✳ *....క్రిస్మస్....* ✳
(ఇరవై తొమ్మిదవ భాగము)
లూకా 2: 10,11
*అయితే ఆ దూత భయపడకుడి; ఇదిగో ప్రజలందరికిని కలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను;*
*దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి యున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు(క్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడని అర్థము)*
క్రీస్తునందు ప్రియపాఠకులారా, యేసు
నామమున మీకు శుభములు కలుగును గాక.
*ఈ లోకంలో వార్తలు రెండు రకాలు. ఒకటి మంచి వార్త. రెండవది చెడు వార్త.*
👉 *మొట్టమొదట మంచి వార్తను గురించి తెలుసుకుందాం.*
లూకా భక్తుడు తన జీవితంలో రాసిన పుస్తకాలైన లూకా సువార్త మరియు అపోస్తులుల కార్యములన్నింటిలో భక్తుడైన లూకాకు మనకందరికీ ప్రత్యేకమైన అధ్యాయం రెండవ అధ్యాయము అని మనం గ్రహించాలి.
*ఈ అధ్యాయంలో శుభవార్త వచ్చింది అనే ప్రస్తావనతో అధ్యాయమంతా సువార్తలలో ప్రసిద్ధిచెందిన అధ్యాయముగా ప్రసిద్ధి చెందింది.*
👉 ఈ భక్తుడైన లూకా *అందరికీ సంతోషాన్ని కలిగించే శుభవార్త వుంది ఆ శుభవార్త భూలోకంలో ఉన్నవారందరికీ చెందుతుందని ప్రస్తావించాడు.*
*పిల్లలకు,యవ్వనస్తులకు, పెద్దలకు, వృద్ధులకు, ఉన్నవారికి, లేనివారికి గ్రామస్తులకు,పట్టనస్తులకు, విద్యాహీనులకు అందరికీ ఈ వార్త చెందుతుంది.*
1⃣ *శుభవార్త యొక్క ప్రాముఖ్యత*
ప్రాముఖ్యత లేని వార్తలు ఎన్నెన్నో చూస్తాము. కొన్నిసార్లు బ్రేకింగ్ న్యూస్ అని వేసిన వాటిలో కూడా ఎలాంటి ప్రాముఖ్యత ఉండదు. అయితే ప్రపంచానికి శుభవార్తగా యేసుక్రీస్తు ప్రభువుల వారి లోకానికి ఎంతో ప్రాముఖ్యత, ప్రాధాన్యత తెచ్చిపెట్టింది. అన్నిటికంటే ఆచర్యకరమైనా సంఘటన ఏమనగా, ఆయన రాజుగా అవతరించడము. ఆశ్చర్యమైన సంఘటన. క్రీస్తు ప్రభువుల వారి ముందు ఎంత మంది రాజులు పుట్టినా, వారు ప్రపంచాన్ని ఏలెవారు కాలేకపోయారు. అందుకే *హేరోదుకు జ్ఞానులు చెప్పిన మాటలు యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడని విన్న మాట అతన్ని ఎంత కలవరపరిచిందో మన మెరిగియున్నాము.*
మేము ఆయనను ఆరాధింప వచ్చితిమి అని హేరోదుతో చెప్పిరి. కావున ప్రాముఖ్యత లేని వాటిపైన చూడక ప్రాముఖ్యమైన, చారిత్రాత్మకమైన దేవున్ని ఆరాధించి, నీవు కూడా దేవుని చేత ఎరుగబడి దేవుని ఎరిగి మహిమపరచాలని కోరుచున్నాను.
2⃣ *శుభవార్త మర్మము*
ఈ లోకంలో భూమి మీద జీవించే మనమంతా కూడా దేవుని సంకల్పంలో ఆయన చేత ఏర్పరచబడడమే దేవుని ప్రణాళికైఉన్నది. అందుకే పౌలు ఇలా అంటాడు *” మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి”* అని ప్రస్తావించాడు. కావున మన మందరము క్రీస్తుచేత పిలువబడిన వారము. ఆత్మచేత ముద్రించబడినవారము. ఆయన రక్తంలో కడుగబడి, ఆయన చేత విమోచించబడినవారము. అంతకంటే ఎక్కువగా ఆయన సమరూపములో మార్చబడుటకు ఆయన ద్వారా సృజింపబడిన వారము.
*”క్రీస్తు మనవలె జీవించినను ఆయన శోదింపబడినను పాపం లేనివాడుగా ఉండెను”* అని హెచ్చరించారు 4 :15 లో చూస్తాము.
*”మన ప్రధానయాజకుడు మన బలహీనతలయందు మనతో సహనుభవము లేనివాడు కాడు గానీ సమస్త విషయములలో మన వలననే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను.”* కావున క్రీస్తు పరిశుద్ధుడు, నీతిమంతుడైయున్నాడు.
3⃣ *శుభవార్త పిలుపు*
ఈ శుభవార్త సందేశాన్ని మొదటి సృష్టి, ఆ తర్వాత ప్రవక్తలు ,ఆ తర్వాత భూమ్మీదికి దేవదూతలు తీసుకొని వచ్చిరి. గొర్రెల కాపర్లు మంద కాస్తుండగా దేవునెరుగని వీరి దగ్గరికి వచ్చినప్పుడు వారి చుట్టూ వెలుగు ప్రకాశించగా వారు భయపడిరి.
*ఇక్కడ ఉన్న గొర్రెలకాపరులు అంటరానివారుగా వెలివేయబడినవారుగా ఉన్నవారు. అసలు కోర్టు న్యాయవ్యవస్థానాల్లో కూడా ఈ గొర్రెల కాపరులు అనేవారు రోమా ప్రభుత్వ నియమ నిబంధనలను బట్టి లోపలికి వెళ్లడానికి కూడా అధికారం వారికి లేదు. అలాంటి వారి దగ్గరకు దేవ దూతల ద్వారా శుభవార్త వెళ్ళటము ఎంత ఆశ్చర్యము.*
👉 వారి దగ్గరికే శుభవార్త వెళ్లినప్పుడు అయోగ్యూడవైన పాపివైన నీ దగ్గరికి కూడా రాలేదా? చ్చితంగా నీ దగ్గరి కూడా చేరింది. ఆ సందేశాన్ని విని ఆ దేవాది దేవుడైన యేసు ప్రభువుల వారిని మహిమపరచు, కీర్తించు, ఆ సంతోషాన్ని ఇతరులతో కూడా పంచుకోవాలి.
👉 *కావున ఈ శుభవార్త పిలుపును పొందుకున్న నీవు ఇతరులకు ఆ వార్త చేరవేయాలి.*
👉 *ఏమిటి ఆ శుభవార్త?*
*రక్షకుడు జన్మించాడు.*
*ఆయన ద్వార మనకందరికీ విమోచన అనే సత్యాన్ని అనేకమందికి తెలపడమే మన బాధ్యత, విశ్వాసి అయినా ప్రతి వ్యక్తి క్రీస్తు కొరకు రాయబారియు అంతేకాక క్రీస్తు కొరకు ఉద్యోగస్తులై యున్నారు.*
మత్తయి, మార్కు, లూకా యోహాను సువార్తలు వ్రాసిన భక్తులు *తమ సువార్తలలో క్రీస్తు ప్రేమను ఎలా వర్ణించి చెప్పారో అలా నీవుకూడా దేవుని ఎరగని వారికి క్రీస్తు ప్రేమను గూర్చి వర్ణించి ప్రచురించాలి. అది మనందరి బాధ్యతయై వున్నది.*
4⃣ *శుభవార్త సత్యమైయున్నది*
ఈ శుభవార్త చెప్పేదేమనగా క్రీస్తు సత్యమై ఉన్నాడనే విషయాన్ని ఉద్ఘాటిస్తుంది. అందుకే యేసుప్రభువుల వారు
*”నేనే మార్గము, సత్యము, జీవమునైయున్నాను. నా ద్వారా తప్ప ఎవడును తండ్రియొద్దకు రాడు.”* అని యోహాను సువార్త 14 :6 లో సెలవిచ్చాడు. కావున క్రీస్తు సత్యమైయున్నాడు. ఆ సత్యం మనలను స్వతంత్రులుగా చేస్తుంది. నమ్మినవారికి విశ్వసించిన వారికి అది దొరుకుతుంది.
👉 *సత్యమును మనం స్వతంత్రించుకునే ముందు నీవే స్థితిలో ఉన్నావు నీవే పాపములో ఉన్నావు నీవే ఘోర అపవిత్రతలో ఉన్నావో దాని నుంచి బయటపడాలి. విడిపించబడాలి. మనము పాపానికి దాసులమైయున్నాము. కావున పాపం దాసత్వంలో నుండి, మరణంలో నుండి జీవం లోనికి నిత్యజీవం లోనికి నిన్ను నడిపించుటకు ఆ సత్యమే మార్గము సుగమం చేయును.*
👉 ఎందుకనగా సత్యం కాని వాటి వైపు తిరుగుతూ నీ కాలాన్ని వృధా చేసి అపవాది ఒడిలో ఇరుక్కుపోయి బయటికి రాలేక చిక్కుకున్న నిన్ను పాపమునుండి విడిపించి,అంత మాత్రమే కాక నూతన పరచి అసత్యం లోనుండి సత్యములోనికి నడిపించి, అంత మాత్రమే కాక సత్య వాక్కులతో నిన్ను నింపి నీవు సత్యనకు విదేయుడవై దానిని సంపాదించుకొనుటకు *ఈ శుభ హవార్తను విని క్రీస్తును నమ్మి ఆయన పాదాల చెంత చేరి ఆయనను హత్తుకొని ముందుకు సాగిపోవలెను.*
5⃣ *శుభవార్తను చాటిచెప్పిన ఆయన శిష్యులు*
*యేసు క్రీస్తు ప్రభువు వారు ఈ లోకంలో ఉద్బభవించడం వలన మనకు విమోచన అనుగ్రహించాడని మనందరికీ తెలుసు.*
👉 అయితే ఈ శుభవార్తను ఇతరులకు ఎలా తెలియచేయాలో ఎలా ఈ సువార్త విస్తరించాలొ దేవుడొక ఉన్నతమైన ప్రణాళికతో ముందుకు వెళ్ళాడు. ప్రభువు ప్రారంభించిన పరిచర్యలో, ప్రారంభ దినాల్లో 12 మంది శిష్యులను ఏర్పరచుకొని వారి ద్వారా పరిచర్యను భూదిగంతములవరకు విస్తరింపజేసి ఆ తరువాత *మనలను ఏర్పరచుకొని మన ద్వారా ఆ పరిచర్యను సువార్తను ఘనంగా చాటిచెప్పే ఆ గొప్ప పనిని నీవు నేను పొందడం ఎంత ఆదిక్యత.*
ఇంత గొప్ప ఆధిక్యతను సువార్త చెప్పే ఆధిక్యతను, నశించిపోయే ఆత్మలను రక్షించే ఆధిక్యతను, ఉన్నట్లుండి వదిలిపెట్టి వెళ్లిన యోనవలె కాక *మనం అంతవరకు శ్రమలు సహించి అయిన సరే ప్రభువు కొరకు సాక్షి గా జీవించు. నీవు పొందిన సంతోషకరమైన వర్తమానము అందరికీ తెలియ చెప్పాలి .ఈ బాధ్యతను బలముగా చేపట్టి ఆయన రాజ్య విస్తరణలో పాలిభాగస్తులుగా ఉండాలనేదే ప్రభువు ఆశ. ఈలాంటి గొప్ప కార్యములు చేపట్టి తుధమట్టుకు కొనసాగించలేవా?*
ప్రభు మనకిచ్చిన గొప్ప పని గొప్ప కార్యంమై యున్నది. ఈ కార్యము చేయుటకు నీవు, నీ కుటుంబము ముందుకు రావాలని ప్రభువు కోరుతున్నాడు. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు ఈ లోకమునకు వచ్చే నను మాట ప్రకారము నీవు కూడా ఒక ఆత్మ కొరకు ప్రయాసపడి, పోరాడి వారిని ప్రభు వైపు తిప్పి నడిపించి యుగయుగములు క్రీస్తు ద్వారా ఆశీర్వాదం పొందుదువుగాక!
*హల్లెలూయ...*
*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*
*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి