ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

క్రిస్మస్ సందేశాలు

✳ *క్రిస్మస్ సందేశాలు* ✳

(11 వ భాగము )

*ఎవరీ శిశువు – ఆశ్చర్యకరుడు*


(యెషయా 9:6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింప బడెను  -  *ఆశ్చర్యకరుడు.*)

యెషయా తన ప్రవచనం ద్వార ఆ శిశువునకు ఇచ్చిన పేరులో ఒక భాగం *ఆశ్చర్యకరుడు.* యెషయా కాలంలో యూదాను ఆహాజు రాజు పరిపాలించుండగా యూదా దేశం మీదకు సిరియా మొదలగు  శత్రువుల దండెత్తినప్పుడు, యూదా దేశం మీద మరణచ్చాయలు అలుముకున్నాయి. “మరణచ్చాయలు గల దేశం” అని వాక్యంలో వ్రాయబడినది. 

ఆ మరణచ్చాయలు తొలగింపజేయడం ఏ మానవునివల్ల కూడా కాని పని అని కేవలం ఏదైనా ఒక అధ్బుతమైన ఆశ్చర్యకార్యం జరిగితేగాని ఆ మరణచ్చాయలు వీడవని ప్రజలు భావిస్తున్న సమయంలో వారుకోరినట్లుగా *ఆశ్చర్యకరుడు* అను పేరుగల రక్షకుని దేవుడు వారికి వాగ్దానం చేశాడు. 

సాతాను చేత భయంకరమైన మరణం ఈ లోకాన్ని కమ్ముకుంటూ ఉండగా సర్వమానవులు ఆ సాతాను యొక్క మరణచ్చాయల నుండి విడిపించుకోలేని పరిస్థితులలో ఉండగా ఆశ్చర్యకరంగా ఆ దేవుడు *ఆశ్చర్యకరుడుగా* ఈ లోకానికి వచ్చాడు.

ఆ కుమారుని జీవితమే 
ఆశ్చర్యకరం. ఆయన జీవితమంతా ఆశ్చర్యకరమైన కార్యములతో నిండి యున్నది. 

*1. ఆయన జననం ఆశ్చర్యం:* పురుషుని ఎరుగకుండా స్త్రీ గర్భం ధరించడం ఏ శాస్త్రానికి అందని ఆశ్చర్యం. పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు మరియ గర్భంలో ప్రవేశించడం ఆశ్చర్యం. లూకా 1:34-35 అందుకు మరియ నేను పురుషుని ఎరుగని దాననే; యిదేలాగు జరుగునని దూతతో అనగా  దూత పరిశుద్ధాత్మ నీమీదికి వచ్చును; సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును.

*2. యేసు జీవితమంతా గొప్ప అద్భుత క్రియలు ఆశ్చర్య కార్యాలు:* నీటిని ద్రాక్షరసంగా మార్చడం ఆశ్చర్యం కాదా! ఐదు రొట్టెలు రెండు చేపలు వేలవేల మందికి ఆహారంగా మారడం ఆశ్చర్యం కాదా! తుఫాను సమయంలో సముద్రం మీద నడచుకుంటూ రావడం ఆశ్చర్యం కాదా! ఒకటా రెండా, ఎన్నో ఆశ్చర్యకార్యాలు ఆకుమారుని జీవితంలో ఉన్నవి.

*3. యేసు బాప్తీస్మం ఒక ఆశ్చర్యం:* ఆకాశం తెరవబడుట, ఆత్మ పావురమువలె దిగి వచ్చుట ఒక ఆశ్చర్యం. తండ్రియైన దేవుడు తన కుమారుని గురించి “ఈయన నా ప్రియకుమారుడని” సాక్ష్యమిచ్చుట ఆశ్చర్యం.

*4. యేసు మరణం ఒక ఆశ్చర్యం:* నేరం చేసినవారు, పాపులైనవారు మరణశిక్ష పొందుకొనుట సర్వ సాధారణం. కాని ఏ నేరము చేయకుండా, నిష్కల్మషుడు, నిందారహితుడు, పాపులలో చేరకయున్నవాడు, పరిశుద్దుడైన ఆ కుమారుడు, భయంకరమైన క్రూరమైన నీచమైన హీనమైన శిలువ మరణం పొందడం ఆశ్చర్యం కాదా!

*5. యేసు సమాధి కార్యం ఒక ఆశ్చర్యం:* నక్కలకు బొరియలుండెను ఆకాశ పక్షులకు గూళ్ళు ఉండెను కాని తల వాల్చుకొనుటకైనను ఒక్కింత స్థలం కూడా లేని ఆ మనుష్యు కుమారుని పార్దీవ శరీరం ఒక ధనవంతుని క్రొత్త రాతి సమాధిలో ఉంచబడడం ఆశ్చర్యం.

*6. యేసు పునరుత్థానం ఒక ఆశ్చర్యం:* చరిత్రలో మొట్టమొదటిసారి మరణాన్ని జయించి తిరిగి లేవడం ఆశ్చర్యం. యాయీరు కుమార్తె, లాజరు లాంటి వారు మరణించి బ్రతికారు కాని వారు మరల మరణించారు. అనేక మంది దేవుళ్ళు వచ్చారు చనిపోయారు కాని ఒక్కరు కూడా తిరిగి లేవలేదు. 

ప్రపంచ చరిత్రలో *ఆ కుమారుడు* మాత్రమే మరణాన్ని జయించి తిరిగి లేచాడు. అందుకే ఆయన ఆశ్చర్యకరమైన నిజ దేవుడు మరియు *ఆది సంభూతుడు* అని పేరుగాంచాడు. 

చాల మంది ఆది సంభూతుడు అను మాటకు అర్ధం ఆదిలో సంభవించినవాడు అనగా పుట్టినవాడు అని, కాబట్టి త్రిత్వంలోని రెండవ వ్యక్తియైన యేసు ఆదిలో తండ్రియైన దేవుని చేత  సృష్టించ బడినవాడు కాబట్టి యెహోవా దేవుడే గొప్ప అని వాదిస్తూ ఉన్నారు. కాని వాస్తవ అర్ధం ఏమంటే *ఆది సంభూతుడు* అనగా మరణించి తిరిగి లేచినవారిలో మొట్టమొదటి వాడు అని భావం  

*7. యేసు ఆరోహణం ఒక ఆశ్చర్యం:* మేఘం ఆయనను కొని పోవడం ఒక ఆశ్చర్యం. అదే మేఘం మీద తిరిగి రాబోవడం ఆశ్చర్యం. అందుకే ఆయన ఆశ్చర్యకరమైన దేవుడు.

ప్రియమైన వారలారా! ఇవన్ని ప్రభువు మన కొరకు చేసిన ఆశ్చర్య కార్యాలు. కీర్తన 111:2 యెహోవా క్రియలు గొప్పవి. యోబు 9:10 ఎవడును తెలిసికొనలేని మహత్తయిన కార్యములను లెక్కలేనన్ని  అద్భుతక్రియలను  ఆయన  చేయుచున్నాడు. ఎఫేస్సి 3:20 మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటెను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి. కీర్త 136:4 ఆయన ఒక్కడే మహాశ్చర్యకార్యములు చేయువాడు. 

నిర్గ 34:10 అందుకు ఆయనఇదిగో నేను ఒక నిబంధన చేయు చున్నాను; భూమిమీద ఎక్కడనైనను ఏజనములో నైనను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి యెదుట చేసెదను. కీర్తన 105:2 ఆయననుగూర్చి పాడుడి ఆయనను కీర్తించుడి ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ  చేయుడి

ఆయన మన జీవితాలను కూడా ఆశ్చర్యకరంగా మారుస్తాడు. వేల దయ్యాలు పట్టి మరణకరమైన పరిస్థితులలో ఉన్న సేన అను వ్యక్తి యేసు వలన ఆశ్చర్యకరంగా మార్చబడి, దెకపొలిలో ప్రకటింపగా అందరూ అది చూచి *ఆశ్చర్యపోయారు*. (మార్కు 5:20  వాడు వెళ్లి, యేసు తనకు చేసిన వన్నియు దెకపొలిలో ప్రకటింప నారంభింపగా అందరు ఆశ్చర్యపడిరి.) 

పామరులైన జాలరులు ప్రపంచాన్ని తల్లక్రిందులు చేసి రాజులముందు కూడా ఆశ్చర్యకరంగా సువార్త ప్రకటింప గలిగారు. (1సమూ  12:24 ఆయన మీకొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో అది మీరు తలంచుకొని, మీరు యెహోవాయందు భయభక్తులు కలిగి, నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము.) 

అదేరీతిగా మనం కూడా ఆ ఆశ్చర్యకరుడైన కుమారుని నమ్ముకొనుట వలన మన జీవితంలో కూడా ఆ యేసు ప్రభువు ద్వార అద్భుత క్రియలు మరియు ఆశ్చర్యక్రియలు చూడగలం. అందుకు దేవుని కృప ఎల్లవేళలా మనకు తోడుగా ఉండునుగాక! ఆమెన్!

దైవాశ్శీసులు! 

From the desk of..
Pastor Jyothi Raju Vemula
_(Soli Deo Gloria)_

Immanuel Bible College 
NIDUBROLU   


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...