస్తాడు. ఆయనిచ్చే ఆశీర్వాదం సమాధానమైనది, శాశ్వతమైనది.*
*నేడైనా ఆయన శక్తిని గ్రహించి, నీ హృదయంలో చేర్చుకొని, ఆయన మాటకు విధేయత చూపగలిగితే? నీవే కాదు నిన్ను బట్టి నీ కుటుంబం, నిన్నుబట్టి నీ పొరుగువారు కూడా ఆశీర్వధించ బడతారు.*
👉 అట్లా అని, కేవలం ఆశీర్వాదాలను స్వంతం చేసుకొనే ప్రయత్నం కాదుగాని, ఆశీర్వాదాలకుకర్త అయిన ఆయనను స్వంతం చేసుకోగలగాలి. అప్పుడు నీవే ఒక ఆశీర్వాదపు నిధిగా మార్చబడతావు.
👉ఇంకనూ ఎదురాడు వారిగానే జీవిస్తున్నామా?
🔹అవిధేయులుగానే బ్రతుకుతున్నామా?
*ఇంకెంత కాలం?*
👉ఆయనను ఇంకనూ పశువుల తొట్టెలోనున్న శిశువు గానే చూస్తున్నామా?
👉గొర్రెపిల్ల గానే చూస్తున్నామా?
వద్దు!
*ఆయన గర్జించు కొదమ సింహమువలే రాబోతున్నాడు.*
👉 ఇంకనూ, విధేయత చూపకుంటే. తప్పించుకోలేము.
విధేయులవుదాం!
శాశ్వత రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
*హల్లెలూయ...*
*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*
*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి